
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్‌ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది.
అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది.
రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్‌ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్‌ఆర్‌కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్‌ఆర్ వెబ్‌సైట్ చూడండి.
(చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)
Comments
Please login to add a commentAdd a comment