డబ్లిన్ : ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో దాదాపు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమం మొదలైంది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూకే నుండి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు.
మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగాణైటీస్ ఆఫ్ ఐర్లాండ్ వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచుకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఇక్కడి ప్రాంతీయ ఎంపీలు(టీడీఎస్) రుత్ కొపింజర్, జాక్ చాంబర్స్, కౌన్సెలర్ మేరీ మెక్‌కామ్‌లే పాల్గొన్నారు. అతిథులకు ప్రసాదం, రుచికరమైన వంటలను వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన శ్రీనివాస కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల, జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కోలన్, సంతోష్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేష్ అది, దయాకర్ రెడ్డి కొమురెల్లి, శ్రీనివాస్ పటేల్, సుమంత్ చావా, అల్లే శ్రీను, నగేష్ పొల్లూరు, నవీన్ రెడ్డి గడ్డం, త్రీశిర్ పెంజర్ల, ప్రదీప్ యల్క, ప్రవీణ్ లాల్, వెచ్చ శ్రీను, వెంకట్ తీరు, సునీల్ పాక, అల్లంపల్లి శ్రీనివాస్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగి రెడ్డి, రమణ యానాల, రామ్ రెడ్డి, వెంకట్ గాజుల, వెంకట్ జూలూరి, వెంకట్ అక్కపల్లి, నవీన్ జనగాం, రాజా రెడ్డి, రామ బొల్లగొని, కొసనం శ్రీను, రాజు తేరా, సాయినాథ్, సుచరిత్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్లు బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించడంలో తమ వంతు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment