డబ్లిన్లో ఘనంగా గణేశ్ చతుర్థి | ganesh festival celebrated in dublin by telugu people | Sakshi
Sakshi News home page

డబ్లిన్లో ఘనంగా గణేశ్ చతుర్థి

Published Tue, Sep 22 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

ganesh festival celebrated in dublin by telugu people

ఐర్లాండ్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఐటీవీ సహకారంతో ఐర్లాండ్లోని డబ్లిన్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపారు.  కమ్యూనిటీ స్థానిక సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు తెలుగు ప్రజలు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక శనివారం నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించి, ఊరేగింపులు జరిపి ఘనంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాన్ని విజయవంతం చేసిన తెలుగువారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఐర్లాడ్ తెలుగు సమాజం(ఐటీఎస్) కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement