
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. అంతేకాకుండా ఈ తుది పోరులో కెప్టెన్‌గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించి మరోకరికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్‌కు ప్రస్తుతం తగినంత విశ్రాంతి అవసరమని గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తిరిగి గాడిలో పడాలంటే ఇదొక్కటే మార్గమని అతడు తెలిపాడు.
"కెప్టెన్‌కి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో వారి వ్యక్తిగత ప్రదర్శన ఒకటి. జట్టును నడిపించే వాడికి ఎప్పుడూ ఒత్తిడి ఉండే ఉంటుంది. నా వరకు అయితే రోహిత్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు రిఫ్రెష్ కావాలి. అతడు ఏ ఫార్మాట్‌లో కూడా నిలకడగా ఆడటం లేదు. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అదే తీరు కనబరిచాడు.
అతడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందరూ అతడి వ్యక్తిగత ప్రదర్శన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు తప్ప కెప్టెన్సీ పై కాదు. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందడం ప్రస్తుతం భారత జట్టుకు ఎంతో అవసమని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ పేర్కొన్నాడు.
చదవండి: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment