HIV-True Love: Assam Teenager Inject HIV Patient Lover Blood, Check Details - Sakshi
Sakshi News home page

HIV: హెచ్‌ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది!

Published Tue, Aug 9 2022 2:50 PM | Last Updated on Tue, Aug 9 2022 4:12 PM

True Love Test: Assam Teenager Inject HIV Patient Lover Blood - Sakshi

దిస్‌పూర్‌: ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని, వాళ్ల ఆలోచనలు కూడా అంతే ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుందని నిరూపించిన ఘటన ఇది. 

ప్రియుడికి హెచ్‌ఐవీ ఉంది. ఆ విషయంలో ఆమెకు తెలిసింది. తెలిసింది ఏంటీ.. తెలిసే ప్రేమించింది కూడా. ఇంతలో పెద్దలు వాళ్ల ప్రేమకు అడ్డుతగిలారు. ఓ హెచ్‌ఐవీ రోగిని చేసుకోవడం ఏంటని చెడామడా వాయించారు ఆ అమ్మాయిని. కానీ, తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నిరూపించుకునేందుకు ఎవరూ దిగని చేష్టలకు దిగిందామె.

అస్సాం సువాల్కుచీకి చెందిన ఓ టీనేజర్‌‌కి సత్దోలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఈ మూడేళ్లలో వాళ్ల స్నేహం.. ప్రేమగా ఎదిగింది. కలిసి జీవిద్దాం అనుకుని ఫిక్స్‌ అయిపోయారు. ప్రియుడికి హెచ్‌ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె జీవించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో పెద్దలకు విషయం చెబితే.. ఆమెను చితకబాదారు. ఇద్దరు రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కూడా. కానీ, ఈ పెద్దోలున్నారే.. లాక్కొచ్చి ఇంట్లో పడేశారు. 


బాధితురాలు.. (గతంలో వెళ్లిపోయినప్పుడు ప్రెస్‌మీట్‌లో)

ఇక లాభం లేదనుకుని తన ట్రూ లవ్‌ను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రియుడి హెచ్‌ఐవీ రక్తాన్ని ఓ సిరంజీ ద్వారా సేకరించి తన నరాల్లోకి ఎక్కించుకుంది ఆమె. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన షాకింగ్‌ పని.. స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. 

బాధితురాలిని(15) అబ్జర్వేషన్‌లో ఉంచామని, బ్లడ్‌ రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రేమ పేరుతో మైనర్‌లో ముగ్గులోకి దించిన నేరానికి సదరు యువకుడిని హజో పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

ఇదీ చదవండి: చిలిపి దొంగలు.. ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement