Dublin High School Students Doing Service Program With Urban Agriculture - Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!

Published Mon, Jul 24 2023 10:36 AM | Last Updated on Mon, Jul 24 2023 10:51 AM

Dublin High School Students Doing Service Program With Urban Agriculture - Sakshi

ఇలా ట్రేలలో ఇంట్లోనే మైక్రో గ్రీన్స్‌ పెంచుతున్నారు

చారిత్రాత్మక డబ్లిన్‌ నగరంలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కలసి అర్బన్‌ అగ్రికల్చర్‌ రంగంలో చేపట్టిన సేవా కార్యక్రమం ఇటీవల వార్తల్లోకెక్కింది. పౌష్టికాహార భద్రతను కల్పించే ట్టి మొక్కల్ని స్వయంగా తామే పెంచి ఇతరులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్‌ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్‌ రాజధాని డబ్లిన్‌. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది.

1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్‌ ఫ్రీ స్టేట్‌’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్‌గా మార్చారు. అర్జున్‌ కరర్‌–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్‌ హైస్కూల్‌ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్‌ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్‌గా మైక్రోగ్రీన్స్‌ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది. సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్‌ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్‌ తన 16వ ఏట లైసెన్స్‌ తీసుకొని మరీ తమ గ్యారేజ్‌లో వర్టికల్‌ గార్డెన్‌ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్‌ పెంపకాన్ని ప్రారంభించాడు.

‘గార్డెనర్స్‌ ఆఫ్‌ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్‌ కరర్‌–పరేఖ్, ప్రెస్టన్‌ చియు, నికో సింగ్‌ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్‌ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. డీయూఎస్‌డీ న్యట్రిషనల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఫ్రాంక్‌ కాస్ట్రో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్‌ను డబ్లిన్‌ యూనిఫైడ్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ (డీయూఎస్‌డీ) పరిధిలోని స్కూల్‌ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు. ‘మైక్రోగ్రీన్స్‌ పెంపకానికి అలమెడా కౌంటీ నుంచి హోమ్‌ గ్రోయర్స్‌ లైసెన్స్‌ కూడా తీసుకున్నాను.


కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్‌

నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్‌ బ్యాగ్స్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్‌. డబ్లిన్‌ నగరపాలకులు మినీ గ్రాంట్ల పేరిట 1,500 డాలర్లను అందజేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. ‘డబ్లిన్‌ హైస్కల్‌లో సలాడ్లకు మైక్రోగ్రీన్స్‌ను జోడించడం అద్భుతంగా ఉందని న్యట్రిషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఫ్రాంక్‌ కాస్ట్రో అన్నారు. ‘మా చొరవ ప్రత్యేకమైనదని మేం నమ్ముతున్నాం.

సమాజంలో మార్పు తెస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రజలకు సహాయం చేయడం మంచి అనుభతినిస్తుంది. నేను ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయం చేయాలనుకున్నాను. ఒంటరిగా చేయలేకపోయిన పనిని మేం కలసి చేస్తున్నాం’ అన్నారు జీజీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరి గణేష్‌ (16). పై చదువులకు వెళ్లాక కూడా ఈ పని కొనసాగించాలని, మరింత మందికి మైక్రోగ్రీన్స్‌ అందించాలని ఈ యువ అర్బన్‌ ఫార్మర్స్‌ ఆశిస్తున్నారు.

ఈ విద్యార్థుల పని స్ఫూర్తిదాయకం ‘గార్డెనర్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ సభ్యులైన ఈ విద్యార్థులు ఎంతో మంచి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తీర్చాలని వీరు కంకణం కట్టుకోవడం చాలా స్ఫర్తిదాయకంగా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్‌ను పండించడం కొనసాగించడానికి డబ్లిన్‌ సిటీ యూత్‌ అడ్వైజరీ కమిటీ మంచి గ్రాంట్‌ ఇవ్వటం చసి చాలా సంతోషిస్తున్నాను.
– మెలీసా హెర్నాండెజ్, డబ్లిన్‌ నగర మేయర్‌

పతంగి రాంబాబు

(చదవండి:  ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement