హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్‌ఐవి ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్‌ఐవి, ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో ప్రముఖ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం.
1. అపోహ: హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్‌ఐవి ఇతరులకి సోకుతుంది?
వాస్తవం: హెచ్‌ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ఐవి సోకదు.
2. అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది?
వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్,హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు,ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం, రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది.
3. అపోహ: దోమకాటు ద్వారా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది?
వాస్తవం:దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవి ఎలా బతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు.
4. అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు?
వాస్తవం: సరైన మందులు,సకాల చెకప్స్‌తో, ఒకరు హెచ్‌ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని,హెచ్ఐవిని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి.
5. అపోహ: హెచ్‌ఐవీ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు?
వాస్తవం: తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్‌ఐవి,ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం వల్ల హెచ్‌ఐవీ నెగటివ్ బిడ్డకు జన్మనివ్వొచ్చు.
- నవీన్ నడిమింటి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment