india cricket board
-
జై షా వారసుడెవరో!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఒక్కడి పేరే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి భారత బోర్డులో ఆయన వారసుడు ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఐసీసీలో మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో చైర్మన్ పదవి ఏకగ్రీవంతో దక్కనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బీసీసీఐలో రెండోసారి కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం మరో ఏడాది మిగిలుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో జై షా వారసుడెవరనే చర్చలో ప్రముఖంగా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో కీలకమైన కార్యదర్శి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపడతారు. దీంతో ఇంకో మూడు నెలల వరకు జై షా బీసీసీఐ పదవిని అట్టిపెట్టుకునే అవకాశముంది. -
సశేషం!
దుబాయ్: కరోనా కారణంగా ఎదురైన సవాళ్లను అధిగమించి మళ్లీ క్రికెట్ మొదలు పెట్టడం, ప్రతిష్టాత్మక టి20 ప్రపంచ కప్ నిర్వహణపై స్పష్టత, ఇతర భవిష్యత్ పర్యటన కార్యక్రమాల (ఎఫ్టీపీ)పై మార్పులు చేర్పులు, ఐసీసీ కొత్త చైర్మన్ ఎంపిక... ఇలా ఎన్నో అంశాలపై చర్చించేందుకు సిద్ధమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చివరకు ఏమీ తేల్చకుండానే ముగించేసింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. అన్నింటినీ జూన్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎజెండాలో ఉంచిన అన్ని అంశాలపై నిర్ణయం ఆ రోజే ప్రకటిస్తామని వెల్లడించింది. పొట్టి ప్రపంచకప్ వాయిదా ఖాయమని వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుండా ఐసీసీ ఇంకా దాటవేట ధోరణిలోనే వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. మరో వైపు ఐసీసీ బోర్డు సమావేశాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుండటం పట్ల ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీ ఎథిక్స్ ఆఫీసర్‌తో అంతర్గత విచారణ జరిపేందుకు సభ్యులందరూ అంగీకరించారు. -
జీవరక్షణ వలయంలో ఆడటం కష్టమే: ద్రవిడ్
న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణంలో క్రికెట్ పునరుద్ధరణ కష్టమని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇలా ఆడించాలనుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధానం ఆచరణలో సాధ్యం కాదన్నాడు. జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఇటీవల ఈసీబీ ప్రకటించింది. దీనిపై స్పందించిన ద్రవిడ్ ఇది సాధ్యం కాదన్నాడు. ‘నాకైతే ఈసీబీ చెప్పింది మిథ్యగా అనిపిస్తోంది. ఎందుకంటే మన క్రికెట్ క్యాలెండర్ ప్రకారం నిత్యం ప్రయాణాలు చేయాలి. చాలా మంది ఇందులో పాల్గొనాల్సి వస్తుంది. వైరస్ పరీక్షలు, క్వారంటైన్, వలయాన్ని ఏర్పాటు చేశాక కూడా టెస్టు రెండో రోజు ఎవరైనా కరోనా బారిన పడితే ఏం చేస్తారు? ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అందర్నీ క్వారంటైన్ చేయాల్సిందేగా. అప్పుడు మ్యాచ్ రద్దేగా! ఇలా కాకుండా ఆటగాడికి కరోనా సోకితే ఎలా ముందడుగు వేయాలని ప్రభుత్వ వర్గాలతో కలిసి పనిచేయాలి’ అని వివరించాడు. -
కొత్త ప్రతిపాదనలపై ఐసీసీ భేటీ నేడు
సింగపూర్: ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనల ఆమోదం కోసం నేడు (శనివారం) సభ్యదేశాలు మరోమారు సమావేశం కానున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత క్రికెట్ బోర్డు ఆదాయపరంగానే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ తిరుగులేని స్థాయిలో ఉంటుంది. బీసీసీఐతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు కూడా తగిన అధికారాలు లభించనున్నాయి. అయితే ఈ పరిణామాలను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు ఈ సమావేశంలో ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ పునర్నిర్మాణ ప్రతిపాదనలు చట్టబద్ధంగానే ఉన్నాయని ఐసీసీ న్యాయ విభాగం చీఫ్ ఇయాన్ హిగ్గిన్స్ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు స్పష్టం చేశారు. ప్రతిపాదనల చట్టబద్దతను ప్రశ్నిస్తూ లంక బోర్డు ఐసీసీ న్యాయవిభాగానికి గతంలో లేఖ రాసింది. -
మండేలా-గాంధీ ట్రోఫీ పేరుకు ఒప్పుకోలేదు
బీసీసీఐపై సీఎస్ఏ ఆరోపణ ముంబై: దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంతో ఆగ్రహం చెందిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టు పర్యటనపై చాలా రోజులు స్పష్టత ఇవ్వని విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ కోసం సీఎస్ఏ ఎంతగా పట్టుబట్టినా బీసీసీఐ ససేమిరా అని రెండు టెస్టులకు కుదించింది. అలాగే ఈ టెస్టు సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెడదామని సీఎస్ఏ ప్రతిపాదించగా భారత బోర్డు తిరస్కరించిందని దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. ‘మండేలా మృతిని మేం ఊహించలేకపోయాం. అంతకన్నా ముందే ఇరు జట్ల మధ్య జరగాల్సిన ఐదు టెస్టుల సిరీస్‌కు మండేలా-గాంధీ ట్రోఫీగా పేరు పెట్టాలని భావించాం. ఎందుకంటే వీరిద్దరు ప్రపంచ నాయకులు కావడమే కాకుండా ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చింది’ అని సీఎస్ఏ సీనియర్ అధికారి ఓ టీవీ చానెల్‌కు తెలిపారు.