Dublin
-
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్‌ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! ఇప్పుడిలా!
India tour of Ireland, 2023: దాదాపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు వరణుడు స్వాగతం పలకబోతున్నాడా? ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ నేపథ్యంలో తొలిసారి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఈ పేసు గుర్రం రీఎంట్రీకి వర్షం ఆటంకిగా మారనుందా? అంటే స్థానిక వాతావరణ శాఖ అవుననే అంటోంది! ఐర్లాండ్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా ఇరు జట్లు పోటీపడనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 గంటలకు)కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం! అయితే, డబ్లిన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రానికి పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరిస్తూ యెల్లో వార్నింగ్ జారీ చేసింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మ్యాచ్ రద్దైతే.. అంతే సంగతి! బుమ్రా ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కితే చూడాలని ఆశ పడుతుంటే ఈ వర్షం గోల ఏమిటని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో బుమ్రా ఫిట్నెస్ పరీక్షకు ఐర్లాండ్ పర్యటన మంచి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడనుందని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దీంతో రీఎంట్రీలో ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. తర్వాత ఆసియా కప్! బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఐర్లాండ్‌కు పంపింది. అయితే, వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైపోతే బుమ్రాతో పాటు యాజమాన్యానికి చేదు అనుభవం తప్పదు. మిగతా రెండు మ్యాచ్‌లకు కూడా ది విలేజ్ వేదిక కావడం విశేషం. ఇక ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: ఎల్లప్పుడూ రుణపడి ఉంటా: విరాట్ కోహ్లి భావోద్వేగ పోస్ట్.. వైరల్ -
ఐర్లాండ్‌లో ఆర్యవైశ్య సమ్మేళనం
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్‌లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు. తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!
చారిత్రాత్మక డబ్లిన్ నగరంలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కలసి అర్బన్ అగ్రికల్చర్ రంగంలో చేపట్టిన సేవా కార్యక్రమం ఇటీవల వార్తల్లోకెక్కింది. పౌష్టికాహార భద్రతను కల్పించే ట్టి మొక్కల్ని స్వయంగా తామే పెంచి ఇతరులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్ రాజధాని డబ్లిన్. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది. 1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్గా మార్చారు. అర్జున్ కరర్–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్ హైస్కూల్ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్‌గా మైక్రోగ్రీన్స్‌ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది. సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్ తన 16వ ఏట లైసెన్స్ తీసుకొని మరీ తమ గ్యారేజ్‌లో వర్టికల్ గార్డెన్ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించాడు. ‘గార్డెనర్స్ ఆఫ్ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్ కరర్–పరేఖ్, ప్రెస్టన్ చియు, నికో సింగ్ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. డీయూఎస్‌డీ న్యట్రిషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్‌ను డబ్లిన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (డీయూఎస్‌డీ) పరిధిలోని స్కూల్ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు. ‘మైక్రోగ్రీన్స్ పెంపకానికి అలమెడా కౌంటీ నుంచి హోమ్ గ్రోయర్స్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్ నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్ బ్యాగ్స్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్. డబ్లిన్ నగరపాలకులు మినీ గ్రాంట్ల పేరిట 1,500 డాలర్లను అందజేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. ‘డబ్లిన్ హైస్కల్లో సలాడ్లకు మైక్రోగ్రీన్స్‌ను జోడించడం అద్భుతంగా ఉందని న్యట్రిషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో అన్నారు. ‘మా చొరవ ప్రత్యేకమైనదని మేం నమ్ముతున్నాం. సమాజంలో మార్పు తెస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రజలకు సహాయం చేయడం మంచి అనుభతినిస్తుంది. నేను ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయం చేయాలనుకున్నాను. ఒంటరిగా చేయలేకపోయిన పనిని మేం కలసి చేస్తున్నాం’ అన్నారు జీజీ వైస్ ప్రెసిడెంట్ హరి గణేష్ (16). పై చదువులకు వెళ్లాక కూడా ఈ పని కొనసాగించాలని, మరింత మందికి మైక్రోగ్రీన్స్ అందించాలని ఈ యువ అర్బన్ ఫార్మర్స్ ఆశిస్తున్నారు. ఈ విద్యార్థుల పని స్ఫూర్తిదాయకం ‘గార్డెనర్స్ ఆఫ్ ది గెలాక్సీ సభ్యులైన ఈ విద్యార్థులు ఎంతో మంచి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తీర్చాలని వీరు కంకణం కట్టుకోవడం చాలా స్ఫర్తిదాయకంగా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్‌ను పండించడం కొనసాగించడానికి డబ్లిన్ సిటీ యూత్ అడ్వైజరీ కమిటీ మంచి గ్రాంట్ ఇవ్వటం చసి చాలా సంతోషిస్తున్నాను. – మెలీసా హెర్నాండెజ్, డబ్లిన్ నగర మేయర్ పతంగి రాంబాబు (చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ') -
కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు
డుబ్లిన్: మనం చాలా రకాలుగా బ్యాంకులను మోసం చేసి బారీగా రుణాలను పొంది ఎగవేతకు పాల్పడిన ప్రముఖుల గురించి విన్నాం . కానీ కరోనా మహమ్మారీని ఎదుర్కొనేలా ప్రజలకు ఆర్థిక వెసులబాటును కల్పించేందుకే ఏర్పాటు చేసిన కరోనా రిలీఫ్ ఫండ్‌ని మోసం చేసి కటకటాల పాలయ్యాడు డుబ్లిన్‌కి చెందిన ఒక వ్యక్తి. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) వివరాల్లోకెళ్లితే.....వినత్ ఔడోమ్సిన్ తన వ్యాపారంలో పనిచేస్తున్న వ్యక్తుల సంఖ్య, కంపెనీ స్థూల ఆదాయం తదితర వివరాలు చెప్పి తమ కంపెనీ ఉద్యోగుల కోసం అంటూ అబద్ధం చెప్పి కరోనా మహమ్మారి ఆర్థిక ఉపశమన రుణం కోసం దరఖాస్తు చేశాడు. దీంతో అతను 85 వేల డాలర్లు (సుమారు రూ. 63 లక్షలు) రుణం అందుకున్నాడు. ఆ తర్వాత అతను 57వేల డాలర్లు(రూ.43 లక్షలు) విలువ చేసే పోకీమాన్ కార్డులను కొని జల్సాలు చేశాడు. పైగా వేల డాలర్లకు అమ్ముడుపోయే ఈ పోకీమాన్ కార్డులను కొనుగోలు చేయడంతో అతన్ని డుబ్లిన్ డిఫెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఇలా మోసం చేసి రుణం పొందినందుకు గానూ అతనికి 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు 250 వేల డాలర్లు(సుమారు రూ.1.87 కోట్లు) జరిమాన విధించారు. నిజానికి శిక్ష తక్కువగానే ఉండేది కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఆరోగ్యపరంగానూ, ఆర్థికంగానూ దెబ్బతిన్న వారికి వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దాన్ని దుర్వినియోగం చేయడంతో యూఎస్ ప్రభుత్వం అతన్ని ఇంత కఠినంగా శిక్షించింది. (చదవండి: జిమ్నాస్టిక్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న వికలాంగురాలు) -
దుమ్మురేపిన ఓపెనర్లు; సఫారీ ఘన విజయం
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జేన్‌మన్ మలాన్ (169 బంతుల్లో 177; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. సిమీ సింగ్ సెంచరీ (91 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు)తో ఐర్లాండ్ గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఫెలుక్వాయో, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు. -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్‌కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్‌లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
బ్రెడ్డులో పిసరంత షుగర్.. కోర్టు వద్దంది
డబ్లిన్: మనిషికి ఎల్లవేళలా రుచికరమైన ఆహారమే ప్రీతికరమైంది. తర్వాతే మిగతా పనీ పాట. ‘ఏం చేసినా దీని కోసమే కదా గురూ’ అని టైమ్‌కి క్యారేజ్‌ను ఓపెన్ చేసే పని సంస్కృతి బహుశా ఒక్క ఇండియాదే కాకపోవచ్చు. క్యారేజ్‌లు లేనివాళ్లకు నడిచి వెళ్తే ‘సబ్ వే’లు, నడవడం చేతకాకపోతే స్విగ్గీలు ఎలాగూ ఉంటాయి. ఏమైనా ప్రపంచ ప్రజలకు వేళకు తిండిపై ధ్యాస పెరిగి, ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతోంది! పౌరులపై పౌరులకు శ్రద్ధ తగ్గినప్పుడు ఆ శ్రద్ధ బాధ్యతను కూడా ప్రభుత్వాలే కదా తిండి మానేసైనా తీసుకోవలసింది. మన దేశంలోనే చూడండి.. తినే వాటి విషయంలో ముఖ్యమైనవేమీ మనం పట్టించుకోము కదా.. ప్రభుత్వం పట్టించుకుంది. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ లేకుండా చిన్న స్వీట్ ముక్కను కూడా అమ్మడానికి లేదని ఈ ఫస్ట్ నుంచి చట్టాన్ని తెచ్చింది. అలా ప్రజల ఆరోగ్య భద్రతను తన మీద కొంత ఉంచుకుని, మిగతా కొంత అమ్మేవాళ్ల మీద పెట్టింది. పౌరుల షుగర్ విషయంలో ఐర్లాండ్ ప్రభుత్వం మనకన్నా మరికాస్త శ్రద్ధగా ఉంది. అమెరికన్ తినుబండారాల గొలుసు కంపెనీ ‘సబ్ వే’ విక్రయిస్తున్న బ్రెడ్డులో పిసరంత షుగర్ ఎక్కువైందని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు తక్కిన కేసులన్నీ పక్కకు నెట్టేసి సబ్ వే బ్రెడ్డు కేసును విచారించింది. పిసరంతే కదా అని తినేవాళ్లు అనుకోవచ్చు. సుప్రీంకోర్టుకు ఆ పిసరంత టూ మచ్ అనిపించింది. ‘చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది ముఖ్య ఆహారం (స్టేపుల్ ఫుడ్) అవదు. ముఖ్య ఆహారం కాదు కనుక దీనికి జీరో పర్సెంట్ వ్యాట్ వర్తించదు’ అని తీర్పు ఇచ్చింది. దీనర్థం ఏమిటి? ఆ బ్రెడ్డు తినకపోయినా ఆత్మారాముడు ఏమీ హర్ట్ అవడు, తిని షుగర్ తెచ్చుకుని తిప్పలు పడకండి అని చెప్పడం. చెబితే పౌరులు వినడం లేదు కాబట్టి.. షుగర్ తగ్గించకపోతే వ్యాట్ పడుతుంది జాగ్రత్త అని ‘సబ్ వే’ ను కోర్టు వారి ద్వారా లైన్లో పెట్టించింది ఐర్లాండ్ ప్రభుత్వం. -
ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్
డబ్లిన్ : భారీ సిక్సర్లకు కేరాఫ్‌గా ఉండే ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒబ్రెయిన్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మ్యాచ్ గెలిచినందుకు సంతోషించాలా లేక కారు అద్దం పగిలినందుకు బాధపడాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అదేంటి మ్యాచ్ గెలిపించినందుకు సంతోషించాలి గానీ ఇలా సందిగ్ధంలో ఉండడం ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో గురువారం డబ్లిన్ వేదికగా నార్త్‌వెస్ట్ వారియర్స్, లీన్స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన లీన్స్టర్ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు.దీంతో 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్త్‌వర్త్ లూయిస్ ప్రకారం లీన్స్టర్ జట్టు 24 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్‌లో స్టార్ ఆఫ్ ది పర్సన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కెవిన్ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. అద్దం పగిలిన కారు కెవిన్ ఓబ్రెయిన్దే. పాపం అతను కొట్టిన సిక్స్ తన కారు అద్దం ధ్వంసం చేస్తుందని అతను కూడా ఊహంచి ఉండడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్ పార్క్ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళ్లి జరిగిందంతా వివరించాడు. Didn’t need the air-con on the drive up to you lads. 🤣 unreal service once again. Never fails to disappoint. I’ll park further away next time 😝 #BestInTheBusiness https://t.co/tNKTG0tRLA — Kevin O'Brien (@KevinOBrien113) August 27, 2020 కారును ఇన్సురెన్స్ కోటా కింద రిపేయిరింగ్కు తరలించారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్నిఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్విటర్లో షేర్ చేసింది. దీనిపై కెవిన్ సరదాగా స్పందించాడు.' ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్ నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్ ఆవల చాలా దూరంలో పార్క్ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'పాపం కెవిన్ .. భారీ సిక్సులతో విరుచుకుపడే కెవిన్‌కు ఎంత కష్టం వచ్చింది.. ఆ ఒక్క సిక్స్ అతని పాలిట శాపమైంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : తండ్రి కాబోతున్న కోహ్లి, ఆసీస్ టెన్షన్) (తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) -
‘అమ్మ నవ్వుతూనే ఉండాలని అలా చేశారు’
-
‘హలో.. నన్ను బయటికి తీయండి’
డబ్లిన్ : ‘హలో.. హలో...? నన్ను బయటికి తీయండి. అక్కడ ఫాదర్ ఉన్నాడు కదా. నాకు అతడి మాటలు వినిపిస్తున్నాయి. నేను షే. పెట్టెలో ఉన్నాను’ అన్న మాటలు విని.... తమ ఇంటి పెద్ద శవాన్ని మట్టిలో పూడ్చేందుకు సిద్ధమవుతున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. శవ పేటిక నుంచి వస్తున్న మాటలు నిజం అయితే ఎంత బాగుండునో కదా అని భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయమేమిటంటే... ఐర్లాండ్‌కు చెందిన షే బ్రాడ్లే అనే వృద్ధుడు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించేవాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ.. వారిని సంతోషపెట్టేవాడు. కాగా మూడేళ్ల క్రితం అతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో కాస్త డీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో తన చావు గురించి ముందే తెలుసుకున్న షే.. మరణం తర్వాత కూడా కుటుంబ సభ్యులకు నవ్వించే వ్యక్తిగానే గుర్తుండిపోవాలని భావించాడు. ఇందుకోసం తన పెద్ద కొడుకు సహాయంతో ఏడాది కిందటే ఆడియో మెసేజ్ రికార్డు చేయించి.. తాను చనిపోయిన తర్వాత మట్టిలో పూడ్చేముందు దానిని ప్లే చేయాలని కోరాడు. ఈ క్రమంలో క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతూనే షే అక్టోబరు 8న మరణించాడు. దీంతో అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. షే చెప్పినట్లుగా అతడి మాటలను పెద్ద కొడుకు కుటుంబ సభ్యులకు వినిపించాడు. ఈ విషయాన్ని షే కూతురు ఆండ్రియా ట్విటర్లో పంచుకున్నారు. ‘ మా నాన్న లెజెండ్.. షే బ్రాడ్లే. అంత్యక్రియలకు ముందు మమ్మల్ని నవ్వించాలనేది తన చివరి కోరిక. ఆయన చాలా గొప్పవాడు. ఆయన లేరన్న బాధతో మేము విషణ్ణ వదనాలతో ఉండకూడదని ఇలా చేశారు’ అని తన తండ్రి ఫొటోను షేర్ చేశారు. తమ తల్లి ఎప్పటికీ నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతో నాన్న ప్రాంక్ మెసేజ్ చేశారని పేర్కొన్నారు. -
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
డబ్లిన్ : ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో దాదాపు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమం మొదలైంది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూకే నుండి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగాణైటీస్ ఆఫ్ ఐర్లాండ్ వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచుకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఇక్కడి ప్రాంతీయ ఎంపీలు(టీడీఎస్) రుత్ కొపింజర్, జాక్ చాంబర్స్, కౌన్సెలర్ మేరీ మెక్కామ్లే పాల్గొన్నారు. అతిథులకు ప్రసాదం, రుచికరమైన వంటలను వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన శ్రీనివాస కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల, జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కోలన్, సంతోష్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేష్ అది, దయాకర్ రెడ్డి కొమురెల్లి, శ్రీనివాస్ పటేల్, సుమంత్ చావా, అల్లే శ్రీను, నగేష్ పొల్లూరు, నవీన్ రెడ్డి గడ్డం, త్రీశిర్ పెంజర్ల, ప్రదీప్ యల్క, ప్రవీణ్ లాల్, వెచ్చ శ్రీను, వెంకట్ తీరు, సునీల్ పాక, అల్లంపల్లి శ్రీనివాస్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగి రెడ్డి, రమణ యానాల, రామ్ రెడ్డి, వెంకట్ గాజుల, వెంకట్ జూలూరి, వెంకట్ అక్కపల్లి, నవీన్ జనగాం, రాజా రెడ్డి, రామ బొల్లగొని, కొసనం శ్రీను, రాజు తేరా, సాయినాథ్, సుచరిత్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్లు బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించడంలో తమ వంతు కృషి చేశారు. -
డబ్లిన్‌లో ఘనంగా గణేశ్ చతుర్థి
ఐర్లాండ్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఐటీవీ సహకారంతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపారు. కమ్యూనిటీ స్థానిక సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు తెలుగు ప్రజలు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక శనివారం నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించి, ఊరేగింపులు జరిపి ఘనంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాన్ని విజయవంతం చేసిన తెలుగువారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఐర్లాడ్ తెలుగు సమాజం(ఐటీఎస్) కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఐర్లాండ్
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్, వైశాల్యం: 84,421 చ.కి.మీ జనాభా: 64,00,000 (తాజా అంచ నాల ప్రకారం) రాజధాని: డబ్లిన్, ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్ కరెన్సీ: యూరో, భాషలు: ఇంగ్లిష్, ఐరిష్, మతం: క్రైస్తవులు సరిహద్దులు: మూడు వైపులా అట్లాంటిక్ సముద్రం, ఉత్తరం వైపు ఉత్తర ఐర్లాండ్. వాతావరణం: జనవరి, ఫిబ్రవరిలో 4 నుండి 7 డి గ్రీలు, జూలై, ఆగస్టులో 14 నుండి 16 డిగ్రీలు. పంటలు - పరిశ్రమలు: తృణ ధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, కూరగాయలు. సహజ వాయువు, సీసం, జింకు, బెరైట్లు, జిప్సమ్, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్, యంత్ర పరికరాలు, రసాయనాలు, ఎరువులు, దుస్తులు, ఫాబ్రిక్స్. సామ్యవాద శకంలో పారిశ్రామీకరణ వల్ల భారీ పరిశ్రమలు లోహయంత్రాల ఉత్పత్తి, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు, నూనెశుద్ధి కర్మాగారాలు మొదలైన వాటి వల్ల 20 శతాబ్దం చివరలో బల్గేరియా ఆధిపత్యం కొనసాగింది. స్వాతంత్య్రం: డిసెంబర్, 1921 చర్రిత: క్రీస్తుశకం 432లో ఈ ప్రాంతాన్ని సెయింట్ పాట్రిక్ పాలించాడు. ఆ తర్వాత వైకింగ్‌లు ఈ ప్రాంతంలో వలస వచ్చి స్థిరపడిపోయారు. వీరిదే అక్కడ ఆధిపత్యం. ఐర్లాండ్ దేశానికి చెంది బ్రయాన్ బోరు అనే మాతృదేశ భక్తుడు క్రీస్తుశకం 1024లో వైకింగ్‌లను ఓడించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడు. కాని అది ఎంతో కాలం నిలువలేదు. క్రీ.శ.1168లో ఇంగ్లండ్ రాజు రెండవ హెన్రీ ఐర్లాండ్‌ను ఆక్రమించాడు. ఇక అప్పటి నుండి నిన్న మొన్నటిదాకా ఐర్లాండ్ ఇంగ్లండ్ అధీనంలో ఉండేది. 16, 17 శతాబ్దాలలో ఇక్కడి ప్రజల భూములను ఆంగ్లేయులు లాక్కున్నారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్కు చెందిన ప్రొటెస్టెంటులు ఇక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇది క్యాథలిక్కులకు ప్రొటెస్టెంటులకు మధ్య ఆధిపత్యపోరు. 1801లో యూనియన్ ఆక్ట్ రూపొందించారు. దాని ప్రకారం ఐర్లాండ్‌లో పార్లమెంటు రద్దు కాబడింది. కేవలం అక్కడి నుండి సభ్యులు ఎన్నికై బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు వెళ్లాలి. బ్రిటిష్ రాజులు ఐర్లాండ్‌లో క్యాథలిక్కులు ఎలాంటి అధికారాలను, కార్యాలయాలను కలిగి ఉండరాదని నిషేధం విధించారు. అయితే 1828లో క్యాథలిక్కు అయిన డేనియల్ ఓ కానెల్ సభ్యుడుగా గెలిపొందినపుడు బ్రిటిష్ ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించవలసి వచ్చింది.1845లో అనూహ్యమైన కరువు కాటకాలు ఏర్పడి దాదాపు పది లక్షల మంది ఆకలితో మరణించారు. 1847లో రెండున్నర మిలియన్ల ప్రజలు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ రాజులు ఐర్లాండ్‌లో హోమ్ రూల్ అమలు చేశారు. 1916 నుండి 1921 వరకు ఐరిష్ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల మీద యుద్ధం చేశారు. చివరికి 1921లో ఐర్లాండ్ స్వాతంత్రం పొందింది. ప్రజలు - సంస్కృతి సాధారణంగా ప్రజలు తెలుపు రంగులో ఉంటారు. సంవత్సరం పొడుగునా వేడిమి తక్కువగా ఉంటుంది. జనవరి కాలంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలను తాకుతుంది. మహిళలు పని సమయంలో ఏప్రాన్ లాంటి కోటు ధరిస్తారు. తలకు ఒక పట్టీ కట్టుకుంటారు. పురుషులు, మహిళలు సమానంగా పనిచేస్తారు. ఇక్కడి ప్రజలు స్నేహభావంతో ఉంటారు. తీరిక సమయాల్లో మహిళలు కుట్లు, అల్లికల పని చేస్తారు. జనాభా అంతా క్రిస్టియన్లే. వీరంతా ఆదివారం తప్పకుండా చర్చికి వెళతారు. గ్రామాల్లో చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 50 శాతానికి పైగా ప్రజలు దేవుని నమ్ముతారు. జాతీయ పండుగల సమయంలో గ్రామస్థాయి నుండి రాజధాని నగరం దాకా ప్రజలు ఆట పాటల్లో మునిగిపోతారు. ప్రతి కుటుంబానికి ఇల్లు తప్పకుండా ఉంటుంది. పొలం పనులు మగవాళ్లు ఎక్కువగా చేస్తారు. వీరు ఆధునిక య్రంతాలతో వ్యవసాయం చేస్తారు. మహిళలకు నాట్యం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడి ప్రజలు తేనెను అధికంగా ఉపయోగిస్తారు. బ్రెడ్డు, కూరగాయల ముక్కలు అల్పాహారంగా తింటారు. మాంసం ముఖ్య ఆహారం. వీటితో పాటు బాక్సిటీ, బారమ్ బ్రాక్, సోడా బ్రెడ్, ఛాంప్ కూరగాయల రోస్ట్, కోల్కనన్, స్ట్యూ, బెకన్ కాబే జి, కాడిల్, చేడర్, బంగాళ దుంపలు, ఉల్లిపాయల చిప్స్, చీజ్ కేక్ మొదలైన పదార్థాలను అధికంగా తింటారు. పరిపాలనా రీతులు ఐర్లాండ్ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు ప్రావిన్స్‌లుగా విభజింపబడి ఉంది. అవి కొన్నాచెట్, లీన్స్టర్, మున్యటర్, ఉల్స్స్టర్లు. వీటిలో ఉల్స్స్టర్ ఉత్తర ఐర్లాండ్ భాగం. ఈ నాలుగు ప్రావిన్స్‌లు తిరిగి 32 సాంప్రదాయక కౌంటీలుగా విభజింపబడి ఉన్నాయి. 28 ఐర్లాండ్‌లో, 6 ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్నాయి. దేశంలో దాదాపు పది పెద్ద నగరాలు ఉన్నాయి. అవి డబ్లిన్, బెల్ఫాస్ట్, కార్క్, లిమరిక్, డెర్రీ, గాల్వే, వాటర్ ఫోర్డ్, క్రేగనోన్, డ్రోగెడా, డుండాల్క్లు. చూడదగిన ప్రదేశాలు... 1. డబ్లిన్ వైకింగ్ రాజులు ఈ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేశారు. నగరం గుండా లిఫ్సీనది ప్రవహిస్తుంది. నగరం ఎంతో అందమైన భవనాలతో నిండి చూడడానికి ఎన్నో పురాతన రాచరిక కట్టడాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి డబ్లిన్ కాజిల్, ఫీనిక్స్ పార్క్, ఐర్లాండ్ అధ్యక్షుడి నివాస భవనం - అరస్ అనే ఉచ్చారిస్, మెరియన్ వీధిలో ప్రభుత్వ భవనాలు, ఓ కానెల్ వీధిలో శతాబ్దం నాటి జనరల్ పోస్టాఫీస్ భవనం, నేషనల్ గాలరీ, నేషనల్ లైబ్రరీ, గ్లాస్నెవిన్ సిమెట్రీ, ఐరిష్ నేషనల్ వార్ మెమోరియల్, శతాబ్దం క్రిందటి కిల్మెన్హమ్ గోల్ జైలు భవనం, డబ్లిన్ లిటి ల్ మ్యూజియం, సుప్రీంకోర్టు భవనం, నేషనల్ బొటానికల్ గార్డెన్, సెయింట్ మేరిస్, క్రైస్ట్ చర్చ్ క్యాథడ్రల్లు, సెయింట్ పాట్రిక్స్ క్యాథడ్రల్, ఎలిజబెత్ రాణి నిర్మించిన డబ్లిన్ విశ్వవిద్యాలయ భవనం, 18వ శతాబ్దపు నిర్మాణం ఫిట్జ్ విలియం, మెరియన్ స్క్వేర్లు హాఫెనీ బ్రిడ్జి, రాయల్ కెనాలు ఇలా నగరం నిండా చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. 2. బోయ్‌నే ప్యాలస్ కౌంటీ మీట్ ప్రాంతంలో బ్రూనా బోయినె లేదా బోయ్నా ప్యాలస్‌గా పిలవబడే ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక కట్టడం ఉంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది అత్యంత పురాతన కట్టడం. ఈజిప్టులోని గీజా పిరమిడ్ల కన్నా పురాతనమైనవి. డిసెంబర్ 21వ తేదీన ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టూంబులోకి సూర్యకిరణాలు నేరుగా వెళతాయి. సన్నటి దారిలోంచి సూర్యకిరణాలు వెళ్లడం ఒక గొప్ప అద్భుతం. కేవలం డిసెంబర్ 21న మాత్రమే ఇది జరుగుతుంది. ఇదొక అంతు తెలియని కట్టడం అని అందరూ అనుకుంటారు. ఈ నిర్మాణం క్రీస్తు పూర్వం 330లో జరిగిందని చరిత్ర చెబుతోంది. ఈ పరిసరాల లో దాదాపు 40 ఇలాంటి టూంబులు ఆ కాలంలో నిర్మించారు. వీటి నిర్మాణంలో నిర్మాణ శైలి, ఇంజనీరింగ్ , ఖగోళ వింత అనేది ఇప్పటికీ సృష్టంగా తెలుస్తుంది. ఆ రోజున మాత్రమే సూర్యకిరణాలు లోపలికి వెళ్లడం అనేది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. క్రీస్తు పూర్వం 2900 నుండి ఇవి నిరుపయోగం అయిపోయాయి. క్రీస్తు పూర్వం 500 క్రీస్తు శకం 400 మధ్య కాలంలో తిరిగి ఇక్కడ ప్రజలు నివసించారని చెప్పే ఆనవాళ్లు ఉన్నాయి. 3. కార్క్ దేశానికి దక్షిణ భాగంలో అట్లాంటిక్ సముద్రతీరంలో నెలకొని ఉన్న మరో పెద్ద నగరం కార్క్. ఈ నగరం 18వ శతాబ్దంలో సెయింట్ మేరీ, సెయింట్ అన్నే, సెయింట్ ఫిన్ బర్రే క్యాథ్రడల్లు నిర్మితమయ్యారు. సెయింట్ అన్నే కాథడ్రల్ పైన నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ఒక్కొక్క గడియారం ఒక్కొక్క సమయాన్ని చూపిస్తుంటాయి. అలా ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. దీనినే ‘నాలుగు ముఖాల అబద్ధాల కోరు’ అని పిలుస్తుంటారు. ఈ నగరంలో ఫొటో ైవె ల్డ్లైఫ్ పార్కు, 17వ శతాబ్దంలో నిర్మితమైన ఎలిజబెత్ ఫోర్ట్, కార్క్ ఓపెరా హౌస్, ఇంగ్లీష్ మార్కెట్, బ్లార్నీ క్యాజిల్, ఐర్లాండ్ నేషనల్ యూనివ ర్సిటీలు ఉన్నాయి. ఈ నగరం లీనది తీరంలో నిర్మించబడింది. నది రెండు పాయలుగా చీలి మధ్యన భూభాగం ఒక ద్వీపంలా కనబడుతోంది. నగరంలో ఉన్న సిటిహాల్ భవనం, షాన్డోన్ స్టీఫుల్ చూడదగ్గవి. వైకింగ్ రాజులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 900 శతాబ్దంలో పాలించినపుడు ఈ నగరం నిర్మితమైంది. ఈ నగరం ఇప్పుడు గొప్ప వ్యాపార కేంద్రంగా వృద్ధి చెందింది. 4. లిమెరిక్ ఐర్లాండ్ దేశంలో మూడో అతిపెద్ద నగరం లిమెరిక్. ఇది షన్నన్ నదీ తీరంలో ఉంది. క్రీస్తు శకం 800 శతాబ్దం నుండి ఈ నగరం ఉనికిలో ఉంది. 12వ శతాబ్దంలో నార్మన్ రాజులు ఈ నగరాన్ని మరింత మెరుగు పరిచారు. ఇక్కడే శతాబ్దాల నాటి భవనాలు, సెయింట్ మేరీ క్యాథడ్రల్ ఉన్నాయి. నగరంలో హాంట్ మ్యూజియం, బెల్టబుల్ ఆర్ట్ సెంటర్, షన్నన్ ఎయిర్ ఫోర్ట్, లిమెరిక్ సిటీ మ్యూజియం, కింగ్ జాన్ క్యాజిల్, సెయింట్ మేరీ క్యాథడ్రల్, ట్రీటీ స్టోన్, తోమండ్ బ్రిడ్జి... ఇలా ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో మనకు దర్శనమిస్తాయి. ఓ కాన్నెల్ వీధిలో ఉన్న కన్నాక్ డిపార్టుమెంటల్ స్టోర్ భవనం ఎంతో విశాలంగా ఎంతో పొడవుగా, తెలుపు రంగులో దర్శనమిస్తుంది.