డబ్లిన్ : ‘హలో.. హలో...? నన్ను బయటికి తీయండి. అక్కడ ఫాదర్ ఉన్నాడు కదా. నాకు అతడి మాటలు వినిపిస్తున్నాయి. నేను షే. పెట్టెలో ఉన్నాను’ అన్న మాటలు విని.... తమ ఇంటి పెద్ద శవాన్ని మట్టిలో పూడ్చేందుకు సిద్ధమవుతున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. శవ పేటిక నుంచి వస్తున్న మాటలు నిజం అయితే ఎంత బాగుండునో కదా అని భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయమేమిటంటే... ఐర్లాండ్‌కు చెందిన షే బ్రాడ్లే అనే వృద్ధుడు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించేవాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ.. వారిని సంతోషపెట్టేవాడు. కాగా మూడేళ్ల క్రితం అతడికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో కాస్త డీలా పడ్డాడు.