
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహించనున్న ఎస్‌ఏ టి20 లీగ్‌లో మొత్తం ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించారు. టోర్నీలో 7 కోట్ల ర్యాండ్ లు (రూ. 33 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించారు.
దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద మొత్తం. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటుండగా... ఆరు టీమ్‌లనూ ఐపీఎల్‌కు చెందిన యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రా యల్స్, జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేర్లతో జట్లు బరిలోకి దిగుతాయి.
చదవండి: AUS-W vs IND-W: ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి..
Comments
Please login to add a commentAdd a comment