ఐర్లాండ్ | reland's view of the world | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్

Published Sat, Mar 7 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

ఐర్లాండ్

ఐర్లాండ్

ప్రపంచ వీక్షణం
నైసర్గిక స్వరూపం

 
ఖండం: యూరప్, వైశాల్యం: 84,421 చ.కి.మీ
జనాభా:  64,00,000 (తాజా అంచ నాల ప్రకారం)
రాజధాని: డబ్లిన్, ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్
కరెన్సీ: యూరో, భాషలు: ఇంగ్లిష్, ఐరిష్, మతం: క్రైస్తవులు
సరిహద్దులు: మూడు వైపులా అట్లాంటిక్ సముద్రం, ఉత్తరం వైపు ఉత్తర ఐర్లాండ్.
వాతావరణం: జనవరి, ఫిబ్రవరిలో 4 నుండి 7 డి గ్రీలు, జూలై, ఆగస్టులో 14 నుండి 16 డిగ్రీలు.

పంటలు - పరిశ్రమలు:  తృణ ధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, కూరగాయలు. సహజ వాయువు, సీసం, జింకు, బెరైట్‌లు, జిప్సమ్, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్, యంత్ర పరికరాలు, రసాయనాలు, ఎరువులు, దుస్తులు, ఫాబ్రిక్స్. సామ్యవాద శకంలో పారిశ్రామీకరణ వల్ల భారీ పరిశ్రమలు లోహయంత్రాల ఉత్పత్తి, చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు, నూనెశుద్ధి కర్మాగారాలు మొదలైన వాటి వల్ల 20 శతాబ్దం చివరలో బల్గేరియా ఆధిపత్యం కొనసాగింది.
స్వాతంత్య్రం: డిసెంబర్, 1921
 
చర్రిత: క్రీస్తుశకం 432లో ఈ ప్రాంతాన్ని సెయింట్ పాట్రిక్ పాలించాడు. ఆ తర్వాత వైకింగ్‌లు ఈ ప్రాంతంలో వలస వచ్చి స్థిరపడిపోయారు. వీరిదే అక్కడ ఆధిపత్యం. ఐర్లాండ్ దేశానికి చెంది బ్రయాన్ బోరు అనే మాతృదేశ భక్తుడు క్రీస్తుశకం 1024లో వైకింగ్‌లను ఓడించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడు. కాని అది ఎంతో కాలం నిలువలేదు. క్రీ.శ.1168లో ఇంగ్లండ్ రాజు రెండవ హెన్రీ ఐర్లాండ్‌ను ఆక్రమించాడు. ఇక అప్పటి నుండి నిన్న మొన్నటిదాకా ఐర్లాండ్ ఇంగ్లండ్ అధీనంలో ఉండేది. 16, 17 శతాబ్దాలలో ఇక్కడి ప్రజల భూములను ఆంగ్లేయులు లాక్కున్నారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్‌కు చెందిన ప్రొటెస్టెంటులు ఇక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇది క్యాథలిక్కులకు ప్రొటెస్టెంటులకు మధ్య ఆధిపత్యపోరు. 1801లో యూనియన్ ఆక్ట్ రూపొందించారు. దాని ప్రకారం ఐర్లాండ్‌లో పార్లమెంటు రద్దు కాబడింది. కేవలం అక్కడి నుండి సభ్యులు ఎన్నికై బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు వెళ్లాలి. బ్రిటిష్ రాజులు ఐర్లాండ్‌లో క్యాథలిక్కులు ఎలాంటి అధికారాలను, కార్యాలయాలను కలిగి ఉండరాదని నిషేధం విధించారు. అయితే 1828లో క్యాథలిక్కు అయిన డేనియల్ ఓ కానెల్ సభ్యుడుగా గెలిపొందినపుడు బ్రిటిష్ ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించవలసి వచ్చింది.1845లో అనూహ్యమైన కరువు కాటకాలు ఏర్పడి దాదాపు పది లక్షల మంది ఆకలితో మరణించారు. 1847లో రెండున్నర మిలియన్ల ప్రజలు చనిపోయారు.     

 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ రాజులు ఐర్లాండ్‌లో హోమ్ రూల్ అమలు చేశారు. 1916 నుండి 1921 వరకు ఐరిష్ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల మీద యుద్ధం చేశారు. చివరికి 1921లో ఐర్లాండ్ స్వాతంత్రం పొందింది.
 
ప్రజలు - సంస్కృతి

సాధారణంగా ప్రజలు తెలుపు రంగులో ఉంటారు. సంవత్సరం పొడుగునా వేడిమి తక్కువగా ఉంటుంది. జనవరి కాలంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలను తాకుతుంది. మహిళలు పని సమయంలో ఏప్రాన్ లాంటి కోటు ధరిస్తారు. తలకు ఒక పట్టీ కట్టుకుంటారు. పురుషులు, మహిళలు సమానంగా పనిచేస్తారు. ఇక్కడి ప్రజలు స్నేహభావంతో ఉంటారు. తీరిక సమయాల్లో మహిళలు కుట్లు, అల్లికల పని చేస్తారు. జనాభా అంతా క్రిస్టియన్లే. వీరంతా ఆదివారం తప్పకుండా చర్చికి వెళతారు. గ్రామాల్లో చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 50 శాతానికి పైగా ప్రజలు దేవుని నమ్ముతారు.

జాతీయ పండుగల సమయంలో గ్రామస్థాయి నుండి రాజధాని నగరం దాకా ప్రజలు ఆట పాటల్లో మునిగిపోతారు. ప్రతి కుటుంబానికి ఇల్లు తప్పకుండా ఉంటుంది. పొలం పనులు మగవాళ్లు ఎక్కువగా చేస్తారు. వీరు ఆధునిక య్రంతాలతో వ్యవసాయం చేస్తారు. మహిళలకు నాట్యం అంటే ఎంతో ఇష్టం.

ఇక్కడి ప్రజలు తేనెను అధికంగా ఉపయోగిస్తారు. బ్రెడ్డు, కూరగాయల ముక్కలు అల్పాహారంగా తింటారు. మాంసం ముఖ్య ఆహారం. వీటితో పాటు బాక్సిటీ, బారమ్ బ్రాక్, సోడా బ్రెడ్, ఛాంప్ కూరగాయల రోస్ట్, కోల్‌కనన్, స్ట్యూ, బెకన్ కాబే జి, కాడిల్, చేడర్, బంగాళ దుంపలు, ఉల్లిపాయల చిప్స్, చీజ్ కేక్ మొదలైన పదార్థాలను అధికంగా తింటారు.
 
పరిపాలనా రీతులు
 
ఐర్లాండ్ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు ప్రావిన్స్‌లుగా విభజింపబడి ఉంది. అవి కొన్నాచెట్, లీన్స్‌టర్, మున్యటర్, ఉల్స్‌స్టర్‌లు. వీటిలో ఉల్స్‌స్టర్ ఉత్తర ఐర్లాండ్ భాగం. ఈ నాలుగు ప్రావిన్స్‌లు తిరిగి 32 సాంప్రదాయక కౌంటీలుగా విభజింపబడి ఉన్నాయి. 28 ఐర్లాండ్‌లో, 6 ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్నాయి. దేశంలో దాదాపు పది పెద్ద నగరాలు ఉన్నాయి. అవి డబ్లిన్, బెల్‌ఫాస్ట్, కార్క్, లిమరిక్, డెర్రీ, గాల్వే, వాటర్ ఫోర్డ్, క్రేగనోన్, డ్రోగెడా, డుండాల్క్‌లు.
 
చూడదగిన ప్రదేశాలు...
 
1. డబ్లిన్

 వైకింగ్ రాజులు ఈ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేశారు. నగరం గుండా లిఫ్సీనది ప్రవహిస్తుంది. నగరం ఎంతో అందమైన భవనాలతో నిండి చూడడానికి ఎన్నో పురాతన రాచరిక కట్టడాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి డబ్లిన్ కాజిల్, ఫీనిక్స్ పార్క్, ఐర్లాండ్ అధ్యక్షుడి నివాస భవనం - అరస్ అనే ఉచ్చారిస్, మెరియన్ వీధిలో ప్రభుత్వ భవనాలు, ఓ కానెల్ వీధిలో శతాబ్దం నాటి జనరల్ పోస్టాఫీస్ భవనం, నేషనల్ గాలరీ, నేషనల్ లైబ్రరీ, గ్లాస్నెవిన్ సిమెట్రీ, ఐరిష్ నేషనల్ వార్ మెమోరియల్, శతాబ్దం క్రిందటి కిల్మెన్హమ్ గోల్ జైలు భవనం, డబ్లిన్ లిటి ల్ మ్యూజియం, సుప్రీంకోర్టు భవనం, నేషనల్ బొటానికల్ గార్డెన్, సెయింట్ మేరిస్, క్రైస్ట్ చర్చ్ క్యాథడ్రల్‌లు, సెయింట్ పాట్రిక్స్ క్యాథడ్రల్, ఎలిజబెత్ రాణి నిర్మించిన డబ్లిన్ విశ్వవిద్యాలయ భవనం, 18వ శతాబ్దపు నిర్మాణం ఫిట్జ్ విలియం, మెరియన్ స్క్వేర్‌లు హాఫెనీ బ్రిడ్జి, రాయల్ కెనాలు ఇలా నగరం నిండా చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి.
 
2. బోయ్‌నే ప్యాలస్

కౌంటీ మీట్ ప్రాంతంలో బ్రూనా బోయినె లేదా బోయ్‌నా ప్యాలస్‌గా పిలవబడే ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక కట్టడం ఉంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది అత్యంత పురాతన కట్టడం. ఈజిప్టులోని గీజా పిరమిడ్ల కన్నా పురాతనమైనవి.
 డిసెంబర్ 21వ తేదీన ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టూంబులోకి సూర్యకిరణాలు నేరుగా వెళతాయి. సన్నటి దారిలోంచి సూర్యకిరణాలు వెళ్లడం ఒక గొప్ప అద్భుతం. కేవలం డిసెంబర్ 21న మాత్రమే ఇది జరుగుతుంది. ఇదొక అంతు తెలియని కట్టడం అని అందరూ అనుకుంటారు. ఈ నిర్మాణం క్రీస్తు పూర్వం 330లో జరిగిందని చరిత్ర చెబుతోంది. ఈ పరిసరాల లో దాదాపు 40 ఇలాంటి టూంబులు ఆ కాలంలో నిర్మించారు. వీటి నిర్మాణంలో నిర్మాణ శైలి, ఇంజనీరింగ్ , ఖగోళ వింత అనేది ఇప్పటికీ సృష్టంగా తెలుస్తుంది. ఆ రోజున మాత్రమే సూర్యకిరణాలు లోపలికి వెళ్లడం అనేది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. క్రీస్తు పూర్వం 2900 నుండి ఇవి నిరుపయోగం అయిపోయాయి. క్రీస్తు పూర్వం 500 క్రీస్తు శకం 400 మధ్య కాలంలో తిరిగి ఇక్కడ ప్రజలు నివసించారని చెప్పే ఆనవాళ్లు ఉన్నాయి.

 3. కార్క్

 దేశానికి దక్షిణ భాగంలో అట్లాంటిక్ సముద్రతీరంలో నెలకొని ఉన్న మరో పెద్ద నగరం కార్క్. ఈ నగరం 18వ శతాబ్దంలో సెయింట్ మేరీ, సెయింట్ అన్నే, సెయింట్ ఫిన్ బర్రే క్యాథ్రడల్‌లు నిర్మితమయ్యారు. సెయింట్ అన్నే కాథడ్రల్ పైన నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ఒక్కొక్క గడియారం ఒక్కొక్క సమయాన్ని చూపిస్తుంటాయి. అలా ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. దీనినే ‘నాలుగు ముఖాల అబద్ధాల కోరు’ అని పిలుస్తుంటారు. ఈ నగరంలో ఫొటో ైవె ల్డ్‌లైఫ్ పార్కు, 17వ శతాబ్దంలో నిర్మితమైన ఎలిజబెత్ ఫోర్ట్, కార్క్ ఓపెరా హౌస్, ఇంగ్లీష్ మార్కెట్, బ్లార్నీ క్యాజిల్, ఐర్లాండ్ నేషనల్ యూనివ ర్సిటీలు ఉన్నాయి.
 ఈ నగరం లీనది తీరంలో నిర్మించబడింది. నది రెండు పాయలుగా చీలి మధ్యన భూభాగం ఒక ద్వీపంలా కనబడుతోంది. నగరంలో ఉన్న సిటిహాల్ భవనం, షాన్‌డోన్ స్టీఫుల్ చూడదగ్గవి. వైకింగ్ రాజులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 900 శతాబ్దంలో పాలించినపుడు ఈ నగరం నిర్మితమైంది. ఈ నగరం ఇప్పుడు గొప్ప వ్యాపార కేంద్రంగా వృద్ధి చెందింది.

 4. లిమెరిక్

 ఐర్లాండ్ దేశంలో మూడో అతిపెద్ద నగరం లిమెరిక్. ఇది షన్నన్ నదీ తీరంలో ఉంది. క్రీస్తు శకం 800 శతాబ్దం నుండి ఈ నగరం ఉనికిలో ఉంది. 12వ శతాబ్దంలో నార్మన్ రాజులు ఈ నగరాన్ని మరింత మెరుగు పరిచారు. ఇక్కడే శతాబ్దాల నాటి భవనాలు, సెయింట్ మేరీ క్యాథడ్రల్ ఉన్నాయి. నగరంలో హాంట్ మ్యూజియం, బెల్టబుల్ ఆర్ట్ సెంటర్, షన్నన్ ఎయిర్ ఫోర్ట్, లిమెరిక్ సిటీ మ్యూజియం, కింగ్ జాన్ క్యాజిల్, సెయింట్ మేరీ క్యాథడ్రల్, ట్రీటీ స్టోన్, తోమండ్ బ్రిడ్జి... ఇలా ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో మనకు దర్శనమిస్తాయి.
 ఓ కాన్నెల్ వీధిలో ఉన్న కన్నాక్ డిపార్టుమెంటల్ స్టోర్ భవనం ఎంతో విశాలంగా ఎంతో పొడవుగా, తెలుపు రంగులో దర్శనమిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement