Special Programme
-
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంగణపతి, పూర్వాంగ పూజ , అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైంది. ఆ తరువాత సభ పాలక దేవత పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్కు లఘున్యాసం, రుద్రాభిషేకం , రుద్రగణ పారాయణం జేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, చివరలో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు.ఈ కార్యక్రమములో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ తన బృందంతో తీర్చిదిద్దిన రంగవల్లి విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని దైవత్వాన్ని జోడించాయి.రాంకుమార్ బృందం నామసంకీర్తన భజనలు, కొంత మంది స్త్రీలు ప్రదర్శించిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షలకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమములో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో అయ్యప్పస్వామి భక్తి గీతాలను ఆలపించారు. సభా ట్రస్టీలలో ఒకరైన శంకర్ తాళాల (కంజీర) కళాకారుడిగా భజనలో పాల్గొనడం విశేషం.గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయడంలో అనుభవంవున్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం , కొబ్బరి పాలతో పాయసం తయారు చేసారు. గత 6 దశాబ్దాలకుపైగా వారసత్వంగా ఈ పాయసం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో యువతరం చురుకుగా పాల్గొనడం అత్యంత విశేషం .ఉత్తరాంగ పూజానంతరం పడి పాట్టుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలై లో రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్రం కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్చంద కార్యకర్తలు అయిన సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసు బ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్రమణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్ తదితరులను సభాధ్యక్షుడు ఘనంగా సత్కరించారు.SDBBS అధ్యక్షులు కార్తీక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్ , కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్ మాట్లాడుతూ కార్యక్రమము విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రాంకుమార్ బృందం, విజయా మోహన్ బృందం, కలై (AV వీడియో) తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించడం విశేషం. -
స్వరార్చన
-
75 వారాలు 75 ప్రాంతాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్రం తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులను స్మరించుకుని నివాళులు అర్పించాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైందని చెప్పారు. దేశ పురోగమనంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని పేర్కొన్నారు. 2021 మార్చి 12 నుంచి ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సభ్యులుగా సాధారణ పరిపాలన, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యా శాఖల కార్యదర్శులు, పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు, సభ్యకార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఉంటారని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. 75 ప్రాంతాల్లో ఎత్తయిన జాతీయ జెండాలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్‌లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, రాష్ట్రవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ భావాలను పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి పాల్గొన్నారు. ఉత్సవాల ప్రాధాన్యత, విధివిధానాలు, లక్ష్యాలను ప్రధాని వివరించారు. రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. మార్చి 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్‌లో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, వరంగల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు జాతీయ జెండావిష్కరణ, పోలీసు కవాతు తదితర దేశభక్తి కార్యక్రమాలు ఉంటాయని సీఎం తెలిపారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. -
లాహిరి..లాహిరి..
-
రాష్ట్రానికి కొత్త ‘చూపు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిని గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కంటి వెలుగు’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంటిచూపు సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పరీక్షలతో దృష్టి లోపాలను, అందుకు కారణాలను గుర్తించడంతోపాటు.. ఉచితంగా కళ్లద్దాలను, వైద్యసేవలను, మందులను అందించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలను చేయించేలా చర్యలు చేపడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు బంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాగానే.. ఈ నెలాఖరులోనే ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కార్యక్రమం అమలు కోసం రూ.106 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు కార్యక్రమం మార్గదర్శకాలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, వార్డుల్లో క్యాంపులు.. ‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో సమగ్ర సర్వే తరహాలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో.. నగర, పట్టణ ప్రాంతాల్లోని వార్డులలో వైద్య పరీక్షల కోసం క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి క్యాంపులో నిర్వహించిన వైద్య పరీక్షల సమగ్ర సమాచారాన్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తారు. తదుపరి స్థాయి వైద్యపరీక్షల కోసం, చికిత్స అందించేందుకు తోడ్పడేలా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కళ్లద్దాలు.. శస్త్రచికిత్సలు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేలా చర్యలు చేపడతారు. క్యాటరాక్ట్, గ్లకోమా, కార్నియా సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, విటమిన్ ‘ఏ’లోపం, ఇతర సాధారణ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని నిర్ధారిస్తారు. చూపుపరమైన సమస్యలున్న అందరికీ వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కార్నియా లోపాలు తదితర సమస్యలున్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. పది మందితో బృందాలు.. మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో పది మందితో కూడిన బృందం కంటి పరీక్షల క్యాంపును నిర్వహిస్తుంది. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు మల్టీపర్పర్ హెల్త్ సూపర్వైజర్లు (మహిళా/పురుషులు), కంటి వైద్య సహాయకుడు, ఫార్మాసిస్టు, ముగ్గరు ఆశ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, యంత్రాలను, మందులను వైద్యారోగ్య శాఖ సమకూరుస్తుంది. రూ.106.83 కోట్లు మంజూరు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం అమలవుతుంది. ఈ శాఖ ప్రతిపాదనల ప్రకారం కార్యక్రమానికి అవసరమైన రూ.106.83 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.84.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి, రూ.42 కోట్లను జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి కేటాయించింది. మొత్తం మంజూరైన నిధుల్లో తొలి విడతగా రూ.42 కోట్లను విడుదల చేసింది. ‘కంటి వెలుగు’పథకం అంచనాలివీ.. కంటి పరీక్షలు నిర్వహించే జనాభా: 3.5 కోట్లు అవసరమయ్యే కళ్లద్దాలు: 41,05,808 ప్రాథమిక వైద్యసేవలు అవసరమయ్యేవారు: 77,768 రెండో దశ వైద్యసేవలు అవసరమయ్యేవారు: 3,31,178 ఆస్పత్రిలో వైద్యసేవలు అవసరమయ్యేవారు: 14,283 -
సత్యవాఖ్యోపదేశమ్ 14th January 2018
-
యాడ్ మేకర్స్
-
సాక్షి హెల్దీ కిచెన్.
-
శివార్చన
-
శతావతారం
-
సాక్షి మెట్రో స్పెషల్: సుధా కార్స్
-
బంగారు బాల్యం
-
ఇది కధ కాదు
-
బ్రాండ్ రచ్చ - ప్రత్యేక చర్చ
-
గజ గజ 2