HIV Patient
-
షాకింగ్ ఘటన: ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది
దిస్పూర్: ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని, వాళ్ల ఆలోచనలు కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుందని నిరూపించిన ఘటన ఇది. ప్రియుడికి హెచ్ఐవీ ఉంది. ఆ విషయంలో ఆమెకు తెలిసింది. తెలిసింది ఏంటీ.. తెలిసే ప్రేమించింది కూడా. ఇంతలో పెద్దలు వాళ్ల ప్రేమకు అడ్డుతగిలారు. ఓ హెచ్ఐవీ రోగిని చేసుకోవడం ఏంటని చెడామడా వాయించారు ఆ అమ్మాయిని. కానీ, తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నిరూపించుకునేందుకు ఎవరూ దిగని చేష్టలకు దిగిందామె. అస్సాం సువాల్కుచీకి చెందిన ఓ టీనేజర్‌కి సత్దోలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఈ మూడేళ్లలో వాళ్ల స్నేహం.. ప్రేమగా ఎదిగింది. కలిసి జీవిద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయారు. ప్రియుడికి హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె జీవించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో పెద్దలకు విషయం చెబితే.. ఆమెను చితకబాదారు. ఇద్దరు రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కూడా. కానీ, ఈ పెద్దోలున్నారే.. లాక్కొచ్చి ఇంట్లో పడేశారు. బాధితురాలు.. (గతంలో వెళ్లిపోయినప్పుడు ప్రెస్మీట్లో) ఇక లాభం లేదనుకుని తన ట్రూ లవ్‌ను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఓ సిరంజీ ద్వారా సేకరించి తన నరాల్లోకి ఎక్కించుకుంది ఆమె. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన షాకింగ్ పని.. స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని(15) అబ్జర్వేషన్లో ఉంచామని, బ్లడ్ రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రేమ పేరుతో మైనర్లో ముగ్గులోకి దించిన నేరానికి సదరు యువకుడిని హజో పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఇదీ చదవండి: చిలిపి దొంగలు.. ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు! -
హెచ్ఐవీ బాధిత ఎస్టీ కుటుంబాలకు చేయూత
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధిత గిరిజన కుటుంబాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేయూత అందిస్తోంది. హెచ్ఐవీ కారణంగా బతుకుదెరువు లేక మానసికంగా కుంగిపోకుండా వారిలో మనోధైర్యం నింపేలా ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. బాధితులు తమ కుటుంబాలను పోషించుకునేలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధి చూపించే చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే 117 మంది బాధితులను గుర్తించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితుల జాబితాలు పంపించాలని కలెక్టర్లను కోరామని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక శ్రద్ధతో ఎస్టీల్లో హెచ్ఐవీ బాధితులకు రూ.1.17 కోట్లు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య చెప్పారు. -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్‌కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్‌లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
హెచ్ఐవీ పేషెంట్.. కరోనాను జయించాడు
లక్నో: హెచ్ఐవీ పేషెంట్ ఒకరు కేవలం ఆరు రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గొండాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడటంతో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. పరీక్షల అనంతరం అతడికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అంతేకాక బాధితుడు తనకు హెచ్ఐవీ ఉందని... ప్రస్తుతం అందుకు సంబంధించిన మందులు వాడుతున్నాని వైద్యులతో చెప్పాడు. ఈ మేరకు చికిత్స అందించడంతో కేవలం 6 రోజుల్లోనే సదరు వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.(కరోనా పాజిటీవ్.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ) ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... ‘ఇలాంటి కేసు రావడం ఇదే ప్రథమం. ప్రొటోకాల్ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లో అతడికి కరోనా నయమైంది. చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నెగిటీవ్‌గా రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం రెండు వారాల పాటు అతడిని హోం క్వారంటైన్లో ఉండమని చెప్పాం. గతంలో ఓ క్యాన్సర్ పేషెంట్‌కు కూడా కరోనా పూర్తిగా నయమయ్యింది. డయబెటీస్ ఉన్న వారు కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు’ అని వైద్యులు తెలిపారు. -
హెచ్ఐవీ ఉందని చెప్పినా..
ముంబై : మహారాష్ట్రలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పిన వినకుండా ఓ మహిళ(37)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి సహాయంగా ఆస్పత్రిలో ఉంటోంది ఓ మహిళ. తను హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నా.. తన సోదరికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆస్పత్రికి వచ్చారు. అయితే ఆమెపై కన్నేసిన ఓ యవకుడు... మాయమాటలు చెప్పిన ఆమెపై లైంగిక దాడి చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా బాధితురాలితో మాట మాట కలిపిన నిందితుడు...తాను అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని నమ్మించాడు. ఆమెకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశాడు. అందుకు ఆమె ఔనని సమాధానం చెప్పింది. ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న డిపార్ట్మెంట్లో ఫామ్ నింపితే మందులు, చికిత్సలో రాయితీ ఇస్తారని నమ్మించిన నిందితుడు... ఆమెను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు శారీరికంగా బలహీనంగా ఉండటంతో... అతడి నుంచి తప్పించుకోలేకపోయారు. తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని చెప్పిన వినకుండా పశువులా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సమీపంలోని సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దీపక్ అన్నప్ప అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు
ఏలూరు : హెచ్ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీతో బాధపడుతున్నాడు. అయినా వాస్తవాన్ని దాచిపెట్టి సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16న వివాహం చేసుకుని 18వ తేదీన(గురువారం)శోభనానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో జయరామ్ ఇంటికి వెళ్లి శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృత జ్ఞతలు తెలిపారు. -
ఇతడికి హెచ్ఐవీ... అంటించడమే పని!
-
ఇతడికి హెచ్ఐవీ... అంటించడమే పని!
♦ జల్సాలతో హెచ్ఐవీ కొనితెచ్చుకున్న జోసఫ్ జేమ్స్ ♦ నేరాలు చేసి సంపాదించిన డబ్బుతో జల్సాలు ♦ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి లోబరుచుకున్న నిందితుడు ♦ వారిని వలలో వేసుకోవడానికి విచ్చలవిడిగా డబ్బు ఎర ♦ సుమారు 300 మందిని లొంగదీసుకుని హెచ్ఐవీ అంటించిన రాక్షసుడు హైదరాబాద్: అతనో హెచ్ఐవీ పేషెంట్.. జల్సాలు చేసి హెచ్ఐవీని కొనితెచ్చుకున్నాడు. తన నిర్వాకం వల్ల సోకిన జబ్బును సమాజంపై బలవంతంగా రుద్దాలనుకున్నాడు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. బస్టాపులు, సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఒంటరిగా కనిపించే మహిళలను మాయమాటలతో ఆకట్టుకునేవాడు. తెలివిగా వలలో వేసుకోవడం.. షాపింగ్‌కు తీసుకెళ్లి నచ్చిన వస్తువులు కొనిపెట్టడం.. ఆ తర్వాత లోబర్చుకోవడమే అతని లక్ష్యం. ఇందు కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేసేవాడు. ఆ డబ్బు సంపాదించేందుకు ఎలాంటి నేరాలకైనా తెగబడేవాడు. నేరాలు చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో మహిళలను లోబర్చుకుని తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం ఇదే అతని నిత్యకృత్యం. తనకు ప్రాణాంతకమైన జబ్బు ఉందని తెలిసినా.. కనీస మానవత్వం మరచి.. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 300 మందిని లొంగదీసుకున్నాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించింది. మంగళవారం మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మల్కాజిగిరి మీర్జాలగూడకు చెందిన జోసఫ్ జేమ్స్(31) టెన్త్ వరకు చదువుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఒక అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మరో ఇద్దరితో సహజీవనం కొనసాగించడంతో.. భార్య కొడుకును తీసుకుని దూరంగా వెళ్లిపోయింది. అమ్మ, చెల్లి, సోదరుడితో కలసి జేమ్స్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి జేమ్స్ ఇద్దరు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూనే.. ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ మహిళలతో విచ్చలవిడి సంబంధాల కోసం వచ్చిన డబ్బంతా ఖర్చు కావడంతో అదనపు సంపాదన కోసం నేరాలకు దిగాడు. మల్కాజిగిరి కేంద్రంగా మట్కా దందా మొదలుపెట్టాడు. ఆ దందాలో వచ్చిన డబ్బుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో జేమ్స్‌కు హెచ్ఐవీ సోకింది. అనుమానం వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో సమాజం పట్ల కసిని పెంచుకున్న జేమ్స్ తన రాక్షసత్వాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ.. విశృంఖలంగా తయారయ్యాడు. ఒంటరి మహిళలను లోబరుచుకునేందుకు.. జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. తనకు వచ్చిన ప్రాణాంతక రోగాన్ని సమాజంలో వ్యాపింప చేయాలనే పైశాచిక నిర్ణయానికి వచ్చాడు. అమాయక మహిళలను వల పన్ని లోబరుచుకునేవాడు. ఇలా సుమారు 300 మందిని లొంగదీసుకుని తన రోగాన్ని వారికి అంటించాడు. ఇలా పట్టుబడ్డాడు... కొద్దిరోజుల క్రితం ఉప్పల్‌లోని తన స్నేహితుని ఇంట్లో తాళం పగులగొట్టి బీరువాలో దాచిన ఐదు తులాల బంగారు గొలుసును జేమ్స్ దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానం వచ్చి జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తానే దొంగిలించినట్లు అంగీకరించాడు. దొంగిలించిన డబ్బుతో మహిళలను వలలో వేసుకుంటానని, తాను చేసే పని కూడా వారికి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జేమ్స్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.