
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.
తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారం
సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా
వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.
సంగ్రహ కార్యక్రమం
ప్రారంభ సభ
కవి సమ్మేళనం
మహిళా పృఛ్ఛకులతో అష్టావధానం - ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణ
నూతన పుస్తకావిష్కరణ సభ-2025
కవి సమ్మేళనం నమోదు వివరాలు
భారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.
నమోదు పత్రం
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewform
నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025
• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.
• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.
• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.
• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.
నూతన పుస్తకావిష్కరణలు
నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)
‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
ప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)
రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)
డా. వంశీ రామరాజు +91 9849023852 (హైదరాబాద్)
డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా)
Comments
Please login to add a commentAdd a comment