south africa hiv woman carries covid 19 infection 216 days - Sakshi
Sakshi News home page

హెచ్​ఐవీ​ పేషెంట్​లో 216రోజులుగా కరోనా!

Published Sun, Jun 6 2021 12:20 PM | Last Updated on Sun, Jun 6 2021 4:56 PM

South Africa HIV Woman Carries Covid-19 Infection for 216 days - Sakshi

డర్బన్​​:  దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్​ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్​ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్​ 32 సార్లు మ్యూటేషన్స్​కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్​ఆర్​గ్జివ్​ మెడికల్ జర్నల్​ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
  
ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్​ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్​లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్​ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్​​ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు.
 
కారణం ఇదే..
సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్​డ్​ స్టేజ్​లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్​ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్​ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్​ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్​కి చెందిన జెనెటిసిస్ట్​ టులియో డె ఒలివెయిరా తెలిపారు. ​

త్వరగా ట్రీట్​మెంట్​ 
ఈ పరిశోధనతో హెచ్​ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్​ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్​ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్​ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్​మెంట్​ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్​లో సుమారు పది లక్షల మంది హెచ్​ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్​మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్​ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

చదవండి: తెలంగాణలో కండోమ్​ కొనేందుకు సిగ్గు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement