aids
-
ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో పెరిగిన అవగాహన, హెచ్ఐవీ రోగులను గుర్తించి తగిన చికిత్స అందిస్తుండడంతో రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. 15–49 సంవత్సరాల వయసు గలవారిలో హెచ్ఐవీ వ్యాప్తి (ప్రివలెన్స్) రేటు దేశంలో 0.20 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.44గా ఉంది. రాష్ట్రంలో 2020లో హెచ్ఐవీ వ్యాప్తి 0.48 శాతంగా ఉండగా, ఏటా ఒక శాతం తగ్గుతూ 2024–25లో 0.44 శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 25 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (నాక్స్) లెక్కలు చెబుతున్నాయి. ఐదో స్థానంలో తెలంగాణ ఎయిడ్స్ వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో ఉన్నది. మిజోరం మొదటి స్థానంలో ఉండగా, నాగాలాండ్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ లో 1.04 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కలు చెబుతు న్నాయి. హెచ్ఐవీ వైరస్, ఎయిడ్స్ సోకి న వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మందులను ‘యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్స్ (ఏఆర్టీ) ద్వారా సరఫరా చేస్తున్నట్లు సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె. హైమావతి ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లో 2010 నుంచి హెచ్ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు సెప్టెంబర్ 25న ’రివైటలైజ్డ్ మలి్టలేటరలిజం: రీకమిటింగ్ టు ఎండింగ్ ఎయిడ్స్ టుగెదర్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిజోరం ఫస్ట్.. జమ్ముకశీ్మర్ లాస్ట్ దేశంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి రేటు మిజోరంలో అత్యధికంగా ఉంది. 2023–24 లెక్కల ప్రకారం ఇక్కడ ఎయిడ్స్ వ్యాప్తి 2.73 శాతంగా నమోదైంది. ఆ తరువాత నాగాలాండ్‌లో 1.37 శాతం, మణిపూర్‌లో 0.87 శాతం, ఏపీలో 0.62 శాతం, తెలంగాణలో 0.44 శాతం ఉన్నది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశీ్మర్, లద్దాఖ్‌లో ఎయిడ్స్ వ్యాప్తి అతి తక్కువగా 0.06 శాతంగా ఉన్నది. 2024– 25లో దేశవ్యాప్తంగా హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు నాక్స్ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ 31 వరకు ఏడు నెలల్లో తెలంగాణలో 9,56,713 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తే.. 5,363 మందికి పాజిటివ్‌గా తేలింది.3,37,752 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా.. 427 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 902 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2023–24 సంవత్సరంలో సుమారు 20 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 11,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకొంటే హెచ్ఐవీ సోకినా సాధారణ జీవితం గడుపవచ్చని కె. హైమావతి చెప్పారు. -
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించి వెలువడిన తాజా నివేదిక మరింత దడ పుట్టిస్తోంది. 2023లో ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవి వైరస్‌ను ప్రపంచంలోని సుమారు నాలుగు కోట్ల మందిలో గుర్తించారు. వీరిలో 90 లక్షల మంది వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స పొందలేకపోయారు. ఫలితంగా ప్రతి నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతిచెందాడని వెల్లడయ్యింది.ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరంగా పరిణమించింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలలో ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది ఎయిడ్స్ కారణంగా ఆరు లక్షల మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు2023లో దాదాపు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మృతిచెందారు. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేస్తామని ప్రపంచ నాయకులు ప్రతిజ్ఞ చేశారని, అయితే 2023లో కొత్తగా13 లక్షలకు పైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు. -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్ఐవీ ఉన్నవాళ్లు పిల్లల్ని కనకూడదా?అలా కూడా వ్యాపిస్తుందా?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్ఐవి ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్ఐవి, ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో ప్రముఖ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. 1. అపోహ: హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్ఐవి ఇతరులకి సోకుతుంది? వాస్తవం: హెచ్ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ఐవి సోకదు. 2. అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది? వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్,హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు,ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం, రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది. 3. అపోహ: దోమకాటు ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది? వాస్తవం:దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవి ఎలా బతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. 4. అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు? వాస్తవం: సరైన మందులు,సకాల చెకప్స్‌తో, ఒకరు హెచ్ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని,హెచ్ఐవిని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి. 5. అపోహ: హెచ్ఐవీ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు? వాస్తవం: తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవి,ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం వల్ల హెచ్ఐవీ నెగటివ్ బిడ్డకు జన్మనివ్వొచ్చు. - నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం!
మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్‌లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది. ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్ఐవీ ప్రబలంగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్‌తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్‌తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా. సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవీ / ఎయిడ్స్ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్)ను మొదట హెచ్ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ని హెచ్ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్పోజర్ ప్రొఫై లాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్ ఎయిడ్స్’ పిలుపునిచ్చింది. డాక్టర్ యనమదల మురళీకృష్ణ వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్: 94406 77734 (నేడు ప్రపంచ ఎయిడ్స్ డే) -
ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ మారథాన్
సాక్షి, అమరావతి: హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ 5కె మారథాన్ (రెడ్ రన్)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎపిశాక్స్) అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ (ఐఆర్‌యస్) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 30న ఐక్యత మరియు దృఢ సంకల్పం యొక్క ఉల్లాసకరమైన ప్రదర్శనలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆలోచనగా యూత్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించేందుకు విజయవాడ నగరం సిద్ధమవుతోందని ఆమె అన్నారు. ఈ ఈవెంట్ యువత ఆరోగ్యం మరియు అవగాహన దిశగా అద్భుతమైన వేడుకగా నిర్వహించనున్నట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. నేకో(NACO) దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కీలకమైన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వినూత్నమైన కార్యక్రమంగా దీన్ని రూపొందించామని అన్నారు. హెచ్ఐవి నివారణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం, యువతలో సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను ప్రోత్సహించడం, హెచ్ఐవి మరియు ఎస్టిఐ సంబంధిత సేవల్ని ప్రోత్సహించడం , ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి నిర్ధేశించిన లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. 26 జిల్లాల నుండి వచ్చిన 17-25 సంవత్సరాల వయస్సు గల 260 ఔత్సాహిక కళాశాల విద్యార్థులు 5K మారథాన్‌లో పాల్గొంటారన్నారు. ఇది ఆరోగ్యకరమైన, మరింత అవగాహన గల భవిష్యత్తు కోసం వారి నిబద్ధతను సూచిస్తుందన్నారు. కళాశాల విద్యార్థులు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులతో సహా ప్రతి జిల్లా నుంచి పది మంది దీనిలో పాల్గొంటారన్నారు. హెచ్ఐవికి సంబంధించిన మరింత సమాచారం కోసం www.apsacs.ap.gov.in సంప్రదించాలని ఆమె కోరారు. -
భార్యకు ఎయిడ్స్ అంటించి భర్త పరార్!
ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త పెళ్లికి ముందు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని ఆరోపించింది. పెళ్లి తరువాత తాను హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోయానన్నారు. దీంతో తనను పుట్టింటిలో దిగబెట్టి, భర్త పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె భర్త దురాగతంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మీరఠ్‌లోని పల్లవ్‌పురంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెకు 2021లో జానీ పోలీస్స్టషన్ పరిధిలోని ఒక యువకునితో వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వివాహానికి రూ. 15 లక్షలు ఖర్చుచేశానని తెలిపారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందక ఇంకా కట్నం కావాలని అడుగుతుండేవారని తెలిపారు. అత్తవారింటిలో ఎన్ని సమస్యలు ఎదురైనా తన కుమార్తె సహనంతో వ్యవహరించిందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లికి ముందు ఆ యువకుడు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపారు. అయితే పెళ్లి సమయంలో ఈ విషయాన్ని దాచి ఉంచారన్నారు. ఈ నేపధ్యంలో తన కుమార్తె కూడా ఎయిడ్స్ బాధితురాలిగా మారిందని వాపోయారు. కుమార్తె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను తమ దగ్గర దిగబెట్టి భర్త పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం! -
ఎయిడ్స్ నియంత్రణకు ప్రెప్ అస్త్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ వర్గాల వారికి ప్రీ–ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ (ప్రెప్) ఔషధాలు అందజేస్తోంది. చెన్నైకి చెందిన వలంటరీ హెల్త్ సొసైటీ (వీహెచ్ఎస్) ద్వారా ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ శాక్స్) వీటిని పంపిణీ చేస్తోంది. కండోమ్ వినియోగంలో పొరపాట్లు, ఇతర సురక్షితం కాని శృంగారం వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాప్తిని ఈ మాత్రలు నిరోధిస్తాయి. బహిరంగ మార్కెట్లో 30 మాత్రల ధర రూ.2 వేలు ఉంది. వీటిని సబ్సిడీపై వైద్యశాఖ రూ.450కే పంపిణీ చేస్తోంది. విజయవాడ, వైజాగ్‌లలో ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు. హైరిస్క్ వర్గాలుగా పరిగణించే ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు (మేల్ హోమో సెక్సువల్స్), ట్రాన్స్జెండర్లు, ఇంజెక్షన్ల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునేవారికి సబ్సిడీపై ఈ మాత్రలు అందిస్తున్నారు. ఎయిడ్స్ హైరిస్క్ వర్గాల్లో ట్రాన్స్జెండర్లు ఒకరు. సమాజంలో వివక్షకు లోనయ్యే వీరికి వైద్యంతో పాటు సామాజిక తోడ్పాటు అందించడానికి విజయవాడ, వైజాగ్‌లలో ట్రాన్స్‌జెండర్స్ వన్స్టాప్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో వైద్యుడు, ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారు. ఇక్కడ ట్రాన్స్జెండర్లకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి వైద్య సహాయం అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి, న్యాయపరమైన సహకారం అందిస్తున్నారు. హైరిస్క్ గ్రూపుల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా ఇక్కడ సహాయం లభిస్తోంది. ఇక్కడే ప్రెప్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. త్వరలో తిరుపతి, కర్నూలు, కాకినాడల్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రెప్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ ఇలా వన్‌స్టాప్ సెంటర్లకు వచ్చిన హైరిస్క్ వర్గాల్లోని హెచ్ఐవీ నెగెటివ్ వ్యక్తులకు ప్రెప్ మాత్రల వినియోగం వల్ల ప్రయోజనాలను వివరిస్తారు. అనంతరం హెచ్ఐవీ నిర్ధారణ, కిడ్నీ, లివర్ పనితీరు సహా పలు రకాల వైద్యపరీక్షలు చేస్తారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రెప్ మాత్రల వినియోగానికి అర్హులో కాదో వైద్యులు నిర్ధారిస్తారు. వైద్యుల సూచన మేరకు మాత్రలు అందిస్తారు. అనంతరం వన్‌స్టాప్ సెంటర్లోని వైద్యుడు ఆ వ్యక్తిని రోజూ ఫోన్ ద్వారా సంప్రదించి మాత్రలు వినియోగిస్తున్నారో లేదో ఫాలోఅప్ చేస్తారు. ముందు, తర్వాత 21 రోజుల చొప్పున వాడాలి ప్రెప్ మాత్రల వినియోగం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకదు. శృంగారంలో పాల్గొనడానికి 21 రోజుల ముందు నుంచి, చివరిసారిగా శృంగారంలో పాల్గొన్న తరువాత 21వ రోజు వరకు రోజుకు ఒక మాత్ర వాడాలి. అప్పుడే ప్రభావవంతంగా పనిచేస్తుంది. వైద్యులను సంప్రదించకుండా వాడకూడదు. ఎస్టీడీతో పాటు ఇతర జబ్బులు సోకకుండా ఉండాలంటే అపరిచితులతో శృంగారంలో కండోమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. – డాక్టర్ ప్రత్యూష, టీజీ వన్‌స్టాప్ సెంటర్ వైద్యురాలు, విజయవాడ ప్రజల్లో చైతన్యం ఇంకా పెరగాలి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాలి. వ్యాధి వ్యాప్తి తగ్గిందిలే అని నిర్లక్ష్యం వహించకూడదు. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి రాబోయే తరాలకు సురక్షిత ఆరోగ్యం ప్రసాదించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. విజయవాడ, వైజాగ్‌లలో ప్రెప్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. త్వరలో తిరుపతి, కాకినాడ, కర్నూలుల్లో కూడా ప్రారంభిస్తాం. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్ పీడీ -
HIV-AIDS cure: ఆ ఇంజక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!
టెల్ అవీవ్: వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్–టైప్ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. ‘‘ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేస్తున్నాయి. , యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన డాక్టర్ బర్జేల్ వివరించారు. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెడతామని ధీమా వెలిబుచ్చారు. -
వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఆమె ఎయిడ్స్‌ను జయించింది!
మానవ వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్ పూర్తిగా నయమైంది. స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూలకణ మార్పిడి) చికిత్సతో సదరు మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో ‘బెర్లిన్ పేషెంట్’ గా పిలిచే టిమోతీ రే బ్రౌన్ అనే మగ పేషెంటు 12 ఏళ్ల పాటు హెచ్ఐవీ రెమిషన్ (అంటే యాంటీ వైరల్ మందులు వాడటం ఆపేసినా వైరస్ ప్రబలకపోవడం) పొందాడు. అనంతరం ‘లండన్ పేషెంట్’ అనే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్ఐవీ రెమిషన్ లేదా ఎయిడ్స్ నుంచి ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు యూఎస్‌లో మంగళవారం జరిగిన సీఆర్‌ఓఐ అనే సదస్సులో వెల్లడించారు. స్టెమ్ సెల్ మార్పిడి అనంతరం ఆమె 14 నెలలుగా ఏఆర్టీ(యాంటీ వైరల్ థెరపీ) తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్ఐవీ వైరస్ కనిపించలేదని వివరించారు. బొడ్డు పేగు మూలకణాలతో మేజిక్ బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్ సెల్స్‌తో హెచ్‌ఐవీరెమిషన్ సాధ్యమైందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 (ఇంటర్నేషనల్ మాటర్నల్ పీడియాట్రిక్ అడాలసెంట్ ఎయిడ్స్ క్లీనికల్ ట్రయిల్ నెట్వర్క్) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌ను 2015లో ఆరంభించారు. ఇది హెచ్ఐవీ సోకిన 25మంది పేషెంట్లపై పరిశోధనలు చేసి ఫలితాలు నమోదు చేస్తుంది. ప్రస్తుత ప్రయోగంలో హెచ్ఐవీని జయించిన మహిళ మైలాయిడ్ ల్యుకేమియా (ఒకరకమైన క్యాన్సర్)తో బాధపడుతోంది. ఇదే సమయంలో హెచ్ఐవీ సోకడంతో నాలుగేళ్లుగా ఏఆర్టీ తీసుకుంటోంది. కీమో తెరపీతో ఆమెకు క్యాన్సర్ నుంచి గతంలో ఉపశమనం లభించింది. స్టెమ్‌సెల్ మార్పిడికి ముందు ఏఆర్టీ వల్ల ఆమెలో హెచ్ఐవీ అదుపులోనే ఉంది. 2017లో ఆమె బంధువుల్లో ఒకరు దానం చేసిన మూలకణాలతో బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తైన 37 నెలలకు ఆమె ఏఆర్టీ కూడా నిలిపివేసింది. అప్ప టి నుంచి ఇప్పటికి 14 నెలలు గడిచిందని, ప్రస్తు తం ఆమెలో ట్రేసబుల్ (గుర్తించదగిన) వైరస్ జాడ లేదని పరిశోధకులు తెలిపారు. పరిమితులున్నాయి.. స్టెమ్‌సెల్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స ఖరీదైనది. ఈ చికిత్సలో స్టెమ్‌సెల్స్‌ను అందరూ దానం చేయడం కుదరదు. రక్త కణాల్లో హెచ్ఐవీ వైరస్‌ను బంధించే గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉండని వ్యక్తిని దాతగా అంగీకరిస్తారు. అప్పుడు రోగి శరీరంలోకి ఎక్కించిన దాత స్టెమ్‌సెల్స్ నూతన రక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త కణాలు హెచ్ఐవీ నిరోధకాలుగా ఉంటాయి. దీంతో సదరు రోగిలో క్రమంగా వైరస్ లోడు తగ్గిపోతుంది. అయితే ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్టులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం అతిపెద్ద సమస్య. తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈ దఫా మహిళా పేషెంటులో ఈ సమస్య కనిపించలేదు. దీంతో మరోమారు ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై ఆశలు పెరిగాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు
నౌగావ్: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్‌కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్‌లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
కండోమ్ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్ఐవీ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం. అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ. కండోమ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్‌ఐవీనే కాదు హెపటైటీస్–బి, సి, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అంతేకాదు చాలామందికి హెచ్ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు.. కదా! అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. రక్షణ కోసం కనీసం కండోమ్‌లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవగాహన ఉన్నా.. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్ వాడుతున్నారు. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్ వాడుతున్నట్లు స్పష్టమైంది. నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ.. అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. ·గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది. ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరికి వాడిన సిరంజ్‌లు, బ్లేడ్స్ మరొకరికి వాడటం వల్ల వస్తుంది. నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్ ప్రసన్నకుమారి, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారిణి -
పెళ్లిని తప్పించుకునేందుకు ఎయిడ్స్ నాటకం
సాక్షి బెంగళూరు: పెళ్లి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తనకు ఎయిడ్స్ ఉందని, పెళ్లి రద్దు చేయాలని కోరాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి వాయిదా వేశారు. వాస్తవానికి డిసెంబర్ 1న ఒక యువతితో నిందితుడు కిరణ్ కుమార్ వివాహం నిర్ణయం అయింది. కానీ పెళ్లికి మరో నాలుగు రోజులు ఉందనగానే నాటకీయంగా తనకు హెచ్ఐవీ సోకిందని అబద్ధం చెప్పి పెళ్లి నిలిచిపోయేలా చేశాడు. అయితే పెళ్లికి సదరు యువతి కుటుంబం సుమారు రూ. 15 లక్షల ఖర్చు చేసింది. దీంతో కిరణ్‌పై అనుమానంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు తీసుకున్న విజయనగర పోలీసులు.. కిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి హెచ్ఐవీ పరీక్ష చేయించారు. రిపోర్టు చూసి హెచ్ఐవీ లేదని నిర్ధారించుకున్నాక, యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై విజయనగర పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేశారు. -
తలసేమియా నివారణకు గ్లోబల్ అలయన్స్ కృషి
చికాగో: ప్రపంచం ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం (డిసెంబర్ 1) సందర్భంగా.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను నివారించటం కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. చికాగోలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ చైర్మన్ డాక్టర్ విజయ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించటం కోసం విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్ వ్యాధి రూపుమాపడానికి ‘ఎండ్‌తాల్‌నౌ’ పనిచేస్తోందని విజయ్ ప్రభాకర్ తెలిపారు. ‘ఎండ్‌తాల్‌నౌ’ అంటే తలసేమియాను అంతమొందించడమే అని ఆయన పేర్కొన్నారు. ఇక తలసేమియా వ్యాధిని నివారించడానికి సహదేవ్ పౌండేషన్ విరాళాలు సేకరించిందని ‘ఎండ్‌తాల్‌నౌ’ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ కండిమల్లా కొనియాడారు. తలసేమియా వ్యాధిని నివారించడానికి 10,000 మంది రక్త దానం చేశారని పేర్కొన్నారు. భారీ ఎత్తున రక్తదానం చేయటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు లభించిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నర్మదా కుప్పుస్వామి మాట్లాడుతూ.. సికిల్ సెల్ వ్యాధిని అంతమొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులు పదేళ్లు కూడా బతకలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమిరేట్స్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాశం టాటా మాట్లాడుతూ.. ‘ఎండ్‌తాల్‌నౌ’ చేస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులను రక్షించడమే ‘ఎండ్‌తాల్‌నౌ’ లక్ష్యమన్నారు. ఇక గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ (జీఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అజిత్ సింగ్ మాట్లాడుతూ.. జీఎస్ఏ ప్రతి ఏడాది డిసెంబర్ 1న తలసేమియా వ్యాధి నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సంగీత గాయకులు ప్రవీణ్ జలగామ, ఆయన తనయుడు శిశిర్ రాఘవ జలగామ తమ సంగీతం ద్వారా తలసేమియా వ్యాధి నివారించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని అశోక్ పగడాలా నిర్వహించగా.. స్వదేశ్ మీడియాకు చెందిన ఉగందర్ నగేష్, సాయి రవిసురుబొట్ల, చార్లెస్ రూటెన్‌బర్గ్ రియాల్టీ ఆఫ్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ మోర్ట్గేజ్ సొల్యూషన్స్, అశోక్ లక్ష్మణన్, సంతిగ్రమ్ కేరళ ఆయుర్వేద నేపర్‌విల్లే, డాక్టర్ సుద్దేశ్వర్ గుబ్బా, అనికా దుబేలు స్పాన్సర్లుగా వ్యవహరించారు. -
మహమ్మారి మళ్లీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) నగరంలో మళ్లీ పంజా విసురుతోంది. గత 15 ఏళ్లుగా తగ్గుతూ వచి్చన ఈ జబ్బు 2018 నుంచి క్రమంగా పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిడ్స్ కేసుల నమోదులో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా... కరీంనగర్, నల్లగొండ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018లో కొత్త కేసుల శాతం 1.93 ఉండగా.. 2019లో 1.98కి పెరగడం గమనార్హం. ఇదిలా ఉంటే 2019 జనవరి–అక్టోబర్ వరకు నగరంలోని 23 ఐపీటీసీ సెంటర్లలో మొత్తం 1,32,124 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా... 1,339 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే హెచ్ఐవీ పాజిటీవ్ బాధితుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చారి్మనార్, గోల్కొండలో అధికం... రాష్ట్ర వ్యాప్తంగా 83,102 మంది హెచ్ఐవీ పాజిటీవ్ బాధితులు ఉండగా... వీరిలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, కింగ్‌కోఠి, చెస్ట్ ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్లలో ప్రస్తుతం 23,350 మంది చికిత్స పొందుతున్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 21,350 మంది వరకు పెద్దలు ఉండగా... 1,234 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. జిల్లాలో చారి్మనార్, గోల్కొండ ఏరియాలో అత్యధికంగా హెచ్ఐవీ పాజిటీవ్ కేసులు నమోదవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, అడ్డా కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వలస వచ్చినవారు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి వ్యాప్తికి కారణాలివే... హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ (హెచ్ఐవీ) వైరస్ ఎయిడ్స్‌కు కారణం. అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు 5 శాతం అవకాశం ఉంది. ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరికి వాడిన సిరెంజ్లు, బ్లేడ్స్‌ను మరొకరికి వాడటం వల్ల వస్తుంది. నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కని్పస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. – డాక్టర్ నిర్మలా ప్రభావతి, అడిషనల్ డీఎంహెచ్ఓ, హైదరాబాద్ జిల్లా -
27 మంది ఖైదీలకు ఎయిడ్సా?
సాక్షి, అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ ఉందా? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా? అనే విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీరందరికీ అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో కూడా తమకు తెలియచేయాలంది. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 2018లో జీవిత ఖైదును విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి 2019లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్నానని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రాజమండ్రి జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. అసలు జైల్లో ఎంత మంది ఖైదీలు ఉంటారని ధర్మాసనం ఆరా తీసింది. 1500 మంది వరకు ఉండొచ్చునని పీపీ చెప్పగా, ఇంతమంది ఎయిడ్స్‌తో బాధపడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లోకి వచ్చే ముందు ఖైదీలకు తప్పనిసరిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని గుర్తు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేసింది. ఆ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని తెలిపింది. అసలు వారికి వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించింది. జైల్లోకి వచ్చాక వీరు ఎయిడ్స్ బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తప్పవని హెచ్చరించింది. -
ఎయిడ్స్ నుంచి మూడో వ్యక్తికీ విముక్తి?
ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి నుంచి ఇంకో వ్యక్తి విముక్తి పొందాడా? అవును అంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. డిస్సెలెడ్రోఫ్ రోగి అనిపిలుస్తున్న ఈ వ్యక్తి మూడు నెలలకు యాంటీ రెట్రోవైరల్ మందులకు దూరంగా ఉన్నప్పటికీ శరీరంలో వైరస్ ఛాయలు కనిపించలేదని కాన్ఫరెన్స్ ఆన్ రెట్రోవైరెసెస్ అండ్ ఆపర్చూనిస్టిక్ ఇన్ఫెక్షన్ సదస్సులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. 1980 ప్రాంతంలో ప్రపంచానికి తెలిసిన హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి కొన్ని కోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌కు సహజ సిద్ధమైన నిరోధకత కలిగిన వ్యక్తి ఎముక మజ్జను అందివ్వడం ద్వారా 2007 ప్రాంతంలో తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి వ్యాధి నుంచి బయటపడ్డాడు. పన్నెండేళ్ల తరువాత ఇదే చికిత్సా పద్ధతి ద్వారా రెండో వ్యక్తికి కూడా వ్యాధి నుంచి ఉపశమనం లభించింది. తాజాగా డిస్సెలెడ్రోఫ్ రోగికి కూడా ఇదే పద్ధతి ద్వారా నయమైందని అన్నేమేరీ వెన్సింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అంతేకాదు.. ఇంకా కొంతమంది రోగులకు ఎముక మజ్జ మార్పిడి జరిగిందని.. వీరి శరీరంలోని వైరస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. -
ఎయిడ్స్ బాధితులకు శుభవార్త
లండన్: 3.7 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఇది. వీరందరికీ కచ్చితంగా ఇది శుభవార్తే. బతికున్నన్నాళ్లు వ్యాధిని భరిస్తూ.. మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేదని భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా నిరూపించారు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీ నుంచి బయటపడినట్లు.. పూర్తిస్థాయి చికిత్స సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్‌ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్ రోగి రెండో వ్యక్తి అని సియాటెల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో రవీంద్ర ప్రకటించారు. ఎయిడ్స్ వైరస్‌కు సహజమైన నిరోధకత కలిగిన వ్యక్తి తాలూకూ ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను చొప్పించడం ద్వారా ఇద్దరికీ చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పన్నెండేళ్ల కింద బెర్లిన్ పేషెంట్‌గా ప్రపంచానికి పరిచయమైన తిమోతీ బ్రౌన్ జర్మనీలో చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంట్రీ రెట్రోవైరల్ మందులు వాడకున్నా అతడి శరీరంలో వైరస్ ఛాయలేవీ లేవు. లండన్ రోగి విషయానికొస్తే.. ఈయనకు 2003లో వ్యాధి సోకింది. 2012లో హడ్కిన్స్ లింఫోమా (ఒక రకమైన రక్త కేన్సర్) బారిన కూడా పడ్డాడు. రవీంద్ర గుప్తా అప్పట్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పనిచేస్తుండేవారు. 2016లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య లండన్ పేషెంట్ తన వద్దకొచ్చాడని.. చివరి ప్రయత్నంగా మూలకణ చికిత్సకు ఏర్పాట్లు చేశామని రవీంద్ర తెలిపారు. జన్యుక్రమంలో సీసీఆర్ 5, డెల్టా 32 అనే రెండు మార్పుల కారణంగా హెచ్ఐవీ వైరస్ సోకని ఓ వ్యక్తి మూలకణాలను లండన్ పేషెంట్‌కు ఎక్కించారు. కొంతకాలం పాటు కొత్త మూలకణాలను రోగి శరీరం నిరోధించిందని.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. మూడేళ్లపాటు మూలకణాలను ఎక్కించాక గత 18 నెలలుగా లండన్ పేషెంట్ యాంటీ రెట్రోవైరల్ మందులు తీసుకోవడం ఆపేసినా శరీరంలో వైరస్ ఛాయల్లేవని రవీంద్ర వివరిస్తున్నారు. సులువేం కాదు.. మూలకణాల ద్వారా హెచ్ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉత్తర యూరప్ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం. రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. దాత మూలకణాలను అడ్డుకునేందుకు రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను తట్టుకుని నిలవగలగడం కష్టసాధ్యమైన పని. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. -
బలిపీఠంపై మూడు ప్రాణాలు
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో ఓ గర్బిణీ స్త్రీకి రక్తం ఎక్కించడం ద్వారా హెచ్ఐవీ సోకడం, తనకు హెచ్ఐవీ ఉందని తెలియకుండానే రక్తం ఇచ్చిన దాతకు ఈ విషయం తెలిసి తాను ఆత్మహత్య చేసుకోబోవడం రెండూ విషాదకర సంఘటనలే. గర్బిణీ కడుపులోని బిడ్డకు ఎయిడ్స్ సోకితే అది మరో విషాధం. రక్తదాతకు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని కనుగొనడంలో విఫలమైన ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇందులో అసలు నేరస్థులు. సొత్తూరుకు చెందిన ఎనిమిది నెలల గర్బిణి ప్రస్తుతం మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు రక్తదానం చేసిన 20 ఏళ్ల యువకుడు బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించి రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. (గర్భిణికి హెచ్ఐవీ బ్లడ్.. రక్తదాత ఆత్మహత్యాయత్నం) హెచ్ఐవీ రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నివారించేందుకు కఠినమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలా జరగడం దారుణం. రక్తదాతలకు హెచ్ఐవీ, మలేరియా, హెపటైటీస్ బీ, సీ, సిఫిలీస్ ఉందా, లేదా అని తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రక్తం బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రక్తదాన శిబిరాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల రక్త మార్పిడి కారణంగా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవీ సోకుతోంది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యన ఇలా ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య 2,234 మందని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థనే వెల్లడించింది. అయితే ఈ సంఖ్య వారంతట వారు ముందుకొచ్చి చెప్పుకున్నదని, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినది కాదని ఆ సంస్థ చెబుతోంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకడం బాగా తగ్గినప్పటికీ రెండేళ్లలో రెండువేల మందికిపైగా సోకిందంటే చిన్న విషయం ఏమీ కాదు. 20 ఏళ్ల క్రితం ప్రతి పది మందిలో 8 మందికి రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకేది. నాణ్యమైన రక్తం కన్నా ఎక్కువ పరిణామంలో రక్తాన్ని సేకరించేందుకు సామాజిక సంస్థలు, బ్లడ్ బ్యాంకులు తాపత్రయ పడడం వల్ల ఎయిడ్స్ ముప్పు పెరుగుతోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ 20 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ 2017 లెక్కల ప్రకారం దేశంలో అంతకుముందు సంవత్సరం 80 వేల మందికి ఎయిడ్స్ సోకితే ఆ సంవత్సరం 88 వేలకు పెరిగింది. ఇక మృతుల సంఖ్య కూడా 62 వేల నుంచి 69 వేలకు పెరిగింది. ప్రస్తుతం 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. -
చీదరింపులు..ఛీత్కారాలు
సాక్షి, సిటీబ్యూరో: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్ఐవీ(ఎయిడ్స్) బాధితులకు ఆదరణ కరువైంది. ఓ వైపు సకాలంలో మందులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరో వైపు చికిత్స వెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది తీరుతో మానసికంగా మరింత కుంగిపోతున్నారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి, వారికి మనోధైర్యం కల్పించాల్సిన ఏఆర్టీ(యాంటి రెట్రల్ వైరల్ సెంటర్) వైద్య సిబ్బంది సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి సిబ్బంది సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురయ్యే కంటే..మందులు వేసుకోకుండా జబ్బుతో చావడమే మేలనే నిర్ణయానికి వస్తున్నారు. కొత్తగా మరో 12 వేల కేసులు... తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1,97,126 మంది హెచ్ఐవీ బాధితులు ఉండగా, వీరిలో 76,746 మంది మాత్రమే ఏఆర్టీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. 2017–18లో 63,1574 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 11,820 మందికి హెచ్ఐవీ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 692 మంది గర్భిణులు ఉండగా, 750 మంది చిన్నారులు ఉన్నారు. 60 శాతానికి పైగా బాధితులు గ్రేటర్ పరిధిలో ఉండగా, వీరికి గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులో ఏఆర్టీ సెంటర్లలో చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ వీరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో బాధితుల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఏఆర్టీ సెంటర్లలో మందులు మాత్రమే ఇస్తూ వారికి అవసరమైన న్యూట్రిషన్‌ను అందించక పోవడం కూడా బాధితుల చావుకు కారణమవుతోంది. అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటు.. జిల్లా కేంద్రాల్లోని ఏఆర్టీ సెంటర్లలో చికిత్సలకు వెళితే..బంధువులెవరైనా గుర్తించే ప్రమాదం ఉందని భావించి, బాధితుల్లో చాలా మంది నగరంలోని ఏఆర్టీ సెంటర్లకు చేరుకుంటున్నారు. వీరిలో సీడీ 4 కౌంట్ 350 కన్న తక్కువ ఉన్న వారికి ప్రతి నెలా సీడీ 4 కౌంట్ పరీక్ష చేసి, మందులు పంపిణీ చేస్తారు. ఆయా ఏఆర్టీ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది వైఖరితో వీరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక నెలలో ఒక సెంటర్లో మందులు తీసుకున్న వారు మరో నెలలో మరో సెంటర్‌కు బదిలీ చేయించుకోవడం రోగుల పట్ల సిబ్బంది వైఖరికి అద్దం పడుతోంది. ఉస్మానియాలోనూ తప్పని తిప్పలు.. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్ అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 250–300 మంది రోగులు వస్తుండగా, వీరికి చికిత్స చేయడానికి సరిపడ వైద్యులు లేకపోవడంతో వైద్య సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చికిత్స కోసం వచ్చిన కొందరు రోగులకు టీబీ కూడా ఉండటంతో వారు దగ్గినప్పుడు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఉస్మానియా సహా గాంధీలో సరిపడా మందులు ఇవ్వక పోవడంతో తరచూ రోగులు ఆందోళనకు దిగాల్సి వస్తోంది. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లోని కనీస వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు వేళకు రాకపోవడం, ఒక వేళ వచ్చినా మధ్యాహ్నం రెండు గంటలకే తిరుగు ప్రయాణం కడుతుంటంతో సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వాలదే
సాక్షి, సుందరయ్యవిజ్ఞానకేంద్రం: విద్య, వైద్యం బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో నైపుణ్యానికి తగిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.. బ్రిటన్‌లో అమలు చేస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే బ్రిటన్ తరహా వైద్య విధానం మొదటి వరుసలో నిలిచిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి స్థానిక వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రజా ఆరోగ్య కేంద్రంగా వైద్య ఆరోగ్య రక్షణకు ఒక నిర్ధిష్టమైన పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీడీపీలో ఆరోగ్య రంగానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాల్సిన వైద్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుందని అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్, వైద్యులు అర్జున్, అశోక్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
రన్ ఫర్ అవేర్నెస్
-
మీ హెచ్ఐవీ స్థితి తెలుసా?
హెచ్ఐవీ.. ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి సోకినా క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా సుఖమైన జీవనం సాగించవచ్చు. వైద్యులు, కౌన్సిలర్ల సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే ఆనందంగా గడపవచ్చు. ఎలాంటి అనుమానం ఉన్నా ఉచితంగా పరీక్షలు చేస్తారు. జిల్లాలోని ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ వ్యాధిగ్రస్తులకు మనోస్థైర్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా గర్భిణుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఈ ఏడాది‘ మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి’ అనే నినాదంతో వ్యాధి నివారణకు పిలుపునిచ్చారు. కొత్తగా హెచ్ఐవీకి గురి కాకుండా చర్యలు తీసుకోవడం, వివక్ష లేకుండా చూడడం, హెచ్ఐవీ మరణాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ధ్యేయం. ఇందు కోసం జిల్లాలో డిసెంబర్ నెలలో హెచ్ఐవీపై అవగాహన సదస్సులు, హైరిస్క్ ప్రాంతాల్లో పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారు 20,665 మంది ఉన్నారు. మదనపల్లె సిటీ / చిత్తూరు అర్బన్ :శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్/హెచ్ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గుర య్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు ఎయిడ్స్ అతిపెద్ద కారణం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ బారిన పడకుం డా ఉండాలంటే విశృంఖల శృంగా రానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని సూచి స్తున్నారు. కణాల పాత్రే కీలకం.. వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్ కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైంది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతిమిల్లీలీటర్ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది. వ్యాధి గుర్తించడానికి ఇదేళ్లు హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్ఐవీ పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు. అందుబాటులో ఏటీఆర్ కేంద్రాలు జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది కంటే ఎక్కువగా రోగులు నమోదు ఉన్న తిరుపతి కేంద్రానికి ఏఆర్టీ ప్ల్లస్ గుర్తింపు వచ్చింది. ఇక్కడికి కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు. వీటితో పాటు శ్రీకాళహస్తి, కుప్పం, వి.కోట, పలమనేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, పూతలపట్టు, పీలేరు, సదుం, పుంగనూరులాంటి ప్రాంతాల్లో 11 లింక్ ఏఆర్టీలు ఉన్నాయి. 350, అంతకంటే తక్కువ తెల్ల రక్తకణాలు ఉన్నవారు, హెచ్ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటీ రిట్రోవైరల్ మందులు ఇవ్వ డంతో ఇన్పెక్షన్లు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు. నేడు భారీ ఎత్తున ర్యాలీలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ కం ట్రోల్ అధికారిణి డాక్టర్ అరుణ సులోచన తెలి పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరి«ధిలో కూడా ర్యాలీలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి ఇలా వస్తుంది.. ♦ సురక్షితం కాని లైంగిక సంబంధాలు ♦ మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని ఉపయోగించడం. ♦ రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్æ ఇన్స్ట్రుమెంట్స్ను శుభ్ర పరచకుండా వాడితే వ్యాపిస్తుంది. ఇలా రాదు.. ♦ హెచ్ ఐవీ బాధితుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు. ♦ హెచ్ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. ♦ వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం. ♦ నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామి తోనే లైంగిక సంబంధం కలిగి ఉండడం. ♦ సరైన పద్ధతిలో కండోమ్ వాడడం. ♦ హెచ్ఐవీ బాధితులు జీవితకాలం మందులు క్రమం తప్పకుండా వాడాలి. సాంకేతిక పద్ధతిలో సరైన మందులు వాడితే దీర్ఘకాలం జీవించొచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణికి హెచ్ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్టీ సెంటర్‌కు పంపిస్తాం. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట ర్ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్æ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. ఏఆర్టీ మందులు వాడితే సిజేరియన్ అవసరం లేదు. –అరుణ సులోచన, అడిషనల్ డీఎంహెచ్ఓ, చిత్తూరు -
ఆ కేసుల్లో భారత్ టాప్
ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో హెచ్ఐవీతో బాధపడే యువతీయువకులు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. 2017 సంవత్సరానికి గానూ భారత్‌లో 19 ఏళ్లలోపు వయస్సున్నవారిలో 1,20,000 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 మంది యువతీయువకులు చనిపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ‘చిల్డ్రన్–హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్– ది వరల్డ్ ఇన్ 2030’ పేరుతో యూనిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. చిన్నారులు, యువత, గర్భిణుల్లో హెచ్ఐవీ కేసుల్ని నియంత్రించడంలో దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని యూనిసెఫ్ తెలిపింది. ఈ విషయంలో భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్(5,800 మంది), నేపాల్(1,600), బంగ్లాదేశ్(వెయ్యి కంటే తక్కువ) మరింత మెరుగైన ఫలితాలు సాధించాయంది. -
హెచ్ఐవీలో విశాఖ @ 9
తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు : విశాఖ జిల్లాలో 2014 నుంంచి 2018 వరకూ హెచ్ఐవీ కేసుల తీరు తెన్నులు పరిశీలిస్తే.. ఏటేటా గణనీయంగాతగ్గుతున్నాయి. 2014లో 98,169 మందిని పరీక్షిస్తే 2464 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. 2015–166లో 96081 మంందికి పరీక్షలు చేయగా 2,180 కేసులు నమోదయ్యాయి. హెచ్ఐవీ కేసులు 2007 నుంచి క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత ఏడాది 1,03,616 మందిని పరీక్షించగా 2,017 మందికి , ఈ ఏడాది ఇప్పటిదాకా 63,325 మందికి పరీక్షలు చేయగా 1,046 మందికి పాజిటివ్‌గా తేలింది. దీనిని బట్టి గడచిన 10 ఏళ్ల నుంచి చూస్తే హెచ్ఐవీని పరీక్షించుకునే వారి సంంఖ్య పెరుగుతుంండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్టుస్పష్టమవుతోంది. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?.. ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్/ హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ జనాలను మహమ్మారిలా హడలెత్తించిన ఈ పులి విశాఖ జిల్లాలో క్రమంగా తన ఉనికి కోల్పోతోంది. గత ఏడాది ఎయిడ్స్/ హెచ్ఐవీ రోగుల సంఖ్యలో జిల్లా 4వ స్థానంలో ఉండగా..ఈ ఏడాది 9వ స్థానానికి మారింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహన సత్ఫాలితాలను ఇచ్చింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ... ఈ ఏడాది ఏప్రిల్ æనుంచి అక్టోబర్ వరకూ జిల్లా ఆస్ప?త్రుల్లో హైఐవీ పరీక్షలు చేయించుకోగా..వారిలో 1,046 మందికి హెచ్ఐవీఉన్నట్టు నిర్ధారణ అయింది. జిల్లాలో హెచ్ఐవీ సోకిన వారి కోసం నాలుగు యాంటీ రెట్రో వైరల్æ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. వీరిలో32,790 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిడ్ బారిన పడిన సుమారు 2,500 మంది బాధితులు పింఛన్లు పొందుతున్నారు. ఏఆర్టీ సెంటర్లలో నమోదైనవారు హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రో వైరల్æ మందుల కోసంం ఏఆర్టీ సెంటరులో మొత్తం 32,790 మంది నమోదు చేయించుకున్నారు. వారిలో 16,890 పురుషులు, 14621 స్త్రీలు. మగ పిల్లలు 661, ఆడపిల్లలు 522 మంది. హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రోవైరల్ నివారణ మందులు (ఏఆర్టీ) వాడుతున్నావారు మొత్తం 15,495 మంది ఉండగా..వారిలో 6,822 పురుషులు, 8047 మంది స్త్రీలు, మగ పిల్లలు 335, ఆడ పిల్లలు 259 మంది వున్నారు. హెచ్ఐవి స్థితిని తెలుసుకోండి పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి అనే కొత్త నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య–ఆరోగ్యశాఖ అధికారి ఎస్.తిరుపతిరావు వెల్లడించారు. రేసపువానిపాలెంలో గల సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఎవరినీ హెచ్ఐవీ బారిన పడకుండా చేయడం, హెచ్ఐవీ సోకిన వారిని వివక్ష లేకుండా సామూహికంగా కలుపుకుని పోవడం అన్నవి ప్రధాన అంశాలుగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి జూన్ 30 వరకు తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. జిల్లాలో సుమారుగా 3వేలమంది ఎయిడ్స్ రోగులు కేజీహెచ్, టీబీ ఆస్పత్రి, అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల ద్వారా ఏఆర్టీ మందులు పొందుతున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్సొసైటీ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ, డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ వరకు భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. మీడియా సమావేశంలో జిల్లావైద్య–ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. నేడు జీవీఎంసీ నుంచి ఏయూ వరకూ ర్యాలీ :నివారణ చర్యలు ముమ్మరం ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో భాగంంగా ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం సీడీ 4పరీక్షతో నిమిత్తంం లేకుంండా హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంంటనే ఎఆర్టీ చికిత్స ప్రారంభించడంం జరుగుతుంది. రక్తసేకరణ, రవాణా వాహనం ద్వారా స్వచ్ఛంద రక్త దానశాతాన్ని పెంచి, రక్తకొరత లేకుండా చేయడం, హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి ఎన్టీఆర్భరోసా ద్వారా జిల్లాలో 4వేలకు పైగా మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఏపీ బ్లడ్ సెల్æ యాప్ ద్వారా బ్లడ్‌బ్యాంక్, రక్తనిల్వలు వివరాలు తెలుసుకోవచ్చు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో జీవిస్తున్న 137 మంది గిరిజనులకు పంచామృతం కార్యక్రమంం ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు.– డాక్టర్ ఆర్.రమేష్, జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ విభాగం అధికారి, విశాఖపట్నం. వివిధ సంస్థల సహకారంతో.. ప్రస్తుత కాలంలో ప్రజల జీవన శైలి ఎయిడ్స్ వ్యాప్తికి దోహదం చేస్తోంది. నైతికపరమైన విలువలతో కూడిన జీవన విధానం ద్వారానే ఈ వ్యాధి నియంంత్రణ సాధ్యపడుతుంది. ముఖ్యంంగా హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థల సహకారంతో నెలకు మూడు సమావేశాలు ఏరా ?టు చేస్తున్నాం. అసలు వ్యాధి రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.తిరుపతిరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,విశాఖ. 9వ స్థానంలో విశాఖ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమైనా ఉందంటే..అది ఆంధ్రప్రదేశే. ఎయిడ్స్‌పై అవగాహన లోపించడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదే. 1981లో తొలిసారిగా ఎయిడ్స్‌ను కనుగొన్నప్పుడు కేవలం నలుగురికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 36.9 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బిల్æగేట్, క్లింటన్ ఫౌండేషన్ల నుంచి నిధులు వచ్చినంంత కాలం ఎయిడ్స్ నివారణకు విస్తత ప్రచారాలు చేసిన రెండు ప్రభుత్వాలు, ఆ నిధులు ఆగిపోవడంంతో ప్రచారాన్ని, అవగాహన కార్యక్రమాలను గాలికొదిలేశాయి.– కూటికుప్పల సూర్యారావు, ప్రముఖ వైద్యుడు -
హెచ్ఐవీ పంజా!
జిల్లాలో హెచ్ఐవీ వైరస్ పంజా విసురుతోంది. ప్రతి నెలా 250 నుంచి 300 కొత్త కేసులు నమోదవుతున్నారు. ఒక్క విజయవాడలోనే నెలకు వంద కేసులకు తక్కువకాకుండా రికార్డవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కాకిలెక్కలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు) : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా.. అంటూ మూడు దశాబ్దాల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేశారు. ఎయిడ్స్ ఎలా సోకుతుంది. రాకుండా ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలతో హోరెత్తించారు. దీంతో దశాబ్దకాలం పాటు హెచ్ఐవీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే రెండేళ్లుగా జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెలా కొత్తగా 300 కేసులు నమోదవుతుండగా, ఏడాదిలో 3 వేల నుంచి 3,500 వరకూ నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరింత మంది ఉండవచ్చనేది అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోనే హెచ్ఐవీ వ్యాప్తిలో జిల్లా మొదటి స్థానానికి చేరే అవకాశం ఉంది. హెచ్ఐవీ వ్యాప్తి చెందుతుందిలా.. ఒకప్పుడు లైంగిక సంపర్కం ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ వ్యాప్తి చెందేది. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్‌ల్లో స్క్రీనింగ్ పరీక్షలు నాసిరకంగా చేయడంతో రక్తమార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో యువత ఇటీవల కాలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీంతో ఒకరు వాడిన సూదిని మరొకరు వాడటం ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాపిస్తున్నట్లు సమాచారం. హైటెక్ వ్యభి చారం జోరుగా సాగుతుండటం మరోకారణం. అధికారులు కాకి లెక్కలు అధికారుల లెక్కల ప్రకారం 2015లో 33 వేలు ఉండగా, 2016లో 36 వేలకు చేరింది. 2017లో 39,500 మంది హెచ్ఐవీ బాధితులు ఉండగా, తాజాగా 20 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన 19,500 మంది ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. వారిలో సగం మంది మృత్యువాత పడగా, మిగిలిన వారిని ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయకపోవడంతో పేర్లు తొలగించి, జిల్లాలో హెచ్ఐవీ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కాకిలెక్కలు చెబుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా నివారణ సాధ్యం కాదు. అలాంటిది 39 వేల మందిని, ఇప్పుడు 20 వేలే ఉన్నట్లు చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నాసిరకంగా నిర్ధారణ పరీక్షలు.. రాజమండ్రిలో ఓ గర్భిణికి హెచ్ఐవీ లేకుండానే ఐసీటీసీ సిబ్బంది పరీక్షల నివేదికలో పాజిటివ్ అని ఇవ్వడంతో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అదేరీతిలో గతంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన హెచ్ఐవీ పాజిటివ్ రోగికి ర్యాపిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే వైద్యులకు సదరు రోగి గతంలో పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఐసీటీసీల్లో సరఫరా చేసే కిట్లు నాసిరకంగా ఉండటంతో నిర్ధారణ పరీక్షల్లో సైతం ప్రామాణికం ఉండటం లేదు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జిల్లాలో హెచ్ఐవీ కొత్త కేసులు ఏడాదిలో 2,500 నుంచి 3 వేల వరకూ వస్తున్నాయి. హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడంతో పాటు, రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది ఉన్నారు. వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏఆర్‌టీల్లో సైతం సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవు. అన్నింటినీ ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. మా డీఎల్వో పర్యవేక్షిస్తుంటారు. – డాక్టర్ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
మరణమా?.. హెచ్ఐవీతోనా?
జోహన్నెస్‌బర్గ్: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్ డొనాల్డ్ గోర్డాన్ మెడికల్ సెంటర్ వైద్యులు ‘ఎయిడ్స్’ అనే జర్నల్‌లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
పసిబిడ్డలకూ గండం
సాక్షి, అమరావతి: తొమ్మిది మాసాలు కడుపులో ఉన్నప్పుడే కాదు బిడ్డను ప్రసవించాక కూడా ఆ చిన్నారికి తల్లే రక్షణ కవచం. అలాంటి తల్లి నుంచే బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యంతో పసిబిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఇది. వివరాల్లోకి వెళితే.. మన రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చితే వారి నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా ఉండాలంటే నెవరపిన్ సిరప్ విధిగా వేయాలి. అయితే రాష్ట్రంలో నెవరపిన్ సిరప్ పూర్తిగా అయిపోయింది. పొరుగునే ఉన్న తెలంగాణ ముందస్తు జాగ్రత్తతో కొనుగోలు చేసి నవజాత శిశువులకు అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. చిన్నారులకు పొంచివున్న ముప్పు మన రాష్ట్రంలో నెలకు సగటున 100 నుంచి 120 మంది హెచ్ఐబీ బాధిత మహిళలు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి వస్తున్నారు. వీరి నుంచి చిన్నారులను కాపాడేందుకు నెవరపిన్ సిరప్ వేయాలి. దీన్ని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో) సరఫరా చేసేది. అయితే రెండు నెలల క్రితం తాము సరఫరా చేయలేమని, రాష్ట్రాలే సమకూర్చుకోవాలని చెప్పింది. వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లులు భయాందోళన చెందుతున్నారు. డాక్టరును అడిగితే స్టాకులేదని చెబుతున్నారని తల్లులు చెబుతున్నారు. తాము ఎలాగూ చేయని తప్పునకు విధివంచితులమయ్యామని, మా చిన్నారులను బలిచేయవద్దని వారు ఎంత బతిమలాడుకున్నా పట్టించుకునే వారేలేరు. మాత్రను ఐదు సమభాగాలుగా చేసి... నెవరపిన్ సిరప్ అనేది చిన్నారులకు వెయ్యడం చాలా సులభం. కానీ ఆ సిరప్ వెయ్యకుండా మాత్రలు వెయ్యాలని చెబుతున్నారు. ఆ మాత్రలేమో ఒక్కోటి 50 మిల్లీ గ్రాములవి. దీన్ని ఐదు సమభాగాలు చేసి దాన్ని తల్లిపాలలోగానీ, కాచి చల్లార్చిన పాలలోగానీ కలిపి తాగించాలి. కానీ ఈ మాత్రను ఐదు సమభాగాలు చేయడం కష్టం. ఎక్కువో తక్కువో అయ్యిందంటే బిడ్డకు ఇబ్బంది. అధికారులేమో సిరప్ లేదు ఇక మాత్రలు వేసుకోవాల్సిందే అంటూ సెలవిస్తున్నారు. పుట్టిన రోజు నుంచి 6 వారాల వరకూ ఈ సిరప్ వెయ్యాలి. ఆ తర్వాత 18 వారాల వరకూ సెప్ట్రాన్ అనే సిరప్ వెయ్యాలి. ఆ సిరప్‌ను కూడా హెచ్ఐవీ బాధితులు వైద్యానికి వచ్చే ఐసీటీసీ సెంటర్లలో ఉంచకుండా ప్రభుత్వాసుపత్రుల్లోని సాధారణ ఫార్మసీలలో ఉంచుతున్నారు. అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు. అక్కడేమో మందుల కోసం జనం బారులు తీరి నిలబడి ఉండటంతో హెచ్ఐవీ తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం సరఫరా ఆపేసింది గతంలో కేంద్రం సరఫరా చేసేది. ఇప్పుడు ఆపేసింది. ఈ సిరప్‌ను తెప్పించేందుకు బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీతో మాట్లాడాం. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకూ మాత్రలను పౌడర్ చేసి ఐదు సమభాగాలుగా చేసి వెయ్యమని చెప్పాం. సిరప్ రాగానే సరఫరా చేస్తాం. –డా.రాజేంద్రప్రసాద్, అదనపు సంచాలకులు (ఏపీశాక్స్) -
క్షణకాల కాంక్ష.. పిల్లలకు జీవితశిక్ష
తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కూలి పనులు చేసుకొంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులకే భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం వచ్చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం భర్త కోరిక మేరకు ఆమె కువైట్ వెళ్లి వచ్చింది. తిరిగొచ్చిన అనంతరం మళ్లీ కేరళకు భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లింది. నాలుగు నెలల కిత్రం నయంకాని వ్యాధితో మంచానికే పరిమితమైంది. భర్త ఆమెను వదిలేసి తిరుపతి వెళ్లిపోయాడు. ఎముకల గూడుగా మారిన ఆ మహిళను రెండు నెలల క్రితం రాత్రిపూట ఆటోలో తీసుకొచ్చి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఇరవై రోజులు మృత్యువుతో పోరాడి మహిళ కన్నుమూసింది. ఈమెకు ఒక కుమార్తె. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. కొన్ని సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి తిరిగి వ చ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి గ్రామానికి వచ్చి మేస్త్రి పని చేసుకొంటున్న ఓ వ్యక్తితో స్థానికులు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాన్ని నిర్మించుకొన్నారు. ఇంతలో నయం కాని వ్యాధి ఇద్దరినీ కబళించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వారు ఏమయ్యారో కూడా చెప్పేవారు లేరు. వాల్మీకిపురంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఉపాధి కోసం పూణే వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు. పూణె నుంచి స్వగ్రామానికి తరచూ వస్తూ బిడ్డను చూసుకునేది. ఈ క్రమంలోనే నయంకాని వ్యాధిబారిన పడడంతో మహిళ కన్నుమూసింది. కుమారునికీ వ్యాధి సోకడంతో తండ్రి పట్టించుకోలేదు. నానమ్మ సహకారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం నడవలేని స్థితికి చేరింది. దీంతో చదువు అర్ధంతరంగా ఆగిపోతుందని, దాతలు ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు జీవితాంతం శిక్షకు గురవుతున్నారు. చిత్తూరు ,మదనపల్లె టౌన్: కరువు కోరల్లో చిక్కుకుని కొందరు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇంకొందరు, ఉపాధి లేక మరికొందరు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతులు, మహిళలు అధికంగా వేశ్య వృత్తిని ఎంచుకుని వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. డబ్బుమీద వ్యామోహంతో రెడ్‌లైట్ ఏరియాలైన ముంబయి, పూణె, ఢిల్లీ, కలకత్తా, బెంగళూర్, సింగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి హెచ్ఐవీ బారిన పడి జీవితాలను నరకప్రాయం చేసుకుని రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. పబ్బులు, వేశ్య గృహాలకు వెళ్లి నయంకాని వ్యాధిబారిన పడుతున్నారని కొన్ని సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అలా వ్యాధుల బారిన పడుతున్న వారు అధికంగా మదనపల్లెతో పాటు, పడమట మండలాలైన పీటీఎం, బి. కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యంలలో గత ఐదేళ్లలో 23 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడు వేలకుపైనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు.. అలా చనిపోయిన వారి అయినవారి ఆదరణకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు వీరికి జీవిత కాల శిక్ష పడుతోంది. రక్తసంబంధీకులు కూడా అక్కున చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. కానరాని ప్రభుత్వ చర్యలు.. గతంలో ప్రభుత్వాలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, యువతులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 1000 కూడా అందించేవారు. దీంతో ఎంతో కొంత వారికి భరోసా లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. పునరావాస చర్యలు తీసుకుంటే కొంతైనా తగ్గించ వచ్చని పలువురు చెబుతున్నారు. ఆదరించని కుటుంబసభ్యులు.. వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి బాధపడుతున్న మహిళలు, పురుషులు కుటుంబసభ్యుల నిరాదరణకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంచం పట్టిన బాధితులను పట్టిం చుకోవడం లేదు. పైగా వారే అర్ధరాత్రి సమయాల్లో తీసుకొచ్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వదలి వెళుతున్నారు. వారిని సిబ్బంది క్రానిక్ వార్డులో చేర్చి చికిత్సలు అందిం చినా ఫలితం లేక చేరిన నెల రోజుల్లోపే చనిపోతున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులు తీసుకెళ్లని పరిస్థితి. దీంతో కుళ్లి దుర్వాసన వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తున్నారు. వారు ఆ మృతదేహాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి వాగుల్లో పాతిపెట్టి వస్తున్నారు. -
రాజధానిలో పెరిగిన ఎయిడ్స్ కేసులు
న్యూఢిల్లీ : గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గింది.. కానీ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్‌సభలో సభ్యులు దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ కేసుల వివరాల గురించి అడిగిన ప్రశ్నలకు, ఆరోగ్య, మంత్రిత్వ శాఖ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానాలు అందించింది. గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్ వ్యాధి కేసుల వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం.. 2015 - 16 సంవత్సరంలో 2, 00, 465 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా, 2013 - 17లో 1, 93, 195 కేసులు, 2017 - 18 సంవత్సరంలో 1, 90, 763 ఎయిడ్స్ కేసులు నమోదయినట్లు తెలిపింది. ఏడాదికేడాది దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. అందుకు విరుద్ధంగా రాజధాని ఢిల్లీలో మాత్రం ఎయిడ్స్ కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నట్లు ప్రకటించింది. 2017 - 18 సంవత్సరానికి గాను ఢిల్లీలో ఉన్న కొత్తగా 6,563 ఎయిడ్స్ కేసులను గుర్తించగా, గతేడాది ఈ సంఖ్య 6,340గా ఉన్నట్లు తెల్పింది. అయితే ఈ పెరుగుదలకు కారణం ‘వలసలు’ అంటున్నారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు. ‘ఉపాధి కోసం ప్రతిరోజు ఎందరో రాజధానికి వలస వస్తుంటారు. అందువల్లే కొత్త కేసులు పెరుగుతున్నాయ’ని తెలిపారు. ప్రస్తుతం రాజధానిలో మొత్తం 28, 445 ఎయిడ్స్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఎయిడ్స్ వ్యాధి బారిన పడి దాదాపు 400 మంది మరణిస్తున్నారని ప్రకటించారు. 2017 - 18 సంవత్సరానికి గాను మహారాష్ట్రలో అత్యధికంగా ఎయిడ్స్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రలు ఎయిడ్స్ వ్యాధికి హాట్‌స్పాట్స్‌గా మారాయన్నారు. త్వరలోనే రాజధాని ఢిల్లీలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. అంతేకాక ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మరో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. -
ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో ‘ఆకలి కేకలు’..!
విజయనగరం ఫోర్ట్ : జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పరిధిలో 13 ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 13 మంది కౌన్సిలర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మరో నలుగురు, విజయనగరం, పార్వతీపురంలలో రెండు ఏఆర్టీ కేంద్రాల్లో 16 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, ఎస్.కోటల్లో నా లుగు లింక్ ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో నలుగురు స్టాఫ్ నర్సులు, బ్లడ్‌బ్యాంక్‌లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరిందరికీ మార్చి నెల నుంచి జీతాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటివి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పుచేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. విధులు నిర్వర్తిస్తున్నా... ఐసీటీసీ సెంటర్లలో రోగులకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవీ నిర్ధారణ అయినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఏఆర్టీ కేంద్రంలో రోగులకు సీడీఫోర్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీసుకోవాల్సి ఆహారం, జాగ్రత్తలు గురించి కౌన్సిలింగ్ ఇస్తారు. లింక్ ఎఆర్టీ కేంద్రంలో రోగులకు మందులు అందజేస్తారు. బ్లడ్‌బ్యాంక్‌లో బ్లడ్ క్రాస్ మేచింగ్, రక్తానికి హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. జీతాలు అందకపోవడం వాస్తవమే... జిల్లాఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారుల ను ప్రశ్నిస్తే ప్రోసెస్‌లో ఉందని చెబుతున్నారు. – జె.రవికుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
బాధితుడికి ఓ అన్నం ముద్ద
హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వచ్చినవారిని సమాజం దూరం పెడుతుంది. వారికి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావడానికి సాహసించరు. ఇందుకు విరుద్ధంగా ‘మీల్స్ ఆన్ వీల్స్’ పేరుతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారికి అమెరికాలోని ‘ఇండియానా’ రాష్ట్రంలోని ఓ సంస్థ కడుపు నిండా అన్నం పెడుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మంచి ప్రయత్నానికి ‘ర్యాన్స్ మీల్ ఫర్ లైఫ్’ గా గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమానికి ‘ర్యాన్స్ మీల్’ అనే పేరు పెట్టడానికి వెనుక ఒక చిన్న కారణం ఉంది. కొన్నేళ్ల కిందట కొకొమోకు చెందిన ‘ర్యాన్ వైట్’ అనే 18 సంవత్సరాల యువకుడు హెచ్ఐవి కారణంగా మరణించాడు. తన 13 సంవత్సరాల వయసులో కలుషిత రక్తం ద్వారా ఆ బాలుడిలోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఐదు సంవత్సరాలు వ్యాధితో పోరాడి కన్నుమూశాడు. అందువల్ల ఈ సత్కార్యానికి అతడి పేరు పెట్టారు. అదే సంవత్సరం అక్టోబరు మాసంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్ర రాజధాని ఇండియానాపొలిస్‌లో రోజుకి 250 మందికి భోజనం అందిస్తూ, వారానికి 2500 మందికి అందించే స్థాయికి ఎదిగాం’ అని చెబుతారు ‘మీల్స్ ఆన్ వీల్స్’ ప్రాజెక్టు మేనేజర్ నిక్ ఫెన్నింగ్. ‘ఇండియానాలో సుమారు 12,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. అందులో సగం కంటె ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు’ అని చెబుతారు నిక్. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆహారం ఇవ్వడమే కాకుండా, వారికి కావలసిన ఆరోగ్య సదుపాయాలు చూస్తారు. ‘ఒంటరితనంతో బాధపడుతున్న వారు, వయసు పైబడినవారు ఎంతోమందికి మేం అన్నం పెట్టగలుగుతున్నాం’ అంటూ సంబరంగా చెబుతారు నిక్. ‘‘ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రబలిన ఎయిడ్స్ కారణంగా కొందరు వారి జీవితభాగస్వాములను కోల్పోయి, ఒంటరివారయ్యారు. వారంతా నలుగురితో కలవాలని, వారి బాధను నలుగురితో పంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అంటున్నారు నిక్. ‘మీల్స్ ఆన్ వీల్స్’ కేవలం హెచ్ఐవి బాధితులకు మాత్రమే కాకుండా, దివ్యాంగులకు, పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులకు కూడా కడుపు నింపుతున్నారు. చాలా దేశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న హెచ్ఐవీ బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమం జరిగితే చాలా బాగుంటుందని సామాజిక సేవకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ విజృంభించనున్న ‘ఎయిడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది. ఎయిడ్స్‌ను కనుగొన్న 30 సంవత్సరాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైద్య రంగానికే స్ఫూర్తినిచ్చింది. అప్పటికే దాదాపు మూడు కోట్ల మంది మరణానికి కారణమైన ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం కలసికట్టుగా ముందుకు కదిలింది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఎయిడ్స్ రోగులను ‘పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ’ అని పిలుస్తున్నారు. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి ఫలితంగా 2000 సంవత్సరం నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య 30 శాతం తగ్గింది. 2003 నుంచి మృతుల సంఖ్య 40 శాతం తగ్గింది. ఒక్క సబ్ సహారా ఆఫ్రికాలో గత దశాబ్దం కాలంలో 25 నుంచి 50 శాతం కేసులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆమ్‌స్టర్‌డామ్‌లో జూలై 23 నుంచి 27 వరకు ఎయిడ్స్‌పై ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. రెండో రకం చికిత్సను కూడా తట్టుకొని బతకకలిగే శక్తిని హెచ్ఐవీ సాధించిందనేదే ఆ వార్త. ఎయిడ్స్ నివారణలో ప్రస్తుతం రెండు రకాల చికిత్స విధానాన్ని అమలు చేస్తున్నారు. మొదటి రకం విధానానికి రోగి స్పందించకపోతే రెండోరకం విధానాన్ని అమలు చేస్తారు. దాంతో 90 శాతం మంది రోగులకు హెచ్ఐవీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, రోగుల్లో వ్యాధి ముదిరి మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇతర బ్యాక్టీరియాలకన్నా పరావర్తనం చెందే శక్తి హెచ్ఐవీ వైరస్‌లో పది లక్షల కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది మందులకు లొంగకపోతే విపరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎయిడ్స్ నివారణకు అమెరికాలో 28 రకాల మందులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు రకాల కాంబినేషన్లలో మాత్రమే ఈ మందులను వాడుతారు. ఒకటో రకం కాంబినేషన్ రోగిపై పనిచేయడం ఇది వరకే నిలిచిపోగా, ఇప్పుడు రెండో రకం కాంబినేషన్ కూడా పనిచేయక పోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పీఎన్బీ స్కాం: అంబానీ సహా నలుగురిపై ఆంక్షలు
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో దర్యాప్తు అధికారులు వేగంగా కదులుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన కీలక అధికారుల కదలికలపై తాజాగా ఆంక్షలు విధించారు. నీరవ్ మోదీ కంపెనీకి చెందిన నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై ట్రావెల్ ఆంక్షలు విధించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ బ్యాంకును రూ.11,400కోట్ల మేర మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వీరు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలనే యోచనతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. మోదీ కంపెనీకి చెందిన భాగస్వాములు, సీనియర్ అధికారులు తమ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ ఆదేశించింది. ముఖ్యంగా సోమవారం సాయంత్రం టాప్ ఎగ్జిక్యూటివ్‌లు విపుల్ అంబానీ, రవిగుప్త సహా నలుగురిని విచారించిన అనంతరం సీబీఐ ఈ ఆదేశాలిచ్చింది. ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక, కార్పొరేట్, అభివృద్ధి ప్రెసెడెంట్, విపుల్ అంబానీ, ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) రవి గుప్తా, అంతర్జాతీయ ఫైనాన్స్ డివిజన్ అధ్యక్షుడు సౌరబ్ శర్మ, మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరాబ్ లను దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అంతకుముందు దేశ, విదేశాలలో సంస్థ వ్యాపార లావాదేవీలు ఇతర వివరాల గురించి వీరిని ఆరా తీసింది. అలాగే కవితా మణిక్కర్ (అధీకృత సంతకం), ఎమిల్లా (వ్యక్తిగత సహాయకుడు), ప్రతీక్ మిశ్రాలతో సహా మరి కొంతమంది అధికారులకు కూడా సమన్లు జారీ చేసింది. మరోవైపు పీఎన్బీకి ముంబై బ్రాడి హౌస్ చెందిన మరో ముగ్గురు అధికారులు బీహూ తివారీ (చీఫ్ మేనేజర్, ఫారెక్స్ శాఖ), యశ్వంత్ జోషి (ఫారెక్స్ డివిజన్ స్కేల్ II మేనేజర్) ప్రఫుల్ సావంత్ (స్కేల్ I అధికారి, ఎక్స్పోర్ట్) లను సోమవారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసింది. -
ఈ మహమ్మారి తీరు..చాప కింద నీరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ మళ్లీ విజృంభిస్తోంది. జాతీయ సగటు కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారితో మరణిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2016–17లో 13.03 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,058 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. 2017–18లో జనవరి 31 వరకు 11.25 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 10,194 మంది కొత్త బాధితులు తేలారు. 40 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఎయిడ్స్ బారి న పడుతున్నారు. బాధితుల్లో 52 శాతం మంది 40 నుంచి 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. 15–49 ఏళ్ల వయసున్న వారితోనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) పేర్కొంటోంది. ఈ వయసున్న వారిలో 6 శాతం మంది ఎయిడ్స్ పరంగా ‘హై రిస్క్’జోన్లో ఉంటారని ఈ సంస్థ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ వయసున్న వారిలో ఆరు శాతం లెక్కన.. 10.50 లక్షల మంది ఉన్నారు. ‘‘40 ఏళ్లు దాటిన వారిలో జీవితపరంగా స్థిరత్వం వస్తోంది. ఆర్థికంగానూ ఇలాగే ఉంటున్నారు. ఎక్కువ మంది ఉపాధి, ఉద్యోగాల కోసం బయటి ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఎయిడ్స్‌కు కారణమవుతున్నాయి’’అని హైదరాబాద్‌లోని ప్రభుత్వ బోధన ఆస్పత్రి వైద్య నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ప్రైవేటు’ రోగుల లెక్కలేవి? రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో సరైన విధానం కనిపించడంలేదు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రాష్ట్ర విభాగం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన వారి సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటోంది. ఎయిడ్స్ రోగుల్లో గ్రామీణులు, పేదలు మాత్రమే ప్రభుత్వ ఎయిడ్స్ చికిత్స కేంద్రాలకు వస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రులలోనే ఎక్కువ మంది ఎయిడ్స్ రోగులు వైద్యం తీసుకుంటున్నారు. వ్యాధి సోకినవారు బయటకి చెప్పుకోవడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ జరుగుతున్నా.. అక్కడ మందులు తీసుకుంటే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రైవేటు చికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారెంత మంది అన్న లెక్కలు ప్రభుత్వ విభాగాల వద్ద ఉండటం లేదు. ప్రైవేటు సంస్థలపై పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడంతో ఎయిడ్స్ నియంత్రణ విషయంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జాతీయ సగటును మించి కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలగా.. అదే రాష్ట్రంలో ఆ సంఖ్య రెండుగా ఉంటోంది. చికిత్స అరకొరే.. రాష్ట్రంలో ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్ బలి తీసుకుంటోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటికే 31,416 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వీరిలో 90,156 మంది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. న్యాకో ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పింఛన్ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(టీ సాక్స్) సంస్థ ఆధ్వర్యంలో మందులు పంపిణీ జరుగుతోంది. రెగ్యులర్‌గా మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 37,732 మంది ఎయిడ్స్ రోగులు క్రమపద్ధతిలో మందులు తీసుకోవడం లేదు. ఫలితంగా వ్యాధి నియంత్రణ సాధ్యం కావడం లేదు. సరిపడ ఏఆర్టీ కేంద్రాలేవీ? ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కేంద్రాలు రాష్ట్రంలో 22 మాత్రమే ఉన్నాయి. నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఒక్క ఏఆర్టీ సెంటర్ లేదు. -
ఒక్క తప్పు.. 40 మందికి హెచ్ఐవీ
లక్నో: ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి 40 మంది జీవితాలు బలయ్యాయి. ఎయిడ్స్ రోగికి ఇచ్చిన సిరంజీతో ఇంజక్షన్ చేయడం వల్ల 40 మందికి హెచ్ఐవీ వైరస్ సోకింది. ఈ విషయం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి తెలియడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించింది. హెచ్ఐవీ సోకడానికి కారణమైన సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోంమంత్రి ఆదేశించారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులను కాన్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించి చికిత్స కూడా అందిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ఉన్నావో జిల్లాలోని బంగార్మౌ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ పేషంట్‌కు ఇచ్చిన సూదితోనే ప్రతి రోగికి ఇంజెక్షన్ చేయడం వల్లే అందరికీ హెచ్ఐవీ సోకిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోందని, చాలా మంది డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల తమ లారీలను అక్కడే ఆపి సుఖవ్యాధులు అంటించుకుంటున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ వారికి హెచ్ఐవీ సోకడంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. -
వైద్యం మారలేదు.. వ్యాధి తగ్గలేదు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ మరణాలు ఎయిడ్స్ కారణంగానే జరుగుతున్నాయి. వ్యాధి నియంత్రణ, రోగులకు ఉపశమనమే లక్ష్యంగా చికిత్సా విధానంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ఈ కొత్త వైద్యం అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాయి. ఈ మేరకు ఔషధాలు, చికిత్స వనరులను సైతం అందిస్తున్నాయి. అయితే ఎయిడ్స్ నివారణపై రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం కొత్త చికిత్సా విధానం అమలు కావడంలేదు. ఫలితంగా రోగులకు పాట్లు తప్పడం లేదు. çహ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్(హెచ్ఐవీ), అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) రోగులకు వైద్యం అందించే విషయంలో సీడీ4 కణాల సంఖ్యే కీలకం. రోగ నిరోధకతను సూచించే సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తక్కువకు పడిపోయినప్పుడే హెచ్ఐవీ బాధితులకు యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) అందిస్తున్నారు. సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తగ్గినప్పుడు రోగ నిరోధక శక్తి ఎక్కువగా కోల్పోతారు. దీంతో ఎయిడ్స్ రోగులు క్షయ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు... హెచ్ఐవీని గుర్తించగానే చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీనిపై కొత్త విధానాన్ని అమలు చేయాలని ఈ ఏడాది జూన్‌లో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కొత్త విధానం అమలైతే ఎయిడ్స్ బాధితులు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీ సాక్స్) మాత్రం ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. సీడీ4 కణాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎయిడ్స్ రోగులు అందరికీ మందులు అందించాలంటే కచ్చితమైన సంఖ్యను జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ(న్యాకో)కు ఇవ్వాలి. టీ సాక్స్ ఇంత వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో రాష్ట్రంలోని మొత్తం రోగులకు అవసరమైన ఉచిత మందుల సరఫరా సైతం జరగడంలేదు. అంతర్జాతీయంగా, జాతీయంగా ఎయిడ్స్ కేసులు తగ్గుతుంటే తెలంగాణలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్ మహమ్మారి తీసుకుం టోంది. వ్యాధిపై అవగాహన పెరుగుతున్నా చికిత్స, మందులు మాత్రం అందడంలేదు. దీంతో కొత్తగా ఎయిడ్స్ సోకేవారు రాష్ట్రంలో పెరుగుతున్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రతి నెల సగటున వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 5,789 మందికి ఎయిడ్స్ సోకినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వీరిలో 71,651 మంది మాత్రమే ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. 37,732 మంది క్రమపద్ధతిలో మందులు తీసుకోవడంలేదు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(టీసాక్స్) సంస్థ ఆధ్వర్యంలో ఈ మందుల పంపిణీ జరుగుతుంది. క్రమపద్ధతి(రెగ్యులర్)లో మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు... ఏడాది కొత్త కేసులు 2014–15 13,420 2015–16 11,081 2016–17 11,403 2017–18 5,789 (2017 ఆగస్టు 31 వరకు) జిల్లాల వారీగా ఎయిడ్స్ పరిస్థితి... జిల్లా పేరు రోగులు మృతులు ఆదిలాబాద్ 3,959 947 హైదరాబాద్ 59,586 6,494 కరీంనగర్ 20,832 4,850 ఖమ్మం 18,641 3,817 మహబూబ్‌నగర్ 14,846 1,834 మెదక్ 12,822 2,288 నల్లగొండ 17,268 2,494 నిజామాబాద్ 14,752 4,046 రంగారెడ్డి 3,842 1,085 వరంగల్ 14,369 3,439 (గణాంకాలు 2017 సెప్టెంబర్ వరకు) -
ఎయిడ్స్ బాధితులపై ఆధార్ పిడుగు
సాక్షి, బెంగళూరు: గోరుచుట్టపై రోకటి పోటులా ఉంది ప్రభుత్వాల నిర్ణయం. అసలే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే.. ఆధార్‌తో లింకప్ అని అధికారులు ఎయిడ్స్ బాధితులను వేధిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నియంత్రణ చర్యల్లో వెసులుబాటు లేక ఈ సమస్య తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఏఆర్టీ సెంటర్ల ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు ఉచితంగా నెలవారి మందులు, ఆర్థిక సాయం అందజేస్తోంది. నెలకు రూ.5 వేల విలువైన మందులను, ధనశ్రీ పథకంలో భాగంగా రూ.50వేల రుణాలను ఇవ్వడమే కాకుండా అందులో రూ.20 వేలను సబ్సిడీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సదరు సదుపాయాలు పక్కదారి పట్టకుండా ఉండటం కూ డా లబ్ధిదారులు కచ్చితంగా తమ ఆధార్‌ను ఏ ఆర్టీ సెంటర్లలో అందజేయాలని ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో సూచించింది. అయితే రాష్ట్రం లో ప్రస్తుతం హెచ్ఐవీతో బాధపడుతున్న దా దాపు 1.64 లక్షల మందిలో 50,413 మంది మాత్రమే తమ ఆధార్‌ను ఏఆర్టీ సెంటర్లలో అందజేశారు. మిగిలిన వారు తమ విషయాలు ఎక్కడ బహిర్గతమవుతాయో అన్న అనుమానంతో ఆధార్‌ను ఇవ్వడం లేదు. అంతేకాకుండా మందులతో పాటు ధనశ్రీ వంటి పథకాల ప్ర యోజనాలను పొందడానికి ఇటీవల ముందుకు రావడం లేదు. దీంతో బాధితుల ప్రయోజనాల కు విఘాతంతో పాటు ఎయిడ్స్వ్యాప్తి చెందే ప్ర మాదమూ ఉందని ఒక స్వచ్ఛందసంస్థ ప్రతి నిధి వాపోయారు. ‘ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆధార్ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ఏఆర్టీ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ పరిస్థితి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది’ అని తెలిపారు. సీడీ కౌంట్‌తో ఔషధాలకు ముడి.. బలైన వేల ప్రాణాలు 2007లో అమల్లోకి వచ్చిన నిబంధనలను అనుసరించి హెచ్ఐవీ సోకిన వ్యక్తి సీడీ–4 కౌంట్ 350కు పడిపోయిన తర్వాత మాత్రమే ఉచిత యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)కు అర్హులు. మిగిలిన వారు సొమ్ములు చెల్లించి మందులు కొనుక్కోవాల్సి వచ్చేది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మాత్రం ఈ నిబంధనలో మార్పు వచ్చింది. సీడీ–4 కౌంట్‌తో సంబంధం లేకుండా ఏఆర్టీ సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా గత పదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి కర్ణాటకలో 80,173 మంది మరణించారు. అయితే వీరిలో దాదాపు 40 శాతం మంది ఏఆర్టీ సెంటర్ల ద్వారా మందులు పొందలేకపోయినవారేనని కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (కేఎస్ఏపీఎస్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల సరళీకరణ నిర్ణయం ముందే వెలువడి ఉంటే హెచ్ఐవీ వ్యాప్తిని మరింతగా అడ్డుకట్టువచ్చునని అధికారులే ఒప్పుకుంటున్నారు. పసిబిడ్డలకు శుభవార్త కర్ణాటకలో హెచ్ఐవీతో బాధపడుతున్న గర్బిణిల నుంచి వారికి పుట్టబోయే పిల్లలకు హెచ్ఐవీ రాకుండా అడ్డుకోవడంలో రాష్ట్రం కొంత ప్రగతిని సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్ఐవీతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్యలో తగ్గుదల రావడమేకాకుండా వారి నుంచి పుట్టిన బిడ్డకు హెచ్ఐవీ సోకే విషయంలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. -
ఎయిడ్స్ రూటు మారింది!
సాక్షి, సిటీబ్యూరో: ‘పులి రాజా...’ వచ్చే మార్గం మారింది. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కుల ద్వారా ఎయిడ్స్ ఎక్కువగా వ్యాపిస్తుందని చాలా మంది భావిస్తుంటారు కానీ...ప్రస్తుతం ఆయా వర్గాల్లో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పురుషుల్లో హెచ్ఐవీ బాధితులు పెరిగినట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. లైంగిక సంబంధాల ద్వారా వచ్చిన దానికంటే...ఇతర మార్గాల్లో (కలుషిత రక్త మార్పిడి..ఒకరికి వాడిన సిరంజ్‌లు, షేవింగ్ బ్లేడ్లు మరొకరికి వాడటం) ఎయిడ్స్ బారినపడిన వారే అధికంగా ఉన్నట్లు తేలింది. తప్పని చీదరింపులు.. చీత్కారాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్ఐవీ రోగులకు ఆదరణ కరువైంది. చికిత్స కోసం వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఆర్టీ(యాంటి రెట్రల్ వైరల్ సెంటర్) వైద్య సిబ్బంది వారిని సూటి పోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చికిత్సకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తెలంగాణలో 1,80, 937 మంది పేర్లు నమోదు చేసుకోగా, ప్రస్తుతం వీరిలో 90,156 మంది ఆయా ఏఆర్టీ సెంటర్లలో చికిత్సలు పొందుతున్నారు. 71,651 మంది మందులు వాడుతున్నారు. మరో 37,732 మంది చికిత్సకు రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. అవమానాలు, వేధింపులు భరించలేక కొంత మంది ఇతర ఏఆర్టీ సెంటర్లకు బదిలీ చేయించుకుంటున్నారు. బోధనాసుపత్రుల్లో కిట్స్ కొరత బోధనాసుపత్రుల్లో ఎయిడ్స్ కిట్స్ సరఫరా అధ్వానంగా ఉంది. ప్రతి చిన్న వస్తువు రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నాపెద్ద కలిపి ప్రతి రోజు సగటున 200–250 వరకు, గాంధీలో 200పైగా చికిత్సలు జరుగుతుంటాయి. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజు సగటున 25–30, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 60–70 ప్రసవాలు జరుగుతున్నాయి. చికిత్సలకు ముందు రోగ నిర్థారణలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు హెచ్ఐవీ టెస్టు తప్పని సరి. ఆస్పత్రిలో కిట్స్ కొరత వల్ల వాటిని రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.150 వెచ్చిస్తున్నారు. చికిత్సల్లో కీలకమైన సర్జికల్ కిట్స్(సూది, దారం, బ్లేడ్, దూది, గ్లౌజు)లేక పోవడంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500–700 వరకు ఖర్చు అవుతోంది. గర్భిణుల్లో తగ్గుముఖం అక్వైర్డ్ ఇమ్యూనో డెఫీషియన్సీ సిండ్రోమ్(ఎయిడ్స్)నగరంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరంలోని 25 ఐసీటీసీ కేంద్రాల్లో ఇప్పటి వరకు సేకరించిన నమూనాలను పరిశీలిస్తే.. 2004–05లో 16.99 శాతం హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. 2016 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 40395 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయగా, వీరిలో 1024 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34,861 మంది గర్భిణులను పరీక్షించగా, కేవలం 43 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 21587 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 39 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గర్భిణుల్లో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టిందనడానికి ఇదో నిదర్శనం. -
అటకామా ఎడారిలో హెచ్ఐవీకి మందు!
లండన్: భూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన ప్రదేశాల్లో చిలీలోని అటకామా ఎడారి ఒకటి. ఎయిడ్స్ చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను ఈ ఎడారి ప్రాంతంలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన ఎడారి మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయి. మన పర్యావరణ వ్యవస్థలో యాక్టినోబ్యాక్టీరియా జాతి చాలా ప్రధానమైందని, ఇది జీవక్రియా మిశ్రమాల గని అని బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ∙పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. హెచ్ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో బ్యాక్టీరియాలోని చిన్నభాగమైనా సహకరిస్తుందని.. దీంతో ఔషధాలను కనుగొనడంలో ఉపయోగపడుతుందని అన్నారు. -
69 రోజులు.. 10 లక్షల కండోమ్స్
సాక్షి, బెంగళూరు : దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. -
లేని జబ్బుతో నరకం
తుమకూరు: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యులు భగవంతునితో సమానమని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రోగికైనా ప్రాణం పోయడానికి శతథా ప్రయత్నిస్తారని విశ్వసిస్తాం. కానీ కొందరు వైద్యుల నిర్వాకాల వల్ల ఆస్పత్రులంటేనే దడ పుడుతుంది. ఇక్కడ ఒక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణికి ఎయిడ్స్ జబ్బు ఉందని తప్పుడు నిర్ధరణతో ఆమె జీవితం అతలాకుతలమైంది. కడుపులో ఉన్న బిడ్డను కోల్పోవడంతో పాటు తీవ్ర మనోవేదనతో మంచం పట్టింది. ఏం జరిగిందంటే... 2015, డిసెంబర్లో... తుమకూరు జిల్లాలోని శిర పట్టణంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి స్థానిక గర్భిణి మహిళ ఒకరు సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలతో పాటు హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించారు. ‘ఆ పరీక్షలో పాజిటివ్ అని వచ్చింది. నీకు హెచ్ఐవి ఉంది’ అని వైద్యులు చెప్పడంతో బాధితురాలు షాక్‌కు గురైంది. రోజుల తరబడి తిండితిప్పలు లేక, కుటుంబ సభ్యుల అనుమానపు చూపులతో తీవ్రంగా విలపించింది. ఆ బాధతో అబార్షన్ అయ్యింది. గడిచిన రెండు సంవత్సరాల నుంచి వైద్యులు రాసిచ్చిన మందులు వాడుతూ ఉంది. నిగ్గుతేల్చిన ప్రైవేటు ఆస్పత్రి ఇటీవలే ఆమె మళ్లీ గర్భవతి కావడంతో తుమకూరులో ఉన్న ఓ ప్రవేట్ ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంది. వైద్యులు ఆమెకు ఎలాంటి వ్యాధీ లేదని, ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పడంతో నమ్మలేకపోయిన మహిళ సుమారు నాలుగైదు ప్రవేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఎక్కడా హెచ్ఐవీ/ ఎయిడ్స్ అని నిర్ధరణ కాలేదు. కనీసం ఆ లక్షణాలు ఉన్నట్లు కూడా పేర్కొనలేదు. దాంతో తుమకూరు జిల్లా ఆస్పత్రికి వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకోగా వారూ అదే తేల్చిచెప్పారు. అక్కడి వైద్యులు సైతం హెచ్ఐవీ ఏమీ లేదని తెలిపారు. న్యాయ పోరాటం చేస్తా: బాధితురాలు అప్పటికి బాధితురాలు ఊపిరిపీల్చుకుంది. అయితే రెండేళ్ల నుంచి అనుభవిస్తున్న మనోవేదనకు కారణమైన శిరా పట్టణ ప్రభుత్వాస్పత్రి వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కడుపుకోతతో పాటు రెండు సంవత్సరాల పాటు నరక యాతన అనువించానని తెలిపింది. ఈ వైద్యులు నాకు అన్యాయం చేశారని, ఈ విషయం పైన తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది. -
పులిరాజా కబళిస్తోంది!
రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)’ భూతం చాప కింద నీరులా మెల్లమెల్లగా కబళిస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతుండగా.. మన రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 12 వేల మందికిపైగా హెచ్ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇక హెచ్ఐవీ ముదిరిపోయి ‘ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్)’ దశకు చేరిన వేలాది మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ బాధితులు 36.70 కోట్లు భారత దేశంలో హెచ్ఐవీ బాధితులు 21.17లక్షలు తెలంగాణలో హెచ్ఐవీ బాధితులు 2.01లక్షలు చికిత్స పొందుతున్న వారు 69,901 చికిత్స పొందుతున్న వారిలో పిల్లలు 2,804 ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు 134 హెచ్ఐవీకి కారణమయ్యే హైరిస్క్ గ్రూపు 1,87,864 సెక్స్ వర్కర్లు,ట్రాన్స్ జెండర్లు 66,588 సమగ్ర అవగాహన, చికిత్స కేంద్రాలు 852 పరీక్షలు,మందుల పంపిణీ కేంద్రాలు 101 చాప కింద నీరులా... హెచ్ఐవీ సోకిన వారిలో చాలా మందికి తగిన చికిత్స అందడం లేదు. తమకు హెచ్ఐవీ ఉన్నట్లు బయటికి తెలిస్తే వెలివేతకు గురవుతామన్న ఆందోళన, హెచ్ఐవీ మందులు అత్యంత ఖరీదు కావడం, పేదరికం, హెచ్ఐవీ సోకినా కొంతకాలం వరకూ గుర్తించకపోవడం వంటి కారణాలతో.. చికిత్స చేసుకునే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో వారి ద్వారా హెచ్ఐవీ మరింత మందికి సోకుతోంది. పదేళ్ల కిందటితో పోల్చితే హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గినా... ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉండడం ఆందోళనకరం. హెచ్ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. చికిత్స అందుతున్నది కొందరికే.. తెలంగాణలో 2,01,167 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు అంచనా. కానీ అందులో 69,901 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఏటా కొత్తగా 12 వేల మంది వరకు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో హెచ్ఐవీ బాధితులకు చికిత్స కేంద్రాలు ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల రూ.వెయ్యి పింఛనుగా అందిస్తోంది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. హెచ్ఐవీ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందుకోసం భారీగా నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏసీఎస్)లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ప్రజల్లో హెచ్ఐవీపై అవగాహన కల్పన, మందుల పంపిణీ, చికిత్స అందిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాప్తికి కారణమయ్యే సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, స్వలింగ సంపర్కుల వివరాలను నమోదు చేస్తున్నాయి. ప్రతి రక్త నమూనా పరిశీలన హెచ్ఐవీ వ్యాప్తిలో రక్త మార్పిడి ప్రక్రియ కూడా కీలకంగా మారింది. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రక్తం, బ్లడ్ బ్యాంకులకు చేరుతున్న రక్తం వంటివాటిని ఎవరికైనా ఎక్కించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరీక్షించక పోతుండ డంతో హెచ్ఐవీ సంక్రమిస్తోంది. దీంతో ఇటీవల ప్రతి రక్త నమూనానూ తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేసేలా చర్యలు చేపట్టారు. ఇలా ఏటా సగటున 20 లక్షల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. తెలంగాణలో హెచ్ఐవీ పరిస్థితి.. (2016–17లో) నిర్ధారణ కోసం మొత్తం రక్త పరీక్షలు 19,32,987 ఏసీఎస్ ఆధ్వర్యంలో సేకరించిన నమూనాలు 6,74,324 అవసరార్థం ఇచ్చిన రక్త నమూనాలు 4,05,527 రక్తదానం చేసిన వారి నమూనాలు 2,68,797 హెచ్‌ఐవీగా నిర్ధారించినవి 11,403 గర్భిణుల రక్త నమూనాలు 6,71,925 హెచ్‌ఐవీగా నిర్ధారణ అయినవి 655 పంపిణీ చేసిన కండోమ్‌లు 38,70,276 -
రూ.5 లక్షలిస్తారా....అబ్బాయిని అమ్మేస్తా...
- అమ్మకానికి యత్నించిన కన్నతల్లి - తల్లితో పాటు మరో ఇద్దరి అరెస్టు హైదరాబాద్: పుట్టి నెలైనా నిండని పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి.. తల్లిని అరెస్టు చేసి బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొడిచర్లకు చెందిన అంజమ్మ గతనెల 9న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎయిడ్స్ బాధితురాలు కావడంతో ప్రసవం తరువాత గాంధీ ఆసుపత్రిలో 10 రోజులు చికిత్స పొందింది. ఈ క్రమంలో భర్త దేవయ్యకు తెలియకుండా ఇద్దరు బంధువులతో కలసి బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకుంది. నగరంలోనే ఉంటూ ప్రతీరోజు రాత్రి బల్కంపేట సాయిబాబా దేవాలయం గుడి వద్దకు వచ్చి యాచకురాలి ముసుగులో బేరసారాలు సాగించేది. ఈ విషయం టీఆర్ఎస్ నాయకు రాలు లతకు తెలియడంతో శనివారం రాత్రి అంజ మ్మ వద్దకు వెళ్లి బాబును కొంటానని చెప్పింది. మహిళలను మాటల్లో పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు తమకూ బిడ్డ కావాలని అడిగారు. దీంతో అంజమ్మ రూ.5 లక్షలు ఎవరిస్తే.. బిడ్డను వారికే ఇస్తానంది. తమ వెంట వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి పోలీసులు అంజమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉన్న ఇద్దరు బిడ్డలనే పోషించలేని స్థితిలో ఉన్నామని అందుకే బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు అంజమ్మ అంగీకరించింది. బాలుడు ఏడవకుండా ఉండేందుకు మత్తు పానియాలు ఇచ్చినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అంజమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. -
ఎయిడ్స్ ప్రాజెక్టు ఉద్యోగుల ఆందోళన
- 10 నెలలుగా జీతాలు లేవని నిరసన - రాయలసీమ స్థాయి సమావేశం బహిష్కరణ కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేస్తున్న తమకు పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎయిడ్స్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ఎయిడ్స్ ప్రాజెక్టు ఎన్జీఓలు, ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లతో ఏపీ శాక్స్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించారు. తమ ప్రాజెక్టులో డైరెక్టర్లతో పాటు మేనేజర్లు, ఔట్ రీచ్ వర్కర్లు, క్షేత్రస్థాయిలో సెక్స్‌వర్కర్లు హెచ్ఐవీ నివారణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీటీసీ, పీపీటీసీల్లో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతోపాటు పెంచారన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్యకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా ఏపీ శ్యాక్స్ జేడీ చంద్రశేఖర్, టీం లీడర్ వెంకట్ ఎదుట పలువురు ఎన్జీఓ ప్రతినిధులు సైతం నిధుల విడుదలపై నిలదీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జేడీ తెలిపారు. ఆందోళనలో ప్రోగ్రామ్ మేనేజర్లు మురళి, బాబు(చిత్తూరు), శాంతిరాజు(కర్నూలు), సూర్యనారాయణ, శేషాద్రి(అనంతపురం), మురళి(చిత్తూరు) తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
బేల : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోని స్థానిక ప్రధాన వీధుల గుండా ఎరుుడ్‌స అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ కె. మోహన్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎరుుడ్సపై నిర్వహించిన వ్యాసరచలన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి అందజేశారు. నార్నూర్ : ఎయిడ్స్ రహిత సమాజ నిర్మానం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యుడు శ్రీనివాస్ అన్నారు. ఎయిడ్స్ డే సందర్బంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఎయిడ్స్ అంటువ్యాధి కాదన్నారు. మయాదారి రోగాల భారిన ఏవరు పడకుడదన్నారు. హెచ్ఐవీ సోకడానికి గల నాలుగు దశలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్ ప్రిన్సిపాల్ కాంబ్లె బాలాజీ, వైద్య శాఖ హెచ్ఈ నాందేవ్, సూపర్వైజర్ చరణ్‌దాస్, ఏఎన్ఎంలు సుశీల, శీల తదితరులు ఉన్నారు -
ఎయిడ్స్ రహిత జిల్లాగా కృషి
నెల్లూరు(బారకాసు): 2030 నాటికి ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏజేసీ రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్హాల్లో నిర్వహించిన సభలో ఏజేసీ మాట్లాడారు. జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన అందరి బాధ్యత అని చెప్పారు. ఈవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై పనిచేస్తున్న ఎనిమిది స్వచ్ఛందసంస్థల నిర్వాహకులకు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వివిధ నర్సింగ్ కళాశాలలోని విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు నగరంలోని గాంధీబోమ్మ సెంటర్ నుంచి టౌన్‌హాల్ వరకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏజేసీ జెండా ఊపీ ప్రారంభించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ(ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్ రమాదేవి, డీటీసీఓ డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఎన్‌ఎన్‌పీ ప్లస్ సంస్థ నిర్వాహకురాలు ధనూజ, హిజ్రాల సంఘం జిల్లా అధ్యక్షురాలు అలేఖ్య పాల్గొన్నారు. -
పీతల సుజాతకు చేదు అనుభవం
ఏలూరు: ఏపీ మంత్రి పీతల సుజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏలూరులో గురువారం ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఆ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంత్రికి సమాచారమివ్వలేదు. ఏలూరు లోనే అందుబాటులో ఉన్నా ఎందుకు సమాచారం అందివ్వలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో డీఎం అండ్ హెచ్వోపై చర్యలు తీసుకోవాలని సుజాత కలెక్టర్ ను కోరారు. -
8 నెలల్లో 7,300 ఎయిడ్స్ కేసులు
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కొత్తగా 7,308 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన పూర్వ జిల్లాల లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌లో 1,348 మంది, రంగారెడ్డి జిల్లాలో 778 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో 285 హెచ్ఐవీ కేసులు, నిజామాబాద్ జిల్లాలో 632, కరీంనగర్లో 594, మెదక్‌లో 784, మహబూబ్‌నగర్‌లో 766, నల్లగొండలో 768, వరంగల్‌లో 630, ఖమ్మం జిల్లాలో 723 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఎయిడ్స్ పై ప్రచారం కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కొన్నాళ్లు హెచ్ఐవీ, సీడీ4 వంటి నిర్ధారణ పరీక్ష కిట్లను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.7 లక్షల మంది హెచ్ఐవీ బాధితులుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా. -
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం!
సందర్భం : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం అనంతపురం మెడికల్ : శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్/హెచ్ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్సెనని అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే విశృంఖల శృంగారానికి అడ్డుకట్టవేయాల్సిందేనని సూచిస్తున్నారు. హెచ్ఐవీ అనేది వైరస్.. ఎయిడ్స్ అనేది వ్యాధి. నేడు 'ప్రపంచ ఎయిడ్స్ దినం' సందర్భంగా 'ఎయిడ్స్'పై 'సాక్షి' ప్రత్యేక కథనం. హెచ్ఐవీ ఇలా వస్తుంది – సురక్షితం కాని లైంగిక సంబంధాలు – మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని కొందరు కలిసి ఉపయోగించడం. – రక్త మార్పిడి – హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ను శుభ్ర పరచి వాడకపోతే వ్యాపిస్తుంది. ఎలా వ్యాపించదు – హెచ్ఐవీ బాధితుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు. – హెచ్ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. జాగ్రత్తలు తప్పనిసరి – వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం – నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామితోనే లైంగిక సంబంధం కలిగి ఉండడం – సరైన పద్ధతిలో కండోమ్ వాడడం సీడీ–4 కణాల పాత్రే కీలకం వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్ కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైనది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతి మిల్లీలీటర్ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయం తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్ఐవీ లక్షణాలు కన్పించడం ఆరంభమవుతుంది. వ్యాధి లక్షణాలు కన్పించేందుకు ఐదేళ్లు! హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్ఐవీ పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు. అప్పుడు పరీక్ష చేస్తేనే 'పాజిటివ్' - హెచ్ఐవీ క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను తయారు చేయడం ఆరంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్ఐవీ పాజిటివ్ అని వస్తుంది. - హెచ్ఐవీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తొలి దశలో కనిపించే ఫ్లూ వంటి లక్షణాలు తగ్గిపోయిన తర్వాత బాధితులు కనీసం పదేళ్ల వరకు ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్ఐవీ క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి. బాధితుల కోసం ఏఆర్టీ కేంద్రాలు జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం అనంతపురం సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. లింక్ ఏఆర్టీ కేంద్రాలు హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, గుంతకల్లు, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పెనుకొండ, రాయదుర్గం ఆస్పత్రుల్లో ఉన్నాయి. 350, అంతకంటే తక్కువ తెల్లరక్తకణాలు ఉన్న వారు, హెచ్ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటి రిట్రోవైరల్ మందులు ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు. అధికారులది ప్రచార ఆర్భాటమే జనం ఎయిడ్స్ భూతం బారిన పడకుండా ఉండేందుకు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రమే. బాధితుల్లో మనోస్థైర్యం పెంచడంతో పాటు హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఏడాది పొడువునా ప్రత్యేక కార్యక్రమాలేవీ చేపట్టకుండా కేవలం డిసెంబర్ 1న మాత్రమే 'ఎయిడ్స్ నియంత్రణ దినం' సందర్భంగా నానా హంగామా చేయడం రివాజుగా మారుతోంది. ర్యాలీలంటూ ఉన్న నిధులను ఖర్చు చేసి ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నారు. ఫలితంగా ఈ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. హెచ్ఐవీ నిర్మూలనకు 'తీవ్రంగా' కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఆర్టీ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వారిలో ఇప్పటి వరకు సుమారు 4 వేల మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనధికారికంగా మాత్రం దీని సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత వర్గాల్లోనూ బాధితులు! ఎయిడ్స్ బారిన పడిన వారిలో ఉన్నత వర్గాలూ ఉండడం కలవరపరుస్తోంది. క్రమం తప్పకుండా మూడు నెలల పాటు మందులు వాడితే ప్రభుత్వం అందించే పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం ఏఆర్టీ కేంద్రాల్లో 11,061 మంది మందులు తీసుకుంటుంటే పింఛన్లు తీసుకుంటున్న వారు మాత్రం 3,061 మంది ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు దరఖాస్తు చేసుకున్నా మరికొందరు మాత్రం తమకు పింఛన్ వద్దని చెబుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార వర్గాలతో పాటు చివరకు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. -
నిశ్శబ్దాన్ని ఛేదించారు!
వ్యాధి విషయమై మాట్లాడుతున్నారు జిల్లాలో ఏటా తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు {పభుత్వం నుంచి సాకారం అవసరం రేపు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం చిత్తూరు (అర్బన్) : హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు కూడా దీనిపై నలుగురిలో మాట్లాడాలంటే వణుకు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే గుండె జారిపోరుునంత పని. వ్యాధి సోకిందని తెలిస్తే ఆత్మహత్య ఒక్కటే దారనుకునే రోజులు. అందుకే దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు.. మాట్లాడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడుతున్నారు. హెచ్ఐవీ పట్ల తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటున్నారు. గురువారం ప్రపంచ ఎరుుడ్‌స నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనమిదీ. ఐదేళ్ల క్రితం జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2,462 ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య వెరుు్యకి చేరింది. సుఖ వ్యాధులు, రోగాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండటం వల్లే హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాధి బారినపడ్డ వాళ్లకు ఆ ప్రాంతాల్లో సుఖ వ్యాధి చికిత్స కేంద్రాలు (డీఎస్ఆర్సీలు), వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యాంటీ రిట్రో వైరల్ థెరపి (ఏఆర్టీ) కేంద్రాలు 18 పనిచేస్తున్నారుు. వీటిల్లోని సిబ్బంది హెచ్ఐవీ బాధితులకు వైద్య సేవలు అందించడంతో పాటు వాళ్లలో మనోధైర్యాన్ని పెంచేలా కౌన్సెలింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదరణ ఏదీ..? జిల్లాలో ఎరుుడ్‌స నియంత్రణ కోసం పనిచేస్తున్న ఐసీటీసీ కేంద్రాలకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. ఫలితంగా ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల్లేక పనులు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నా, వాటిని తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావడంలేదు. సాటివారు చులకనగా చూస్తారనే భావం హెచ్ఐవీ బాధితుల్ని వెంటాడుతోంది. ఇలాంటివారికి ఇళ్ల వద్దకు కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు జమచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. చైతన్యం తెస్తున్నాం ఏటా అంతర్జాతీయ ఎరుుడ్‌స నివారణ దినోత్సవం నేపథ్యంలో ఒక కొత్త స్లోగన్‌తో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఈ సారి హెచ్ఐవీ వ్యాప్తిలేని సమాజాన్ని సాధిద్దామనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నాం. ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం కీలకం. ప్రజలు సైతం చైతన్యంతో వైద్యుల వద్దకు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా నిర్మొహమాటంగా చెబుతున్నారు. పాజిటివ్ వచ్చినా మనోధైర్యంతో చికిత్స చేరుుంచుకుంటున్నారు. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎరుుడ్‌స నియంత్రణాధికారిణి -
ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన
అనంతపురం మెడికల్ : ఎయిడ్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ, అడిష¯ŒS డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ’ప్రపంచ ఎయిడ్స్ డే’ పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్ఐవీ బాధితులు పెరుగుతున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. వచ్చేనెల 1న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. -
హెచ్ఐవీ బాధితులు నిరాశ చెందొద్దు
-డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ భారిన పడిన వారు జీవితమైపోయిందని భయపడవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వ్యాధి నివారణకు మంచి మందులున్నాయన్నారు. జిల్లాలోని ఎయిడ్స్ నివారణ ఒప్పంద ఉద్యోగులు, లెప్రసీ ప్రోగ్రామ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడ్స్ నివారణ స్వచ్చంధ సంస్థల సిబ్బంది ఒకరోజు వేతనాన్ని రూ.లక్ష విరాళంగా ఇస్తూ జిల్లాలోని అన్ని డివిజన్లలోని హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతి గర్భిణి తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన కాన్పు కావాలన్నారు. అప్పుడే మనం జీరో పాజిటివ్‌ను సాధించడానికి వీలవుతుందన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడటం వల్ల జీవిత కాలం పెంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేబార్ కో ఆర్డినేటర్ హేమలత, మెడికల్ ఆఫీసర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ నివారణ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, ఆరోగ్య విద్య అధికారి ఎస్ఎస్ రావు, లెప్రసీ డీపీఎంలు, నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి, ఎయిడ్స్ నివారణ కౌన్సిలర్లు దస్తగిరి, రసూల్ పాల్గొన్నారు. -
మందుల నిర్వహణలో అవకతవకలు
సంబంధిత ఉద్యోగి సస్పెండ్ సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్ రోగులకు మందులను నిల్వ చేసే నగరానికి చెందిన ఓ స్టోర్ నిర్వహణలో లోపాలున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. ఈ మందులను నిల్వ చేసే స్టోర్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఈ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇటీవల స్టోర్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో పలు అవకతవకలు జరిగినట్లు తేలడంతో స్టోర్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఎరుుడ్‌స వ్యాధిగ్రస్తులకు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మందులను రాష్ట్రానికి ఇస్తుంది. ఈ మందుల నిల్వ కోసం ఎల్బీ నగర్లో ప్రత్యేక స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. అరుుతే ఈ స్టోర్ నిర్వహణ బాధ్యతలను ఒక కాంట్రాక్టు ఉద్యోగి చూస్తున్నారు. ప్రభుత్వం అందించిన మందులకు... ఈ స్టోర్ నుంచి సరఫరా చేసిన మందులకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్టోర్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు సరిగా లేనట్లు పరిశీలనలో తేలడంతో స్టోర్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు. కాగా ఈ స్టోర్‌లో మందులు గోల్మాల్ అయ్యాయా? ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయా? అనే విషయంపై అధికారులు పూర్తిస్థారుు విచారణ చేయాలని నిర్ణరుుంచారు. విచారణ తర్వాత అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వారికి ఎయిడ్స్ సోకదు!
విల్నియస్: ఎయిడ్స్.. ఇదో ప్రాణాంతక వ్యాధి. అయితే లిథువేనియా దేశానికి చెందిన కొందరికి మాత్రం ఎయిడ్స్ అంటే అస్సలు భయమే లేదు. ఎందుకంటే వారికి ఎయిడ్స్ అసలే సోకదు. హెచ్ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా కూడా వారికి ఏమీ కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. లిథువేనియా ప్రజల్లో దాదాపు 16 శాతం మందికి ఎయిడ్స్ నిరోధకత కలిగి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారి జన్యువులు పలు పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్) చెందడం వల్ల వారి నిరోధక వ్యవస్థలోకి ఎయిడ్స్ వైరస్ ప్రవేశించి నాశనం చేయలేదని వెల్లడించారు. వీరి జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఎయిడ్స్ వ్యాధి చికిత్స పద్ధతులు తెలుసుకునే అవకాశం కలగనుంది. -
‘ఎయిడ్స్’ వివక్షకు రెండేళ్ల జైలు
♦ రూ. లక్ష జరిమానా కూడా ♦ హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ద్వారా వ్యాధిగ్రస్తుల హక్కులను కాపాడటంతోపాటు.. వారి ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసుపత్రులు, విద్యాలయాలతోపాటు పలుచోట్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష కనబరిస్తే శిక్ష అనుభవించక తప్పదని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. తొలి మెడికల్ పార్కుకు ఓకే.. దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే మెడికల్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టు ప్రాంతంలో 300 ఎకరాలను హెచ్ఎల్ఎల్ కంపెనీకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా భారతదేశంలో తక్కువ ధరకే ముఖ్యమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ‘మేకిన్ ఇండియా’ ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. -
హిల్లరీ సేవకులను బిజీగా మార్చిన ట్రంప్
న్యూయార్క్: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్న డెమొక్రటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి ముఖాముఖిగా చర్చాగోష్ఠిలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో హిల్లరీకి ప్రసంగపాఠం తయారుచేసేవారు బిజిబిజీగా మారిపోయారంట. వారంతా ఇప్పుడు ట్రంప్ అసలు ఎలాంటివాడు? ఆయన వ్యక్తిగత పరిస్థితులు ఏమిటి? ఆయన మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుంది? ఎలాంటి సమాధానం చెబితే ఆయన ఎలా స్పందిస్తాడు? ఆయన పర్సనాలిటీ మొత్తం ఎలా ఉంటుందనే విషయాలను స్కానింగ్ చేస్తున్నారట. దీనికోసం వారు ప్రత్యేకంగా గత నెలలోనే పనిని ప్రారంభించి నివేదికలు తెప్పించుకున్నారట. ట్రంప్ కు బాగా దగ్గరయినవారి నుంచి గతంలో ఆయన వ్యక్తిగత సలహాదారులుగా పనిచేసి మానేసినవారు, ప్రసంగాలు తయారు చేసి ఇప్పుడు మానేసిన వారి నుంచి ట్రంప్ సమాచారం హిల్లరీ తరుపువాళ్లు తెప్పించారట. ట్రంప్ వాగ్దాటి ఎలా ఉంటుందో ఇప్పటికే తెలిసిందే. ఒక అంశం నుంచి మరో అంశంలోకి ఆయన అప్పటికప్పుడు ఇష్టమొచ్చినట్లుగా వివాదాస్పదంగా మాట్లాడగలడు.. అలాగే వివాదంలోకి నెట్టగలడు. ఈ నేపథ్యంలోనే హిల్లరీ ఈ విషయంలో పలు జాగ్రత్తలే పాటిస్తున్నారంట. గతంలో ఆమె జరిపిన ప్రచారానికి, ప్రసంగాలకు పూర్తి భిన్నమైన వ్యూహంతో హిల్లరీ ఈ ముఖాముఖి ద్వారా ముందుకు వెళుతోందని అక్కడి మీడియా చెబుతోంది. పిలిప్పీ రైన్స్ చాలా కాలంగా ట్రంప్ ప్రసంగ పాఠాలు రూపొందిస్తున్నాడు. కొన్ని గంటలపాటు ట్రంప్, హిల్లరీ మధ్య చర్చ జరగనున్న నేపథ్యంలోనే అందుకు తగ్గ వ్యూహాలనే భారీగా సిద్ధం చేస్తున్నారంట. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత వారిద్దరి మధ్య ఈ చర్చాగోష్ఠి జరగనుంది. ఇలాంటి చర్చాగోష్ఠిలు మొత్తం మూడు ఉంటాయి. ఇప్పటికే గెలవడానికి ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయనీ, ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందని వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. -
ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల మహాధర్నా
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా నుద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షుడు కోడిరెక్క కోటిరత్నం మాట్లాడుతూ గత మూడేళ్ళుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారన్నారు. చదువుకు, హోదాకు తగ్గ వేతనం ఇవ్వాలని, ఈపిఎఫ్ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ప్రతినెలా ఒకటో తేదీకల్లావేతనాలు ఇవ్వాలని, హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని, ప్రస్తుతం ధరలు పెరిగిన దష్ట్యా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, స్టాఫ్‌నర్సులు, కౌన్సిలర్లు, డేటా మేనేజర్లు, కేర్ కో ఆర్డినేటర్లు, తదితరులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. మహాధర్నాలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతుల వీరాస్వామి, జిల్లా సెక్రటరీ శ్రీనివాసరావు, మహిళా విభాగం కన్వీనర్ స్వర్ణలత, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ మండలి ప్రాజెక్ట్ మేనేజర్ లంకపల్లి మధుసూధనరావు, షిప్ అధ్యక్షురాలు రమాదేవి, టీఎన్‌పీ ప్లస్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ కార్యాయంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్‌లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు అందజేశారు. -
ఏపీ శాక్స్ ఉద్యోగులు విధుల బహిష్కరణ
విజయవాడ (లబ్బీపేట) : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగా సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలోని నాలుగు ఏఆర్టీ సెంటర్లతోపాటు 80కి పైగా ఐసీటీసీ, పీపీటీసీటీ సెంటర్లలో సేవలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, అరకొరగానే సేవలు అందడంతో రోగులు ఇబ్బందిపడ్డారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్ నుంచి ఉద్యోగులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సబ్ కలెక్టర్ సృజనను కలిసి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు అపర్ణ, అరుణ, కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము 15 ఏళ్లుగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలిలో వివిధ హోదాల్లో పని చేస్తున్నా, కనీన సదుపాయాలు కల్పించకపోవటం బాధాకరమన్నారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని చెప్పారు. ప్రతీ నెలా సక్రమంగా వేతనాలు సైతం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో టీబీ తదితర వ్యాధులు సోకి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పట్టించుకునే నాథుడే లేరని వాపోయారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలు గుర్తించి ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నామని, నేడు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన వచ్చిందని తెలిపారు. యూనియన్ ప్రచార కార్యదర్శి కె.వరప్రసాద్, నాయకులు మందా రవి, మేరుగు అనిల్, భాస్కరరావు, సౌజన్య, డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ఉద్యమబాట
–ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా –నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన తాడేపల్లిగూడెం: హెచ్ఐవీ, ఎయిడ్స్, క్షయ బాధితులకు ఎనలేని సేవలందిస్తున్న ఉద్యోగుల జీవితాల్లో మాత్రం వెలుగు కనిపించడం లేదు. శ్రమకు తగిన ఫలితం ఉండటం లేదు. చాలీచాలని వేతనాలు, హామీలకే పరిమితమైన ఇంక్రిమెంట్లు, మూడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కనికరం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్). దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఏఆర్టీ సెంటర్, వలంటరీ కౌన్సెలింగ్ టెస్టింగ్ సెంటర్లలో పనిచేస్తున్న 1,250 మంది ఉద్యోగులు సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని నాలుగు ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు ధర్నాకు దిగుతున్నారు. జిల్లాలో నాలుగు సెంటర్లు.. 100 మంది ఉద్యోగులు జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఏలూరులోని ఏఆర్టీ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా, డాటా మేనేజర్లుగా, స్టాఫ్‌నర్సులుగా, ల్యాబ్‌టెక్నీషియన్లుగా, ఫార్మాసిస్టులుగా, కేర్ కో ఆర్డినేటర్లుగా 100 మంది పనిచేస్తున్నారు. వీరిని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులుగా నియమించింది. అర్హత, అనుభవం, కేడర్‌ను బట్టి నెలకు రూ.6 వేల నుంచి రూ.46 వేల వరకు వేతనం అందిస్తున్నారు. వేతన ఒప్పందం ప్రకారం ఏటా రూ.1,250 పెంచాలి. అయితే 2013 నుంచి వేతన పెంపుదలతో ఏపీ సాక్ తాత్సారం చేస్తోంది. చివరకు 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత బకాయిలు మినహా, ఈ ఏడాదికి 2.5 శాతం అంటే రూ.750 వేతనం పెంచుతానని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. డిమాండ్లు ఇవి –ఏఆర్టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. –ఐదేళ్లు తర్వాత ఇచ్చిన వార్షిక ఇంక్రిమెంటును 20 శాతంగా, రూ.2,500 నుంచి రూ.3,000 రూపాయలు ఇవ్వాలి. –నాకో జారీచేసిన ఆర్డర్ ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన స్థిరీకరణ చేయాలి. –ఏడో పీఆర్సీ ప్రకారం ఉద్యోగులందరికీ వర్తింపచేయాలి. –వేతన నిర్ణయంలో విద్యార్హతలు, సీనియారిటీ పరిగణనలోకి తీసుకోవాలి. –ఎయిడ్స్ కంట్రోల్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో విలీనం చేయాలి. –ఉద్యోగులకు ఆరోగ్య పాలసీ అమలుచేయాలి. –ఆరోగ్య బీమా, గ్రూప్ ఇన్సూ్యరెన్సు అమలుచేయాలి. –సమాన పనికి సమాన వేతనం అందించాలి. –హెచ్ఆర్ పాలసీ అమలుచేయాలి. మూడేళ్లుగా పరిష్కారం లేదు ఏపీ సాక్‌లో పనిచేసే ఉద్యోగులకు మూడేళ్లుగా ఇస్తానన్న ఇంక్రిమెంట్లు ఇవ్వడంలేదు. ఏఆర్టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు క్షయ వంటి వ్యాధులు సోకి మరణిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. దీంతో జాతీయ యూనియన్ పిలుపుమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో పనిచేసే 1,250 మంది ధర్నాలో పాల్గొననున్నారు. –సీహెచ్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్ -
ఎయిడ్స్ నివారణకు 'మ్యాజిక్' డ్రగ్!
న్యూయార్క్: ఎయిడ్స్ వ్యాధి నివారణకు అమెరికా పరిశోధకులు 'మ్యాజిక్' డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. వ్యాధి కారక హ్యూమన్ ఇమ్యునో వైరస్(హెచ్ఐవీ).. నోరు, యోని ద్వారా వ్యాపించకుండా ఈ కొత్త మందు సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రీ క్లినికల్ పరిశోధనల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది హెచ్ఐవీ కలిగిన మహిళలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. సరైన చికిత్స లేని కారణంగా వీరిలో 45 శాతం మంది తమ పిల్లలకు తల్లిపాల ద్వారా వైరస్‌ను సంక్రమింపజేస్తున్నారు. కొత్త ఔషధం.. 4-ఇథినిల్-2-ఫ్లోరో-2'డిఆక్సియాడినోసైన్(ఈఎఫ్‌డీఏ) ద్వారా ఈ రకమైన సంక్రమణను సమర్థవంతంగా అరికట్టొచ్చని భావిస్తున్నారు. ఇక మహిళల్లో లైంగిక చర్య ద్వారా జరిగే సంక్రమణను కూడా ఇది అరికడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధన ఫలితాలను 'యాంటీమైక్రోబయల్ కీమోథెరపి' జర్నల్‌లో ప్రచురించారు. హెచ్ఐవీ వ్యాప్తి నివారణలో ఈఎఫ్‌డీఏ కీలకంగా పనిచేస్తుందని నార్త్ కరోలినా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిలా వహెల్ తెలిపారు. -
మళ్లీ పులిరాజ పంజా
రాష్ట్రంలో రోజూ 100 మందికి హెచ్ఐవీ పాజిటివ్! - గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదు - ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్టు నిర్ధారణ - చాపకింద నీరులా విస్తరిస్తోన్న వ్యాధి గడిచిన 12 నెలల్లో హెచ్ఐవీ టెస్టులు చేసింది 7.94 లక్షల మందికి హెచ్ఐవీ సోకినవారి సంఖ్య 23,960 హెచ్ఐవీ సోకిన గర్భిణులసంఖ్య 996 సాక్షి, హైదరాబాద్ : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఒకప్పుడు అన్ని టీవీ చానళ్లలో, రోడ్లపక్కన హోర్డింగ్లపైన, పత్రికల్లో భారీ ప్రకటనలు హోరెత్తిన విషయం గుర్తుంది కదూ! హెచ్ఐవీపై ప్రజల్ని చైతన్యం చేస్తూ జారీ అయిన అవి అప్పట్లో రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి కూడా. అంతేకాదు.. ఎయిడ్స్ నిరోధం కోసం ప్రభుత్వపరంగా పెద్ద ఎత్తున చర్యలు కొనసాగాయి. నిధుల కేటాయింపూ జరిగింది. మరిప్పుడో.. : పులిరాజా వస్తున్నాడహో.. అంటూ జాగృతపరిచే ప్రకటనలు లేవు. హోర్డింగ్‌లలో ప్రకటనల్లేవు. కరపత్రాల్లేవు.ఆస్పత్రుల్లోనూ వ్యాధి గురించి చెప్పే గోడరాతల్లేవు. కేంద్ర నిధులు చిక్కిపోయాయి. దీంతో ఎయిడ్స్ నివారణ చర్యలు అంతంతమాత్రమయ్యాయి. దీని ఫలితం.. : రాష్ట్రంలో పులిరాజు మళ్లీ విజృంభించాడు. రాష్ట్రంలో హెచ్ఐవీ-ఎయిడ్స్ మరలా జడలు విప్పుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజూ 100మందికిపైనే హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు సాక్షాత్తూ ప్రభుత్వ తాజా సర్వేలోనే వెల్లడవడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ 70వేల నుంచి లక్షమందికి హెచ్ఐవీ టెస్టులు నిర్వహిస్తుంటే 100 నుంచి 125 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలుతోంది. అత్యధికంగా గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉన్నట్టు వెల్లడైంది. ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణవుతోంది. నిధుల్లేక.. మందులు కొనట్లేదు: హెచ్ఐవీ-ఎయిడ్స్ నివారణ చర్యల్లో ప్రధానమైంది పరీక్షలు. తర్వాత మందుల సరఫరా కీలకం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావట్లేదు. ఏడాదికి దాదాపు రూ.80 కోట్ల వరకు రావాల్సివుంటే 2015-16లో వచ్చింది రూ.20 కోట్లే. ఈ ఏడాది ఇవీ ఇంతవరకూ రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఐసీటీసీ)లలో హెచ్ఐవీ బాధితులకు పరీక్షలు నిర్వహిద్దామంటే.. కనీసం సిరంజీలు, సూదులు(నీడిల్స్) లేని పరిస్థితి నెలకొంది. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా ఇవ్వాల్సిన నెవరపిన్ సిరప్లు 9నెలలుగా లేవు. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు డెలివరీ చెయ్యాలంటే కావాల్సిన గ్లౌజ్లుసైతం ప్రభుత్వాసుపత్రుల్లో లేవు. గతంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీశాక్స్) హెచ్ఐవీ బాధితులకు తమ నిధులతో మందులు కొనేది. ఇప్పుడు ఏపీశాక్స్ నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ కొనట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మందులడిగితే.. మీరే కొనుక్కోండని చెబుతున్నారు. దీనివల్ల ప్రధానంగా టెస్ట్ కిట్లు లేక వేలాదిమంది వైద్యపరీక్షలకు దూరమవుతున్నారు. హెచ్ఐవీ ఉన్నా టెస్టులు చేయకపోవడం వల్ల తెలుసుకోలేక జీవితాన్ని కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో హెచ్ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సరైనవిధంగా వైద్యపరీక్షలు జరిగితే హెచ్ఐవీ సోకినవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. రిజిస్టర్లూ లేవు.. సాధారణంగా హెచ్ఐవీ టెస్టు చెయ్యాలంటే రోగినుంచి అనుమతి పత్రం తీసుకున్నాకే పరీక్ష చెయ్యాలి. లేదంటే చెయ్యకూడదు. అయితే అలాంటి కన్సంట్ లెటర్లు తీసుకోవడం లేనేలేదు. అంతేకాదు.. హెచ్ఐవీ సోకిన బాధితుల వివరాలు నమోదుకు రిజిస్టర్లు కూడా లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్ఐవీ నివారణ చర్యలపై మరింత శ్రద్ధ పెడితే మేలు. లేకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. -
ఎయిడ్స్ దంపతుల బహిష్కరణ
కలెక్టర్‌కు ఫిర్యాదు టీనగర్: ఇంటి స్థలం ఇవ్వాలని ఆజ్ఞాపించినా తమకు గ్రామ నిర్వాహక అధికారి ఆ దిశ గా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ చెంగల్పట్టు సమీపంలోని ఎయిడ్స్ బాధిత దంపతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెంగల్పట్టు సమీపంలోని తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న రాధాకన్నన్( 45), కాంత( 40) లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా తనకు ఎయిడ్స్ సోకిందనే విషయాన్ని పక్కన బెట్టి 20 ఏళ్ల క్రితం కాంతను ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు. దీంతో కాంతకు ఎయిడ్స్ సంక్రమించింది. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు మృతిచెందడంతో బాధితురాలు ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తూ వచ్చింది. ఈమెకు అదే సంస్థలో పనిచేస్తున్న రాధాకన్నన్తో మరలా వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె ఐదవ తరగతి, చిన్న కుమార్తె మూడవ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో రాధాకన్నన్ తన కుటుంబంతో ఏడేళ్ల క్రితం చెంగల్పట్టు తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఒక పొరంబోకు స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తూ వచ్చారు. వీరిని పంచాయితీ అధ్యక్షుడు, గ్రామ ప్రజలు ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. వీరి ఇంటికి మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై రాధాకన్నన్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తర్వాత రాధాకన్నన్ తనకు, భార్యకు ఎయిడ్స్ ఉన్నందున నివసిస్తున్న స్థలానికి పట్టా ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో న్యాయవాది పట్టా అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అయితే గ్రామ నిర్వాహక అధికారి ఆ స్థలం వైద్య కళాశాలకు సొంతమని తెలిపి నిరాకరించారు. దీంతో ఆయన కాంచీపురం జిల్లా కలెక్టర్ గజలక్ష్మిని కలిసి పిటిషన్ అందజేశారు. దీని గురించి కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. -
హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు
లండన్: వేల్స్ యువరాజు హ్యారీ హెచ్ఐవీ పరీక్షలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా లండన్ లోని జెయింట్ థామస్ హాస్పిటల్‌కు వెళ్లారు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్నారు. అయితే టెస్ట్ చేయించుకున్న విషయాన్ని వీడియో తీయించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే యువరాజు ఎయిడ్స్ పై అవగాహనా కల్పించేందుకు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్న వీడియో వైరల్ అయింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం చాలా సులువుగా ఉంటుందని, ఈ విషయంపై అవగాహనా పెంచేందుకు తాను ఈ పని చేసినట్లు వేల్స్ యువరాజు హ్యారీ వెల్లడించారు. వచ్చే బుధవారం డర్బన్ లో జరగనున్న అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో తాను పాల్గొనునున్నట్లు ట్వీట్ చేశారు. హెచ్ఐవీ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, ఆడా, మగా, వృద్దులు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ హెచ్ఐవీ టెస్ట్ చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ టెస్టులు చేయించుకోవడం చాలా సులువు అని ట్వీట్ చేశారు. హెచ్ఐవీపై పోరాడేందుకు ప్రిన్స్ హ్యారీ సరైన మార్గాన్ని ఎంచుకున్నారని టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ సీఈవో ఇయాన్ గ్రీన్ పేర్కొన్నారు. Prince Harry has been tested for HIV @GSTTnhs It's a simple finger prick test and gives a nearly instant result! pic.twitter.com/VRr6KyUSD3 — Kensington Palace (@KensingtonRoyal) 14 July 2016 On Wednesday next week Prince Harry will arrive in Durban for the International AIDS Conference #AIDS2016 — Kensington Palace (@KensingtonRoyal) 14 July 2016 -
విజృంభిస్తున్న ఎయిడ్స్
* జిల్లాలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు * ఇప్పటివరకు మొత్తం 3,012 మంది మృత్యువాత * అవగాహన కార్యక్రమాలు అంతంతమాత్రమే * బాధితులకు పింఛన్లు అందని వైనం సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ రోగాలున్న వంద మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఆరుగురికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు. అవగాహన లోపం, ఆరోగ్యంపై అశ్రద్ధతోనే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో హెచ్ఐవీ సోకి ఇప్పటి వరకు 3,012 మంది చనిపోయారు. వీరిలో అధిక శాతం 40 లోపు వయసు వారు ఉండటం గమనార్హం. పలు వ్యాపారాలకు చిత్తూరు జిల్లా అనుకూలంగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం కూడా ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్యుతు చెబుతున్నారు. జిల్లాలో ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 324 అభంశుభంతెలియని పిల్లలు దీని బారిన పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. రెండేళ్లనుంచి నిధులు నిల్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం నామమాత్రపు కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. ప్రధాన కూడళ్లలో ఎయిడ్స్ నియంత్రణపై సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఐసీటీసీ అండ్ డీఆర్పీసీయూ కేంద్రాలకు అరకొర నిధులిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రతినెలా ఖర్చుల నిమిత్తం రూ.18,000 ఈ సెంటర్లకు విడుదల చేయాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడం లేదు. దీంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తమకు జీతాలే సరిగా రావడం లేదని ఇంకా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపట్టుతామని ప్రశ్నిస్తున్నారు. పింఛన్లకు దూరం జిల్లాలో సుమారుగా 17,326 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది అధికారికంగా ఏఆర్టీ కేంద్రాల్లో నమోదైన సంఖ్య. వీరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరందరికి పింఛన్లు మంజూరు చేస్తోంది. అయితే గత మూడేళ్లలో పింఛన్ తీసుకున్న వారు ఐదు శాతం కంటే తక్కువే. సమాజం తమను చులకనగా చూస్తుందని రోగులు కూడా పింఛన్లకు దూరంగా ఉంటున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో హెచ్ఐవీ బాధితులకు అందుతున్న పింఛన్లు.. 2013 ఏప్రిల్ వరకు 1,300 2014ఏప్రిల్ వరకు 2,144 2015 ఏప్రిల్ వరకు 2,215 అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం ఎయిడ్స్నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు చెబుతాం. దీనిపై జిల్లా వ్యా ప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ఇలాంటి వ్యాధులను అరికట్టలేం. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, చిత్తూరు -
30 ఏళ్ల క్రితం దేశం షాక్ తిన్నది!
సరిగ్గా 36 ఏళ్ల కిందట 1986 జూన్ నెలలో ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లోకి సైతం అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ ప్రవేశించిందని వెల్లడికావడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. మహిళా డాక్టర్ అయిన సునీతి సోలోమన్ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా కనుగొని దేశమంతటా కలకలం రేపారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిగా ఉన్న ఆమె ఓ పరిశోధక ప్రాజెక్టులో భాగంగా 100 మంది సెక్స్ వర్కర్లను పరీక్షించారు. మద్రాస్‌లోని ఓ చిన్న ప్రాథమిక ల్యాబ్‌లో ఆమె నిర్వహించిన పరీక్షలు మున్ముందు దేశానికి వైద్యపరంగా పెను సవాలు విసురుతాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. డాక్టర్ సునీతి 100 మంది సెక్స్‌వర్కర్లను పరీక్షించగా అందులో ఆరుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. హెచ్ఐవీ వైరస్ భారత్‌లోకి ప్రవేశించిందని తెలియడం అదే తొలిసారి. ఈ పరీక్షలే మున్ముందు దేశానికి ఎదురవుతున్న పెను వైద్య సవాల్‌ను వెల్లడించడమే కాకుండా.. ఇందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటాయి. షాక్ గురయ్యారు! 'పరీక్షల్లో ఏదో వెల్లడి అవుతుందని అనుకోవద్దని ఆమె ముందే తన నేతృత్వంలోని పరిశోధక విద్యార్థులకు చెప్పారు. తమ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పూర్తిగా నెగిటివ్ ఫలితాలు వస్తాయని ఆమె ఆశించారు. కానీ పాజిటివ్ ఫలితాలు రావడం ఆమెను షాక్‌కు గురిచేసింది' అని డాక్టర్ సునీతి తనయుడు డాక్టర్ సునీల్ సోలోమన్ గుర్తుచేసుకున్నారు. 'ప్రభుత్వం ఈ పరీక్షల ఫలితాలను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. పాశ్చాత్య దేశాల కన్న ఉన్నత సంప్రదాయాలు అనుసరించే భారత్ వంటి దేశంలో ఇలాంటి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదని అప్పట్లో ప్రభుత్వం భావించింది. కానీ పరీక్ష నమూనాలను వాషింగ్టన్ పంపి.. అక్కడ కూడా పాజిటివ్‌గానే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది' అని సునీల్ తెలిపారు. ఇప్పటికీ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి ముప్పు భారత్‌ను వేధిస్తూనే ఉంది. సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం వంటి అవసరాన్ని, లైంగిక విద్య ఆవశ్యకతను ఇది చాటుతోంది. -
భారత్‌లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్?
న్యూఢిల్లీ: భారత్‌లో రక్తమార్పిడి కారణంగా గత 17 నెలల కాలంలో 2,234 మందికి ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీఓ) బుధవారం నాడు ప్రకటించింది. రక్తదానం తీసుకునే ముందు దాతలకు ఎయిడ్స్ ఉందా, లేదా? అన్న విషయంలో సమగ్ర పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చెప్పుకుంటున్న దేశంలో ఇంత మందికి రక్తం ఎక్కించడం ద్వారా ఎయిడ్స్ మహమ్మారి సంక్రమించడం నిజంగా షాకింగ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలా జరగడం లేదు. మరి మన దగ్గర ఎక్కడ పొరపాటు జరుగుతోంది. రక్తం తీసుకోవడంలో బ్లడ్ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయా, ఎలాంటి పరీక్షలు లేకుండానే వైద్యులు రక్తమార్పిడి చర్యలకు ఒడిగడుతున్నారా. ధనదాహం కోసం కొన్ని బ్లడ్ బ్యాంకులు కక్కుర్తి పడుతున్నాయా? టెక్నీషియన్లకు సాంకేతిక పరిజ్ఞానం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. భారత్‌లో అమలు చేస్తున్న రక్త విధానం నుంచి అన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి. వీటిని అరికట్టనంతకాలం అమాయకులు ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు. వాస్తవానికి ఎయిడ్స్ సోకిన రెండు, మూడు రోజుల్లో రోగి రక్తంలో ఎయిడ్స్ ఉన్న విషయాన్ని కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. ఎయిడ్స్ సోకిన వారం రోజుల్లో ఎయిడ్స్‌ను గుర్తించే రక్త పరీక్షలు ప్రపంచంతోపాటు భారత్‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పరీక్షకు అయ్యే ఖర్చు దష్ట్యా భారత్‌లో ఎక్కడ కూడా ఎయిడ్స్‌ను త్వరగా కనుగొనే ఈ పరీక్షను ఉపయోగించడం లేదు. వారం రోజుల్లో ఎయిడ్స్‌ను కనుగొనేందుకు ‘న్యూక్లిక్ ఆసిడ్ ఆంప్లికేషన్ టెస్ట్’ను నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓ యూనిట్ రక్తం ధర 2000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు పెరుగుతుంది. భారత్‌లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఒక యూనిట్ రక్తాన్ని రూ. 1050, ప్రైవేట్ బ్యాంకులు రూ.1450కి మించి అమ్మకూడదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిమితి విధించింది. ప్రస్తుతం భారత్‌లో ‘ఎంజైమ్ లింకిడ్ ఇమ్యునోసార్బెంట్ ఆస్సే (ఈఎల్ఐఎస్ఏ)’ పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులోనూ నాలుగోతరం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల ఎయిడ్స్ సోకిన మూడు వారాల్లో గుర్తించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ఒక్క కర్ణాటక ప్రభుత్వం మినహా దేశంలో ఎక్కడా ఉపయోగించడం లేదు. త్వరలోనే ఈ విధానాన్ని తాము కూడా అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడోతరం టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎయిడ్స్ సోకిన నాలుగు వారాల తర్వాతనే రోగాన్ని గుర్తించగలం. కెనడాలో రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకిన సంఘటన 1985 నుంచి ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అమెరికాలో 2008 తర్వాత నమోదు కాలేదు. బ్రిటన్‌లో 2005లోనే ఆఖరి కేసు నమోదైంది. ఎయిడ్స్ సోకిన రెండు, మూడు రోజుల్లో రోగాన్ని కనుగొనే టెక్నాలజీయే ప్రపంచంలో లేనప్పుడు మరి ఆ దేశాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. ఆయా దేశాల్లో, ముఖ్యంగా కెనడాలో దాత నుంచి రక్తం తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. ముందు రోగికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇటీవల ఏమైన అస్వస్థతకు గురయ్యారా, లేదా? తెలుసుకుంటారు. లైంగిక సంబంధాల గురించి క్షుణ్నంగా వాకబు చేస్తారు. వారు చెప్పినవన్నీ నిజాలేనని నిర్ధారించుకొని కూడా అఫిడవిట్ మీద సంతకం తీసుకుంటారు. అబద్ధం చెబితే శిక్షార్హులవుతారు. ఆ తర్వాతే దాత నుంచి రక్తం తీసుకుంటారు. మన దేశంలో పేరు, ఊరు, చిరునామా కలిగిన పత్రాలను కూడా సరిగ్గా రాయించుకోరు. మన దేశంలో ఎయిడ్స్, హెపటైటీస్ లాంటివి అరికట్టడం కోసం సుప్రీం కోర్టు ‘ప్రోఫెషనల్ డోనర్స్’ను నిషేధించినా లాభాల కోసం బ్లడ్ బ్యాంకులు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. మరీ అత్యవసర పరిస్థితులోతప్ప రక్తమార్పిడిని అనుమతించవద్దని వివిధ దేశాల్లో చట్టాలున్నాయి. మన దగ్గర అలాంటివి లేవు. సమగ్ర రక్త విధానమే లేదు. -
రక్తమార్పిడితో 2234 మందికి హెచ్ఐవీ!
అత్యవసర పరిస్థితిలో రక్తమార్పిడి చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. బ్లడ్‌బ్యాంకులలో రక్తాన్ని క్షుణ్ణంగా, అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే దాన్ని రోగులకు ఇస్తారు. కానీ.. రక్తమార్పిడి కారణంగానే మన దేశంలో 2234 మందికి హెచ్ఐవీ సోకింది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యలో రక్తం తీసుకుని, హెచ్ఐవీ బారిన పడినవాళ్ల సంఖ్య ఇది. ఈ విషయం సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. చేతన్ కొఠారీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. చాలావరకు బ్లడ్‌బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దానివల్లే ప్రజలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఇటీవల వెల్లడైన ఓ నివేదికలో కూడా తెలిపారు. 2014 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని బ్లడ్‌బ్యాంకులు సేకరించాయి. వాటిలో 84 శాతం మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అయితే, ఈ రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే 2వేల మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. అత్యధికంగా యూపీలో 361 మంది, తర్వాత గుజరాత్లో 292 మందికి ఈ వ్యాధి సోకింది. సేకరించిన రక్తాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు తప్పనిసరిగా హెచ్ఐవీ, హెచ్‌బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులు ఉన్నాయేమో పరీక్షించాలి. అయితే, హెచ్ఐవీ సోకిన 3 నెలల వరకు అది రక్తపరీక్షలో కూడా బయటపడదు. దీన్ని విండో పీరియడ్ అంటారు. అలాంటి సందర్భాల్లోనే చాలావరకు రక్తగ్రహీతలకు హెచ్ఐవీ సోకుతుందని నిపుణులు అంటున్నారు. -
బ్యాంకు ఖాతాలకే ‘ఆసరా’ పెన్షన్
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఆసరా పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ మంజూరైన తర్వాత కూడా ఆంధ్రా బ్యాంక్ ఇచ్చే ప్రీపెయిడ్ కార్డుల కోసం వారంతా కనీసం నెలరోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇకపై జాప్యం జరగకుండా పెన్షన్ అందుకునేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ఏర్పాట్లు చేశారు. యాంటీ రిట్రోవియల్ ట్రీట్మెంట్ (ఏఆర్టీ) కేంద్రాల్లో వారి బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను సమర్పిస్తే చాలని అధికారులు స్పష్టం చేశారు. -
విషమే విరుగుడు!
ఎయిడ్స్‌కు హోమియో మందు ‘క్రొటాలస్.హరిడస్’ ఔషధంతో హెచ్ఐవీని నిర్మూలించవచ్చని గుర్తించిన ఆయుష్ వైద్యులు పాము విషంతో తయారీ.. వైరల్ ఇన్ఫెక్షన్లలో వినియోగం ఔషధం సామర్థ్యాన్ని నిర్ధారించిన ఐఐసీటీ హైదరాబాద్ లో 3,900 మందిపై క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకంగా ఫలితాలు.. మరో రెండేళ్లు ప్రయోగాలు సాక్షి, హైదరాబాద్: వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ‘క్రొటాలస్.హరిడస్’ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుందని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఒక రకమైన పాము విషంతో తయారుచేసే ఈ మందు... హెచ్ఐవీ వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనలో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. అంతేకాదు ఈ ‘క్రొటాలస్.హరిడస్’ మందు పనితీరును పూర్తిస్థాయిలో తేల్చేం దుకు 3,900 మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ హోమియో మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని ఆయుష్ వర్గాలు వెల్లడించాయి. 13 మందిలో హెచ్ఐవీ వైరస్ శూన్య స్థితికి వచ్చిందని, ఇద్దరిలో ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపాయి. పాము విషం నుంచి.. ప్రస్తుతమున్న హోమియో మందులు ఎయిడ్స్ నియంత్రణలో 60-70 శాతం మాత్రమే ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం నియంత్రణ చేయగలిగే ఔషధం కోసం ఆయుష్ అధికారులు పరిశోధన చేశారు. ఎబోలా వైరస్ విజృంభణ సమయంలో దాని నియంత్రణకు ‘క్రొటాలస్.హరిడస్’ ఔషధాన్ని వినియోగించినట్లుగా గుర్తించారు. బ్రెజిల్లో ఉండే ఒక రకమైన పాము విషంతో తయారయ్యే ఈ హోమియో మందును ఇప్పటికే అధిక కామెర్లు, పక్షవాతం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ఎబోలా వైరస్‌కు సరిసమాన లక్షణాలున్న హెచ్ఐవీ వైరస్‌పై ఈ ఔషధం పనిచేయగలదని భావించి పరిశోధన చేపట్టారు. దీనిపై ఐఐసీటీని సంప్రదించారు. అక్కడి శాస్త్రవేత్తలు ఈ మందును ప్రయోగాత్మకంగా పరీక్షించి... అది హెచ్ఐవీ వైరస్‌పై పనిచేస్తుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆరు నెలలుగా క్లినికల్ ట్రయల్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ సహాయంతో ఎయిడ్స్ వ్యాధి శరీరంలో విస్తరిస్తుంది. దీనిని ‘క్రొటాలస్.హరిడస్’ నియంత్రిస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. గతేడాది జూన్ నుంచి 3,900 మందిపై ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. వారిని నాలుగు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులో ఏ మందులూ వాడనివారు, రెండో గ్రూపులో అల్లోపతి వైద్యం తీసుకునేవారు, మూడో గ్రూపులో వైరల్ లోడ్ ఎక్కువగా ఉండి సీడీ-4 కౌంట్ తక్కువగా ఉన్నవారు, నాలుగో గ్రూపులో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నా ఇతర లక్షణాలు లేనివారిని చేర్చారు. మొత్తంగా 2,200 మందికి ప్రస్తుతం ఎయిడ్స్ నియంత్రణకు అందుబాటులో ఉన్న మందులు ఇస్తూనే... ‘క్రొటాలస్.హరిడస్’నూ ఇస్తున్నారు. మిగతా వారికి కేవలం ‘క్రొటాలస్.హరిడస్’ ఔషధాన్ని మాత్రమే ఇస్తున్నారు. వారందరిపైనా ఈ ఔషధాన్ని ప్రయోగిస్తున్నారు. ఆరు నెలలుగా జరుగుతున్న ఈ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని... బాధితుల్లో సీడీ-4 కౌంట్ పెరుగుతోందని ఆయుష్ అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది ‘‘హోమియో మందుతో ఎయిడ్స్‌ను నయం చేయొచ్చని తెలంగాణ ఆయుష్ వైద్యులు కనుగొనడం మంచి పరిణామం. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా.. ఈ మందు ఎయిడ్స్/హెచ్ఐవీ చికిత్సకు పనికి వస్తుందన్న విషయంపై అధికారిక ధ్రువీకరణ కావాల్సి ఉంది. తుది ఫలితాలు కోసం వేచిచూస్తున్నాం..’’ - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎయిడ్స్ నియంత్రణ మండలికి నివేదిక ఇచ్చాం ‘‘ఎయిడ్స్/హెచ్ఐవీ నియంత్రణలో ‘క్రొటాలస్.హరిడస్’ పనిచేస్తుందని ఐఐసీటీ పరిశీలనలో వెల్లడైంది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఇది పనిచేసే విధానంపై ఎయిడ్స్ నియంత్రణ మండలికి సమగ్ర నివేదిక ఇచ్చాం. ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ ఇంకా రెండేళ్లు కొనసాగుతాయి..’’ - డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు 3,900 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. క్రొటాలస్.హరిడస్ హోమియో మందు ప్రస్తుతం పక్షవాతం, అధిక కామెర్లు వంటి వాటిని నయం చేయడంలో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఎయిడ్స్ నియంత్రణకు ఉపయోగపడుతుందని ఐఐసీటీ ప్రాథమికంగా నిర్ధారించింది. - డాక్టర్ సువర్ణ ప్రవీణ్‌కుమార్, రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ -
ఎయిడ్స్ పై విజయం సాధించారు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధిని కలిగించే హెచ్ఐవీ వైరస్ నిర్మూలనలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ నుంచి హెచ్ఐవీ వైరస్ ను తొలగించవచ్చునని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త కామెల్ ఖాలిలి తెలిపారు. హెచ్ఐవీ-1 వైరస్ పై చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే యాంటీరిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్న పేషెంట్లు తమ ట్రీట్ మెంట్ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని సూచిస్తున్నారు. జెనీ ఎడిటింగ్ సిస్టమ్ అనే విధానం ద్వారా హెచ్ఐవీ వైరస్ ను అరికట్టవచ్చని వివరించారు. డీఎన్ఏ లోని సీడీ4 టీ కణాల నుంచి హెచ్ఐవీ వైరస్ క్రమక్రమంగా తొలగిపోతుందని తమ పరిశోధనలు కనుగొన్నట్లు పేర్కొన్నారు. జెనీ ఎడిటింగ్ విధానం ప్రారంభించిన తర్వాత ఎయిడ్స్ పేషెంట్లు ఈ ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ పొందుతారు. ఈ విధానం ఏదో నామమాత్రం కాదని పూర్తిగా ప్రభావాన్ని చూపుతుందని పేషెంట్లు మళ్లీ ఈ వ్యాధి భారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్త కమెల్ ఖలిలి తెలిపారు. -
అక్కడ కండోమ్ యాడ్‌పై నిషేధం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఎయిడ్స్ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడటంపై ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయి. తాజాగా కండోమ్ వాణిజ్య ప్రకటనపై నిషేధం విధించడం ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది పాకిస్థాన్ దినపత్రిక ఒకటి తెలిపింది. 'ఎయిడ్స్ గురించి మాట్లాడుదాం' అంటూ ద న్యూస్ ఇంటర్నేషనల్ దినపత్రిక ఒక సంపాదకీయం రాసింది. ఎయిడ్స్ సమస్య గురించి చర్చించడంలో పాకిస్థాన్ ఎప్పుడు సరిగ్గా వ్యవహరించడంలేదని, తాజాగా కండోమ్ యాడ్‌పై విధించిన నిషేధం.. కీలకమైన ఈ సమస్య పరిష్కారానికి నిరాకరిస్తున్న వైనాన్ని చాటుతున్నదని ఆ పత్రిక పేర్కొంది. 'పాకిస్థాన్‌లో ఎయిడ్స్ సమస్య భారీగానే ఉందని ఒప్పుకోవడానికి సాధారణంగా ఎవరూ ముందుకురావడం లేదు. దేశ జనాభాలో 0.1శాతం మంది పెద్దలకు ఈ వ్యాధి సోకినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 97వేలమంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు ప్రభుత్వం, యూనిసెఫ్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి' అని పత్రిక వివరించింది. మాదక ద్రవ్యాలు ఇంజెక్ట్ చేసుకునే వర్గాలు, సెక్స్ వర్కర్లు, దూరప్రాంతాలకు వెళ్లే ట్రక్కు డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. -
కండోమ్‌ల కొరత.. విస్తరిస్తున్న హెచ్ఐవి
'ఎయిడ్స్‌కు చికిత్స లేదు.. నివారణ మాత్రమే' అని ప్రభుత్వం అనేక నినాదాలు వినిపిస్తూ ఉటుంది. హెచ్ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉచితంగా కండోమ్‌లు పంచిపెడుతుంది. కానీ, కర్ణాటకలో, ముఖ్యంగా రామనగరం, ఉడిపి, హసన్ జిల్లాలలో కండోమ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటోందని ఓ పరిశీలనలో తేలింది. సగటున ఒక సెక్స్ వర్కర్‌కు 12-30 నిమిషాలకు ఓ కండోమ్ అందుబాటులో ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశిస్తోంది. సాధారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల కోసం నెలకు దాదాపు 26-30 లక్షల కండోమ్‌లు సరఫరా చేస్తుంది. కానీ, డిసెంబర్ నెలకు అందుబాటులో ఉన్న స్టాకు కేవలం 6.9 లక్షలు మాత్రమే. కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని సెక్స్ వర్కర్లకు కండోమ్‌లను సరఫరా చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే కొరత ఉందన్న విషయాన్ని సంబంధిత పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్జీ రాఘవేంద్ర మాత్రం అంగీకరించడం లేదు. త్వరలోనే మరిన్ని స్టాకులు వస్తాయని, సమస్య ఏమీ లేదని చెబుతున్నారు. దేశంలోనే హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. ఇక్కడ దాదాపు 87వేల మంది సెక్స్ వర్కర్లున్నట్లు ప్రభుత్వమే లెక్కలు తేల్చింది. ఎయిడ్స్ వ్యాపించకుండా చూసేందుకు తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే.. ఇలా కండోమ్‌లకు కొరత వస్తే వాళ్ల జీవితాలపై ప్రభావం పడుతుందని, తర్వాత చికిత్సకు అయ్యే ఖర్చుల వల్ల వాళ్ల ఆర్థిక స్థితి కూడా దారుణంగా దెబ్బతింటుందని ఎన్జీవోల ప్రతినిధులు చెబుతున్నారు. గడిచిన పదేళ్లుగా చేసిన కృషి అంతా ఈ ఒక్క కారణం వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందని కర్ణాటక సెక్స్ వర్కర్ల సంఘం ప్రధాన కార్యదర్శి భారతి అంటున్నారు. -
వడిగా.. ఎయిడ్స్ అంతం దిశగా..
సందర్భం ఎయిడ్స్... ప్రపంచ మానవ ఇతిహాసంలో, చరిత్రకు అందిన మేరకు ఏ ఒక్క అంశమూ కలిగిం చని పెనువిషాదాన్నీ, విల య విధ్వంసాన్నీ సృష్టిం చింది, సృష్టిస్తోంది. 1981 జూన్‌లో అమెరికాలో ఎయిడ్స్ వ్యాధి బయటప డింది. గడచిన 34 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మందికిపైగా ఎయిడ్స్ వ్యాధిని కల గజేసే హెచ్ఐవీ క్రిమిసోకింది. నాలుగు కోట్లకు మిం చి వ్యాధిగ్రస్తులను బలితీసుకొంది. 2015 జూన్ అం చనాల ప్రకారం 3 కోట్ల 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధలు పడుతున్నారు. ఎయిడ్స్ తన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపని మానవ జీవన పార్శ్వం లేదు. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశాలు అనేకం అన్ని రకాలుగా కునారిల్లిపోయినా, ధనిక దేశాలలో దాదాపు అంతరించి పోయిన క్షయవంటి వ్యాధులు మళ్లీ తలెత్తినా, కుటుంబ విలువలూ- సామాజిక కట్టుబాట్లతో ఉండే భారతదేశం హెచ్ఐవీ వ్యాధి గ్రస్తుల సంఖ్యలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉండి మనకు తలవంపులు తెచ్చినా; వైద్యరంగంలో కొత్త మందులు రూపొందించి, మార్కెట్లో ప్రవేశ పెట్టడానికి అయ్యే కాలవ్యవధి దశాబ్దాల నుండి రెండు మూడేళ్లకే తగ్గిపోయినా... అవన్నీ ఎయిడ్స్ బహుముఖ ప్రభావాలే. ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ పోరాట సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’ మార్గనిర్దేశనంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలూ, ప్రజలూ, మీడియా, స్వచ్ఛం ద సంస్థలూ, వైద్యులూ తీరైన రీతిలో స్పందించి ఎయిడ్స్‌ను చాలావరకూ అదుపులోకి తెచ్చారు. 2015 కల్లా 1 కోటి 50 లక్షల మందికి ఎయిడ్స్ ఔషధాలు అందించాలన్న లక్ష్యాన్ని అధిగమించి నేడు 1 కోటీ 58 లక్షల మందికి చేరువ చేశారు. 2015 ఎయిడ్స్ డే డిసెంబర్ 1ని ‘వడిగా, ఎయిడ్స్ అంతం దిశగా’ నినాదంతో నిర్వహిస్తు న్నారు. 2020 నాటికి క్రిమిసోకిన వారిలో 90 శాతం మందికి ఔషధాలు అందజేయాలనీ, వీరిపట్ల చుల కన భావాలను పూర్తిగా తొలగించాలనీ యూఎన్ ఎయిడ్స్ లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. తెలుగువారికి పొంచివున్న ముప్పు ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధా నంగా సెక్సు ద్వారా వ్యాపిస్తుంది. కొంత మేరకు వ్యాధిగ్రస్తులైన స్త్రీలకు కడుపులోని బిడ్డకూ, చను బాల ద్వారానూ, ఇంజెక్షన్లు, రక్తం ద్వారా వ్యాపి స్తుంది. భారత్‌లో 2011 డిసెంబర్‌కు 24 లక్షల మం ది, 2013 చివరి నాటికి 21 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమి తి సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’కు అందచేసిన నివేది కలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు నమోదైంది. తెలు గు జనాభా దేశంలో దాదాపు 6 శాతం అయితే, భారత్‌లోని హెచ్ఐవీ రోగుల్లో 20 శాతంపైగా తెలుగువారున్నారు. విశాల జనబాహుళ్యంలో హెచ్ఐవీ అంచనాకు కొండగుర్తుగా చూసే గర్భిణులలో హెచ్ఐవీ బిహార్, ఒడిశా, రాజస్థాన్‌లో వంటి రాష్ట్రాలలో వెయ్యికి 3 ఉండగా, తెలుగు వారిలో ఇది వెయ్యికి ఆరుగురు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రపం చంలోని అనేక దేశాలు ఎయిడ్స్ వ్యాధికి సంబంధిం చిన 2014 వివరాలు యూఎన్ ఎయిడ్స్‌కు అందజే సినా, మన దేశం అట్టి వివరాలు క్రోడీకరించకపో వడం భారత్‌లో ఈ వ్యాధి పట్ల నెలకొంటున్న నిర్లిప్త తకు తార్కాణం. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వితరణ సంస్థలు ఎయిడ్స్‌కు నిధుల కేటాయింపు లను తగ్గించాయి. మన దేశంలో ఎయిడ్స్ నిరోధా నికిగాను కండోమ్స్ లభ్యత తగ్గింది. తెలుగు రాష్ట్రా ల్లో హెచ్ఐవీ పరీక్షల టెస్ట్ కిట్స్‌కు కొరత ఏర్పడింది. ఎయిడ్స్ రంగంలో మనం ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితిని దాటడానికి సామాజిక బాధ్యత కలిగిన వారంతా చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. అంతర్జాతీయ, జాతీయ సంస్థల నుండి మనకు తగ్గిన నిధులను తెలుగు ప్రభుత్వాలు భర్తీ చేయాలి. ఈ నిర్లిప్తతను భగ్నం చేయకపోతే దేశా భివృద్ధికి దోహదం చేసే యువశ్రామిక తరంలో చాలామందిని ఎయిడ్స్‌కి బలి ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! (నేడు యూఎన్ ఎయిడ్స్ డే...) - డా॥వై.మురళీకృష్ణ వ్యాసకర్త ఎం.డి., ఎయిడ్స్ కార్యకర్త/ వైద్య నిపుణుడు, కాకినాడ. మొబైల్: 9440677734 -
నెలకు రెండు ఇంజెక్షన్లతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధి నియంత్రణ దిశగా కీలక అడుగు పడింది. సుదీర్ఘకాలం క్రియాశీలంగా ఉండే రెండు ఇంజెక్ట్‌బుల్ ఔషధాలను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి రోగికి ఇవ్వడం వల్ల హెచ్ఐవీకి నిరవధికంగా చెక్ పెట్టవచ్చునని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. హెచ్ఐవీ నిరోధానికి జాన్సన్ అండ్ జాన్సన్, దాని భాగస్వామ్య సంస్థ వీఐఐవీ కలిసి చేపడుతున్న ప్రాథమిక పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ కంపెనీలు చేపడుతున్న మొత్తం 96 వారాల అధ్యయనంలో భాగంగా మొదటి 32 వారాల అధ్యయన ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు చేరో ఔషధంతో హెచ్ఐవీ నిరోధానికి ఈ పరిశోధన నిర్వహిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాధి నిరోధక ఔషధాలు అందించడంలో వీఐఐవీ పేరెన్నికగన్న సంస్థ. ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన అదనపు పరీక్షలు ఇంకా జరుగాల్సింది. అయితే, ఈ ఔషధ కలయిక చికిత్సకు ఆమోదం లభిస్తే.. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధి నిరోధంలో గణనీయమైన ముందడుగు పడినట్టే. పరిశోధనలో భాగంగా 309 హెచ్ఐవీ మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. రక్తంలో హెఐవీ వైరస్‌ను నిరోధించేందుకు రోజువారీ ఔషధ మాత్రలను వీరు గతంలో తీసుకునేవారు. వీరికి ప్రయోగదశలో ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వగా.. దాదాపు 95శాతం మంది రక్తంలోని హెచ్ఐవీ వైరస్‌ను 32 వారాలపాటు నియంత్రించింది. ఔషధమాత్రలు తీసుకునేవారు 91శాతం మందిలో మాత్రమే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యపడింది. మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకునే రెండు గ్రూపుల రోగులకు చికిత్స కొనసాగిస్తూ.. కాలనుగుణంగా వారి రక్తాన్ని పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలిస్తే.. రానున్నకాలంలో కొత్త విధానమే ఆచరణసాధ్యంగా కనిపిస్తున్నదని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన ఎయిడ్స్ చికిత్స నిపుణుడు డాక్టర్ డానియెల్ కురిట్జ్‌కెస్ తెలిపారు. -
రోగ నిరోధకత చికిత్సతో హెచ్ఐవీ నుంచి రక్షణ
ముంబై: అత్యాచార బాధితులకు ఘటన జరిగిన ఎనిమిది గంటల్లోపు రోగనిరోధకత చికిత్స అందిస్తే హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించవచ్చని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడ ప్రకటించారు. సరైన అవగాహన లేకపోవడం, సంబంధిత నిబంధనలు లేకపోవడంతో భారత్‌లాంటి దేశాల్లో బాధితులకు ఇలాంటి చికిత్స అందడంలేదని ఆయన అన్నారు. బాధితులకు చట్టబద్ధంగా అందిస్తున్న చికిత్సలకు తోడుగా పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్(పెప్) చేస్తే వారికి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని ఆయన ఆదివారం ఆయన ముంబైలో పీటీఐతో చెప్పారు. పెప్పై అవగాహన కల్పించేందుకు శనివారం నుంచి ముంబైలో కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 36,735 రేప్ కేసులు నమోదయ్యాయి. -
వామ్మో వీడు మామూలోడు కాదు!
హైదరాబాద్: జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ దొంగ పోలీసుల విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవం వెల్లడించాడు. తనకున్న ప్రమాదకరమైన రోగాన్ని పలువురికి వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. దొంగతనంలో కేసులో జేమ్స్ అనే వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఊహించని విషయాలు వెల్లడయ్యాయ. పగలు ఆటో ఆడుపుతూ, రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. మహిళలను ట్రాప్ చేసి విచ్చలవిడిగా సెక్స్ కార్యకలాపాలు సాగించాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి అతడు ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 300 మంది అమ్మాయిలకు ఎయిడ్స్ వ్యాప్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నానని పోలీసుల విచారణలో తెలిపాడు. ఇప్పటివరకు 150 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్టు తెలుస్తోంది. జేమ్స్ మోసాలను నిర్ధారించే పనిలో పడ్డారు పోలీసులు. -
మద్యం తాగినప్పుడు కలిస్తే..!
సందేహం నేను పిల్లలు పుట్టకుండా కాపర్-టి పెట్టించుకుని వారం రోజులయ్యింది. నేను ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు? - ప్రశాంతి, పెదపూడి సాధారణంగా వేరే ఇతర సమస్య ఏదీ లేనప్పుడు కాపర్-టి వేసిన రోజు నుంచే శృంగారంలో పాల్గొనవచ్చు. కొంతమందికి కాపర్-టి వేసిన తర్వాత ఒకట్రెండు రోజులు కొద్దిగా బ్లీడింగ్ (స్పాటింగ్) కనిపించవచ్చు. అలా కనుక జరిగితే... బ్లీడింగ్ తగ్గేవరకూ ఆగితే మంచిది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కనుక మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటీ బయొటిక్స్ వాడిన తర్వాతే సెక్స్‌లో పాల్గొనాలి. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి నాతో ఆనల్ సెక్స్ చేశాడు. అప్పట్నుంచీ నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఎయిడ్స్ ఉందేమో, నాకూ వచ్చిందేమోనన్న ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాకు ఎయిడ్స్ వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? - విజయ, గోదావరి ఖని ఆనల్ సెక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎయిడ్స్ సోకే అవకాశం ఉంది. ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఆ వైరస్ ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక, రోగ నిరోధక శక్తిని పెంపొందించే కణాలు క్షీణించిపోతాయి. వైరస్ పెరిగిపోతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించాక వ్యాధి లక్షణాలు బయటపడటానికి వారి వారి శరీరతత్వాన్ని బట్టి ఆరు నెలల నుంచి ఐదారేళ్లు పడుతుంది. ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. రక్తపరీక్ష చేస్తే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి మీరు ముందు హెచ్ఐవీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అయినా ఇలా చిన్న వయసులోనే ఎవరితో పడితే వాళ్లతో శారీరకంగా దగ్గరవడం అంత మంచిది కాదు. ఇప్పుడు చూశారుగా ఎంత టెన్షన్ పడాల్సి వస్తోందో! కాబట్టి ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా వయసు 36. నా భర్త మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్నుంచీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. అయితే ఈమధ్య నాకు కోరికలు ఎక్కువవుతున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, ఆ ఆలోచన మానుకో అని కోప్పడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కోరికల్ని చంపేయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి. - రాగిణి, నల్లజర్ల మీ పరిస్థితి నిజంగా ఇబ్బందికరమే. అయితే కోరికలు పెరగడానికి మందులు కనిపెట్టారే తప్ప, తగ్గడానికి ఏవీ కనిపెట్టలేదు. మీ వయసు తక్కువే కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మీ పిల్లల వయసు, మీ ఇంట్లోవాళ్ల సపోర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని, మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడి ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచి మనిషిని ఎంచుకుని వివాహం చేసుకోండి. ఇవేమీ సాధ్యం కానప్పుడు మనసును నియంత్రించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన ఓ హాబీని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టండి. అంతకు మించి పరిష్కారం లేదు. నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - స్వాతి, గుంతకల్లు మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. - డా॥వేనాటి శోభ -
'టూర్‌కి వెళతారా.. ఎయిడ్స్ ఉందో లేదో చెప్పండి'
న్యూఢిల్లీ: ఓ కార్యక్రమానికి సంబంధించి ప్రాణాంతక, ధీర్ఘకాలిక వ్యాధులు లేనట్లుగా మెడికల్ సర్టిఫికెట్లు జతపర్చాల్సిందిగా కేంద్రం ఆయా సీనియర్ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. వచ్చే నవంబర్ 2 నుంచి అదే నెల 30వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడటంతోపాటు రాయగల అనుభవజ్ఞులు, ఆరోగ్యపుష్టి కలవారు అర్హులని పేర్కొంది. దీంతోపాటు వారంతా తమకు ఎయిడ్స్, టీబీ, ట్రకోమా, చర్మవ్యాధులు లేనట్లుగా నిర్ధారించే మెడికల్ సర్టిఫికెట్లు జత చేర్చాలని షరతుగా పెట్టింది. ఇక మహిళలయితే ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సర్టిఫికెట్లు జత చేర్చాలని స్పష్టం చేసింది. దీంతోపాటు వారు ఎందుకు ఆ సదస్సుకు హాజరుకావాలనుకుంటున్నారో, ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వివరంగా పేర్కొనాలని తెలిపింది. ఖర్చులతోపాటు ఈ టూర్ సమయంలో కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆర్థిక, సామాజిక అంశాలపై బ్యాంకాక్ సదస్సులో నెల రోజులపాటు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ శుక్రవారమే ఆఖరు తేది. -
ఎయిడ్స్ చిత్రంలో శ్రీయారెడ్డి
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన చిత్రంలో నటి శ్రీయారెడ్డి నటిస్తున్నారు. ఎయిడ్స్ అవగాహన చిత్రం అనగానే ఇదేదో డాక్యుమెంటరీ చిత్రం అని భావించాల్సిన అవసరం లేదు. అలా అని పక్కా కమర్షియల్గానూ ఉండదు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రంగా ఉంటుం దని చెప్పవచ్చు. కారణం దీనికి దర్శకుడు ప్రియదర్శన్. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలు ధరిస్తున్నారు. దీన్ని ప్రభుదేవా స్టూడియోస్, అమలాపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న థింక్ బిగ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.ఈ చిత్రానికి సిల నేరంగళ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని నటుడు ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సిలనేరంగళ్ చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడు ప్రియదర్శకుడు నెరేట్ చేసినప్పుడే అందులోని డెప్త్ అమేజింగ్ అనిపించింది. కథ చాలా అర్థవంతంగా ఉంది. శ్రీయారెడ్డి పాత్ర హైలెట్‌గా ఉంటుంది. అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అదనపు వివరాలేమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను దర్శక నిర్మాతలు 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారట. చిత్ర కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుందట. ఎయిడ్స్ గురించి సమాజంలో అవగాహన కలిగించడమే సిలనేరంగళ్ చిత్ర ముఖ్య ఉద్దేశం కావడంతో దీన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు లక్ష్యంగా తెరకెక్కిస్తున్నారు. సబుసిరిల్ కళా దర్శకత్వం, సంతోష్ శివన్ చాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. -
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
పటమట : ఎయిడ్స్‌పై అవగాహన అవసరమని మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ రేఖ పేర్కొన్నారు. స్టెల్లా కళాశాలలో బుధవారం అంతర్జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అపరిచితులకు దూరంగా ఉండటంతో పాటు ఆస్పత్రులలో ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడకుండా జాగ్రత్తపడాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ రిబ్బన్ క్లబ్, జాతీయ సేవాదళం ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో యువజనోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు రెడ్ రిబ్బన్ ఆకారంలో మానవహారాన్ని ప్రదర్శించారు. -
పులిరాజా పరీక్షల్లేవు!
⇒ హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగు ⇒ ఆరు నెలలుగా టెస్టింగ్ కిట్లు లేక ఆగిన వైద్యపరీక్షలు ⇒ హెచ్ఐవీ పాజిటివ్ తల్లుల బిడ్డలకు లభించని సిరప్లు ⇒ నెలకు రెండు లక్షలమంది కిట్లు లేక తిరుగుముఖం ⇒ చిన్నాభిన్నమైన ఎన్జీవో వ్యవస్థ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ల దోపిడీ సాక్షి, హైదరాబాద్: జబ్బును బయటకు చెప్పలేరు.. అలాగని లోపలా దాచుకోలేరు.. అలాంటి బాధ అనుభవించే హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగుపడింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి (నాకో) నిధులివ్వలేదన్న కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ ఉందో లేదో నిర్ధారించేందుకు వాడాల్సిన టెస్ట్కిట్లు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో హెచ్ఐవీ పరీక్షలకు వచ్చేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఏపీశాక్స్ను 10వ షెడ్యూల్లో చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ దీన్ని గాలికొదిలేశాయి. దీంతో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల తర్వాత అత్యధిక హెచ్ఐవీ రోగులున్న తెలుగు రాష్ట్రాల్లో నియంత్రణ పూర్తిగా అదుపు తప్పింది. ఈఏడాది నాకోనుంచి రూ.100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐసీటీసీల్లో కిట్లు ఎక్కడ? ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ (ఐసీటీసీ)కు నెలకు రెండు లక్షలమంది సెక్స్ వర్కర్లు, డ్రై వర్లు ఇలా పలు వర్గాలకు చెందినవారు పరీక్షలకోసం వస్తారు. ఇందులో నెలకు కనీసం నాలుగువేల మందికి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 463 ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గత ఫిబ్రవరి నుంచి కిట్లు లేకపోవడంతో వైద్య పరీక్షలు ఆపేశారు. దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల మంది బాధితులు వైద్య పరీక్షలు చేయించుకోకుండా వెనక్కు వెళ్లిపోయారు. గర్భిణుల బిడ్డలకు సిరప్లు ఏవీ? ఎయిడ్స్ నియంత్రణా మండలి లెక్కల ప్రకారం ఈ ఏడాది హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులు నాలుగువేల మందిపైనే ఉన్నట్టు అంచనా. వీళ్లు ప్రసవం అయిన తక్షణమే బిడ్డకు 72 గంటల్లోగా నెవాప్రిన్ సిరప్ వేయాలి. ఆ తర్వాత 3 నుంచి 13 వారాల వరకూ సెప్ట్రాన్ సిరప్ వేయాలి. ఈ రెండు సిరప్లు వేస్తేనే తల్లినుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఉంటుంది. గడిచిన ఆరు మాసాల్లో రెండువేల మందికి పైగా హెచ్ఐవీ సోకిన గర్భిణులు ప్రసవం అయ్యారు. కానీ ఆ బిడ్డలకు సిరప్లు వేసే పరిస్థితి లేదు. ఆ బిడ్డల పరిస్థితి దారుణం. సీడీ4 కిట్లూ లేవు హెచ్ఐవీ రోగులకు వ్యాధినిరోధకత శక్తిని సీడీ4 టెస్ట్‌ద్వారా చూస్తారు. అంటే తెల్లరక్త కణాల కొలమానం అన్నమాట. సీడీ4 కౌంట్ 350 కంటే తగ్గితే ఆ వ్యాధిగ్రస్థుడు ఖచ్చితంగా ఏఆర్టీ (యాంటీ రిట్రోవెల్ ట్రీట్మెంట్) మందులు వాడాలి. హెచ్ఐవీ సోకిన టీబీ రోగులైతే విధిగా ఏఆర్టీ మందులు వాడాల్సిందే. ఈ టెస్టును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. కానీ ఏడాదిగా రెండు రాష్ట్రాల్లో సీడీ4 కిట్లు లేవు. దీంతో హెచ్ఐవీ రోగులు ప్రై వేటుకు వెళ్లలేక, ఇక్కడ కిట్లు లేక యాతన పడుతున్నారు. డీపీఎంల దోపిడీ రాజ్యం ఏడాదిగా హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క ప్రచార కార్యక్రమమూ లేదు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లుగా నియమితులైనవారు ఎన్జీవోలనుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఎన్జీవోలు పనిచేయడం మానేశారు. కొందరు నాలుగైదేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తూ హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క కార్యక్రమమూ చేపట్టలేదు. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రాలను పర్యవేక్షించే ఓ జాయింట్ డెరైక్టర్ అండతో ప్రాజెక్టు మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కేంద్రం నుంచి రావడం లేదు హెచ్ఐవీ కిట్లు లేని మాట వాస్తవమే. అయితే ఇవి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ రాలేదు. ఈ ఏడాది నిధులు కూడా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. - డాక్టర్ రామ్మోహన్, జేడీ, ఏపీశాక్స్ నా ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక పోతున్నా ఐదారేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్నా. ఇక్కడ హెచ్ఐవీ రోగులకు వైద్యసేవలు అందడం లేదంటే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లే కారకులు. ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా వచ్చిన నిధులను తినేస్తున్నారు. దీంతో వేలాదిమంది హెచ్ఐవీ రోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.-కె.రవి, హెచ్ఐవీ బాధితుడు (సమాచార హక్కుచట్టం కార్యకర్త) రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ బాధితులు 5 లక్షలు తెలంగాణలో హెచ్ఐవీ బాధితులు 2.5 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ బాధితులు 2.7 లక్షలు ఏటా కొత్తగా నమోదయ్యే బాధితులు 25 వేలు ఏటా ప్రసవానికి వస్తున్న హెచ్ఐవీ బాధితులు 5 వేలు ఏటా రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మృతులు 31 వేలు -
ఎయిడ్స్ కథలో...
జాతీయ అవార్డులు సాధించిన తమిళ చిత్రం ‘కాంజీవరమ్’ దర్శకుడు ప్రియదర్శన్, హీరో ప్రకాశ్‌రాజ్ మరోసారి కలసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాంజీవరమ్’లో ప్రకాశ్ రాజ్ సరసన నటించిన శ్రీయారెడ్డే ఈ కొత్త చిత్రంలోనూ నాయిక. గతంలో ‘అప్పుడప్పుడు’, ‘పొగరు’ చిత్రాలతో వైవిధ్యమైన నటిగా పేరు తెచ్చుకున్న ఆమె పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె చేసిన తొలి చిత్రం ‘కాంజీవరమ్’. ఈ కొత్త చిత్రం ఎయిడ్స్ వ్యాధి నేపథ్యంలో సాగుతుంది. శ్రీయారెడ్డి మలి చిత్రం కూడా ప్రియదర్శన్ దర్శకత్వంలో కావడం, కమర్షియల్ ఫార్మెట్లో సాగే ప్రయోజనాత్మక చిత్రం కావడం, తన పాత్ర కూడా బాగుండడం వల్ల ఈ చిత్రాన్ని పచ్చజెండా ఊపారామె. ‘‘ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. అందరి జీవితాలకు కనెక్ట్ అయ్యేలా, మానవీయ కోణాలను స్పృశించే కథ. ‘కాంజీవరమ్’కి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాగా పేరు వచ్చింది గానీ సామాన్య ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ ఈ సినిమా ‘కాంజీవరమ్’ స్థాయిలో ఉంటూనే, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని శ్రీయారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిడ్స్లేకున్నా ఉందని నిర్దారించిన వైద్యులు
-
‘ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాలి’
మహబూబ్‌నగర్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం అన్నారు. నేషనల్ క్యాండిల్ లైట్ ర్యాలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్‌హాలు నుంచి క్లాక్‌టవర్ వరకు క్యాండిల్స్ ర్యాలీని ఏజేసీ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. -
హెచ్ఐవి కౌన్సెలింగ్
ఇటీవలే తరచూ జ్వరం వస్తూ, తగ్గుతూ ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. ఆయన నాకు హెచ్ఐవీ ఉన్నట్లు చెప్పారు. నాకు ఎయిడ్స్ వచ్చినట్టే కదా? చావు తప్పదా? - సుదీప్ (పేరు మార్చాం), బాపట్ల మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. హెచ్ఐవీ వైరస్ సీడీ4 కణాలను తగ్గించి వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది. హెచ్ఐవీ అనే వైరస్ సోకినవారు, అది హెచ్ఐవీ దశలోనే ఉన్నప్పుడు మాత్రం మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అసలు వాళ్లకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు. అయితే హెచ్ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బతీస్తూ పోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కౌంట్) ప్రతి మైక్రోలీటర్కూ 200 కంటే తగ్గితే.... అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చేయవచ్చు. నాకు హెచ్ఐవీ సోకింది. ఇక నేను దీన్ని నా పిల్లలకు అంటించేస్తానేమో, నా నుంచి వారికి సోకుతుందేమో అనే ఆందోళన ఎక్కువగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్ (పేరు మార్చాం), గుంటూరు సాధారణంగా హెచ్ఐవీ వచ్చిన తల్లిదండ్రులు పడే ఆందోళనలో ఇదే ప్రధానం. అలాంటి భయాలు వద్దు. ఇది కేవలం రక్తం, శరీర స్రావాలలు, అసురక్షితమైన సెక్స్ ద్వారానే సంక్రమిస్తుంది. కానీ ఒకేచోట నివసించడం, అందరూ అవే పాత్రలను వాడటం, పిల్లలను దగ్గరికి తీసుకోవడం, వారికి ముద్దు పెట్టడం వల్ల సోకదు. కాబట్టి నిరభ్యంతరంగా అలాంటి వారికి ఎవరైనా సేవలందించవచ్చు. కాకపోతే... మన చేతులపై గాయాలుంటే వాళ్ల రక్తం, శరీర స్రావాలు దానికి అంటుకోకుండా చూడాలి. వారి రక్తం, శరీర స్రావాలు, రక్తం అంటిన దూది, సూది లాంటి వాటిని జాగ్రత్తగా తొలగించాలి/డిస్పోజ్ చేయాలి. మీరు మీ భార్యతో సెక్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్తో సెక్స్ సమయంలో కండోమ్ వాడటం తప్పనిసరి. డాక్టర్ టి.జి. కిరణ్‌బాబు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వరుడికి ఎయిడ్స్... ఆగిన రెండో పెళ్లి
పీటలపై ఆగిన పెళ్లి - ఎయిడ్స్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు - ఖాకీల రంగప్రవేశం.. వరుడికి పరీక్షలు - హెచ్ఐవీ ఉన్నట్లు నివేదిక హసన్‌పర్తి : ముహూర్తం ఉదయం 10 గంటలకు.. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నారుు.. ఇంతలోనే పోలీసుల రంగప్రవేశం.. వరుడిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లి న పోలీసులు.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు విషయం ఏమిటని అడిగినా సమాధానం రాని పరిస్థితి. హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెంది న ఓ యువకుడికి హుస్నాబాద్ మండలం తౌళ్లపల్లికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్యం జీవితం సవ్యంగానే సాగింది. మూడేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించారు. చివరికి ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భర్త కూడా పరీక్షలు చేరుుంచుకున్నాడు. అయితే అతడికి హెచ్ఐవీ(నెగటివ్) ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అతడికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే మొదటి భార్యకు రూ.50వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. మడిపల్లికి చెందిన అమ్మాయితోనే... ఇదిలా ఉండగా, మడిపల్లికి చెందిన అమ్మాయితోనే రెండో పెళ్లికి సిద్ధమయ్యూడు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండగా, ఉదయం 7.15గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. అటు వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ సార్.. మడిపల్లిలో ఫలాన యువకుడికి ఎయిడ్స్ ఉంది.. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం.. మీరు వెళితే... ఓ యువతి జీవితం నాశనం కాకుం డా ఉంటుందని ఫోన్ పెట్టేశాడు. స్థానిక ఎస్సై రవికిరణ్ సమాచారాన్ని సీఐ రఘుచందర్‌కు చేరవేశారు. దీంతో పోలీసులు మడిపల్లికి వెళ్లి వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా, వరుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపించారు. సుమారు రెండు గంటల తర్వాత నివేదిక ఎస్సై చేతికి అందింది. దీంతో ఆయన స్థానిక వైద్యులకు దానిని చూపించగా.. వారు హెచ్ఐవీ ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కరుణ మైత్రి స్వచ్ఛంద వారికి సమాచారం అందించారు. వారు మడిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
ఎయిడ్స్‌కు హోమియోపతి చికిత్స
చెన్నై : హోమియోపతి చికిత్సతో హెచ్ఐవీ వైరస్‌ను సైతం నివారించవచ్చని పరిశోధనల్లో రుజువైనట్లు గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, పీఆర్వో డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 90 శాతం పరిశోధనల్లోనూ, పది శాతం చికిత్స ద్వారా నిర్ధారించుకున్నామని వారు చెప్పారు. మంగళవారం చెన్నైలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జేఎస్పీఎస్ ప్రభ్వు హోమియోపతి వైద్య కళాశాల (హైదరాబాద్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(హైదరాబాద్)కు చెందిన వైద్యులు జరిపిన పరిశోధనల ద్వారా కనుగొన్న క్రొటాలస్ సారిడస్ అనే మందు ద్వారా ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్ బీ వైరస్‌లను సమూలంగా నివారించవచ్చని రుజువైందని తెలిపారు. ముంబ యికి చెందిన డాక్టర్ రాజేష్ షా సైతం రెండేళ్ల పరిశోధనలతో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందు కనుగొన్నారని చెప్పారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో ఈ ఎయిడ్స్ నివారణ గురించి ప్రచురితమైందన్నారు. ముంబయిలో అంతర్జాతీయ సదస్సు హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక విధానాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో ముంబయిలో ‘వరల్డ్ హోమియోపతి సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మిట్‌లో వివిధ దేశాలకు చెందిన 9 మంది స్పీకర్లు ప్రసంగిస్తారని, అలాగే 25 మంది శాస్త్రవేత్తలు హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక చికిత్స విధానాలను వివరిస్తారని చెప్పారు. సైడ్‌ఎఫెక్ట్స్‌లేని, అతి చౌకైన, వ్యాధిని సమూలంగా నివారించగల మందులు హోమియోపతిలో ఉన్నాయని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ, అధికార శక్తులు అల్లోపతి మందుల తయారీ కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తూ ఈ మందులు వెలుగులోకి రానీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోమియోపతి మందుల పట్ల ప్రజల్లోనే మార్పు రావాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. -
రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
-
రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఓ కొత్త, సమర్థమైన హోమియో ఔషధం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు, ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్-బి కారక వైరస్ల వ్యాప్తిని నిరోధించే ఈ ఔషధం తయారీపై వీరి పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. రక్తపింజర(క్రొటాలస్ హెరిడస్) విషం ఆర్టీ అనే ఎంజైమ్‌ను నిరోధించగలదని వీరు ఇదివరకే శాస్త్రీయంగా నిరూపించారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రథమ ఎస్. మెయింకర్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్‌లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. క్రోటాలస్ హెరిడస్ విషానికి ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు తెలిపారు. ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మార్చి, దానిని అభివృద్ధి చేసి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్- బి వంటి వైరస్ల బారి నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పరిశోధనలు, సాధించిన ఫలితాల పూర్తి వివరాలను ఈ నెల 11న ముంబైలో జరగనున్న ప్రపంచ హోమియోపతి సదస్సులో వెల్లడించనున్నట్లు తెలిపారు. హోమియోపతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నా, హోమియో మందుల శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల వీటిపై సందేహాలను పటాపంచలు చేయాలన్న ఆలోచనతోనే ప్రపంచ హోమియో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు. -
మూడు నెలలుగా అందని వేతనాలు
ఇబ్బందుల్లో ఐసీటీసీ ఉద్యోగులు, సిబ్బంది చెన్నూర్ : సమీకత సమగ్ర హైచ్ఐవీ పరీక్ష కేంద్రం (ఐసీటీసీ), ఎయిడ్స్ వ్యాధి నిరోధక కేంద్రం (ఏఆర్టీ) సెం టర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. రాష్ట్రాలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ను విభజించక పోవడంతో రెండు రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోంది. తెలంగాణలోని 10 జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతి పై సుమారు 1000 మందికి పైగా కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నిషియన్లు, ఏఆర్టీ సిబ్బంది పని చేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభజన జరగక పోవడమే.. రాష్ట్రలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ శ్యాక్స్), తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ శ్యాక్స్) విడిపోలేదు. దీంతో జాతీయ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ మండలి (న్యాకో) ఢీల్లీ నుంచి వేతనాలు ఏపీ శ్యాక్స్ ఖాతాలో వేస్తున్నారని దీంతో వేతనాలు సకాలంలో రావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ఏపీ శ్యాక్స్, టీఎస్ శ్యాక్స్లను విభజించకపోతే ఈ సమస్య తీవ్రమవుతుంది తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్రాలు వేరుపడ్డాక అన్ని శాఖలు వేరైన నేటికి ఐసీటీసీ, ఏఆర్టీ సెంటర్లను వేరు చేయకపోవడం పట్ల రెండు ప్రాంతాల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని సిబ్బంది కోరుతున్నారు. -
పోరాటయోధుడు కేసీఆర్
గజ్వేల్ : ‘బంగారు తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గజ్వేల్ మండలం ఆహ్మాదీపూర్ గ్రామంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మా దాసు శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గజ్వేల్ నగర పంచాయతీ ప్రజ్ఞాపూర్‌లోగల ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో హెచ్ఐవీ బాధిత చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 ఏళ్ల ఉద్యమంతో ఆంధ్ర పాలన నుంచి విముక్తిని తీసుకువచ్చిన పోరాట యోదుడు కేసీఆర్ అని అభివర్ణించారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, స ంక్షేమం రెండు కళ్లల్లా ముందుకు నడుపుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడానికి శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరిక తీరుస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ చూడాలనే ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరికను తీరుస్తామని, త్వరలోనే ఇక్కడినుంచి వారిని బస్సులో సీఎం వద్దకు తీసుకెళ్లి సీఎంను కలిసేలా చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎయిడ్స్ బారిన పడిన పిల్లలు తాము కేసీఆర్ సార్‌ను చూడాలని ఉందన్న కోరికను ఇటీవల పత్రికల ద్వారా తమ మనసులో మాటను వెల్లడించిన సంగతి తెల్సిందే. మంగళవారం కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌కు ఈ విషయాన్ని తెలియజేయగా ఆమె పైవిధంగా స్పందించారు. ఎయిడ్స్ బాధిత చిన్నారుల మధ్య నిర్వహించిన కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో తను పాల్గొనడడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీ యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆకుల దేవేందర్, బెండ మధు, ఆహ్మదీపూర్ సర్పంచ్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రక్తదాన శిబిరంతో 61 మంది యువకులు 61 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు మెదక్ టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణిలు కేక్‌ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందించే సుపరిపాలన నాలుగు కాలాల పాటు ఉంటుందని వారు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రపంచంలోనే తెలంగాణను మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సీఎం బాగుండాలని కోరుతూ ‘గుట్ట’కు పాదయాత్ర జగదేవ్‌పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలి.. తెలంగాణ ప్రజలు మురిసేలా అభివృద్ధి జరగాలి.. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మంగళవారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి టీఆర్ఎస్ నాయకులు గ్రామం నుంచి నల్గొండ జిల్లా యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ యాదగిరిగుట్టకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని సర్పంచ్ భాగ్య తెలిపారు. ఎర్రవల్లి నుంచి ఇటిక్యాల, జగదేవ్‌పూర్, పీర్లపల్లి మీదుగా 12 మంది గల బృందం యాదగిరిగుట్టకు బయలు దేరింది. -
క్షయ నిర్మూలన ఊసేది ?
తెలంగాణలో 41,826 కేసులు నమోదు షుగర్, ఎయిడ్స్, కాలుష్యంతో విజృంభణ మందులకూ లొంగని స్థితికి వ్యాధి సాక్షి, హైదరాబాద్: క్షయవ్యాధి మళ్లీ విస్తరిస్తోంది. దాన్ని నిర్మూలన కార్యక్రమాలు సఫలం కావడంలేదు. ‘టీబీపై 2014 జాతీయ వార్షిక నివేదిక’ ప్రకారం దేశం లో నమోదవుతున్న క్షయ కేసుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. ఉమ్మడిరాష్ట్రంలో 1,03,707 కేసులు నమోదు కాగా, తెలంగాణవి 41,826 కేసులున్నాయి. హైదరాబాద్‌లోనే 6,612 టీబీ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 5,791, మహబూబ్‌నగర్ జిల్లాలో 4,076 కేసులను క్షయవ్యాధిగా గుర్తిం చారు. ప్రపంచవ్యాప్తంగా 80.6 లక్షల మంది క్షయ రోగులుంటే, మనదేశంలో 20.3 లక్షల మంది ఉన్నా రు. అంటే 25 శాతం రోగులు భారతలో ఉన్నారు. షుగర్, ఎయిడ్స్ ఉంటే క్షయ వచ్చే ప్రమాదం... పారిశ్రామికీకరణ, వాతావరణ కాలుష్యం పెరగడంతో క్షయ వ్యాధి కూడా విజృంభిస్తోంది. దీనికి తోడు షుగర్, ఎయిడ్స్ వంటివి ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గి క్షయరావడానికి అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఎయిడ్స్ రోగుల్లో 56 శాతం మందికి క్షయ సోకుతోంది. టీబీ ఉన్న రోగుల్లో 4 శాతం ఎయిడ్స్ రోగులున్నారు. మందులకు లొంగని స్థితికి...: 2006 నుంచి టీబీ మందులకు కూడా లొంగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రుల్లోనూ మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా టీబీ పెరగడానికి ఒక కారణమని కేంద్రప్రభుత్వ నివేదిక పేర్కొంది. పరిశోధనలు జరగాలి ప్రస్తుత మందులకు టీబీ పూర్తిగా తగ్గే అవకాశం లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేర్ ఆసుపత్రి ఊపిరితిత్తులు, శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎ. రఫీ అంటున్నారు. -
ఎయిడ్స్ ప్రచారానికి ఓకే
ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. అలాం టి వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రుతి ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా వున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ, ప్రచారం చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుందని భావించిన ఎయిడ్స్ నిరోధక సంస్థ నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. అందుకు శ్రుతిహాసన్ వెంటనే ఓకే చెప్పారు. ఆమె ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పిన వ్యాఖ్యలను వీడియోలో దాన్ని చిత్రీకరించి ఇంటర్నెట్లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. దీన్ని త్వరలో ఎయిడ్స్ నిరోధక కమిటీ నిర్వాహకులు చిత్రీకరించనున్నారని తెలిసింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విజయ్ సరసన గరుడ చిత్రంలోనూ తెలుగులో మహేష్‌బాబుకు జంటగా ఒకచిత్రంతో పాటు హిందీలో ఐదు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా విశాల్ సరసన మరోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ శ్రుతి ఎయిడ్స్‌పై అవగాహన ప్రచారానికి అంగీకరించడం గొప్ప విషయమే కదా మరి. -
కేసీఆర్ తాతయ్యను కలవాలె
ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరిక గజ్వేల్: వారంతా విషాదానికి ప్రతిరూపాలు. అనాథలు. ఎయిడ్స్ భూతం కబళించి మెదక్ జిల్లా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో చికిత్స పొందుతున్న 15 ఏళ్లలోపు వయసున్న 30 మంది చిన్నారుల కోరిక సీఎం కేసీఆర్‌ను కలవడం, మాట్లాడడం. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని గడా(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు హామీ ఇచ్చారు. ఎయిడ్స్‌డే సందర్భంగా మంగళవారం ఇక్కడ ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఎయిడ్స్‌ను పారదోలాలని చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
జీతాలు లేవు..ఆరోగ్య బీమా
-
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
అనంతపురం స్పోర్ట్స్ : అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించారు. రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీలో ‘ఎయిడ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంతో మంది యువత ఎయిడ్స్ మహమ్మారికి బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో దాన్ని నివారించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎయిడ్స్‌ను పారదోలేందుకు పది నిమిషాలు చర్చించేలా చర్యలు తీసుకుంటామని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిని సామాజిక స్పృహతో ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. వారి పట్ల వివక్ష చూపకుండా అందరిలాగే చూడాలన్నారు. తెలిసో తెలియకో ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిం చారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ను తరిమికొట్టే దిశగా ఆరోగ్యశాఖ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ ప్రభుదాస్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. హెచ్ఐవీ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మదమంచి స్వరూప, అనంత నెట్ వర్క్ ఆఫ్ పాజిటివ్స్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
ఒంగోలు సెంట్రల్:ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా ఎయిడ్స్ ఆధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సంధర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీని శిధ్దా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్కె ఆర్. విజయ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్‌వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎయిడ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ర్యాలీ అనంతరం అంభేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్‌కు మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ సురక్షిత లైంగిక చర్యల వల్ల ఈ వ్యాధి రాదన్నారు. ఈ సంధర్బంగా పీ శాక్స్ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఎఆర్టి మందులను సక్రమంగా వాడితే మంచిదన్నారు. జిల్లా జడ్జి మోహ న్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు వివక్షతకు గురైతే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణా అధికారి డాక్టర్ పద్మావతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి టి. రమేష్, డాక్టర్ సరళాదేవి, డాక్టర్ జోసఫ్, నాగేంద్రయ్య, డెమోలు శ్రీనివాసరావు, పద్మజ, తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. -
ఎయిడ్స్ మహమ్మారి బాధితుల్ని ఆదరించాలి
ఎయిడ్స్ డే కార్యక్రమాల్లో కలెక్టర్ హితవు బాధిత చిన్నారులకు అల్పాహార విందు వారి స్థితిని చూసి చలించిన అధికారులు కాకినాడ క్రైం :ఎయిడ్స్ మహమ్మారి పీడితుల పట్ల నిర్లక్ష్యాన్ని, నిరాదరణను విడనాడాలని, తెలిసో తెలియకో తప్పు చేసి వ్యాధి బారిన పడిన వారిని ఆదరించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. సమాజానికి శాపంగా మారిన ఎయిడ్స్ వ్యాధిపై ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇంకా వ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కనిపించడం శోచనీయమన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ బంగ్లాలో వ్యాధిగ్రస్త చిన్నారులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. హాజరైన వందల మంది చిన్నారులను చూసి కలెక్టర్ చలించిపోయారు. తల్లిదండ్రులు లేక, ఆలనాపాలనా కరువై శుష్కించిన వారిని చూసి కలెక్టర్‌తో పాటు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చలించిపోయారు. ఏ పాపం తెలియని ఇందరు చిన్నారులు వ్యాధి బారినపడడం విషాదకరమని కలెక్టర్ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి హెచ్ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించాలని సూచించారు. ‘జిల్లాలో 46,836 మంది వ్యాధిగ్రస్తులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాధి సోకిందని తెలిస్తే సమాజం చిన్న చూపు చూస్తుందనే భయంతో అనేక మంది బయటికి చెప్పుకోవడం లేదు. దీంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఏ పాపం ఎరుగని చిన్నారులు సైతం ఎయిడ్స్ బారిన పడి నరక యాతన అనుభవిస్తున్నారు. కొందరు మరణిస్తున్నారు. రంపచోడవరం ఏరియాలో ఎనిమిదేళ్ల బాలుడికి హెచ్ఐవీ సోకింది. ఆ బాలుడి తల్లిదండ్రులు మరణించారు. ఏజెన్సీ పర్యటనకు వెళ్లినపుడు ఆ బాలుడిని చూసి, హెచ్ఐవీ పేషెంట్ అని తెలిసి చాలా బాధపడ్డాను. ముసలి తాత దగ్గర ఉంటున్న ఆ బాబుకి ఏఆర్టీ చికిత్సనందించి, బాగోగులు చూడాల్సిందిగా అక్కడి వైద్యులకు సూచించాను’ అని చెప్పారు. జిల్లాలో తగ్గిన వ్యాధి వ్యాప్తి జిల్లాలో 2004-05లో 26.37 శాతంగా ఉన్న వ్యాధి వ్యాప్తి 2013-14లో 6.11 శాతంగా నమోదైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో అధికారులు సఫలీకృతులయ్యారన్నారు. శారీరక సంబంధాల కారణంగానే 93 శాతం వ్యాధి సంక్రమిస్తోందన్నారు. వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రక్తమార్పిడితోనూ వ్యాధి సంక్రమిస్తున్నందున వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సోకే ప్రమాదంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పిల్లల్ని రక్షించడానికి మందులున్నాయని, ప్రతి గర్భిణికి విధిగా హెచ్ఐవీ టెస్ట్ చేయాలని కోరారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది 73,211 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా 4,479 మందికి వ్యాధిసోకినట్లు నిర్ధారణైందన్నారు. గర్భిణుల్లో 60,342 మందిని పరీక్షించగా 171 మందికి వ్యాధి సోకినట్లు తేలిందన్నారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలలో 46,836 మంది వ్యాధిగ్రస్తులు నమోదు కాగా వ్యాధి తీవ్రతను తగ్గించి జీవితకాలాన్ని పెంచే ఏఆర్టీ మందులను 26,920 మంది వాడుతున్నారన్నారు. 350 మంది పిల్లలను ఐసీపీఎస్ పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఏజేసీ డి.మార్కండేయులు, ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి, రిలయన్స్ ప్రతినిధి రవిచంద్రన్, డాక్టర్ వాడ్రేవు రవి తదితరులు ప్రసంగించారు. చిన్నారులకు కలెక్టర్ నీతూప్రసాద్, ఇతర అధికారులు పౌష్టికాహారం పంపిణీ చేసి, అల్పాహారం తినిపించారు. -
వరల్డ్ ఎయిడ్స్ డే: చర్చ
-
అవగాహనతోనే నివారణ
నల్లగొండ టౌన్ :హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత సంవత్సరం(2013-14)లో జిల్లాలో 1832 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది(2014-15) ఇప్పటి వరకు 1029 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2004-05లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2074గా ఉంది. జిల్లాలో 105 పరీక్షల కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, ఒక మొబైల్ ఐసీటీసీ సెంటర్లతో పాటు మొత్తం 105 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రులలో మూడు లింకెడ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఎయిడ్స్ పాజి టీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సిలింగ్, వ్యక్తిగత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను ఉచి తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలీటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, 13 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ పరీ క్షా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్బిణులకు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి హెచ్ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం కృషి చేస్తుండడంతో గతంలో కంటే ప్రస్తు తం హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ర్యాలీని ప్రారంభిస్తారు. ఎన్జీ కళాశాల వరకు కొనసాగుతుంది. నివారణ ఒక్కటే మార్గం : డాక్టర్ విజయ్‌కుమార్ అడిషనల్ డీఎంహెచ్ఓ(ఎయిడ్స్అండ్ లెప్రసీ) ఎయిడ్స్‌ను అవగాహనతో నివారించవచ్చు. ముఖ్యంగా యువతీయువకులు సురక్షిత శృంగార పద్ధతులు పాటిం చాలి. సురక్షితమైన రక్తాన్ని మాత్రమే ఎక్కించుకోవాలి. పాజిటీవ్ వ్యక్తులు ఏఆర్టీ సెంటర్లో అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా తమ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. బోగస్ ప్రకటనలను నమ్మి మొసపోవద్దు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు వ్యాధిపై అవగాహన కల్పించడానికి వినూత్నంగా ప్రయత్నించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) రూపంలో ఇలా కూర్చున్నారు. బాధితుల సంరక్షణ ఇలా.. హెచ్ఐవీ పాజిటీవ్ బాధితులను జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్ లేదా సూర్యాపేటలోని ఏఆర్టీ సెంటర్లకు పంపిస్తారు. అక్కడ వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలు చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. అలాగే అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు. 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సిలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆధరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీఐ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు వాడిన బాధితులను వారికి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి ఆ సెంటర్ల ద్వారా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లలో క్రమం తప్పకుండా వాడిన వేలాది మంది హెచ్ఐవీ పాజిటీవ్ బాధితులలో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమాలు, నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు. -
మహమ్మారి వెనుకడుగు
ఎయిడ్స్.. ఒక్కప్పుడు జిల్లాను వణికించిన మహమ్మారి. చాపకింద నీరులా వ్యాప్తిచెందినా.. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతోంది. ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణం. గతంలో గల్ఫ్‌దేశాలకు వలస వెళ్లే వారినుంచి ఎక్కువగా జిల్లాలో వ్యాప్తి చెందింది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛంద సంస్థల ప్రచారంతో ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. పల్లెలో మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అవగాహన పెరగడం వల్లే ఉపాధి కోసం జిల్లావాసులు గతంలో ముంబయి మీదుగా గల్ఫ్ వెళ్లేవారు. అక్క డ వీసా కోసం 10 నుంచి 15 రోజుల పాటు వేచి చూసేవారు. అక్కడి సెక్స్‌వర్కర్లకు అలవాటుపడటం వల్ల ఎయిడ్స్ బారిన పడేవాళ్లు. అలాగే జిల్లాకు వచ్చిన తర్వాత లైంగిక సంబంధాలు కొనసాగించడం వల్ల ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఎనిమిదేళ్లక్రితం 35,400 మందిని పరీక్షించగా 1,857 మందికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. 2014 అక్టోబర్ వరకు 68,162 మంది పరీక్షించగా 659 మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీన్ని బట్టి చూస్తే ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని తెలుస్తోంది. లైంగిక సంబంధాల్లో కండోమ్‌ల వినియోగం కూడా ఏడాదికేడాది పెరుగుతుండటానికి ఎయిడ్స్‌పై అవగాహనే కారణం. అందుబాటులో వైద్యపరీక్షలు ప్రస్తుతం వైద్యం కోసం వెళితే కొద్దిపాటి అనుమానం ఉన్నా తప్పనిసరిగా హెచ్ఐవీ టెస్టు చేస్తున్నారు. దీని వల్ల వ్యాధి ముందుగానే తెలుసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని జాగ్రత్తలు పాటించడం, ఇతరులకు సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. దీని వల్ల వ్యాధి ప్రభావం తగ్గిపోయింది. జిల్లాలో ఎయిడ్స్ నివారణ కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్లు కూడా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 8 ఐసీటీసీ(ఇంట్రిగేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్సెంటర్లు), నాలుగు పీపీటీసీటీ(ప్రివెన్షన్ పేరెంట్ చైల్డ్ ట్రాన్స్‌మిషిన్ సెంటర్లు) ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ సెంటర్లలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఐసీటీసీ మొబైల్ టీం అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఏఆర్టీ సెంటర్లు రెండు, లింక్ ఏఆర్టీలు ఆరు, బ్లడ్‌బ్యాంకులు ఆరు, నివారణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఐదు స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ నివారణకు తోడ్పడుతున్నాయి. స్నేహ సొసైటీ రూరల్ రీకన్‌స్టక్షన్ , లెప్రా సొసైటీ, చైల్డ్ పౌండ్ ఇండియా, పేరలి నర్సయ్య మెమోరియల్, వర్డ్, నిజం, అభయ తదితర స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ఎయిడ్స్‌ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాయి. ఎయిడ్స్ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. సమస్యలు పరిష్కరిస్తే ఎయిడ్స్ ప్రధానంగా సురక్షితం కానీ లైంగిక సంబంధాలను కొనసాగించడం వల్లే వ్యాప్తిచెందుతోంది. జిల్లాలో సెక్స్‌వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరికి ప్రభుత్వం తరపున పింఛన్లు, ఉచిత బస్సుపాస్ సౌకర్యం కల్పిం చాల్సి ఉంది. 80శాతం మందికి సా యమందడం లేదు. పేదరికం, జీవనోపాధి లేని కారణంగా చాలామం ది అదే రొంపిలో గడుపుతున్నారని స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం సాయమందిస్తే వారు ఉపాధి మార్గాలు చూసుకుంటారని చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలు.. హెచ్ఐవీ బారిన పడినవారిలో నాలుగుదశల లక్షణాలు కనిపిస్తాయి. మొ దటి దశలో ఫ్లూజ్వరం, రక్తంలో వైరస్ సంఖ్య అధికంగా ఉన్న ప్రతిరక్షకాలు కనిపించవు. రెండో దశలో హెచ్ఐవీ ఉనికి తెలుస్తుంది. కానీ వ్యక్తిలో బాహ్యంగా కనిపించవు. మూడో దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. నాల్గో దశలో దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరోచనాలు, నోటి పుళ్లు, లింప్ గ్రంధులు వాచడం, శరీర బరువు పది శాతం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సోకుతుందిలా.. రక్షణ లేని లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తులకు వాడిన సిరంజీలను మళ్లీ ఇతరులకు వాడితే ఎయిడ్స్ వస్తుంది. వారికి వాడిన బ్లేడ్లను వాడినా సోకే ప్రమాదాలున్నాయి. లైంగిక సంబంధాల్లో కండోమ్ వాడటం వల్ల దీన్ని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు వారికి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సోకకుండా నెవరాపిన్ ట్యాబ్లెట్‌ను ఇస్తారు. ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్ఐవీ పరీక్ష ఉచితంగా చేస్తారు. హెచ్ఐవీ సోకినట్లయితే వారికి ఏఆర్టీకి మందులను అందజేస్తారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పౌష్టికాహారం కీలకం... హెచ్ఐవీ బాధితులు మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. యోగా, వ్యాయామం చేయా లి. ఆహారంలో పండ్లు, గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు ఉండేలా చూడాలి. హెచ్ఐవీ వైరస్ శరీరంలోని రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. ఏఆర్టీ మందులను వాడితే రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మద్యం, పొగాకు, ధూమపానం అలవాట్లను మానుకోవాలి. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్ తప్పనిసరిగా వాడాలి. -
బాధితులకు ఆసరా ఏదీ?
నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం ⇒ రూ.కోట్ల నిధులున్నా ప్రయోజనం మాత్రం సున్నా... ⇒ జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ⇒ 11వ స్థానంలో జిల్లా నెల్లూరు (వైద్యం): ఎయిడ్స్‌పై సమరం చేద్దాం.. మహమ్మారిని తరిమికొడదాం.. హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. బాధితులకు అండగా ఉంటాం... ఇవి పాల కులు నిత్యం చెబుతున్న మాటలు. ఏడాదిలో ఒకరోజు ఎయిడ్స్ నివారణ దినాన్ని జరిపి ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం పాలకులు, అధికారులకు పరిపాటిగా మారింది. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కోట్లల్లో నిధులున్నా ప్రయోజనం శూన్యం. జిల్లాలో 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి కనీస వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. బాధితులకు కనీసం పెన్షన్కూడా సక్రమంగా అందించడం లేదంటే వీరిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. కోట్ల నిధులు స్వచ్ఛంద సంస్థల పరం ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన, నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. నిధులు నేరుగా ఆయా స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్నాయి. నిధులు సక్రమంగా బాధితులకు ఉపయోగపడుతున్నాయా...పక్కదారి పడుతున్నాయా అన్న వాటిపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. జిల్లా లో ఎయిడ్స్ నియంత్రణకు 8 స్వచ్ఛంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలకు ఏ టా 10 నుంచి 15 లక్షల వరకు ఏపీ ఎ యి డ్స్ నియంత్రణ మండలి నుంచి నిధులు మంజూరవుతాయి. సంస్థలు ప్రభుత్వాలకు కాకి లెక్కలు చూపుతూ అందినకాడికి నిధులను దిగమింగడం పరిపాటిగా మారింది. నివారణకు కృషి ఎయిడ్స్‌వ్యాధి నివారణకు కృషిచేస్తున్నామని ఎయిడ్స నియంత్రణాధికారి రమాదేవి తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడివారికి చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాలుగా ‘ఆదరణ’ బిట్రగుంట:ముంగమూరు కూడలిలోని హెచ్ఐవీ పాజిటివ్ ఆదరణ కేంద్రం వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటగా 1999లో ముంగమూరు కూడలిలో ఏర్పాైటె న ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకూ సుమారు పదివేల మందికి పైగా బాధితులు సేవలు పొందుతున్నారు. జిల్లాతో పాటు ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి హెచ్ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఆదరణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 32 మంది ఆశ్రయం పొందుతుండగా వారిలో 22 మంది చిన్నారులే ఉండడం గమనార్హం. వీరితో పాటు నాలుగు వేల మందికిపైగా ఔట్పేషెంట్లు ప్రతి నెలా కౌన్సెలింగ్, మందులు పొందుతున్నారు. ప్రాణం పోస్తున్న దాతలు ఆదరణ కేంద్రం నిర్వహణకు, ఆశ్రయం పొందుతున్న వ్యాధిగ్రస్తులకు వివిధ ప్రాంతాలకు చెందిన దాతలే జీవం పోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కపైసా నిధులు అందకపోయినా దాతలే అన్నీ తామై ఆదుకుంటున్నారు. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర వస్తువుల నుంచి వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు, మినరల్ వాటర్, బెడ్లు, పౌష్టికాహారం తదితర అవసరాలను ప్రతీనెలా దాతలే తీరుస్తున్నారు. వన్నెతెచ్చిన అవార్డులు ఆదరణ కేంద్రం సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా న్యూఢిల్లీలో ‘నేషనల్ సివిల్ సొసైటీ’ అవార్డును అందజేశారు. పదుల సార్లు కలెక్టర్లు, ఎస్పీ చేతుల మీదుగా రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవార్డులు అందజేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆదరణ కేంద్రం సేవలు గుర్తించి 2013లో గవర్నర్ భరద్వాజ చేతుల మీదుగా ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి రాావుకు గౌరవ డాక్టరేట్ బహుకరించింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అయితే ఆదరణ కేంద్రం అనుసరిస్తున్న విధివిధానాలనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం: సింహాద్రి రావు, కేంద్రం నిర్వాహకుడు హెచ్ ఐవీ పాజాటివ్ వ్యాధిగ్రస్తులను సమాజం ఆదరరించాలి. చక్కెర వ్యాధిలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ప్రస్తుతం వ్యాధిగ్రస్తులు అందరిలాగే సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన ఏఆర్టీ, ఆయుర్వేదం మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా బాధితులను అర్థం చేసుకోవాలి. -
మందుల్లేవ్!
ఏఆర్టీ సెంటర్లలో అరకొరగా మందుల పంపిణీ పింఛన్ల ఊసే లేదు కిట్ల సరఫరాను నిలిపివేసిన ఏపీ శాక్స్ ఆందోళనలో హెచ్ఐవీ బాధితులు ఎయిడ్స్ మహమ్మారి సోకినా మందులు వాడితే ఆనందంగా జీవించవచ్చని ఆశలు కల్పించారు. కుమిలిపోతూ కన్నుమూయవద్దని, ఆస్పత్రికి వెళితే ఆయుష్షు పెరుగుతుందని చైతన్యం కల్పించారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రచారం కారణంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు పరువును పక్కన పెట్టి ప్రాణాలపై ఆశతో ఏఆర్టీ సెంటర్లకు వస్తున్నారు. వారికి సరిపడా మందులను మాత్రం ప్రభుత్వం, ఏపీ శాక్స్ అందించడంలేదు. కనీసం వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా సరఫరా చేయడంలేదు. దీంతో కొద్దికాలంగా మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉన్న బాధితుల్లో ఆందోళన మొదలైంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లాలోని ఏఆర్టీ సెంటర్ల పరిస్థితి, బాధితులకు అందుతున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేకంగా ఫోకస్... లబ్బీపేట : జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 45 వేల మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులు ఉన్నారు. అనధికారికంగా మాత్రం ఆ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా. హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు మందులు అందజేసేందుకు బందరుతోపాటు నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీ రిట్రూవెల్ థెరపీ(ఏఆర్టీ) సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, నందిగామ, తిరువూరు, అవనిగడ్డ, కంచికచర్ల, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో కూడా లింక్డ్ ఏఆర్టీ సెంటర్లను ప్రారంభించారు. ఏఆర్టీ సెంటర్లలో 40 వేల మంది వరకు బాధితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారిలో 700 మంది పిల్లలు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగుల్లో సీడీ4 కౌంట్ 250 కన్నా తక్కువగా ఉన్న 14 వేల మంది క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో మరో 10వేల నుంచి 15వేల మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వేధిస్తున్న మందుల కొరత.. ఏఆర్టీ సెంటర్లు ప్రారంభించినప్పుడు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి నెల రోజులకు మందులు ఇచ్చేవారు. మళ్లీ నెల తర్వాత వస్తే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చేవారు. కొద్దికాలం నుంచి మందుల కొరత నెలకొనడంతో 15 రోజులకే ఇస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో బాధితులు నెలకు నాలుగుసార్లు ఏఆర్టీ సెంటర్లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక్కొక్కరికీ నాలుగు నుంచి ఆరు రకాల మందులు అందించాల్సి ఉండగా కొన్ని అందుబాటులో ఉండటంలేదు. కిట్ల సరఫరాకు బ్రేక్ స్వచ్ఛందంగా ఏఆర్టీ సెంటర్లకు వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేకపోవడంతో ప్రయివేటు ల్యాబ్‌లకు పంపుతున్నారు. గతంలో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న గర్భిణులకు ప్రసవం, సిజేరియన్ ఆపరేషన్లు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీ శాక్స్) ప్రత్యేక కిట్లు అందజేసేది. ఏడాదిగా ఈ కిట్ల సరఫరాను ఏపీ శాక్స్ నిలిపివేయడంతో బాధిత గర్భిణులు రూ.2 వేల వరకు వెచ్చించి బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పింఛన్లూ ఇవ్వలేడం లేదు క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు ఏఆర్టీ సెంటర్లకు వచ్చి మందులు తీసుకెళ్లే బాధితులకు నెలకు రూ.1,000 చొప్పున పింఛను అందించాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాలో సుమారు వేలాది మందికి పింఛను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆరు నెలలుగా 500 మందికి కూడా అందజేయడంలేదు. దీంతో నెలకు నాలుగుసార్లు మందుల కోసం వస్తున్న బాధుతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెకండ్ లైన్లో వైద్యులు లేరు.. ఏఆర్టీ సెంటర్లలో ఇచ్చే మందులు పనిచేయనివారి కోసం సెకండ్ లైన్ ఏఆర్టీ సెంటర్‌ను రెండేళ్ల క్రితం నగరంలో ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి కూడా రోగులు వస్తున్నందున ఈ సెంటర్లో ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఏపీ శాక్స్ నిర్ణయించింది. నేటి వరకు నియమించకపోవడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యులే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సెంటర్లో ఒక్కో రోగికి నెలకు రూ.5వేల విలువైన మందులు అందజేస్తారు. ఇక్కడ కూడా ఒక్కోసారి మందుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏఆర్టీ సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలని, పింఛన్లు అందించాలని బాధితులు కోరుతున్నారు. చైతన్యం పెరిగింది ఐదేళ్ల క్రితం హెచ్ఐవీ బాధితులు వైద్యం కోసం వచ్చేందుకు ఇబ్బందిగా భావించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. చైతన్యం పెరిగింది. సహజ వ్యాధులు సోకినట్లే వచ్చి మందులు తీసుకువెళ్తున్నారు. సక్రమంగా మందులు వాడనివారు, మందులు వాడినా మద్యం తాగడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఏటా 8శాతం మంది మృత్యువాత పడుతున్నారు. - కె.సత్యనారాయణ, ప్రభుత్వాస్పత్రి ఏఆర్టీ సెంటర్ నోడల్ అధికారి నేడు అవగాహనా ర్యాలీ గతంలో కంటే హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థల కృషి ఉంది. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం నగరంలోని గాంధీనగర్ శారదా కాలేజీ నుంచి ఘంటసాల సంగీత కళాశాల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. సుమారు ఐదు వేల మంది పాల్గొంటారు. అక్కడే రాష్ట్ర స్థాయి సదస్సు కూడా నిర్వహిస్తాం. - డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
మనోరంజితం పటచిత్రం
వేలాది శ్లోకాల్లో ఇమిడి ఉన్న రామాయణ, మహాభారతాలను తన ప్రతిభతో చిత్రరూపం ఇచ్చి మన ముందుంచారు బెంగాలీ ఆర్టిస్ట్ రంజిత్ చిత్రకార్. పటచిత్ర ప్రతిభతో రామాయణానికి చిత్ర రూపం ఇస్తూ 45 షీట్లలో బంధించారు. అంతే మనోరంజకంగా మహాభారతాన్ని చిత్రరాజంగా మలచారు. బంజారాహిల్స్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం మొదలైన ‘పటచిత్ర’ ప్రదర్శన అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నెల 14 వరకు జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఎయిడ్స్ నియంత్రణ, అడవుల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా చిత్రాలు కొలువు దీరాయి. ‘పదేళ్ల వయసు నుంచే పటచిత్ర ఆర్ట్ నేర్చుకున్నాను. కఠోర సాధనతోనే ఈ రంగంలో పేరు సాధించగలిగాను. శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ, లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లలో నా ఆర్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. నా ఇద్దరు కుమారులు కూడా పటచిత్ర పెయింటింగ్ చేస్తున్నార’ని కుంచెకారుడు రంజిత్ చిత్రకార్ తెలిపారు. వాంకె శ్రీనివాస్ రంగుల కళ మదిలోని అందమైన ఊహలకు రంగులు అద్దితే.. కలలకు రూపమిచ్చి కళాఖండాలుగా కళ్లముందు పెడితే.. ఎంత అద్భుతం..! ఇలాంటి అందమైన అద్భుతమే మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. ‘మిలాంజ్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మరో లోకాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే కళాశాలలో పెయింటింగ్ ఓనమాలు దిద్ది, పేరొందిన ఫైన్ఆర్ట్స్ కళాశాలల్లో మాస్టర్స డిగ్రీలు పొంది అంతా కలసి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మండుతున్న అగ్గిపుల్లపై పెద్దపులి, పూలకుండిలోని మొక్క ఆకును అందుకునేందుకు ప్రయత్నిస్తున్న జిరాఫీ.. సీతాకోక చిలుక ఏనుగును పట్టుకుని ఎగిరిపోవడం.. వంటి ఎన్నో చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. -
‘కంట్రోల్’ తప్పిన అవినీతి!
సాక్షి, సిటీబ్యూరో : ఎయిడ్స్ నియంత్రణ మండలికి అవినీతి వైరస్ సోకింది. అధికారులు, ఎన్జీఓలు కుమ్మక్కై రూ.కోట్లు కొల్లగొట్టారు. కాలపరిమితి తీరిన హెచ్ఐవీ కిట్స్‌ను కొనుగోలు చేసి, అవసరం లేకపోయినా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు..నకిలీ రోగులను సృష్టించి పరీక్షలు చేయకున్నా...చేసినట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ (ఐసీటీసీ)సెంటర్లకు గడువు సమీపించిన హెచ్ఐవీ కిట్స్‌ను సరఫరా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కిట్స్‌తో రోగులకు హెచ్ఐవీ పరీక్షలు చేయగా ఫలితాలు తారుమారవుతుండటంట తో ఆయా సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటేనే బాధితులు జంకుతున్నారు. బోధనాస్పత్రుల్లో మరీ ఘోరం ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నాపెద్ద అన్నీ కలిపి ప్రతి రోజు సగటున 200-250 వరకు, గాంధీలో 200పై గా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజు సగటున 25-30, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 60-70 ప్రసవాలు జరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు ముందు రోగ నిర్థారణలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు హెచ్ఐవీ టెస్టు తప్పనిసరి. ఆస్పత్రిలోని హెచ్ఐవీ కిట్స్ అన్నీ ఎక్స్పైర్ కావడంతో వాటిని రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. నిరుపేద రోగులకు ఇది భారమే అయినా తప్పడం లేదు. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.150 వెచ్చిస్తున్నారు. ఇక శస్త్రచికిత్సల్లో కీలకమైన సర్జికల్ కిట్స్(సూది, దారం, బ్లేడ్ , దూది, గ్లౌజు)లేక పోవడంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500-700 వరకు ఖర్చు అవుతోంది. ఏపీసాక్స్‌కు ఐపీఎం డెరైక్టర్ లేఖ నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కి అవసరానికి మించి ఎయిడ్స్ కిట్స్ సరఫరా చేశారు. ఎక్స్పైరీ డేట్ సమీపిస్తుండటంతో వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మూడు మాసాల క్రితమే ఐపీఎం డెరైక్టర్ ఎయిడ్స్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా సుమారు ఐదు లక్షల ఎయిడ్స్ కిట్స్ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఐపీఎం వద్ద అవసరానికి మించి కిట్స్ ఉండగానే అదనంగా మరో రెండు కోట్ల విలువ చేసే కిట్స్ కొనుగోలు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అడవి తంగేడుతో ఎయిడ్స్‌కు చెక్!
తిప్పతీగకూ ఔషధగుణాలు ఎయిడ్స్ కారక వైరస్‌లను తగ్గిస్తారు పరిశోధనలో తేల్చిన కాకతీయ వర్సిటీ బాటనీ విభాగం నివేదికపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంతృప్తి మరింత పరిశోధనకు నిధులు మంజూరు సాక్షి, హన్మకొండ: ఇప్పటివరకు అకడమిక్ విషయాలకే ప్రాధాన్యమిచ్చిన మన యూనివర్సిటీలు ఇప్పుడు పరిశోధనల బాటపట్టాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌ను ఎదుర్కొనే శక్తి మన వనమూలికలకు ఉందంటున్నారు కాకతీయ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు. తెలంగాణలోని అటవీప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అడవి తంగేడు, తిప్పతీగలకు ఎయిడ్స్ వ్యాధికారక వైరస్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. వీరు ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో కొంత ఫలితాలు వచ్చాయి. మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ రూ.21 లక్షలు విడుదల చేయగా.. బయోటెక్నాలజీ విభాగం రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవీ అనే వైరస్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒక వ్యక్తి శరీరంలోకి ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత దాని వృద్ధి రేటు అనేది ఆ వైరస్‌లో ఉండే ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైములపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైముల చర్యశీలత ఎక్కువగా ఉంటే హెచ్ఐవీ వైరస్ త్వరితగతిన అభివృద్ధి చెంది రోగం ముదురుతుంది. ఫలితంగా మనిషి త్వరగా మరణానికి చేరువ అవుతాడు. అయితే, కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు) ఆకుల్లో, టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) మొక్కలలో ఉండే ఔషధ గుణాలకు ఈ ఎంజైముల చర్యశీలతను తగ్గించే లక్షణం ఉందని కేయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల అంటున్నారు. తమ ప్రయోగాల్లో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన వెల్లడించారు. పరిశోధన ఇలా.. కాకతీయవర్సిటీ పీహెచ్డీ పరిశోధనలో భాగంగాా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల.. ‘తెలంగాణ అడవుల్లో నివసించే గిరిజనులు - వనమూలిక వైద్యం’ అనే అంశంపై పరిశోధనలు జరిపారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని గిరిజనులు, వనవాసీలు వివిధ వ్యాధులను నయం చేయడానికి 65 జాతులకు చెందిన ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వీటిలో పునర్నవ (బహెరా డిప్యూరా), పిండికూర (ఎర్వాలానేటా), బ్రహ్మమేడి (ఫైకస్ హిస్పెడా), పులిచేరు (ఫిల్లాంథస్ రెటిక్యూలస్), నరమామిడి (లిట్సాగ్లుటిన్మో), సోమిడిచెక్క (సోమిడి ఫిబ్రుజా), కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు), టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) వంటి మొక్కలు ఉన్నాయి. వీటితో సుఖవ్యాధులు, పాముకాటు, రక్తశుద్ధి, వీర్యవృద్ధి, జీర్ణసంబంధిత ఇతర ప్రాణాంతక వ్యాధులను మందులుగా ఉపయోగిస్తున్నారు. ఆదివాసీ వైద్యం వనమూలికా వైద్య విధానంలో భాగంగా ఆదివాసీలు, గిరిజనులు సుఖవ్యాధుల నివారణ ఔషధాలుగా తిప్పతీగ, అడవితంగేడు మొక్కలను ఉపయోగిస్తున్నట్లుగా కాకతీయ యూనివర్సిటీ స్కాలర్స్ జరిపిన ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఈ రెండు మొక్కలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారు. తిప్పతీగ మొక్కలో అన్ని భాగాలు రెండు కిలోల పరిమాణంలో ఎండబెట్టి తర్వాత ప్రయోగశాలలో సారం తీయగా 2.9 మిల్లీ గ్రాముల సారం వస్తుంది. అడవితంగేడు మొక్క ఆకులను పూర్తిగా ఎండబెట్టి వీటి నుంచి తీసిన సారాన్ని హెచ్ఐవీ వ్యాప్తికి కారకాలుగా పనిచేసే మూడు ఎంజైములపై ప్రయోగించారు. రెండు కేజీల ఎండిన అడవితంగేడు ఆకుల నుంచి 1.5 మిల్లీ గ్రాముల సారం తీసుకుని హెచ్ఐవీ కారక ఎంజైములైన ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్లపై ప్రయోగించగా వీటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైముల పనితీరు మందగించినట్లుగా గమనించారు. ఈ పరిశోధనల ఫలితాలను ప్రముఖ సైన్స్ మ్యాగజైన్లు ఇంటర్నెషన్ జర్నల్స్ అయిన సైంటిఫిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇన్ఫెక్షియస్ డీసీజెస్ అనే బ్రిటన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనంతరం ఈ ప్రయోగ ఫలితాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాఖలకు పంపించారు. కేంద్రం నుంచి రూ.68 లక్షలు మంజూరు అడవితంగేడు, తిప్పతీగలలో ఉన్న ఏ మూలకాలకు ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే ఔషధ లక్షణాలు ఉన్నాయో కనుగొనేందుకు, కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంగీకరించాయి. అడవి తంగేడు, తిప్పతీగలలో హెచ్ ఐవీ వైరస్‌లో ఉండే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైము పనితీరును తగ్గిస్తున్న ఔషధ మూలం (మాలిక్యూల్) ఏదో కనిపెట్టే పనిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇస్తారీ మామిడాలతో నేతృత్వంలో స్కాలర్స్ రాజేంద్రాచారి, రాజేంద్రప్రసాద్, వెంకన్న, సాయినాథ్, ప్రసాద్‌లతో కూడిన బృందం ప్రయోగాలు చేస్తోంది. ఇందుకుగాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2013 అక్టోబరులో రూ.21 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ‘యాంటీ హెచ్ఐవీ ప్రొటేజ్ ఇన్హెలిటరీ ఆక్టివిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఎక్స్‌ట్రాట్స్’ అనే ఆంశంపై పరిశోధన సాగుతోంది. మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ ఏడాది మార్చిలో రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఐసోలేషన్ ప్యూరీఫికేషన్ ఆఫ్ ఆంటీ హెచ్ఐవీ కాంపౌండ్ ఫ్రం మెడిసినల్ ప్లాంట్ ఎక్స్‌ట్రాట్స్ అనే అంశంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. -
అంత్యోదయానికీ అడ్డుచక్రం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదల సంక్షేమమే లక్ష్యమని ఢంకా బజాయిస్తున్న టీడీపీ సర్కారు కొత్త పథకాల మాటెలా ఉన్నా.. ఉన్న పథకాల ఊపిరి తీసేస్తోంది. చివరికి నిరుపేదల కు నెలనెలా అందించాల్సిన బియ్యం గింజలనూ విదల్చడం లేదు. ఫలితంగా గత మూడు నెలలుగా అంత్యోదయ కార్డుదారులు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ కార్డులున్న లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ బియ్యం కోటా విడుదల చేయలేదు. కుష్ఠు, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి దీర్ఘ వ్యాధులతోపాటు అంగవైకల్యంతో బాధపడుతూ ఎటువంటి ఆధారం లేని అభాగ్యులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేస్తారు. ఒక్కో కార్డు మీద ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందజేస్తారు. జిల్లాలో 3,300 మందికి ఈ కార్డులు మంజూరు చేయగా, గత మూడు నెలలుగా వీరందరికీ బియ్యం అందడంలేదు. అంత్యోదయంలోనూ రెండు రకాలు అంత్యోదయ కార్డుల్లోనూ రెండు రకాలు ఉన్నాయి. మొదటి నుంచీ అంత్యోదయ కార్డు తీసుకున్నవారు ఒక రకం కాగా, ఇంతకుముందు తెల్లకార్డులు కలిగి ఉండి, ఆ తర్వాత వాటిని అంత్యోదయ కార్డుగా మార్చుకున్నవారు రెండో రకం. ఇలా తెల్ల కార్డు నుంచి అంత్యోదయకు మారిన కార్డుదారులు 940 మంది ఉన్నారు. వీరికి గతంలో తెల్లకార్డుపై ఇచ్చే బియ్యం విడుదల చేస్తున్నారే తప్ప.. అంత్యోదయకు ఇచ్చే 35 కిలోల బియ్యం ఇవ్వడం లేదు. అలాగే 273 మిస్సింగ్ కార్డులకు పూర్తిగా రేషన్ విడుదల కావడంలేదు. మిగిలిన అంత్యోదయ కార్డులకు మాత్రం మూడు నెలలుగా బియ్యం కోటా నిలిచిపోయింది. ఈ విషయం అధికారుల వద్ద ప్రస్తావిస్తే ఆధార్ అనుసంధానం చేయకపోవడం, లబ్ధిదారులు స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో గతంలో నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ కార్డులకు సరఫరా నిలిపివేశారని చెబుతున్నారు. అయితే అధికారులు తలచుకుంటే జిల్లాస్థాయిలోనే బియ్యం బఫర్ స్టాక్ నుంచి ఈ కార్డుదారులకు బియ్యం సర్దుబాటు చే సే అవకాశం ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం మానవీయ కోణంలో ఆలోచించడం లేదు. అభాగ్య లబ్ధిదారులు మాత్రం ఆశగా ఇప్పటికీ తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.అంత్యోదయ కార్డులకు బియ్యం మంజూరు కాకపోవడంపై జిల్లా సరఫరాల అధికారి సీహెచ్. అనందకుమార్ వద్ద ప్రస్తావించగా ఈ కార్డులకు ప్రభుత్వం బియ్యం కేటాయించడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ ప్రయత్నంగా పౌరసరఫరాల కమిషనరేట్‌కు లేఖలు రాశామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్డుల సమాచారాన్ని ఆన్లైన్లో కూడా పంపించామని వివరించారు. -
హెచ్ఐవీ నివారణకు కొత్త జెల్
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్‌ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్‌ను తయారు చేశారు. దీనిలో టీనోఫోవిర్‌ను నింపి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరక్షిత శృంగారం జరిపినా కూడా హెచ్ఐవీ వ్యాప్తి చెందదని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సారథి టోరల్ ఝవేరీ తెలిపారు. హెచ్ఐవీ, ఇతర వైరస్‌లను నివారించే మందులను జెల్‌తో మాత్రమే కాకుండా నురగ, క్రీము, స్పాంజ్, ఫిల్మ్‌ల ద్వారా కూడా ఉపయోగించవచ్చన్నారు. ఇంతవరకూ హెచ్ఐవీ నిరోధక జెల్లు జంతు ఉత్పత్తుల నుంచి సేకరించే జెలాటిన్ పదార్థంతో తయారు చేశారని, తాము మాత్రం పూర్తి శాకాహార పదార్థాలతోనే ఈ జెల్‌ను సృష్టించామని పేర్కొన్నారు. -
ప్రపంచం... అతడి గ్రామం!
ఒక పత్రికలో ఎయిడ్స్ బాధితుడికి సంబంధించిన వార్త ఒకటి చదివాడు సోమెన్ దేవ్నాథ్. సొంత ఇల్లు అంటూ లేని ఒక ఎయిడ్స్ బాధితుడు కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు దీనస్థితిలో చనిపోయాడు. ఆ వార్త చదివి సోమెన్ మనసు చెదిరిపోయింది. తాను ఉండే బసంతి (పశ్చిమబెంగాల్) గ్రామంలో ఈ వార్త గురించి కనిపించినవారికల్లా చెప్పి బాధపడిపోయాడు. నలుగురితో చెబితే బాధ తరిగిపోతుంది అంటారు. తరగడం మాట అలా ఉంచి తన వంతుగా ఏదైనా చేయాలనే తపన మాత్రం పెరిగిపోయింది. ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎయిడ్స్ గురించి వీలైనంత ఎక్కువగా అధ్యయనం చేశాడు. బెంగాల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి శిక్షణ పొందాడు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని వివిధ ప్రాంతాల ప్రజలతో పంచుకోవడానికి సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. వృక్షశాస్త్రం, ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీలు ఉన్న సోమెన్ను ‘‘హాయిగా ఉద్యోగం చేసుకొంటూ, కడుపులో చల్ల కదలకుండా బతకవచ్చు కదా!’’ అని చాలామంది సలహా ఇచ్చారు. సోమెన్ దృష్టిలో హాయిగా బతకడం అంటే అది కాదు. తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. హాయిగా బతకడం అంటే వాటికి చేరువ కావడమే. అందుకే తన క్షేమం గురించి ఆలోచించకుండా బయలుదేరాడు. అయితే ఈ ప్రయాణం నల్లేరు మీద బండి నడక కాలేదు. అనేకసార్లు చావు తప్పి కన్ను లొట్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2009లో సోమెన్ను పాకిస్థాన్‌లో తాలిబన్లు అపహరించారు. 24 రోజుల పాటు వారి చెరలో ఉండాల్సి వచ్చింది. ఒకొక్కరోజు ఒక్కో నరకం చూడాల్సి వచ్చింది. వారి దగ్గర ఒక రోజు క్లీనర్ పని చేయాల్సి వచ్చేది. మరోరోజు వంట పని...ఇలా ఎన్నో! ‘‘ఇక నా పని అయిపోయినట్లే’’ అనుకున్నాడు సోమెన్. చనిపోతున్నాననే బాధ కంటే తన లక్ష్యం చేరకుండానే చనిపోతానేమో అనే బాధ అతడిని పీడించింది. ఒకరోజు అదృష్టం అతడి తలుపు తట్టింది. ‘‘ఇతడు ప్రమాదకర వ్యక్తి కాదు’’ అని నిర్ధారించుకున్న తాలిబన్లు సోమెన్ను విడిచి పెట్టారు. ‘హమ్మయ్య’ అనుకుంటూ మళ్లీ సైకిల్ ఎక్కాడు. ఇక్కడితో అతని కష్టాలేమీ ఆగిపోలేదు. వివిధ దేశాల్లో ఆరుసార్లు దొంగల బారిన పడ్డాడు. అల్లరిమూకల చేత దాడికి గురయ్యాడు. ఆకలిబాధలు ఎదుర్కొన్నాడు. పదహారు సంవత్సరాల్లో ప్రపంచాన్ని చుట్టి రావాలనే అతని సంకల్పాన్ని ఇవేమీ నీరుగార్చలేకపోయాయి. ‘‘ఇక నా వల్ల కాదు... అనుకునే పరిస్థితులు చాలా వచ్చాయి. అవి నన్ను పరీక్షిస్తున్నట్లుగా అనిపించాయి. అయితే ఆ పరీక్షల్లో నేను నెగ్గాను. ఒక మంచి పనికి ముందు ఇలాంటి కష్టాలు సాధారణమే అనే విషయం నాకు తెలుసు. ప్రజల నైతిక మద్దతుతో నా యాత్ర జయప్రదం అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అంటున్నాడు ప్రసుత్తం ఆఫ్రికాలో పర్యటిస్తున్న సోమెన్. కేవలం ఎయిడ్స్ గురించిన అవగాహన తరగతులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్య శాంతి, సామరస్యం అవసరమంటూ ప్రచారం చేస్తున్నాడు. ‘‘మనుషులు అనేక రకాలుగా విడిపోతున్నారు. శాంతి లోపిస్తుంది. హింస భయపెడుతుంది. ప్రజలందరూ రకరకాల అడ్డుగోడలను తొలగించుకొని ఐకమత్యంగా సుఖశాంతులతో నివసించాలి. ఇదే జీవితపరమసత్యం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనుకుంటున్నాను’’ అంటున్నాడు సోమెన్. ‘‘మరి మీ కుటుంబం సంగతి ఏమిటి? వాళ్లు ఎప్పుడు గుర్తుకు రారా?’’ అని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా - ‘‘ఈ ప్రపంచమే నా కుటుంబం’’ అంటాడు తాత్వికంగా. ‘‘కష్టపడే వాళ్లు, నలుగురికి సహాయపడే వాళు,్ల అందరూ నా వాళ్లే అనుకునేవాళ్లు... ప్రాంతాలతో నిమిత్తం లేకుండా నాకు బంధువులు. వారి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. నేను ప్రపంచపౌరుడిని’’ అని కూడా అంటాడు. సోమెన్ తన యాత్రలో తనకు తెలిసిన విషయాలను చెబుతున్నాడు. తెలియని విషయాలను ప్రజల నుంచి నేర్చుకుంటున్నాడు. ఒక దేశానికి సంబంధించిన అనుభవాలను వేరే దేశంలో పంచుకుంటున్నాడు. తనను ఆకర్షించిన వ్యక్తుల గురించి అదే పనిగా చెబుతుంటాడు. ‘‘నా సందేశం ఒకరికి చేరితే చాలు, అది వారి కుటుంబానికి చేరుతుంది, ఆ కుటుంబం ద్వారా ఊరికి చేరుతుంది. ఇలా సందేశం విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటాడు. పలుదేశాల అధ్యక్షులు, మంత్రులు, ముఖ్య అధికారులను కలుసుకోవడం కంటే పేదవాళ్లు, శ్రామికులతో మాట్లాడడం తనకు ఆనందాన్ని ఇచ్చే విషయం. 2004లో తన సైకిల్ యాత్రను మొదలుపెట్టిన సోమెన్ ఇప్పటి వరకు 75 దేశాలు పర్యటించాడు. తన యాత్ర 2020లో పూర్తవుతుందని చెబుతున్నాడు సోమెన్. ఈ యాత్ర తరువాత గ్లోబల్ విలేజ్ నిర్మించాలనుకుంటున్నాడు. ‘‘ఇదొక ఆదర్శ గ్రామం. స్వయంసమృద్ధి, పర్యావరణ స్పృహతో ఏర్పాటయ్యే ఈ గ్రామంలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు... మొదలైనవి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులను ఈ గ్రామం ప్రతిబింబిస్తుంది. ఈ గ్రామాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను కలుసుకున్న ప్రజలకు అంకితం చేస్తాను’’ అంటున్నాడు సోమెన్. సోమెన్ ప్రపంచయాత్ర విజయవంతం కావాలని, అతడు కోరుకున్న ‘విశ్వగ్రామం’ నిర్మాణం కావాలని నిండు మనసుతో ఆశిద్దాం. -
అనారోగ్యమని వస్తే.. ఎయిడ్స్ అన్నారు!
-
హెచ్ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది...
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని అడ్డుకోవడమే కాదు.. దానిని పూర్తిగా హతమార్చగలిగే రక్షణ కవచం త్వరలోనే అందుబాటులోకి రానుంది. హెచ్ఐవీని చంపగల సమర్థమైన కండోమ్‌ను అభివృద్ధిపర్చినట్లు ఆస్ట్రేలియాలోని ‘స్టార్ఫార్మా’ కంపెనీ ప్రకటించింది. ‘వైవాజెల్ కండోమ్’గా పేరుపెట్టిన ఈ నిరోధ్కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) అనుమతి కూడా లభించిందని, కొద్ది నెలల్లోనే ఈ కండోమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో తయారు చేసిన జెల్‌ను వైవాజెల్ నిరోధ్ తయారీలో ఉపయోగించారట. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ జెల్ హెచ్ఐవీ వైరస్‌లను 99.9 శాతం కచ్చితత్వంతో చంపేసిందట. హెర్పిస్ (పొక్కులు), హ్యూమన్ పాపిలోమా వైరస్‌లను కూడా ఈ నిరోధ్ హతమారుస్తుందట. హెచ్ఐవీని చంపే కండోమ్ తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారని, దీనిని ఉపయోగిస్తే హెచ్ఐవీ, సుఖవ్యాధుల నుంచి వంద శాతం రక్షణ లభించినట్లేనని కంపెనీవారు ధీమాగా చెబుతున్నారు. -
వివాదాల వలలో హర్షవర్ధన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ ప్రచారంలో కండోమ్స్ వినియోగంపై కంటే భార్యాభర్తలు నిబద్ధతతో కూడిన లైంగిక సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలంటూ ఆయన ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యైలపె రేగిన వివాదం సద్దుమణగకముందే పాఠశాలలో లైంగిక విద్యను నిషేధించాలని ఆయన వెబ్సైట్ లోవెల్లడించిన అభిప్రాయం సరికొత్త వివాదాన్ని సృష్టించింది. ఢిల్లీ పాఠశాలలకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ విజ న్ డాక్యుమెంట్లో ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ స్కూళ్లలో ప్రస్తుతం బోధిస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధిస్తామని, యోగాను తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని, భారతీయ సంస్కృతిని గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మహిళా సంస్థ లు, సామాజిక కార్యకర్తలు దీనిని వ్యతిరేకించారు. అయితే హర్షవర్ధన్ తాను సెక్స్ ఎడ్యుకేషన్ నిషేధించాలని అనలేదంటూ వివరణ ఇచ్చారు. అంత కు ముందు ఆయన న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్ఐవి ఎయిడ్స్‌పై నియంత్రణ కోసం కండోమ్స్ వాడకాని కన్నా భార్యాభర్తల మధ్య నిబద్ధతతో కూడిన శారీరక సంబంధాలను ప్రోత్సహించాలనేది తన అభిప్రాయమని, ఇది భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా శాస్త్రీయమైన నివారణ మార్గమని పేర్కొన్నారు. కండోం లతో సురక్షితమైన సెక్స్ జరుపుతున్నామన్న నమ్మ కం కలిగిస్తాయని, అన్నిటికంటే సురక్షితమైన సెక్స్ భార్యాభర్తల మధ్య నిబద్ధదత తో కూడిన లైంగిక సంబంధం అవసరమని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వెలిబుచ్చిన అభిప్రాయంపై పలు ఎన్జీఓలు, ఆరోగ్య కారకర్తలు గగ్గోలు పెట్టారు. ‘హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ ప్రచార ఉద్యమం కండోమ్స్పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించకూడదు. కండోమ్ వాడుతున్నంతవరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధం కలిగిఉన్నా ఫర్వాలేదనే తప్పుడు సందేశాన్ని ఇది అందిస్తుంది. లైంగిక సంబంధాలలో భార్యభర్తలు ఒకరికి కట్టుబడి ఉండాలి’ అనే తన వ్యాఖ్యైలపె హర్షవర్ధన్ వివరణ ఇస్తూ కండోమ్స్ పగిలిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల లైంగిక సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమని పేర్కొన్నారు. -
కొత్తా... దేవతండీ!
సామాజికం ‘‘మా అమ్మాయికి ఆ భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఇచ్చాడు’’ అంటున్నాడు ఎలని నాన్న ఎడటో సాంటోస్. క్యాన్సర్ నుంచి ఎయిడ్స్ వరకు ఎలాంటి రోగాన్ని అయినా సరే, ఎలని సాంటోస్ నయం చేస్తుందనే వార్తలతో బ్రెజిల్‌లోని ఊరూవాడా మారుమోగిపోతోంది. ఎనిమిది సంవత్సరాల ‘ఎలని’ ఇప్పుడు చాలామంది దృష్టిలో బాల దేవత! రియో డి జెనిరోలో తన తండ్రి పని చేసే చర్చిలో రోగులతో మాట్లాడి, వారి బాధలను తెలుసుకొని ప్రార్థనలు చేస్తుంటుంది ఎలని. ‘‘రోగులు వారానికి రెండుసార్లు ఈ అమ్మాయి చేతిని తాకితే చాలు. ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది’’ అంటున్నారు ఎలనీని విశ్వసించే వాళ్లు. ‘‘ప్రజల రోగాలను నయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రోజులో చాలాసేపు రకరకాల రోగులను చేతితో ముట్టుకుంటూనే ఉంటాను. ఆ తరువాత దేవుడిని ప్రార్థించగానే వాళ్లు స్వస్థులవుతారు’’ అంటోంది ఎలని. -
ఎయిడ్స్ నిర్మూలనకు కృషి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ నిర్మూలనలో యువతను భాగస్వామ్యం చేసేందుకు విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీశాక్స్) ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్‌క్లబ్ మాస్టర్ ట్రైనీలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ-ఎయిడ్స్‌పై వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచినందుకు 16 మంది మాస్టర్ట్రైనీలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరీలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐ.నాగేశ్వరరావు(జేకేసీ కళాశాల-గుంటూరు), వి. వెంకటేష్ (ఎస్‌కేవీబీఆర్ కళాశాల-నరసరావుపేట), బి. మాధవిగ్లోరి(ఎస్వీఆర్ఎం కళాశాల-నగరం)లను సత్కరించారు. అదే విధంగా విద్యార్థులను చైతన్య పర్చడంలో కృషిచేసినందుకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాపట్ల), పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(గుంటూరు)లకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ ఎం. ప్రసాదరావు, కళాశాల ఇన్చార్జ్ సీహెచ్ పుల్లారెడ్డి, రెడ్‌రిబ్బన్ క్లబ్ జిల్లా కో-ఆర్డినేటర్ బాలిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీపై విద్యార్థి వినూత్న ప్రచారం
చేగుంట, న్యూస్‌లైన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై ఓ బాలుడు వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఒకటిన అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒక్క రోజు కార్యక్రమాలతో మార్పు రాదని గమనించిన చేగుంటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి సాకేత్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు సమయం చిక్కినప్పుడల్లా ప్లకార్డుతో చేగుంట, వడియారం గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం వడియారం గ్రామంలో హెచ్ఐవీ నివారణ కోసం ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఎయిడ్స్/హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ వస్తే ఎలాంటి చికిత్స పొందాలో స్థానికులకు వివరిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారుల కన్నా ఈ విద్యార్థి ప్రచారమే బాగుందని అతడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందించారు. -
హెచ్ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులు అధిక జీవిత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. బీమా పథకం తీసుకొనేటప్పుడు ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నా అధిక ప్రీమియం చెల్లింపు వర్తిస్తుందని ఐఆర్డీఐ చైర్మన్ టీఎస్ విజయన్ శుక్రవారం స్పష్టంచేశారు. బీమా ప్రొడక్ట్‌లు కొనేటప్పటికే వ్యాధులు ఏమైనా ఉన్నా, బీమా కంపెనీలు లైఫ్ కవర్ సదుపాయాన్ని అందిస్తాయని అయితే వాణిజ్యపరమైన గిట్టుబాటుకు వీలుగా తగిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే బీమా కవరేజ్‌లు కల్పిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు సైతం ఈ దశలో ముందుకు వస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులను జీవిత బీమా కవర్లోకి తీసుకురావడంసహా పలు అంశాలపై అక్టోబర్‌లో ఐఆర్డీఏ ముసాయిదా మార్గదర్శకాలను ఆవిష్కరించింది. వీటిపై డిసెంబర్‌లోపు సంబంధిత వర్గాలు సూచనలు, సలహాలూ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఈ తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు!
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల (పీఎల్హెచ్ఏ) కోసం కూడా బీమా కవరేజి లభించేలా చూడాలని జీవిత బీమా సంస్థలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఆదేశించింది. ఇందుకోసం తగిన పాలసీలను రూపొందించాలంటూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలను బట్టి అర్హత ఉన్న ఏ ఒక్క పీఎల్హెచ్ఏకి కూడా బీమా కవరేజిని నిరాకరించరాదంటూ ఐఆర్డీఏ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా..లోక్‌సభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు వివ రించారు. సర్క్యులర్ ప్రకారం.. పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుకి హెచ్ఐవీ లేకున్నా .. ఆ తర్వాత అది సంక్రమించిన పక్షంలో క్లెయిమ్‌లను నిరాకరించరాదు. బీమా సంస్థల నుంచి ఈ ప్రతిపాదనలపై ఐఆర్డీఏ అభిప్రాయాలు ఆహ్వానించింది. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి : వి.వి.వినాయక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎయిడ్స్ రహిత సమాజం ప్రతి పౌరుడూ కృషి చేయాలని ప్రముఖ సినీ దర్శకులు వి.వి.వినాయక్ పిలుపునిచ్చారు. సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్నారు. ఇందుకు అన్ని వర్గాల వారు తోడ్పడాలన్నారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. వీరిలో పి.రవీందర్, బి.ఉమ, ఎస్.రామారావు, వెంకటలక్ష్మి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ ప్రాజెక్టు మేనేజర్ నాగిరెడ్డి, అదనపు డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వరల్డ్ ఎయిడ్స్ డే
-
వివరం: మాట్లాడుకోవాల్సిన మహమ్మారి
డిసెంబర్ 1 ఎయిడ్స్ డే డిసెంబర్ 1 ‘ఎయిడ్స్ దినోత్సవం’ కాదు; అది ఎయిడ్స్ దినం మాత్రమే! అందులో ఉత్సవం ఎక్కడ? ప్రపంచాన్ని భయపెట్టే యుద్ధ బీభత్సాలు, ప్రకృతి ఉత్పాతాలు, కరువు కాటకాల లాంటి జాబితాలో ‘ఎయిడ్స్’ కూడా చేరిపోయింది. అధికంగా వినడం వల్ల కొంత పలుచబారిపోయినట్టనిపించినా, అదింకా మెడికల్ ఛాలెంజే! మధ్యయుగాల్లో మశూచి, ప్లేగులాగా ఈ ఆధునిక కాలంలో ఎయిడ్స్ అటు చికిత్సలేని వ్యాధి; కొంత ‘నైతికత’తో ముడిపడివుండటం వల్ల ఇటు వివక్షను ఎదుర్కునేది కూడా! అందుకే దానిగురించి ఇంతగా ప్రచారం! మనమూ హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి మాట్లాడుకుందాం; మాట్లాడకుండా దాచుకోవడమే కదా ప్రమాదం! ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘ఎయిడ్స్’తో సుమారు 3.6 కోట్ల మంది చనిపోయారు. ఈ సంఖ్య దాదాపుగా కేరళ లాంటి ఒక రాష్ట్ర జనాభా మొత్తం! అదే ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఒక్క 2012 సంవత్సరంలోనే ఎయిడ్స్ సోకినవాళ్లు 16 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య ప్రకాశం లాంటి జిల్లా జనాభాలో దాదాపుగా సగం! ఇంత ప్రచారంలో కూడా, ప్రతిరోజూ 900 మంది పిల్లలు పుడుతూనే కొత్తగా హెచ్ఐవి బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది. ఈ సంఖ్య ఒక పెద్ద పాఠశాలలోని విద్యార్థుల మొత్తానికి సమానం! మరణించేవారంతా ఎక్కువగా పేద, వెనకబడిన దేశాల్లోనివారే! హెచ్.ఐ.వి. అంటే ఏమిటో, ఎయిడ్స్ అనే పదాన్ని ఎలా విస్తరించాలో తెలియనివాళ్లు కూడా వీటివల్ల అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. హెచ్ఐవి ఏమిటి? ఎయిడ్స్ ఏమిటి? హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) మనిషిలో రోగనిరోధకశక్తిని హరింపజేసే ఒక వైరస్. ఇది ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలు దీని స్థావరాలు. ఇది ఎవరికైనా ఉందని నిర్ధారణ కావడమేహెచ్ఐవి పాజిటివ్. అయితే, దీనికిదే జబ్బు కాదు. వైరస్ సోకిన ఒకటి నుంచి నాలుగు వారాల్లో అది మనిషి శరీరంలో పూర్తిగా వ్యాపిస్తుంది. తన సంఖ్యను తాను పెంచుకుంటూ పోతుంది. పెంచుకోవడమే కాకుండా, మనిషికి రోగనిరోధక శక్తినిచ్చే సీడీ-4 కణాలను చంపుతూ ఉంటుంది. దీనివల్ల, మరేదైనా వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దాన్ని సహజంగా ఎదుర్కోగలిగే రక్షణ వ్యవస్థ మనిషికి ఉండదు. దాంతో అతడికి ఏ స్వల్ప రుగ్మత సోకినా ప్రాణాలమీదికి వస్తుంది. ఇదీ ఎయిడ్స్! (ఎ.ఐ.డి.ఎస్.- ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్). తొలుత ‘4హెచ్’ వ్యాధి హెచ్ఐవి సోకిన తర్వాత, మనిషిలో సీడీ కౌంట్ 200/ఎంఎం క్యూబ్ దాకా పడిపోయినప్పుడు ఎయిడ్స్‌కు దాదాపుగా చేరువైనట్టు! ఈ స్థితి కొందరికి ఒకట్రెండేళ్లకే రావొచ్చు; కొందరికి 10-12 ఏళ్లదాకా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. 1981లో అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తొలిసారిగా ఎయిడ్స్ వ్యాధిని గుర్తించింది. తర్వాత, దీనికి కారణం హెచ్ఐవి వైరస్ అని తేల్చింది. 1970ల ప్రాంతంలో కొందరు అమెరికా యువకుల్లో- ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వాడేవారు, హోమోసెక్సువల్సులో రోగనిరోధక శక్తి పోయి, అరుదుగా సంభవించే చర్మవ్యాధులు వారికి సోకాయి. అంతుబట్టని, పేరులేని రుగ్మతలుగానే ఇవి కొన్నాళ్లు కొనసాగాయి. కొంతకాలం దీన్ని ‘4హెచ్ వ్యాధి’ అని పిలిచేవారు. ఎందుకంటే-హైతియన్స్(అమెరికాలోని హైతీమూలాలున్న ప్రజలు), హోమోసెక్సువల్స్(స్వలింగ సంపర్కులు), హీమోఫీలియాక్స్(రక్తం ఆగనివాళ్లు), హెరాయిన్ యూజర్స్(మాదకద్రవ్యం హెరాయిన్ వాడేవాళ్లు)లో మాత్రమే ఈ వ్యాధిని తొలుత ఎక్కువగా గుర్తించడంవల్ల! మరికొన్నాళ్లు ‘గ్రిడ్’ (జి.ఆర్.ఐ.డి.- గే రిలేటెడ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ)గా కూడా పిలిచారు. ఇది స్వలింగ సంపర్కులకు మాత్రమే పరిమితమైన జబ్బు కాకపోవడం వల్ల దీనికి మించిన పేరు అవసరమైంది. అలా ‘ఎయిడ్స్’ అనే మాట ఉనికిలోకి వచ్చింది. ఆఫ్రికా కోతుల్లో మొదలు... ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో పశ్చిమ మధ్య ఆఫ్రికాలో హెచ్ఐవి వైరస్ ప్రాణం పోసుకుందని అంచనా వేస్తున్నారు. కామెరూన్ దేశంలో కొన్ని రకాల పెద్ద కోతులకు ఎస్.ఐ.వి. (సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకింది. ఇందులో వైల్డ్ చింపాంజీల్లాంటివాటి శరీరంలో ‘ఎస్ఐవి’ నిరోధకత లేదు; అదే, గుడ్లగూబకోతుల్లాంటివి మాత్రం తట్టుకోగలవు. వేటగాళ్లకుగానీ, వన్యమృగాల మాంస విక్రేతలకుగానీ ఈ వైరస్ పాకివుంటుంది. అయితే మనిషి శరీరంలోని రోగనిరోధకత ఈపాటి వైరస్‌ను సులభంగా అణచివేయగలదు! బ్రిటన్ వలస దేశాలుగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో సమాజ మార్పులు జరిగి, వ్యభిచారం తీవ్రంగా పెరిగింది. 1928 ప్రాంతంలో కాంగో రాజధాని కిన్షాసాలో 45 శాతం మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. మామూలు శృంగారంలో ఈ వైరస్ వ్యాప్తి తక్కువే అయినా, భాగస్వాముల్లో ఒకరికి సుఖవ్యాధులు ఉన్నప్పుడు, మర్మాంగాల్లో పొక్కులు ఉన్నప్పుడు వైరస్ బలం ఎక్కువ. అలాగే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా శుభ్రం చేయని సిరంజీలతో టీకాలు గంపగుత్తగా వేయడం వల్ల ఈ వైరస్ అతి త్వరగా వ్యాప్తిచెందిందనీ, అక్కణ్నుంచి ప్రపంచాన్ని చుట్టుకుపోయిందనీ చెబుతారు. హెచ్ఐవి వైరస్‌లో రెండు రకాలున్నాయి. హెచ్ఐవి -1. ఇది చింపాంజీ, గొరిల్లాలాంటివాటిల్లో కనబడింది. హెచ్ఐవి-2 మరికొన్ని రకాల కోతులకు సోకుతుంది. అయితే, వాటికి దాన్ని తట్టుకునే నిరోధకశక్తి ఉంది. హెచ్ఐవి-1ను తిరిగి ‘ఎం’, ‘ఎన్’, ‘ఒ’ , ‘పి’ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. మిగతావి కూడా ఎయిడ్స్‌ను కలగజేసినప్పటికీ ‘ఎం’ మనకు ఎక్కువ ప్రమాదకారి. 90 శాతం ఎయిడ్స్ రోగుల్లో ఉండేది ఇదే! హెచ్ఐవి అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నది నిజానికి ‘హెచ్ఐవి-1 ఎం’. మూడు ముఖ్యమైన మార్గాలు ‘‘హోమోసెక్సువల్స్‌కు దేవుడు విధించిన శిక్ష మాత్రమే కాదు ఎయిడ్స్; హోమోసెక్సువల్స్‌ను సహిస్తున్నందుకు దేవుడు సమాజానికి విధించిన శిక్ష కూడా’’ అన్నారు మతగురువు జెర్రీ ఫాల్వెల్. టాన్స్‌జెండర్స్, హోమోసెక్సువల్స్, బై సెక్సువల్స్... భాగస్వాముల్ని మార్చుతారు కాబట్టి, హై రిస్కు గ్రూపుగా ఉన్నప్పటికీ, అది వాళ్లకు మాత్రమే పరిమితం చేయడం వివక్ష మాత్రమే! సురక్షిత శృంగారంలో పాల్గొనని ఎవరికైనా రిస్కులో తేడాలేదు. అత్యాధునిక సమాజమనుకునే అమెరికాలో కూడా ఇంత ప్రచారం జరిగినా, యువకుల్లో యాభై శాతం మంది కండోమ్‌ను ఉపయోగించట్లేదు. వైరస్ శరీరంలో ఉన్నవారితో లైంగిక సంబంధాలవల్ల, రక్తమార్పిడి వల్ల, బిడ్డ నుంచి తల్లికి ఇది ముఖ్యంగా సోకుతుంది. వెంటనే లక్షణాలు కనిపించవు. హెచ్ఐవి సోకినట్టు కూడా తెలియదు. కొంత కాలం గడిచాక జ్వరం రావడం, ముఖం, మెడ, ఛాతీ మీద రాష్ రావడం, లింఫ్‌నోడ్స్ వాచడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్లనొప్పులు వస్తాయి. బరువు తగ్గుతుంది. వికారం, వాంతులు ఇతర లక్షణాలు. వ్యాధి ముదురుతున్నకొద్దీ జ్వరం అధికమవడం, నీళ్ల విరేచనాలు, మర్మావయల్లో మంట, కంటిచూపు మందగించడం, శ్వాస పీల్చడం కష్టంకావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, డయేరియా కనబడతాయి. హెచ్ఐవి రోగుల్లో అనుబంధ రోగాలు కూడా ఉండే అవకాశముంది. మూత్రపిండాల వ్యాధి (హెచ్ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి), మెదడు పనితీరులో మార్పులు, హెపటైటిస్ బి/సి, క్షయ. సాధారణంగా అత్యధిక ప్రజానీకానికి (85శాతం) క్షయను కలిగించే ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే టీబీ వ్యాప్తికారక బ్యాక్టీరియా శరీరాల్లో ఉంటుంది. సహజంగా ఉండే వ్యాధి రోగనిరోధక శక్తి వల్ల బ్యాక్టీరియా నిద్రాణంగా ఉంటుంది. దీనికిదే టీబీ అవదు. హెచ్ఐవి సోకి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టగానే బ్యాక్టీరియా విజృంభిస్తుంది. అప్పుడు లక్షణాలు కనబడతాయి. అందుకే టీబీ ఉన్నవాళ్లకు హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చికిత్స వైరస్ సోకివుంటుందని అనుమానం వ్యక్తం చేసినవాళ్లకు ముందుగా 72 గంటల్లోపు(మూడు రోజుల్లోపు) ఎమర్జెన్సీ హెచ్ఐవి పిల్స్ ఇస్తారు (పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్). ఈ చికిత్స నాలుగు వారాల పాటు సాగుతుంది. హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష వైరస్ సోకిన నాలుగు నుంచి ఆరు వారాల్లో చేస్తారు. ‘పాజిటివ్’ అయితే గనక దానికి రోగి శరీరంలో రోగనిరోధకశక్తిని బయటినుంచి పెంచడమే మార్గం. దానికోసం ‘యాంటీ రెట్రోవైరల్’(ఎ.ఆర్.టి.) మందులు ఇస్తారు. హెచ్ఐవి తనను తాను కాపీ చేసుకుంటూ సంఖ్య పెంచుకోవడమేగాక, మందులనుంచి నిరోధకతను కూడా పెంపొందించుకుంటుంది. అందుకని ఆ వైరస్‌ను తప్పుదారి పట్టించేందుకు రకరకాల ఎ.ఆర్.టి. మందులను భిన్న కాంబినేషన్లుగా ఇస్తారు. ఈ మందులు ఇవ్వడం కూడా మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, కాక్టెయిల్ ఆఫ్ మెడిసిన్స్! వీటిని దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతి మారిపోవచ్చు. కానీ జీవితకాలాన్ని పెంచుకోవడానికి వాటిని భరించాల్సిందే! ఇక, గర్భధారణ, ప్రసవం, పాలిచ్చే సమయంలో తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ సంక్రమించవచ్చు. ఇది 20-45 శాతం రిస్కు. నిర్ధారణ అవగానే తల్లి చికిత్స తీసుకోవడం, ముందే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయడం, పాలివ్వకపోవడం, బిడ్డకూ ప్రొఫిలాక్సిస్ మందులు ఇప్పించడం ద్వారా హెచ్ఐవి సంక్రమణ రిస్కును 2 శాతానికి తగ్గించవచ్చు. మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్! హెచ్ఐవి ఉన్నప్పటికీ, అది ఎయిడ్స్లాగా మారినప్పటికీ అలాంటివారితో కరచాలనం చేసినా, కౌగిలించుకున్నా, ఒకే చోట నివసించినా, ఒకే పాత్రలు పంచుకున్నా వైరస్ సోకదు. ఆ రోగికి సేవలు చేసినా ప్రమాదం లేదు. వారితో కలిసి టాయ్‌లెట్ వాడుకోవచ్చు, టవల్స్ వాడుకోవచ్చు. రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఏమీకాదు. ఉమ్మి, కన్నీళ్లు హెచ్ఐవిని సంక్రమింపజేయవు. శాశ్వత చికిత్స, వ్యాక్సిన్ ఇప్పటికి అందుబాటులో లేకపోయినా... బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ , క్రమంగా మందులు వాడుకుంటూ, నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవాళ్లకు హెచ్ఐవి అంత భయపెట్టేదేమీ కాదు! ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2012 నాటికి జనాభాలో శాతాల ప్రకారం అత్యధికంగాహెచ్ఐవి బారినపడ్డ పదిదేశాలు: దేశం శాతం స్వాజిలాండ్ 26.5 లెసోతో 23.1 బోట్స్వానా 23.0 దక్షిణాఫ్రికా 17.9 జింబాబ్వే 14.7 నమీబియా 13.3 జాంబియా 12.7 మొజాంబిక్ 11.1 మాలవి 10.8 ఉగాండా 7.2 నాలుగు కోట్ల బాధితులు! ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2012 నాటికి హెచ్ఐవీ బాధితులు సుమారు 3.53 కోట్ల మంది. అత్యధికంగా హెచ్ఐవి బారినపడ్డ పదిదేశాలు: దేశం సంఖ్య- లక్షల్లో దక్షిణాఫ్రికా 61 నైజీరియా 34 ఇండియా 21 కెన్యా 16 మొజాంబిక్ 16 ఉగాండా 15 టాంజానియా 15 జింబాబ్వే 14 మాలవి 11 జాంబియా 11 -
ఏజెన్సీకి ‘ఎయిడ్స్’ వణుకు
భద్రాచలం, న్యూస్‌లైన్: ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది. వ్యాధి పీడుతుల ఆయుష్షు పెంచే అధునాతన మందులు అందుబాటులోకి వచ్చినా వాటిని సకాలంలో వారి దరికి చేర్చలేకపోతుంది. భద్రాచలం ఏజెన్సీ ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకున్న ప్రతి వందమందిలో ఐదుగురు హెచ్ఐవీ పీడితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు 2009లో ఎయిడ్స్ నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెచ్ఐవీ నిర్దారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ వ్యాధి గ్రస్తులతో పాటు ఆస్పత్రులకు వైద్య సేవలు నిమిత్తం వచ్చే రోగులకు ఐసీటీసీ కేంద్రాలలో హెచ్ఐవీ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీపీటీసీటీ కేంద్రాల్లో గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నివారణ, అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా ఏఆర్టీ కేంద్రాలను ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని కూడా నియమించారు. కానీ పరీక్షల్లో నిర్ధారణ అయిన వ్యాధి గ్రస్తులనే తప్ప పల్లెలపై అధికారులు దృష్టి సారించడం లేదు. హెచ్ఐవీ పరీక్షల నిమిత్తం 2002లో స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని ప్రారంభించారు. 2013 నవంబర్ 30 వరకు 42,416 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,306 మందికి హెచ్ఐవీ సోకినట్లుగా నిర్దారణ అయింది. రెండేళ్లుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పరిశీలించినట్లైతే 2011లో 5,216 మందికి పరీక్షలు నిర్వహించగా 219 మందికి, 2012లో 4,925 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 279 మందికి హెచ్ఐవీ సోకినట్లుగా తేలింది. 2013 నవంబర్ 30 వరకు 7,917 మందికి పరీక్షలు నిర్వహించగా 240 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాది 8 మంది గర్భిణులకు కూడా హెచ్ఐవీ సోకింది. పరీక్షలకే పరిమితమవుతున్న కేంద్రాలు ఎయిడ్స్ నిర్ధారణకు జిల్లా మొత్తంమీద 67 సమగ్ర హెచ్ఐవీ కౌన్సెలింగ్, పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 8 ఐసీటీసీలు, మూడు తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా నివారణ కేంద్రాలు, 49 ఫెసిలిలేటెడ్ సమగ్ర హెచ్ఐవీ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు వంటి చోట్ల ప్రత్యేక సిబ్బది పనిచేసే 11 కేంద్రాలు సైతం ఉన్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నా వ్యాధి నిర్ధారణ తర్వాత హెచ్ఐవీ పీడితులకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడంతో వారు సకాలంలో వైద్యసేవలు పొందలేక మృత్యువుకు చేరువవుతున్నారు. పింఛన్ కోసం సవాలక్ష ఆంక్షలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందజేస్తుంది. కానీ నాలుగు నెలలుగా పింఛన్ బకాయిలు పెంఢింగ్లోనే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించే భద్రాచలం ఏఆర్టీ సెంటర్ పరిధిలో 210 మంది పింఛన్‌దారులు ఉన్నారు. మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్సలు పొందినట్లుగా నమోదైతేనే పింఛన్ సక్రమంగా వస్తుంది. అనివార్యకారణాలతో చికిత్సలకు రానివారికి తిరిగి పింఛన్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏడాది కాలపరిమితితో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు పాసులు ఇస్తున్నారు. ఏజెన్సీ పరిధి వరకు ఇలా 273 పాసు లు ఇవ్వగా రెండో ఏడాది 16 మందికే రెన్యువల్ చేశారు. మిగిలిన వారికి అందించటంలో సదరు అధికారులు శ్రద్ధ చూపటం లేదు. పౌష్టికాహార కేంద్రాలు ఎత్తివేత వ్యాధిగ్రస్తుల ఆయుష్షు పెంచేందుకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో)ఆధ్వర్యంలో జిల్లాలోని ఖమ్మం, భద్రాచలంలో పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర, సత్తుపల్లిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటువంటి కేంద్రాలను నెలకొల్పారు. నిధులు లేక నాకో ఆధ్వర్యంలో ఉన్న కేంద్రాలు మూతపడ్డాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను వేరుగా ఉంచి పౌష్టికాహారం అందించటంలో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నందునే వాటిని ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. ఈ కారణంగానే ఏజెన్సీ పరిధిలో 243 మంది మృత్యువాత పడ్డారు. వీరికి టీబీ వ్యాధి ముదరటం కారణంగానే మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. -
సూదిమందుశాపమవుతోంది
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య కాస్తలో కాస్త తగ్గుముఖం పడుతున్నా ఈ రోగంబారిన పడుతున్నవారిలో ఎక్కువ మందికి సూదిమందు ద్వారానే ఈ మహమ్మారి వ్యాపిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) తెలిపిన తాజా వివరాల ప్రకారం... దేశంలోని సాధారణ పౌరుల్లో 0.40 శాతం మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిబారిన పడుతున్నవారిలో 7.17 మందికి సూదిమందు ద్వారానే ఈ వ్యాధి సోకినట్లు తేలింది. భారత్ వంటి దేశాల్లో సూదిమందుపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ అనారోగ్య సమస్యలకు సూదిమందే పరిష్కారం కాకపోయినప్పటికీ వైద్యు ల అత్యుత్సాహం సూదిమందు సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. రోగుల్లో కూడా సూదిమందు వేసుకుంటేనే తమ జబ్బు నయమవుతుందన్న ఓ అపోహ బలంగా నెల కొంది. ఇదే ఎయిడ్స్ వంటి మహమ్మారి విస్తరించడానికి కారణమవుతోంది. ‘హృదయ’ ప్రాజెక్టు అధికారి ఫ్రాన్సి స్ జోసెఫ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘భారతదేశం లో మత్తుపదార్థాల, హానికర మందుల నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావడంలేదు. ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పోలీసులు నిష్క్రియగా ఉంటున్నారు. పోలీసులకు ఈ చట్టంపై అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమవుతోంది. సూదిమందు సం స్కృతిపై ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని ఈ చట్టం నొక్కి చెబుతున్నా ఎవరూ పాటించడంలేదు. ఈ చట్టాన్ని మరింతకఠినంగా మార్చాల్సిన అవసరముంది. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు విధించడంతోపాటు క్రిమినల్ కేసులను నమోదు చేసి, జైలుకు పంపాల్సిన అవసరముంది. ఇందుకోసం పోలీ సులకు కూడా కొంత స్వేచ్ఛనివ్వాల్సి ఉంది. అంతేకాక సూదిమందు వినియోగంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించినప్పుడే ఎయిడ్స్ నియంత్రణ చర్యలు సత్ఫలితాలనిస్తాయ’న్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే... వ్యాధిబారిన పడిన బాధితులకు రక్షణ కల్పించే హెచ్ఐవీ/ఎయిడ్స్ బిల్లును ఈ నెల 5 నుంచి 20 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురావాల్సిందేనని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 2006లోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనలకు తుదిరూపు తెచ్చిందని, అయినప్పటికీ ఇంకా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈ శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు తెచ్చి హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. బిల్లు కార్యరూపం దాలిస్తే హెచ్ఐవీ సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం బాధితులకు ఉపాధి దొరకడమే కష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రభుత్వమే ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఢిల్లీ నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ ప్రతినిధి హరి శంకర్ మాట్లాడుతూ... ‘బిల్లు పార్లమెంటు ముందుకు రావడంలో జరుగుతున్న జాప్యం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఈ ప్రభుత్వం బిల్లు విషయంలో ఏమాత్రం చొరవ చూపడంలేద’న్నారు. -
నిర్లక్ష్యమే అసలు జబ్బు!
పత్తాలేకుండా పలాయనం చిత్తగించాయనుకుంటున్న రోగాలు కొన్నాళ్లాగి రెట్టింపు శక్తితో దాడి చేస్తుంటే... ప్రాణాంతకమైన వ్యాధులనుకున్నవి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రెండు ధోరణులూ ఏకకాలంలో కనబడుతున్నాయని ఈ మధ్య వెలువడిన కథనాలు చెబుతున్నాయి. నిరంతర అప్రమత్తత, సత్వరం స్పందించే గుణమూ ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధిపైన అయినా పోరాటం చేయడం, రూపు మాపడం సులభమే. అదే సమయంలో నిర్లక్ష్యం ఏర్పడితే, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే పరిస్థితి విషమించడం ఖాయం. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికించిన ఎయిడ్స్ వ్యాధి మన దేశంలో తగ్గుముఖం పడుతున్నదని వెలువడిన వార్తలు ఉపశమనం కలిగిస్తాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ ఎయిడ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక భారత్‌లో హెచ్ఐవీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రకటించింది. 2001-13 మధ్య ఈ తగ్గుదల 57 శాతంగా ఉన్నదని తేల్చింది. ఇదేకాలంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ వ్యాప్తి రేటు 25 శాతం తగ్గింది. మనదేశం గొప్పతనం ఏమంటే 2001-09 మధ్య హెచ్ఐవీ కేసుల తగ్గుదల 50 శాతంగా ఉంటే అదిప్పుడు 57 శాతానికి చేరుకున్నది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి రేటు యథాతథంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ వ్యాధి జాడ మొదటిసారి 1981లో కనబడింది. ఆ కేసుతో మొదలై అది అలా అలా పెరుగుతూ పోయింది. దీని వేగాన్ని నియంత్రించగలగడం బహుముఖాలుగా చేసిన పోరాటం ఫలితం. దేశంలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.1,785 కోట్లు ఖర్చు చేస్తోంది. వ్యాధిగ్రస్తుల వివరాల సేకరణ, వారికి సకాలంలో వైద్యసాయం అందించడం, వారి భాగస్వాములకు వ్యాధి సోకకుండా ఔషధాలను అందించడం వల్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గిందని యూఎన్ ఎయిడ్స్ నివేదిక ప్రశంసించింది. అయితే, ఈ ప్రశంసల మాటెలా ఉన్నా వ్యాధి నియంత్రణకు మరింతగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నదని కొన్ని ఉదంతాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మన ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమానికి రూ.1165 కోట్ల మేర అంతర్జాతీయ సాయం అందుబాటులోకి వచ్చినప్పుడు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఏణ్ణర్ధంపాటు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది. ఫలితంగా 10 లక్షల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఔషధాలు, టెస్టింగ్ కిట్లు అయిదు నెలలపాటు అందుబాటులోకి రాకుండాపోయాయి. సర్కారీ బ్లడ్ బ్యాంకుల్లో హెచ్ఐవీ, హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ కిట్లు లేకపోవడం వల్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు సురక్షితమైన రక్తాన్ని అందించడం సాధ్యం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులుంటే అందులో మూడో వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. తీసుకుంటున్న చర్యలు సమర్ధవంతంగానే ఉంటున్నా ఇలాంటి లోపాలు మొత్తం కార్యక్రమాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల లక్షల మంది ఔషధాలకు దూరంకావడంపై సాయానికి ముందుకొచ్చిన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ఐవీ కేసుల తగ్గుదలను 57 శాతానికి తీసుకురావడం గొప్ప విషయమేగానీ మన ఇరుగుపొరుగుతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నట్టే లెక్క. మయన్మార్ 72, నేపాల్ 87, థాయ్‌లాండ్ 63 శాతం చొప్పున తగ్గించి ఆసియాలో మనను మించిపోయి ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మనం సాధించవలసింది ఎంతో ఉండగా తాజాగా బయటపడిన లోపాల వంటివి హెచ్ఐవీ వంటి మహమ్మారితో చేసే పోరాటంలో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ మధ్యే వె లువడిన మరో నివేదిక వ్యాధులపై జరిపే పోరాటంలో ఎంత అప్రమత్తత అవసరమో గుర్తుచేస్తున్నది. అంటువ్యాధులు సోకినవారు ఉపయోగించే ఔషధాలు వ్యాధికారక సూక్ష్మక్రిముల నిర్మూలనలో విఫలమవుతున్నాయని ఆ నివేదిక చెబుతోంది. వ్యాధిగ్రస్తులు ఉపయోగించడానికి కొత్త ఔషధాలను కనిపెట్టకపోతే పరిస్థితి విషమించడం ఖాయమని హెచ్చరిస్తోంది. వాస్తవానికి 1987 తర్వాత బ్యాక్టీరియాపై పోరాడటానికి అవసరమైన కొత్త తరహా ఔషధాలను కనుగొనలేదు. పాత ఔషధాలను అవసరం లేకుండా లేదా అవసరానికి మించి ఉపయోగించిన పాపమే మనల్ని ఈ స్థితికి చేర్చిందని నిపుణులు చెబుతున్నారు. ఔషధాలకు లొంగని వ్యాధులు వర్ధమాన దేశాల్లో లక్షల మంది ప్రజలను బలిగొంటున్నాయి. మన దేశంలో ఏటా 50 లక్షల మంది డయేరియా, న్యూమోనియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అంటువ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా క్షయ వ్యాధి నివారణలో మనం తీవ్రంగా విఫలమవుతున్నామన్న సమాచారం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి నివారణపై అవసరమైనంతగా దృష్టి పెట్టకపోవడం వల్ల వ్యాప్తి శాతం నానాటికీ ఎక్కువవుతున్నదని నివేదిక అంటోంది. దేశ జనాభాలో అధిక శాతం మంది శరీరాల్లో క్షయ కారక క్రిములు నిద్రాణ స్థితిలో ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వెంటనే ఇవి విజృంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకినట్టు తెలిశాక కూడా పూర్తిగా తగ్గేవరకూ వాడేవారు 35 శాతం మించడం లేదు. ఫలితంగా క్షయ కారక క్రిములు ఏ ఔషధానికీ లొంగని స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వ్యాధి తీవ్రతను ప్రపంచ ఆరోగ్య సంస్థ 1993లోనే గుర్తించింది. అందుకు సంబంధించి అత్యయిక స్థితిగా ప్రకటించింది. కానీ, హెచ్ఐవీ విషయంలో పోరాడుతున్నంత తీవ్రంగా క్షయ వ్యాధిపై పోరాటం సాగటం లేదు. పేదరికంలో మగ్గుతున్న లక్షల మంది వ్యాధి ఉన్నదని తెలిసినా స్తోమతలేక ఔషధాలను వినియోగించడం లేదు. మన శక్తినంతా కేంద్రీకరించి పోరాడితే ఏ వ్యాధినైనా ఏ స్థాయిలో నియంత్రించవచ్చునో హెచ్ఐవీ అనుభవం చెబుతుంటే... నిర్లక్ష్యం ఎలా ప్రాణాంతకమవుతుందో ఇతర అంటువ్యాధులు హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తులం కావలసిన బాధ్యత మనదేనని చాటి చెబుతున్నాయి. -
అప్పుడు భయపడ్డాను
అందమే అసూయపడేంత అందాలను పుణికిపుచ్చుకున్న భామ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. సుమారు దశాబ్ద కాలంగా దక్షిణాది సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో దాసోహం చేసుకున్న ఈ జాణ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో ఒక అంశం పాఠశాలలో లైంగిక పాఠాలను ప్రవేశపెట్టాలన్నది. అనుష్క మాట్లాడుతూ తాను బెంగుళూరులో చదువుకుంటున్నప్పుడు కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారం జరిగేదన్నారు. అప్పుడు ఈ విషయం గురించి పట్టించుకునే దాన్ని కానన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటుకోవడానికి వాళ్ల పక్కన కూర్చొని భోజనం చేయడానికి భయపడ్డానని అందుకు కారణం ఆ వ్యాధి తనకెక్కడ సోకుతుందోనన్న అనుమానమేనన్నారు. డాక్టర్ ప్రియ సర్కార్ పరిచయం తరువాత ఎయిడ్స్ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కలిగిందని చెప్పారు. అందువలనే పాఠశాల దశలోనే విద్యార్థులకు లైంగిక విద్యను బోధించాలని సూచించారు. తల్లిదండ్రులు ఈ విద్యను పిల్లలకు అభ్యసింపచేయాలని అన్నారు. సినిమాల వలనే లైంగిక దాడులు అధికమై ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరుగుతోందంటే మాత్రం తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హెచ్ఐవీ బారిన పడటం అనేది వారి ప్రవర్తన బట్టి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన సినిమాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ ప్రశ్నకు తాను బదులివ్వలేనని దర్శక నిర్మాతలే సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తాను నటిని మాత్రమేనని ఎయిడ్స్ అవగాహన చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధం అని అనుష్క తెలిపారు. ఇటీవల ఎయిడ్స్ అవగాహన యానిమేషన్ చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనుష్క ఈ విషయూలు వెల్లడించారు. -
ఎయిడ్స్‌పై అవగాహనకు యానిమేషన్ చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా మృత్యువాత పడుతున్న వారిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికం. ఎయిడ్స్‌ను నిరోధించడానికి పలు చర్యలు చేపడుతూనే ఉన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తమిళ యానిమేషన్ పేరుతో ఎయిడ్స్‌పై అవగాహన కోసం తమిళ యానిమేషన్ చిత్రం రూపొందింది. నటు డు సూర్య, అనుష్క, సిద్దార్థ్, శ్రుతి హాసన్ నటించిన ఈ చిత్రాన్ని టీచ్ ఎయిడ్స్ సంస్థ తమిళనాడు ఎయి డ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్తంగా నిర్మిం చాయి. భారత దేశంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య తమిళనాడులో అధికమన్నది చింతించవలసిన విష యం. యానిమేషన్ చిత్రం వివరాలను ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నటి అనుష్క మాట్లాడుతూ ఎయిడ్స్ వంటి పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను లఘు చిత్రాల ద్వారానే ప్రజలకు వివరించడం సాధ్యమన్నారు. టీచ్ ఎయిడ్స్ సంస్థ రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వారి వరకు సులభంగా అద్దమయ్యేలా ఉందన్నారు. యువతను ఆకట్టుకునేలా విజ్ఞానంతోపాటు ఎంటర్టైన్మెంట్ను చేర్చి రూపొం దించారని తెలిపారు. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రం లో నటించడం సంతోషంగా ఉందని నటుడు సూర్య, శ్రుతిహాసన్, సిద్దార్థ్ ప్రకటన ద్వారా వ్యక్తం చేశారు. టీచ్ ఎయిడ్స్ సంస్థ 2011లో ఈ తర హా యానిమేషన్ చిత్రాన్ని తెలు గు, ఆంగ్ల భాషనల్లో రూపొందించింది. ఇందులో టాలీ వుడ్ నటుడు నాగార్జున, అనుష్క, శ్రుతి హాసన్, షెబ్నా ఆజ్మితో కలిసి నటించారు. -
నకిలీ వైద్యుడి అరెస్ట్
పిఠాపురం, న్యూస్‌లైన్ : జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరునని నమ్మించి.. పనికిరాని మందులతో రోగులకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని బుధవారం పిఠాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎస్.రాంబాబు స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన మహమ్మద్ రసూల్ అలియాస్ ఫకీర్ అహ్మద్ (అభిచంద్) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. నల్లగొండ జిల్లా కోదాడలో ఓ ఆర్ఎంపీ వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. వైద్యంలో కొద్దిగా మెలకువలు నేర్చుకున్న అతను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎ.మల్లవరానికి మకాం మార్చాడు. అక్కడ ఆర్ఎంపీ అవతారమెత్తాడు. స్థానికులతో నమ్మకంగాఉంటూ, గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి మొత్తం రూ.70 వేలు వరకు వసూలు చేశాడు. ఎంతకీ గ్యాస్ కనెక్షన్లు రాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అతడిని నిలదీశారు. అతడు మోసం చేశాడని తెలుసుకుని వారు అన్నవరం పోలీసులకు గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో నిందితుడిని అరెస్టు చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అదే గ్రామంలోని సబ్ జైలులో నాలుగు నెలల పాటు ఉన్నాడు. అతనికి ఎవరూ పూచీకత్తు ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో బయటకు వచ్చిన నిందితుడు పిఠాపురం మండలం రాపర్తిలో ఉన్న తన అన్న కూతురి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరుగా కొత్త అవతారమెత్తాడు. తన పేరు ఎండీ రసూల్ అని, గ్రామా ల్లో రోగులకు సేవలందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా తనను నియమించిందని నకిలీ విజిటింగ్ కార్డు, ఐడెంటిటీ కార్డులు చూపించి అక్కడి రోగులను, స్థాని కులను నమ్మించాడు. సాధారణ మందులనే ఎయిడ్స్‌కు సంబంధించినవని చెబుతూ రోగుల నుంచి అధిక మెత్తంలో డబ్బు గుంజేవాడు. ఇక్కడ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి స్థానికులు ఒకొక్కరి నుంచి రూ.1500 చొప్పున సుమారు రూ.24 వేలు వసూలు చేశాడు. చివరకు స్థానిక పాస్టర్ కె.వీరబాబు బైక్ దొంగిలించి ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. వీరబాబు ఫిర్యాదు మేరకు పిఠాపురం రూరల్ పోలీ సులు కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం సామర్లకోటలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నకిలీ విజిటింగ్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, స్టెతస్కోపు, నల్లగొండ జిల్లా కోదాడ గ్రామ పంచాయతీ స్టాంపు, నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక గ్రామాల్లో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల వివరాలు తెలుసుకుని, వారిని నకిలీ మందులతో మోసం చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు. -
వారికి మనోస్థైర్యం ఏదీ?
జిల్లాలో సుమారు 21,000 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. కానీ వాస్తవంగా 30,000 మందికిపైగానే ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఎయిడ్స్‌వ్యాధి నిర్ధారణ, కౌన్సెలింగ్ నిర్వహణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 12 ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్‌సెంటర్)లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఏఆర్టీ మందుల కోసం పంపిస్తారు. అక్కడ మరో రెండు రకాల రక్త పరీక్షలను నిర్వహించి సీడీ -4 ఆధారంగా ఏఆర్టీ మందులను అందజేస్తారు. అంతేగాక వారి చిరునామాల ఆధారంగా ప్రతి నెలా మందులను అందజేసేందుకు సమీప ప్రాంతాలలోని లింక్డ్ ఏఆర్టీ కేంద్రాలకు వెళ్లమని సూచిస్తారు. జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతీయ వైద్యశాలల్లో లింక్డ్ ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో)ద్వారా ఏఆర్టీ, లింక్డ్ ఏఆర్టీ కేంద్రాలకు ప్రతినెలా మందుల సరఫరా జరుగుతుంది. అయితే గడిచిన రెండు నెలలుగా ఏఆర్టీ మందుల సరఫరా నిలిచిపోవడంతో ఎయిడ్స్ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐసీటీకేంద్రాలకు గడిచిన 20 రోజులుగా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్ల సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా సగటున ఒక రోగికి గతంలో నెల రోజులకు సరిపడా మందులు అందజేసిన సంబంధిత అధికారులు ప్రస్తుతం సరఫరా నిలిచిపోయిందంటూ ఐదు రోజులకు మాత్రమే ఇస్తున్నారు. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు ప్రతి రోజూ తన దినచర్యలో భాగంగా ఏఆర్టీ మందులను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. మధ్యలో ఏ మాత్రం నిలిపివేసినా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసించి మృత్యువాత పడే అవకాశం మెండుగా ఉంటుంది. కాగా ఏఆర్టీ మందులు దొరకక రోగులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా జెఎల్ఎన్, ఎస్ఎల్ఎన్,టీఎల్ఎన్,టీఎల్ఈ మందుల సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయినట్లు సమాచారం. నాకో ద్వారా ఏఆర్టీ మందుల సరఫరా నిలిచి పోవడం వల్లే ఎయిడ్స్ రోగులకు అందించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఏఆర్టీ మందుల సరఫరాను కొనసాగించాలని ఎయిడ్స్ రోగులు కోరుతున్నారు. -
చేదు మాత్ర
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులను ప్రభుత్వం సైతం చిన్నచూపు చూస్తోంది. వారంతా విధిగా వాడాల్సిన మందుల సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రంలో 46 ప్రభుత్వ ఆస్పత్రులలో యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్లు ఉండగా, వీటిద్వారా సుమారు 4 లక్షల 60 వేల మంది రోగులకు నెలనెలా వ్యాధి నివారణ, నిలుపుదల మందులను ఉచితంగా పంపిణీ చేయూల్సి ఉంది. వీటికి నెల రోజులుగా ఈ మందులేవీ సరఫరా కావడం లేదు. దీంతో జిల్లాలోని మూడు ఏఆర్టీ సెంటర్లలోనూ మందులు నిండుకున్నాయి. రోగి శరీరంలో సీడీ 4 కౌంటు 350 కన్నా తక్కువ ఉంటే తప్పనిసరిగా ఏఆర్టీ చికిత్స మొదలు పెట్టాలి. రోగి లక్షణాలను బట్టి జిడో ఉడిన్, ల్యామి ఉడిన్, నెవిరోఫిన్, ఎఫావిరింజ్, టెనోఫేవిర్ కాంబినేషన్లో మందులు వాడతారు. జెడ్‌ఎల్‌ఎన్, జెడ్‌ఎల్‌ఈ, టీఎల్ఈ, టీఎల్ఎన్ మందులను పెద్దవారికి ఇస్తారు. పిల్లలకైతే ఎన్వీపీ కాంబినేషన్ మందులు సరఫరా చేయాలి. ఈ మందులను వాడేవారిలో సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించడానికి నెవిరోఫిన్ టాబ్లెట్లు వాడటం తప్పనిసరి. వీటిని రోగి రోజుకు రెండు చొప్పున వాడాలి. ఈ బిళ్లలు రాష్ట్రంలోని 46 ఏఆర్టీ సెంటర్లకు నెల రోజులుగా సరఫరా కావటం లేదు. నెలకు సరిపడే ఈ మందులను మార్కెట్లో కొనాలంటే రూ.850 వెచ్చించాలి. హెచ్ఐవీ మహమ్మారి బారిన పడి కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై పునరావాస కేంద్రాలు, దాతల సహాయ, సహకారాలతో నడిచే కేంద్రాల్లో ఉంటున్న వారికి అంత మొత్తం వెచ్చించటం తలకు మించిన భారంగా మారింది. ఈ మందుల కోసం బాధితులు ఏఆర్టీ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. వారు వైద్యాధికారులను అడిగితే ‘రేపు వస్తాయి, మాపు వస్తాయి’ అంటూ చెబుతున్నారు. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ (నాకో) నుంచి ఏపీ శాక్స్‌కు, అక్కడి నుంచి ఏఆర్టీ సెంటర్లకు ఈ మందులు వస్తాయి. పరీక్ష కిట్లూ లేవు ఏరియా ఆస్పత్రులలోని ఐసీటీసీ కేంద్రాలలో హెచ్ఐవీ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయడానికి కిట్లు కూడా నెలరోజులుగా లేవు. హెచ్ఐవీ సోకిందన్న అనుమానం ఉన్న వారు బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకొని , రిపోర్టును ఏఆర్టీ కేంద్రాలకు అందిస్తే , దాని కనుగుణంగా మందులు ఇస్తున్నారు. మందులు రావాలి ఏఆర్టీ సెంటర్లకు కొన్ని రోజులుగా నెవిరోఫిన్ మందు బిళ్లలు సరఫరా చేయడం లేదని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ దామోద ర రెడ్డి చెప్పారు. ఐసీటీసి కేంద్రాలలో ర క్త పరీక్ష కిట్లూ లేవని, అధికారులను అడిగితే త్వరలో పంపిస్తామంటున్నారని తెలిపారు. ఏఆర్టీ కేంద్రాలలో పిల్లల డోస్ (50 ఎంజీ) బిళ్లలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పెద్దల డోస్ (200 ఎంజీ) బిళ్లలు లేవని గూడెం ఏఆర్టీ కేంద్రం సహాయ వైద్యాధికారి ఎస్.వెంకటరమణ తెలిపారు. -
ఎయిడ్స్ రోగులకు శుభవార్త
ముంబై: ఎయిడ్స్ ఉన్న వారి ఇన్సూరెన్స్ క్లయిమ్‌లను తిరస్కరించకూడాదని బీమా కంపెనీలకు ఐఆర్డిఏ సూచించింది. పాలసీ తీసుకునే సమయానికి హెచ్ఐవి బాధితులు కాకపోతే అలాంటి వ్యక్తుల క్లయిమ్‌లను తిరస్కరించడం సమంజసం కాదని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఐఆర్డిఏ అనేది మన దేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని నియంత్రించడం కోసం ఉద్దేశించింది. పాలసీ తీసుకున్నాక హెచ్ఐవి వస్తే దాన్ని కూడా ఒక తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలని బీమా నియంత్రణ సంస్థ తెలిపింది. పాలసీ ప్రకారం ఏకమొత్తంగా గానీ లేదా విడతల వారీగా కానీ క్లయిమ్‌లు చెల్లించాలని తెలిపింది. ఎయిడ్స్ రోగులకు, వారి బంధువులకు ఇది శుభవార్తే గదా. -
‘ఎయిడ్స్’ ర్యాలీలో మిస్ యూనివర్స్
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, బాధితులకు సాయం చేసేందుకు ‘వాక్ ఫర్ లైఫ్’ పేరుతో నగరంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో హాజరయింది. ఇండియాగేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించింది. మొదటిసారిగా భారత్‌కు వచ్చిన కల్పో శుక్రవారం కూడా గుర్గావ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ‘ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ముఖ్యంగా యువత అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. ఈ వ్యాధితో వచ్చే ఇబ్బందులను వివరించాలి’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. హెచ్ఐవీ బాధితులపై చిన్నచూపు చూసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ 21 ఏళ్ల బ్యూటీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరింది. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, యువత ఇందులో పాల్గొన్నారు. అమెరికాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాల్లో కల్పో చురుగ్గా పాల్గొంటోంది. భారత్‌లో బాలికా శిశుసంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన వంటి వాటిపై ప్రచారం చేయడానికి ఈ అమెరికన్ యువతి పది రోజులపాటు భారత్‌లో పర్యటించనుంది. పాలమ్విహార్లోని సులభ్గ్రామ్ను కూడా కల్పో శనివారం సందర్శించడం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే పలువురు మహిళలతో రెండు గంటలసేపు ఈమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. లింగ, కుల వివక్ష నిర్మూలనకు గట్టి ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ముంబైలో జరిగే కార్యక్రమాల్లోనూ కల్పో పాల్గొననుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాడు. -
‘ఎయిడ్స్’ ర్యాలీలో మిస్ యూనివర్స్
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, బాధితులకు సాయం చేసేందుకు ‘వాక్ ఫర్ లైఫ్’ పేరుతో నగరంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో హాజరయింది. ఇండియాగేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించింది. మొదటిసారిగా భారత్‌కు వచ్చిన కల్పో శుక్రవారం కూడా గుర్గావ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ‘ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ముఖ్యంగా యువత అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. ఈ వ్యాధితో వచ్చే ఇబ్బందులను వివరించాలి’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. హెచ్ఐవీ బాధితులపై చిన్నచూపు చూసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ 21 ఏళ్ల బ్యూటీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరింది. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, యువత ఇందులో పాల్గొన్నారు. అమెరికాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాల్లో కల్పో చురుగ్గా పాల్గొంటోంది. భారత్‌లో బాలికా శిశుసంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన వంటి వాటిపై ప్రచారం చేయడానికి ఈ అమెరికన్ యువతి పది రోజులపాటు భారత్‌లో పర్యటించనుంది. పాలమ్విహార్లోని సులభ్గ్రామ్ను కూడా కల్పో శనివారం సందర్శించడం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే పలువురు మహిళలతో రెండు గంట లసేపు ఈమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. లింగ, కుల వివక్ష నిర్మూలనకు గట్టి ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ముంబైలో జరిగే కార్యక్రమాల్లోనూ కల్పో పాల్గొననుం ది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాడు. -
హెచ్ఐవీ బాధితుల రక్షణకు బిల్లు
HIV/AIDS Bill in next Parliament session: Oscar Fernandes బెంగళూరు, న్యూస్‌లైన్: హెచ్ఐవీ బాధితుల రక్షణకు త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. కర్ణాటకలో హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నగరంలోని వికాససౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఫెర్నాండెజ్ ప్రసంగించారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆరోగ్య శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీనిపై సెక్స్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో హైదరాబాద్‌లో సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకున్నామని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దానిని కర్ణాటకలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. -
హెచ్ఐవీని పూర్తిగా నిరోధించే టీకా!
కోతుల్లో పరీక్షలు విజయవంతం వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ ‘హెచ్ఐవీ’ని శరీరం నుంచి పూర్తిగా నిరోధించగల ఓ సమర్థమైన టీకాను ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కోతుల్లో హెచ్ఐవీని ఈ టీకాతో పూర్తిగా నిర్మూలించగలిగామని, మనుషుల్లో కూడా ఇది సత్ఫలితాలనిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ సంక్రమించినవారికి యాంటీవైరల్ మందులు ఉపయోగిస్తూ చికిత్సలు చేస్తున్నా.. చాలా తక్కువ మందిలో మాత్రమే ఫలితం కనిపిస్తోంది. అయితే తాము రూపొందించిన ఈ టీకా కోతుల్లో ఎయిడ్స్‌కు కారణమయ్యే ‘సిమియన్ ఇమ్యూనోడెఫీషియెన్సీ వైరస్ (ఎస్ఐవీ)’ని పూర్తిగా నిర్మూలించగలిగిందని వర్సిటీ పరిశోధకులు లూయిస్ పికర్ వెల్లడించారు. సైటోమెగాలో వైరస్(సీఎంవీ) అనే సాధారణ వైరస్‌ను జన్యుమార్పిడి చేసి ఈ టీకాను తయారుచేశామని, కోతుల్లో ఎస్ఐవీ కణాలను తెల్లరక్త కణాలు (టీ-సెల్స్) గుర్తించి హతమార్చేందుకు తోడ్పడుతోందన్నారు. కోతులకు ముందుగా ఈ టీకా ఇచ్చి.. తర్వాత ఎస్‌ఐవీని ఎక్కించగా కొంతకాలానికి వాటి శరీరాల్లోంచి ఎస్ఐవీ పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. సీఎంవీని జన్యుమార్పిడి చేసి మనుషుల్లో హెచ్ఐవీ నిర్మూలనకు ఉపయోగపడే టీకాను కూడా తయారుచేయవచ్చన్నారు. -
కాటేస్తున్న ఎయిడ్స్ భూతం!
మెదక్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ భూతం యువతను నీడలా వెంటాడుతుంది. అవగాహన లేమితో యువతీ, యువకులు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. ఈ దెబ్బకు కొన్ని కుటుంబాలే కనుమరుగవుతున్నాయి. భర్త మరణంతో భార్య.. తల్లుల మరణంతో పిల్లలు అనాథలవుతున్నారు. వ్యాధిసోకిన వారు తమకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తూ మృత్యువుకు బీజాలు వేస్తున్నారు. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు తొమ్మిది వేల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు సమాచారం. ఈ వ్యాధిపై అవగాహన కల్పించే వారే లేకపోవడంతో మృత్యువు సమీపించే వరకు మహమ్మారి జాడలు తెలియడం లేదు. కనీసం హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం తరఫున పింఛన్లు కూడా అందక పోవడంతో వారి జీవితం నరకప్రాయమవుతోంది. ఈ ప్రాంతాల్లోనే అధికం.. జిల్లాలోని పాపన్నపేట, జోగిపేట, అల్లాదుర్గం, గజ్వేల్, రామాయంపేట, సిద్దిపేట, దుబ్బాక, కొల్చారం, కోహీర్, సంగారెడ్డి, జహీరాబాద్ మండలాల్లో హెచ్ఐవీ బాధితులు అధిక సం ఖ్యలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పచ్చని పల్లెల్లో మృత్యుఘోష.. అభం శుభం తెలియని పల్లె జనాలు క్షణికోద్రేకానికిలోనై ఈ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించే చట్టాలు లేనందున హెచ్ఐవీ ఎయిడ్స్‌గా మారిన తరువాతే బయట పడుతోంది. దీంతో మూడు పదులకే యువతీ యువకులు మృత్యువాత పడుతున్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో సుమారు 50 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరో 80 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు సమాచారం. ఇందులో 80 శాతం యువతీ యువకులు కావడం గమనార్హం. పలు కుటుంబాల పరిస్థితి ఇది... పాపన్నపేటకు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఈ వ్యాధిన బారిన పడి మృతి చెందారు. మూడేళ్ల క్రితం ఇద్దరు, నెల రోజుల క్రితం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఓ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు చనిపోగా, వారి భార్యలు సైతం వ్యాధి కోరలకు చిక్కారు. వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. వారి పిల్లలకు సైతం వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కొల్చారం మండలంలోని ఓ గ్రామంలో 220 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా అందులో ఎనిమిది మందికి హెచ్ఐవీ పాజిటివ్ రావడం గమనార్హం. అభాగ్యులకు ఆదరణ కరువు హెచ్ఐవీ బారిన పడిన వారికి ఆదరణ కరువవుతోంది. వారిలో అవగాహన కల్పించి, జీవన నైపుణ్యాలు పెంపొందించి, మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన వారే లేకుండా పోతున్నారు. గతంలో ఐఆర్డీఎస్ (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్) ఆధ్వర్యంలో గ్రామాల్లో లింక్ వర్కర్లు పనిచేసే వారు. వీరు గ్రామాల్లో అనుమానితులను గుర్తించి ఐసీటీసీ కేంద్రానికి తీసుకెళ్లి రక్త పరీక్షలు చేయించి, అవసరమైతే ఏఆర్టీ(యాంటీ రెట్రో వైరల్ ట్రీట్మెంట్) ఇప్పించేవారు. ప్రస్తుతం ఈ స్కీం రద్దు కావడంతో గ్రామీణుల్లో అవగాహన కరువైంది. వ్యాధి బారిన పడి భర్తలు చనిపోయిన మహిళలకు కనీసం వితంతు పింఛన్లు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. వ్యాధినుంచి రక్షణ ఎలా? నివారణే తప్ప చికిత్సలేని ఎయిడ్స్/హెచ్ఐవీ నుంచి ప్రజలు రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. రక్షణలేని లైంగిక చర్యల వల్ల, రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన పొందాలి. అందుకు జీవన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. ‘హెచ్ఐవీ అంటే ఎయిడ్స్ కాదు. ఎయిడ్స్ అంటే మరణం కాదు’ అన్న విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ హెచ్ఐవీ సోకితే క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటే జీవిత కాలాన్ని సాధ్యమైనంత వరకు పొడిగించుకోవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో కళాజాత.. అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు ఎయిడ్స్/హెచ్ఐవీపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 1.50 లక్షల మందికి అవగాహన కల్పించడం జరిగింది. హెచ్ఐవీపై అవగాహన కల్పించే బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు, ఆశ వర్కర్లకు, ఏఎన్ఎంలకు అప్పగించాం. పెళ్లికి ముందు ప్రతి జంట రక్త పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. - డానియల్, డీపీఎం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు