డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం | Lecture on Classical Music by Dr. Tadepalli Lokanatha Sharma At Singapore | Sakshi
Sakshi News home page

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

Published Tue, Feb 25 2025 11:30 AM | Last Updated on Tue, Feb 25 2025 11:59 AM

Lecture on Classical Music by Dr. Tadepalli Lokanatha Sharma At Singapore

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ కర్ణాటక సంగీత ఆలాపనా విధానాలపై విశ్లేషణాత్మక ప్రసంగాన్ని  ప్రత్యేకించి అందించారు.

"ఎప్పుడూ వివిధ శాస్త్రీయ, సినీ సంగీత కార్యక్రమాలను సింగపూర్‌లో ఏర్పాటు చేస్తూనే ఉంటామని, కానీ తొలిసారి ఈ విధంగా వర్ధమాన గాయనీ గాయకులకు ఉపయోగపడే విధంగా శాస్త్రీయ సంగీత ఆలాపనా విధానాలపై మరింత అవగాహనను పెంచే విధంగా మెళకువలను నేర్పే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని" శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్య సంగీతం, స్వరలయ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విద్య సంగీతం నుంచి విద్యాధరి కాపవరపు, ఆదివారం జరిగిన కార్యక్రమానికి స్వరలయ సంస్థ నుంచి శేషు యడవల్లి, కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు.



శాస్త్రీయ సంగీతానికి ఆయువుపట్టైన భావప్రకటన యొక్క ప్రాధాన్యతను గురించి లోకనాథశర్మ వర్ణించారు. కచేరీలలో కేవలం తమ పాండిత్య ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా గాయనీగాయకులు పాటల సాహిత్యంపై భావంపై దృష్టి పెట్టాలన్నారు. కీర్తనలలో హస్వాక్షరాలను రాగాలాపన కోసం సాగదీస్తే అర్థవంతంగా ఉండదన్నారు. గాత్ర సౌలభ్యం కోసం పదాలను నచ్చిన విధంగా విడదీయడం సబబు కాదన్నారు. మహా భక్తులైన త్యాగరాజు అన్నమయ్య రామదాసు కీర్తనల విషయంలో భక్తిరసాత్మకంగా మాత్రమే ఆలపించా లన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సోదాహరణ ఉదాహారణలతో సందేహ నివృత్తి చేసారు.



సింగపూర్‌లో  శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే విద్యార్థులు, గాయనీ గాయకులు, సంగీత పాఠశాలలు నడిపే గురువులు, శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉన్న తెలుగువారు తమ సందేహనివృత్తి చేసుకున్నారు. అనంతరం సంస్థ సభ్యులందరూ కలిసి లోకనాథ శర్మను సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం' కూడా కావడంతో వారాంతంలో ఇటువంటి ఉపయోగాత్మక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో తెలుగు భాగవత ప్రచార సమితి సింగపూర్ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్,  ఇండియా శాఖ అధ్యక్షులు ఊలపల్లి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం అందరూ కలిసి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి కార్యవర్గ సభ్యులు పాతూరి రాంబాబు మరియు శ్రీధర్ భరద్వాజ్ దగ్గరుండి భోజనఏర్పాట్లు సమకూర్చారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలందరికి పేరు పేరున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.



రాధాకృష్ణ  గణేశ్న, కాత్యాయనీ గణేశ్న, సుబ్బు వి పాలకుర్తి సాంకేతిక సహకారంఅందించగా, ఈ కార్యక్రమం ప్రపంచంలోని సంగీతాభిమానులందరికీ కోసం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమైంది.

 మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement