sammelanam
-
ఐర్లాండ్లో ఆర్యవైశ్య సమ్మేళనం
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు. తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చి న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రస్తు తం అందరి ముందున్న లక్ష్యమని, జెండా ఏదైనా అజెండా ఒక్కటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆదివారం నిర్వహించిన పాలే రు నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిధులు, నీ ళ్లు, నియామకాలు అని చెప్పి అధికారంలో కి వచ్చారని, రాష్ట్రంలో నేడు అప్పులు, రైతులు, యువత ఆత్మహత్యలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 20కి మించి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన గ్రా మం ఉంటే చూపించాలని పొంగులేటి సవాల్ విసి రారు. 36.86 లక్షల మంది రైతుల్లో 5.86 లక్షల మందికే రుణమాఫీ చేశారని, ఇంకా 31 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని, బడ్జెట్లోనూ దానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు. రూ.19,600 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఆరేళ్లలో రూ.6,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా రూ.13 వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందని, సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతామన్న పెద్దమనిషి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయ డంలో కేసీఆర్ దిట్ట అన్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపు శత వాయిద్య సమ్మేళనం
కాకినాడ కల్చరల్ : ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్కళావాహిని సంగీత కళాశాల ఆధ్వర్యాన స్థానిక యంగ్మెన్స్ క్లబ్ ఆడిటోరియంలో (దంటు కళాక్షేత్రం) బుధవారం సాయంత్రం శత వాయిద్య సమ్మేళనం నిర్వహించనున్నట్టు సంగీత విద్వాంసుడు ఇ.శ్రీకృష్ణ తెలిపారు. ముందుగా హనుమాన్ చాలీసా సంగీత జ్ఞానయజ్ఞంతో కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. తదుపరి నాదస్వరం, వీణ, వయోలిన్, వేణువు, కీబోర్డు, మృదంగం, తబల, ఘటం, కంజీర వంటి శాస్త్రీయ శత వాయిద్యాల సమ్మేళనంతో, వందమంది కళాకారులతో శాస్త్రీయ సంగీత వాహిని కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపు జిత్ సినీ సంగీతా విభావరి ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా జిత్మోహన్మిత్రా మ్యూజికల్ గ్రూపు, కాకినాడ మ్యూజికల్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం సూర్య కళామందిర్లో సినీ సంగీత విభావరి (తెలుగు, హిందీ) నిర్వహించనున్నట్టు జిత్మోహన్మిత్రా మ్యూజికల్ గ్రూపు కార్యదర్శి ఆర్వీఎస్ లీలాప్రసాద్ తెలిపారు. -
18న మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం
ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణకు సన్మానం కరీంనగర్: మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ఆహ్వాన కమిటీ కన్వీనర్లు గుగ్గిళ్లపు రమేశ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి తెలిపారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బొమ్మకల్లోని మున్నూరుకాపు హాస్టల్ ఆవరణలో ఉదయం పదిగంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను సన్మానిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం నాలుగుగంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సంఘం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్ హాజరువుతారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు.