బీసీసీఐపై సీఎస్‌ఏ ఆరోపణ
ముంబై: దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ) సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంతో ఆగ్రహం చెందిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టు పర్యటనపై చాలా రోజులు స్పష్టత ఇవ్వని విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ కోసం సీఎస్‌ఏ ఎంతగా పట్టుబట్టినా బీసీసీఐ ససేమిరా అని రెండు టెస్టులకు కుదించింది.
అలాగే ఈ టెస్టు సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెడదామని సీఎస్‌ఏ ప్రతిపాదించగా భారత బోర్డు తిరస్కరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. ‘మండేలా మృతిని మేం ఊహించలేకపోయాం. అంతకన్నా ముందే ఇరు జట్ల మధ్య జరగాల్సిన ఐదు టెస్టుల సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెట్టాలని భావించాం. ఎందుకంటే వీరిద్దరు ప్రపంచ నాయకులు కావడమే కాకుండా ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చింది’ అని సీఎస్‌ఏ సీనియర్ అధికారి ఓ టీవీ చానెల్‌కు తెలిపారు.
మండేలా-గాంధీ ట్రోఫీ పేరుకు ఒప్పుకోలేదు
Published Sun, Dec 15 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement