తెంబా బవుమా
CSA T20 League- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ప్రొటిస్ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు (9.2 మిలియన్ సౌతాఫ్రికన్ ర్యాండ్స్) చేసి 22 ఏళ్ల ఈ వపర్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే, ఈ వేలంలో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమాకు చేదు అనుభవం ఎదురైంది. అతడి పేరు రెండుసార్లు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీస ధర( 850,000 సౌతాఫ్రికన్ ర్యాండ్స్)కు కూడా కొనుగోలు చేయలేదు.
బవుమాకు ఘోర అవమానం!
ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, డర్బన్ సూపర్‌జెయింట్స్ కోచ్ లాన్స్ క్లూస్‌నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి టీ20 లీగ్‌లలో ఆడాలంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ ట్యాగ్ సరిపోదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు ఉంటేనే ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు.. ఐఓఎల్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లీగ్‌లలో ఆడాలంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం తరఫున కీలక ఆటగాడు అయినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. అప్పుడే ఫ్రాంఛైజీలు సదరు ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని క్లూస్‌నర్ చెప్పుకొచ్చాడు.
మరేం పర్లేదు!
ఇక మరో మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాంఛైజీ ఓనర్లు ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయో మనకు తెలియదు కదా! అయినా.. ఇప్పుడే అంతా ముగిసిపోలేదు. టోర్నీ ఆరంభమయ్యే లోపు కొంతమంది గాయాల బారిన పడొచ్చు. లేదంటే మరో రూపంలో కూడా అవకాశం రావచ్చు’’ అంటూ బవుమాలా చేదు అనుభవం ఎదుర్కొన్న వారు నిరాశలో కూరుకుపోకూడదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన బవుమా 120.6 స్ట్రైక్‌రేటుతో 562 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానుంది.
చదవండి: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment