భారత్ పై మాది చెత్త ప్రదర్శన..
లండన్: చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చావోరేవో మ్యాచ్‌లో కనీస పోటీని ఇవ్వలేకపోవడం ఆహ్వానించదగిన విషయం కాదన్నాడు. తమ జట్టు ప్రదర్శన ఆశ్యర్యానికి గురిచేసిందని ఐసీసీకి రాసిన కాలమ్‌లో చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత పేస్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లపై విరుచుకుపడతానని ఊహించానట్లు పేర్కొన్నాడు. అయితే తమ ఆటగాళ్లే ఒత్తిడికి లోనై తగిన మూల్యం చెల్లించుకున్నారన్నాడు. తమ ఇన్నింగ్స్ లో రెండు రనౌట్లు కావడం ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసిందన్నాడు. ఇక విరాట్ సేన అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. దక్షిణాఫ్రికాపై పటిష్టమైన ప్రణాళికలతో రాణించారని తెలిపాడు. భారత్ ఫైనల్ ఫేవరేట్ అని బంగ్లాదేశ్‌తో జరిగే సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ నెగ్గుతుందని స్మిత్ జోస్యం చెప్పాడు. ఇక భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్మిత్ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల శిక్షణా శిబిరంలో పాల్గొని వారికి సూచనలు చేశాడు.