సింగపూర్: ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనల ఆమోదం కోసం నేడు (శనివారం) సభ్యదేశాలు మరోమారు సమావేశం కానున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత క్రికెట్ బోర్డు ఆదాయపరంగానే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ తిరుగులేని స్థాయిలో ఉంటుంది. బీసీసీఐతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు కూడా తగిన అధికారాలు లభించనున్నాయి.
అయితే ఈ పరిణామాలను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు ఈ సమావేశంలో ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ పునర్నిర్మాణ ప్రతిపాదనలు చట్టబద్ధంగానే ఉన్నాయని ఐసీసీ న్యాయ విభాగం చీఫ్ ఇయాన్ హిగ్గిన్స్ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)కు స్పష్టం చేశారు. ప్రతిపాదనల చట్టబద్దతను ప్రశ్నిస్తూ లంక బోర్డు ఐసీసీ న్యాయవిభాగానికి గతంలో లేఖ రాసింది.
కొత్త ప్రతిపాదనలపై ఐసీసీ భేటీ నేడు
Published Sat, Feb 8 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement