ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్‌లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు.
తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు.
చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment