
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఈమెగా ఈవెంట్‌లో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి.
ఇక ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శుక్రవారం వెల్లడించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ఖరారు చేసింది. చివరగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 53 శాతం అధికం కావడం గమనార్హం.
విజేతకు ఎంతంటే?
ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 2.24 మిలియర్ డాలర్లు (సుమారు రూ. 20 కోట్లు) నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా రన్నరప్‌కు 1.12 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 12 కోట్లు), సెమీ ఫైనలిస్ట్‌లు ఒక్కొక్కరికి 560,000 డాలర్లు(సుమారు రూ.5 కోట్లు) లభించనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్‌లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్‌మనీ కేటాయించింది.
గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు(సుమారు. 3 కోట్లు) అందనుంది. అదేవిధంగా ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1. 2 కోట్లు) దక్కించుకోనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment