సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా | South Indian Brahmin Sabha of Singapore (SDBBS) Special Programme | Sakshi
Sakshi News home page

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

Published Tue, Jan 7 2025 4:34 PM | Last Updated on Tue, Jan 7 2025 5:02 PM

South Indian Brahmin Sabha of Singapore (SDBBS) Special Programme

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు నిర్వహించారు.

ఈ  కార్యక్రమంగణపతి, పూర్వాంగ పూజ , అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైంది.  ఆ తరువాత  సభ పాలక దేవత  పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్‌కు లఘున్యాసం, రుద్రాభిషేకం , రుద్రగణ పారాయణం జేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, చివరలో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు.

ఈ కార్యక్రమములో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ తన బృందంతో తీర్చిదిద్దిన రంగవల్లి  విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని   దైవత్వాన్ని జోడించాయి.

రాంకుమార్  బృందం నామసంకీర్తన భజనలు, కొంత మంది స్త్రీలు ప్రదర్శించిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షలకులను మంత్రముగ్ధుల్ని చేసింది.  కార్యక్రమములో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో   అయ్యప్పస్వామి భక్తి గీతాలను ఆలపించారు. సభా ట్రస్టీలలో ఒకరైన శంకర్ తాళాల (కంజీర) కళాకారుడిగా భజనలో పాల్గొనడం విశేషం.

గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయడంలో అనుభవంవున్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం , కొబ్బరి పాలతో పాయసం తయారు చేసారు.  గత 6 దశాబ్దాలకుపైగా వారసత్వంగా ఈ పాయసం సంప్రదాయంగా  కొనసాగుతోంది.  ఈ కార్యక్రమంలో యువతరం చురుకుగా పాల్గొనడం అత్యంత విశేషం .

ఉత్తరాంగ పూజానంతరం పడి పాట్టుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలై లో  రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా  ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్రం కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్చంద కార్యకర్తలు అయిన సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసు బ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్రమణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్ తదితరులను సభాధ్యక్షుడు ఘనంగా సత్కరించారు.

SDBBS అధ్యక్షులు కార్తీక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్ , కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్ మాట్లాడుతూ కార్యక్రమము విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రాంకుమార్ బృందం, విజయా మోహన్ బృందం, కలై (AV వీడియో) తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన  అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించడం విశేషం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement