సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ 6 విధాలుగా దోహదం..
4 విధాలుగా విఘాతం కలిగే అవకాశం.
సవాళ్లను అధిగమిస్తే అర్బన్ అగ్రికల్చర్‌తో సుస్థిర అభివృద్ధికి ఎంతో మేలు!
ఈ నెల 22–23 తేదీల్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి ‘ఫ్యూచర్ 2024’
సమావేశాల నేపథ్యంలో ఆసక్తికర అధ్యయనం
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది.
యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.
అర్బన్ అగ్రికల్చర్.. అంటే?
నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది.
నాణానికి అవతలి వైపు..
అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్‌ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు.
అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్‌ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు.
తాజా పోషకాహారం లభ్యత
పోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్‌ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’
ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment