HIV
-
కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...
ఏదైనా వ్యాధి సోకితే మానవుల్లోని వ్యాధి నిరోధక శక్తి / వ్యవస్థ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. అయితే... ఎయిడ్స్ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే... అది దేహంలోని జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తినే దెబ్బతీస్తుంది. దాంతో చిన్న చిన్న సాంక్రమిక వ్యాధులకే బాధితులు తేలిగ్గా లొంగిపోతారు. హెచ్ఐవి వైరస్ క్రిమికి ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రూపొందే పరిస్థితి లేదు. అయినప్పటికీ 25 రకాల ఏంటి రెట్రో వైరల్ ఔషధాల తోపాటు ఓ ఇంజెక్షన్‌తో ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని తేలింది. ఇది ఇంచుమించూ టీకాలాగే పనిచేస్తూ జబ్బు బారిన పడకుండా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. హెచ్ఐవీకి టీకా రూపొందించడానికి అనేక సాంకేతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... ఏదైనా టీకాను అభివృద్ధి చేస్తే... అది ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’ను ప్రేరేపితం చేస్తుంది. కానీ ఈ వైరస్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థలోని కీలక కణాలైన సీడీ4 లింఫోసైట్స్ తదితర కణాల జీన్స్‌లో కలిసిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోయి వ్యాధి నిరోధక వ్యవస్థే కుప్పకూలిపోయి, దీర్ఘ కాలంలో ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఎయిడ్స్‌కు టీకా అభివృద్ధి చేయడం సాధ్యం కా(లే)దు. అయినప్పటికీ హెచ్ఐవీని నిరోధించేందుకు పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌తో విప్లవాత్మక మార్పు... గతేడాది అంటే... 2024 జూలైలో దక్షిణ ఆఫ్రికాకి చెందిన పరిశోధకులు డాక్టర్ లిండా గేయిల్ బెక్కర్ తదితరులు... హెచ్ఐవీని నిరోధించడానికి ప్రీఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్గా ఓ సరికొత్త ఇంజక్షన్ ‘లెనకపావిర్’ సమర్థంగా పనిచేస్తుందని ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన ప్రయోగంలో... తమ భర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉండి... తాము మాత్రం నెగెటివ్ అయిన ఓ 3204 మంది మహిళలకు (అంటే... సీరో డిస్కార్డెంట్ విమెన్‌కు) టెనొఫోవిర్, ఎమ్ ట్రైసిటాబైన్ అనే మందులు ఇచ్చారుగానీ వారిలో 35 మందికి హెచ్ఐవీ సోకింది. ఇక మరో ప్రయోగంలో మరో 2134 మంది సీరో డిస్కార్డెంట్ మహిళలకి సరికొత్త ఔషధం అయిన లెనకపావిర్ (927 మిల్లీగ్రాముల) ఇంజక్షన్స్ ని ఆరు నెలలకు ఒకటి చొప్పున, ఏడాదిలో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వీళ్లలో ఒక్కరికి కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ సోకలేదు. దీంతో హైరిస్క్ గ్రూపుల్లో, అంటే... భర్త హెచ్ఐవి పాజిటివ్ అయి, భార్య నెగిటివ్‌గా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంజక్షన్స్‌తో ఎయిడ్స్‌ను సమర్థంగా నివారించవచ్చని తేలింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెనకపావిర్ ఇంజక్షన్ తాలూకు ఒక్క మోతాదు ఆరు నెలలపాటు రక్షణ ఇస్తుండడంతో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి ఈ ఇంజెక్షన్‌ను వాక్సిన్ (టీకా) తరహాలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అసలీ లెనకపావిర్ కాప్సిడ్ ఇన్హిబిటర్ ఎలా పనిచేస్తుదంటే... హెచ్ఐవీ తాలూకు జీన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్... ఈ అన్నింటినీ కలిపి ‘కోర్’ (న్యూక్లియో కాప్సిడ్) అంటారు. ఈ ‘కోర్’ని కలిపి ఉంచే ఒక సంచి వంటి నిర్మాణమే కాప్సిడ్. ఈ క్యాప్సిడ్ మూలంగానే హెచ్ఐవి తాలూకు ‘కోర్ ’కు ఓ శంఖువు లాంటి ఆకృతి వస్తుంది. ఈ కోర్ తాలూకు ప్రోటీన్‌నే ‘పీ 24 ఏంటిజెన్’గా పిలుస్తారు. ఇన్ఫెక్షన సోకిన తొలివారాల్లో దీన్ని గుర్తించడానికి ప్రత్యేక టెస్ట్‌లు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లెనాకపావిర్ అనేది ‘కాప్సిడ్ ఇన్హిబిటర్ ’ ఔషధం. అంటే... వైరస్ సంక్రమించే సందర్భంలో కాప్సిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు... న్యూక్లియస్ క్యాప్సిడ్ లోని భాగాలు ‘కోర్’గా మారి, దాని చుట్టూ సంచి వంటి కాప్సిడ్ ఏర్పడకుండా అడ్డుతుంది. అంతేకాదు... హెచ్ఐవీ జన్యువుల్లోని అణువులను అది మానవుల కణాల్లోకి విడుదల కాకుండా అడుకట్ట వేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ లోని జన్యువులను మనిషి జీన్స్‌లో కలిసే ప్రక్రియని అడ్డుకుంటుందని చెప్పవచ్చు. లెనాకపావిర్ ప్రత్యేకతలివి... ఇప్పటివరకు ఉన్న యాంటీ రెట్రోవైరల్ మందులు... హెచ్ఐవీ సోకి అది మానవుల్లో వృద్ధి చెందే దశల్లోని ఏదో ఒక దశలో మాత్రమే అడ్డుకొంటాయి. అయితే లెనాక΄ావిర్ మాత్రం హెచ్ఐవీ క్రిమి వృద్ధి చెందడాన్ని మూడు దశలలో అడ్డుకుంటుంది. అంతేకాదు... ఈ మందు ఆర్నెల్ల పాటు పనిచేస్తుంది. అంటే ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే ఏడాదంతా హెచ్ఐవీ / ఎయిడ్స్ రాకుండా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే... ముందుగా ఓ టీకా, ఆర్నెల్ల తర్వాత ఓ బూస్టర్ డోస్ ఎలా పనిచేస్తాయో, ఈ ఇంజెక్షన్ తాలూకు రెండు మోతాదులు అదే పనిచేస్తాయి. పైగా హెచ్ఐవీ బాధితులకు ఇప్పుడు అనేక మందుల్ని రకరకాల కాంబినేషన్లలో వాడుతుంటారు. మందులు పెరుగుతున్న కొద్దీ హెచ్ఐవి క్రిమి వాటికి రెసిస్టెన్స్ పెంచుకుని, వాటికి లొంగకుండా తయారయ్యే అవకాశాలెక్కువ. అలాంటి వారిలో లెనకపావిర్ను ఏదో ఒక మందుతో కలిపి వాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు కూడా లెనకపావిర్ అనే ఈ ఇంజెక్షన్ ఎయిడ్స్ బాధితుల పాలిట ఆశారేఖగా నిలుస్తోంది.అదుపునకు కొన్ని మార్గాలివి...కండోమ్స్, డిస్పోసబుల్ సిరంజీల వాడకం తోపాటు, బ్లడ్ బ్యాంకులలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తిని కొంతమేరకు అదుపు చేయడం సాధ్యమైంది. అయితే ఈ జబ్బుకు గురయ్యేందుకు అవకాశమున్న అనేక వర్గాలకు ముందుగానే ఇచ్చేలా ‘ప్రీ ఎక్సపోజర్ ప్రొఫైలాక్సిస్’ (ప్రెప్ ) వంటి ప్రక్రియలూ, అలాగే ఈ జబ్బు ఉన్న వారికి సేవలు చేసే సందర్భాలలో ప్రమాదవశాత్తు జబ్బు వచ్చే అవకాశం ఉన్న డాక్టర్లు, నర్సుల వంటివారికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్’ (పెప్)ల వంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: సార్కోమాను ఎదుర్కోలేమా!) -
వివాహితతో సహజీవనం.. ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..?
సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్‌కుమార్ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్కుమార్తోనే ఉంటోంది. తల్లితో సహజీవనం చేస్తూ.. ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..జాటోతు సునీల్‌కుమార్ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్‌కుమార్ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది. పోక్సో కేసు నమోదు...సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్‌కుమార్ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..? సునీల్‌కుమార్‌కు హెచ్ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేసి హెచ్ఐవీ టెస్ట్ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. -
కట్టడి చేస్తున్నా...కేసులు పెరుగుతున్నాయ్!
దాదర్: ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు (ఏసీబీ)అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబైలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది హెచ్ఐవీ రోగులన్నుట్లు తేలింది. ప్రస్తుతం ముంబైలో 40,658 హెచ్ఐవీ రోగులున్నట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనజాగృతి కార్యక్రమాల చేపడుతోంది. నేటి ఆధునిక యుగంలో కొత్తకొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. రోగులు కూడా ఆయుర్వేదం జోలికి పోకుండా ఆధునిక మందులు, మాత్రలను వాడుతున్నారు. అయినా ముంబైలో ఏటా మూడు వేలమందికి వ్యాధి నిర్ధారణ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో బయటపడుతున్న కొత్త రోగుల్లో 75 శాతం 15–49 ఏళ్ల మధ్య వయసున్న వారున్నారు. వీరిలో 31 శాతం మహిళలున్నారు. అనేక సందర్భాల్లో రక్షణ ప్రమాణాలు పాటించకుండా లైంగిక సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాల వల్ల ఈ వ్యాధి సోకుతోందని వైద్య పరిశీలనలో తెలిసింది. హెచ్ఐవీ గురించి భారీగా అవగాహన సదస్సులు, జనజాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్ద మొత్తంలో ఎయిడ్స్ కేసులు బయటపడుతుండటంతో ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తగ్గిన వివక్ష... హెచ్ఐవీ రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొద్ది సంవత్సరాల నుంచి నియంత్రణ కమిటీ కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోగులు ఉన్నచోటే పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడం, ఒక్క ముంబైలోనే 20కి పైగా కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాటు చేసినట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ అదనపు డైరెక్టర్ డా.విజయ్‌కుమార్ కారంజ్కర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. గతంలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లోనే మందులు ఇచ్చేందుకు స్వతంత్రంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహారం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుందనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకుంటే ఎప్పటిలాగే జీవనం సాగిస్తారని రోగులకు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో హెచ్ఐవీ రోగులంటేనే వారి కుటుంబసభ్యులు, ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. వారి పట్ల బేధభావం ప్రదర్శించేవారు. వారు వాడే దుస్తులు, వస్తువులను వేరుగా ఉంచడంతోపాటు పడుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించేవారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలవల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో ఇలాంటి ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. -
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
Karnataka: వీడియోలతో బెదిరించి మంత్రి అయ్యాడు
బనశంకరి: కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని మహిళ ఆరోపించారు. బెంగళూరులో ఇది జరిగిందని, నా భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని తెలిపారు. చాలా మంది మహిళలతో ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు. హెచ్ఐవీ కలిగిన యువతితో.. మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు. హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని పదే పదే కోరారు. -
హెచ్ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగింగచలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్‌హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్-ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్, హెచ్ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
హెచ్ఐవీ నియంత్రణకు కొత్త ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్ఫర్ ఇన్హిబిటర్స్ (ఐఎన్‌ఎస్‌టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్ఐవీ వైరస్ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు. ఈ ఐఎన్‌ఎస్‌టీఐ, డోలుటెగ్రావిర్ వంటివి వైరస్‌ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు, చికిత్సలో సవాళ్లు.. 2021లో విడుదలైన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు. డోలుటెగ్రావిర్ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్‌ఎస్‌టీఐ ఆధారిత ఔషధాలు హెచ్ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్ మేకా సత్యనారాయణ తెలిపారు. -
హెచ్ఐవీ ఉన్నవాళ్లు పిల్లల్ని కనకూడదా?అలా కూడా వ్యాపిస్తుందా?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్ఐవి ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్ఐవి, ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో ప్రముఖ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. 1. అపోహ: హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్ఐవి ఇతరులకి సోకుతుంది? వాస్తవం: హెచ్ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ఐవి సోకదు. 2. అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది? వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్,హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు,ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం, రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది. 3. అపోహ: దోమకాటు ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది? వాస్తవం:దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవి ఎలా బతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. 4. అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు? వాస్తవం: సరైన మందులు,సకాల చెకప్స్‌తో, ఒకరు హెచ్ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని,హెచ్ఐవిని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి. 5. అపోహ: హెచ్ఐవీ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు? వాస్తవం: తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవి,ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం వల్ల హెచ్ఐవీ నెగటివ్ బిడ్డకు జన్మనివ్వొచ్చు. - నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
భార్యకు ఎయిడ్స్ అంటించి భర్త పరార్!
ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త పెళ్లికి ముందు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని ఆరోపించింది. పెళ్లి తరువాత తాను హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోయానన్నారు. దీంతో తనను పుట్టింటిలో దిగబెట్టి, భర్త పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె భర్త దురాగతంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మీరఠ్‌లోని పల్లవ్‌పురంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెకు 2021లో జానీ పోలీస్స్టషన్ పరిధిలోని ఒక యువకునితో వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వివాహానికి రూ. 15 లక్షలు ఖర్చుచేశానని తెలిపారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందక ఇంకా కట్నం కావాలని అడుగుతుండేవారని తెలిపారు. అత్తవారింటిలో ఎన్ని సమస్యలు ఎదురైనా తన కుమార్తె సహనంతో వ్యవహరించిందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లికి ముందు ఆ యువకుడు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపారు. అయితే పెళ్లి సమయంలో ఈ విషయాన్ని దాచి ఉంచారన్నారు. ఈ నేపధ్యంలో తన కుమార్తె కూడా ఎయిడ్స్ బాధితురాలిగా మారిందని వాపోయారు. కుమార్తె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను తమ దగ్గర దిగబెట్టి భర్త పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం! -
'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..'
ఢిల్లీ: ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అన్ని మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. సనాతన ధర్మాన్ని డీఎంకే ఎంపీ ఏ రాజా ఎయిడ్స్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఎంపీ రాజా వ్యాఖ్యలను సమ్మతించబోమని చెప్పారు. డీఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత స్పందించిన కాంగ్రెస్ తన సిద్ధాంతం సర్వధర్మ సమభావం అని పేర్కొంది. ప్రతి మతానికి, సిద్ధాంతానికి సమాన ఆధరణ ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఏ మతానికి, విశ్వాసాలను కించపరచబోమని వెల్లడించింది. డీఎంకే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కూటమిలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. డీఎంకే ఎంపీ రాజా ఈ రోజు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు రోగంతో పోల్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’ -
ఎయిడ్స్ ఉందని తప్పుడు రిపోర్ట్
అన్నానగర్: ఎయిడ్స్‌పై తప్పుడు సమాచారం ఇచ్చిన ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి బుధవారం నామక్కల్ వినియోగదారుల కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. కోయంబత్తూరులోని బీలమెట్‌కు చెందిన కృష్ణస్వామి (71) 2017 డిసెంబర్లో పరీక్షల నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి వెళ్లాడు. కళ్లను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అంతకు ముందు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పరీక్షలు ముగియగా అతనికి ఎయిడ్స్ ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన కృష్ణస్వామిని కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అతనికి ఎయిడ్స్ లేదని వైద్య నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహించిన కృష్ణస్వామి కోయంబత్తూరు వినియోగదారుల కోర్టులో ప్రైవేటు కంటి ఆసుపత్రిపై కేసు వేశారు. 2022 జులైలో సత్వర విచారణ కోసం కేసు నామక్కల్ జిల్లా వినియోగదారుల కోర్టుకు బదిలీ చేశారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి డాక్టర్ రామరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు కంటి ఆసుపత్రి నిర్లక్ష్యంగా సేవలందించినందున ఫిర్యాదుదారునికి నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
హైరానా పెడుతున్న హెచ్ఐవీ
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య క్రమంగా విస్తరిస్తున్న దాఖలాలున్నాయి. ప్రతిఏటా రెండు వేల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్ఐవీ పరీక్షలను పెంచడం ద్వారా బాధితులను గుర్తింపునకు ప్రయత్నిస్తోంది. హెచ్ఐవీ/ ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. హెచ్ఐవీ బాధితుల్లో దేశంలో కర్ణాటక 17వ స్థానంలో ఉండడం కొంచెం మంచి విషయమే. కాగా, గతేడాది ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 13,338 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. 2020–21లో మొత్తం 10,095 మందికి, 2021–22లో 11,178 మందికి హెచ్ఐవీ సోకింది. కాగా, అసురక్షిత శృంగారం వల్లే హెచ్ఐవీ కేసులు ఎక్కువగా ప్రబలుతున్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. లక్షిత వర్గాలకు టెస్టులు ఈ నేపథ్యంలో ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్ఐవీ గురించి ముందస్తు జాగ్రత్తగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ కేసులను తగ్గించేందుకు సొసైటీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా లైంగిక కార్యకర్తలు (సెక్స్ వర్కర్స్), ట్రక్ డ్రైవర్లు, డ్రగ్స్ వాడేవారు, హిజ్రాలు, రోజువారీ కూలీలు ఎక్కువగా అసురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారని సమీక్షలో సొసైటీ గుర్తించింది. వీరినే లక్షిత వర్గాలు అని పిలుస్తారు. వారి జాబితాను తయారు చేసి అందరికీ హెచ్ఐవీ టెస్టులను చేస్తోంది. వీరిలో పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సేవలను, ఉచిత ఔషధాలను అందిస్తోంది. ఇప్పటికే 86 శాతం మేర ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. ఏఆర్టీ కేంద్రాల్లో ఔషధాలు రాష్ట్రంలో మొత్తం 71 ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో అపరిశుభ్రత, నర్సులు, మందుల కొరత ఎక్కువగా వేధిస్తోంది. దీంతో బాధితులు ఇక్కడికి రావాలంటే భయపడాల్సి వస్తోంది. రాజీవ్‌గాంధీ వసతి యోజన కింద వసతి, చికిత్స, ఉచిత ప్రయాణానికి డబ్బులు చెల్లిస్తున్నారు. హెచ్ఐవీ బాధిత విద్యార్థులకు ఉచిత కాలేజీ విద్య, ఉపకార వేతనాలు, ధనశ్రీ యోజన కింద రూ. 40 వేల రుణం, ఉచిత రైల్వే ప్రయాణం, ఉచిత రక్తసేవలు వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వాలు బాధితులకు కల్పిస్తున్నాయి. అయితే ఇందులో 40 శాతం హెచ్ఐవీ బాధితులకు ఈ సౌలభ్యాలు చేరడం లేదు. 30 శాతం మందికి ఈ పథకాల సమాచారమే తెలియకపోవడం గమనార్హం. క్షయ, క్యాన్సర్ తదితర జబ్బులు సోకితే నిర్ణీత కాలం చికిత్స తీసుకుంటే నయమై మామూలు మనిషి కావచ్చు. కానీ ఒక్కసారి హెచ్ఐవీ వైరస్ సోకితే నయం కాదు, అది ముదిరిపోకుండా చూసుకుంటూ జీవించాల్సి ఉంటుంది. ఇంత భయంకరమైన హెచ్ఐవీపై అనేక వర్గాల్లో అవగాహన కరువై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సులభంగా హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు గురై జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్‌కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్‌లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్‌ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్‌జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్‌బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
నిశ్శబ్దాన్ని ఛేదించి ఎందరికో ‘చేయూత’
హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు దీనిపై నలుగురిలో మాట్లాడాలంటేనే వణుకు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనుకునే వారు. కానీ.. మందులకు లొంగని ఈ వ్యాధి సోకినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని కోటగిరి రేణుక రుజువు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రేణుక భర్త కోటగిరి శ్రీనివాసరావుకు 1999లో హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. రేణుకకు కూడా ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. 2003లో శ్రీనివాసరావు మృతి చెందారు. భర్త మరణానంతరం రేణుక విజయవాడకు మారారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల తనలా ఇంకెంత మంది మహిళలు వేదనకు గురవుతున్నారోననే భావన రేణుకను కలచివేసింది. హైదరాబాద్‌కు వెళ్లి హెచ్ఐవీ బాధితుల ‘కేర్ అండ్ సపోర్టింగ్’లో శిక్షణ పొందారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా 2003లోనే ‘తెలుగు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంలో భాగస్వామి అయ్యారు. మరోవైపు అప్పట్లోనే చేయూత అనే సంస్థను సైతం నెలకొల్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని హెచ్ఐవీ బాధితులకు వివిధ రకాలుగా అండగా నిలిచారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు సాయం, పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది పిల్లల చదువులకు చేయూత ఎన్జీవో ద్వారా సాయం అందించారు. ప్రస్తుతం 400 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆమె సహకారంతో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ చదివిన వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పుకోవడానికి భయపడను నేను హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి భయపడను. అలా చెప్పుకోవడానికి ఇబ్బంది పడి.. నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా బాధితులకు సాయం చేయడమే నా లక్ష్యం. తమ ప్రమేయం లేకున్నా.. ఏ తప్పు చేయకున్నా చాలామంది ఈ వ్యాధి బారినపడుతుంటారు. వ్యాధి సోకినంత మాత్రాన కుంగిపోవద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో మంచి వైద్యం అందుతోంది. ఎవరో.. ఏదో అనుకుంటారని బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మానేయొద్దు. – కోటగిరి రేణుక, చైర్మన్, చేయూత స్వచ్ఛంద సంస్థ -
భార్యకు హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన భర్త
గుంటూరు: ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం పలు మలుపులు తిరిగి చివరకు ఓ మహిళ జీవితంలో విషాదం మిగిల్చింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహే తర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్ఐవీ సోకే విధంగా ఓ ఆర్ఎంపీ తో వైద్యం చేయించినట్లు ఆ వివాహిత గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకా రం.. సీతానగరానికి చెందిన యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మంగళగిరి చెందిన ముప్పెర చరణ్‌కుమార్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. పాప పుట్టిన అనంతరం ఆమెను చరణ్‌కుమార్ శారీరకంగా దూరం పెట్టడమే కాకుండా ఇంటికి కూడా రావడం మానేశాడు. పిల్లలు పుట్టిన తరువాత నీకు అనారోగ్యంగా ఉంది వైద్యం చేయిస్తానంటూ మంగళగిరి చెందిన ఆర్ఎంపీతో ఆమెకి పలుసార్లు ఇంజక్షన్లు చేయించాడు. కొంత కాలం తరువాత వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉందని తేలింది. ఆసుపత్రి నుంచి అదే విషయాన్ని తన భర్త చరణ్‌కుమార్‌కు తెలిపింది. దీంతో అతను ఇంటికి వచ్చి నాకు హెచ్ఐవీ లేదు, నీకు హెచ్ఐవీ ఉంది. నావల్లే పొరపాటు జరిగింది. నన్ను క్షమించు. జీవితాంతం నిన్ను చూసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నన్ను వదిలించుకోవడానికే హెచ్ఐవీ ప్రయోగం చేశాడని, జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష ప్రయోగం కింద, మోసగించినందుకు, కులాన్ని ప్రస్తావించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కలకలం.. జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ
లక్నో: జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని దాస్నా జైలులో వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా జైలు సీనియర్ అధికారులే ధ్రువీకరించారు. మొత్తం జైలులో 5500 మంది ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. ఘజియాబాద్ జైలులోని ఖైదీలకు ఎమ్‌ఎమ్‌జీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేస్తారని జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో ఘజియాబాద్ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో 46 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ బారిన పడిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వెల్లడించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా హెచ్ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించిన ఖైదీలతో దస్నా జైలు కిక్కిరిసి పోయిందని అధికారులు తెలిపారు. జైలులో 1706 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం జైలులో మొత్తం 5,500 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్ఐవీ బాధితులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాధి స్పర్శ ద్వారా వ్యాపించదని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదన్నారు. హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల్లో ఎక్కువ డ్రగ్స్‌కు బానిసలని, డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ... నమోదైన తొలి కేసు
ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవి ఎటాక్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడ్డాడని వివరించారు. అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్, మంకీపాక్స్ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసు మంకీపాక్స్, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. (చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి) -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తగ్గిన హెచ్ఐవీ తీవ్రత
విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ తీవ్రత జిల్లాలో చాలా వరకు తగ్గిందని జిల్లా ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి రాణి సంయుక్త పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రభావం ఏ ప్రాంతాలలో, ఏ సమూహాలలో, ఏ వయసు వారికి సోకుతున్నదో తెలుసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో 3 రోజుల వర్క్ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డబ్లు్యహెచ్‌ఓ కన్సల్టెంట్ సుకుమార్, డీపీఎం బాలాజీ, జిల్లా సూపర్ వైజర్ సాక్షి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్లలో 17 లక్షల మందికి ఎయిడ్స్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది. ► ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్లో 87,440 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. ► 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్ఐవీ సోకింది. ► తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి. ► 2020 నాటికి 23,18,737 హెచ్ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు. ► హెచ్ఐవీ వైరస్ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారుచేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్లను తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. -
హెచ్ఐవీ కారణంగానే ఒమిక్రాన్ పుట్టుకొచ్చిందా? సంచలన విషయాలు వెల్లడి
Is Omicron Variant Connection With HIV?: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అనుకునే లోపే మాయదారి మహమ్మారి రూపాంతరం చెంది ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రజలను పీడించేందుకు మరో సారి దాపురించింది. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ వేరియంట్ మొదటగా సౌతాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకొచ్చింది, అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. అందుకు శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ కరోనా వైరస్ నుంచి ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది, మరే ఇతర లక్షణాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు నిపుణులు వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్, హెచ్ఐవి మూలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనలను ఉటంకిస్తూ ఒమిక్రాన్‌ను హెచ్ఐవితో ముడిపెట్టే అవకాశాలు "అత్యంత ఆమోదయోగ్యమైనదిగా ఉన్నాయని బీబీసీ తన నివేదికలో పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఒమిక్రాన్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం చెలామణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరిశోధకులు ఏమంటున్నారంటే.. హెచ్ఐవీ సోకిన మహిళకు కరోనా సోకడం, ఆ తరువాత వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉండే అవకాశాలు ఉండచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటువంటి అభిప్రాయమే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వైరస్ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు’’ అని డా.కెంప్ తెలిపారు. చదవండి: Omicron Variant: అమెరికాను కమ్మేసిన ఒమిక్రాన్.. 73 శాతం అవే కేసులు -
ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?
దాదాపుగా దశాబ్ధం తర్వాత మొదటిసారి క్షయ (టీబీ) మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురువారం విడుదలచేసిన గ్లోబల్ టీబీ - 2021 నివేదికలో వెల్లడించింది. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. అందుకు బారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్‌వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష!! చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు
నౌగావ్: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
కండోమ్ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్ఐవీ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం. అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ. కండోమ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్‌ఐవీనే కాదు హెపటైటీస్–బి, సి, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అంతేకాదు చాలామందికి హెచ్ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు.. కదా! అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. రక్షణ కోసం కనీసం కండోమ్‌లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవగాహన ఉన్నా.. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్ వాడుతున్నారు. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్ వాడుతున్నట్లు స్పష్టమైంది. నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ.. అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. ·గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది. ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరికి వాడిన సిరంజ్‌లు, బ్లేడ్స్ మరొకరికి వాడటం వల్ల వస్తుంది. నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్ ప్రసన్నకుమారి, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారిణి -
కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం) కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా జాగ్రత్త వహించాలన్నారు. (కరోనాను జయించిన స్పెయిన్ బామ్మ) బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీకా లేకుండా ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్ కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. (లాక్డౌన్ ముగిసిన వెంటనే బరిలోకి దిగుతా: సెరెనా) -
ఎయిడ్స్‌కు 4,250 మంది బలి
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్‌కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల్లో మన రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018– 19 ఆర్థిక ఏడాదిలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్ నాటికే 4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు. సెక్స్ వర్కర్లలో అధికం.. సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్‌నాథ్ తెలిపారు. -
హెచ్ఐవీ దాచి పెళ్లి.. ఆపై భార్యతో..
ముంబై : తనకు వచ్చిన రోగాన్ని దాచి తనతో పాటు తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. తనకు హెచ్ఐవీ సోకిందన్న నిజాన్ని దాచి.. ఆమె నూరేళ్ల జీవితంతో ఆడుకున్నాడు. చివరకు నిజం తెలుసుకొని నిలదీసిన భార్యపై నిందలు మోపారు. కోడలు వల్లనే తమ కుమారుడికి ఈ పాడురోగం సోకిందంటూ అత్త, మామలు దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ కుమారుడిని వెనుకేసుకొస్తూ నిజాన్ని కప్పిపుచ్చారు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. థానే జిల్లాలోని డోంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(31) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కామోథేకు చెందిన ఓ యువతి(26)ని 2016లో వివాహం చేసుకున్నాడు. కాగా, అంతకు ముందే అతనికి హెచ్ఐవీ సోకింది. ఈ విషయం అతని కుటుంబీకులకు కూడా తెలుసు. ఈ దారుణ విషయాన్ని కప్పిపుచ్చి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చిన ఓ బంధువు.. మందులు వాడుతున్నావా అని అడగడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. మందులు ఎందుకు... ? ఏమైందని అని అడుగగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. అత్తమామలను నిలదీయగా క్షయ వ్యాది సోకిందని, మందులు వాడితే తగ్గిపోతుందని నచ్చజెప్పారు. ఓ రోజు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్ల ద్వారా అతనికి హెచ్ఐవీ సోకిందని తెలుసుకుంది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి మరో ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా.. తిరిగి ఆమెపైనే నిందలు వేశారు. ‘ నీ వల్లనే మా కుమారుడికి హెచ్ఐవీ సోకింది’ అంటూ తిరిగి ఆమెనే నిందించారు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు యువతి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
వేలమందిని కాపాడిన ఆ డాక్టర్ ఇక లేరు
1990లో మధ్య చైనాలో హెచ్ఐవీ, హెపటైటిస్ మహమ్మారికి సంబంధించిన సంచలన విషయాన్ని బయటపెట్టిన సాహసోపేత డాక్టర్ షుపింగ్ వాంగ్ (59) కన్నుమూశారు. దాదాపు పదివేల మందికిపైగా ప్రాణాలను కాపాడిన ఆమె ఇక సెలవంటూ ఈ ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఈమె స్ఫూర్తితో రూపొందించిన నాటకం ‘ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్’ ప్రస్తుతం లండన్‌లో నడుస్తోంది. నాటక రచయిత ఫ్రాన్సిస్ యో చూ.. వాంగ్‌ను "పబ్లిక్ హెల్త్ హీరో" అని పిలుస్తారు. ఈ సందర్భంగా డా. వాంగ్ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. 1991 లో చైనా ప్రావిన్స్ హెనాన్‌లో డాక్టర్ వాంగ్ ప్రభుత్వ రక్త, ప్లాస్మా సేకరణ కేంద్రంలో పనిచేసేవారు. ఈ సందర్భంగా చాలా మంది హెచ్ఐవీ, హెపటైటిస్ బారిని పడిన వారు విచక్షణ రహితంగా రక్తాన్ని అమ్ముతున్నారని, తద్వారా లక్షలమంది రక్త గ్రహీతలు ఈ భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది. వెంటనే తన సీనియర్ అధికారులను అప్రమత్తం చేసింది. దీనికితోడు పేలవమైన సేకరణ పద్ధతుల ద్వారా పెనుప్రమాదం పొంచి వుందని హెచ్చరించింది. ఆమె చర్యలు వ్యాపారానికి ఆటంకం కలిగించాయని వాదించిన సీనియర్లు బదిలీని బహుమానంగా ఇచ్చారు. అయినా 1995లో, ఆమె మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. హైచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి పలు కేంద్రాల్లో రక్తాన్ని అమ్ముతున్నాడని గుర్తించింది. ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా నివేదించింది. ఫలితంగా ఉద్యోగాన్నికోల్పోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఆమె భర్తను అతని సహచరులు బహిష్కరించారు. చివరికి ఇది వారి విడాకులకు దారి తీసింది. దీంతో డాక్టర్ వాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెనాన్ ప్రావిన్స్‌లో తనే స్వయంగా 400 శాంపిళ్లను సేకరించింది. ఖరీదైన పరీక్షలు నిర్వహించి, హెచ్ఐవీ రేటు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఫలితాలను రాజధాని బీజింగ్‌లోని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. కానీ ఈ సారి కూడా ఆమెపై దాడి జరిగింది. ఆమె క్లినిక్‌కు వచ్చి పరికరాలను ధ్వంసం చేశారు. ఎట్టకేలకు చైనా ప్రభుత్వం స్పందించింది. 1996లో దేశంలోని అన్ని రక్తం, ప్లాస్మా సేకరణ కేంద్రాలు మూసివేసి దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆయా కేంద్రాల్లో దాతలందరికీ హెచ్ఐవీ, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ తరువాత ప్రకటించింది. చాలా సంవత్సరాల తరువాత, డాక్టర్ వాంగ్ గ్యారీ క్రిస్టెన్‌సెన్‌ను తిరిగి వివాహం చేసుకుని 2001లో సన్‌షైన్ అనే పేరుతో అమెరికా వెళ్లి పోయారు. అక్కడ సాల్ట్ లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధకురాలిగా పనిచేయడం ప్రారంభించారు. 2001 సంవత్సరంలోనే మధ్య చైనాలో తీవ్రమైన ఎయిడ్స్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చైనా ప్రభుత్వం అంగీకరించింది. స్థానిక రక్త బ్యాంకుల ద్వారా లక్షలాదిమంది వ్యాధి బారిన పడ్డారని వెల్లడించింది. ముఖ్యంగా డాక్టర్ వాంగ్ పనిచేసిన ప్రావిన్స్ హెనాన్ ఎక్కువగా ప్రభావితం మైంది. ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. 2019లో ఆమెను గతం వెంటాడింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన నాటక ప్రదర్శనను నిలువరించే ప్రయత్నాల్లోభాగంగా హునాన్‌లోని బంధువులు, స్నేహితులను కలవడానికివీల్లేదని, చైనా భద్రతా అధికారులు బెదిరించారు. వీటిని వాంగ్ ఏ మాత్రం లెక్కచేయలేదు. దీంతో "ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్" అనే నాటకం సెప్టెంబరులో లండన్‌లోని హాంప్స్టెడ్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. నాటకంలోని ఒక దృశ్యం సెప్టెంబర్ 21 న సాల్ట్ లేక్ సిటీలో స్నేహితులు, ఆమె భర్తతో కలిసి హైకింగ్ చేస్తుండగా డాక్టర్ వాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. మరణానికి ఒక నెల ముందు హాంప్స్టెడ్ థియేటర్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాంగ్ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఉద్యోగం, వివాహం,ఆనందం అన్నీ కోల్పోయాను. కానీ తన పోరాటం ఏంతోమంది పేదలను రక్షించడానికి సహాయపడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఆమె ఆకస్మిక మరణం ఆమె అభిమానుల్లో విషాదాన్ని నింపింది. నాటక రచయితతో డా. వాంగ్ -
వారి సంగతేంటో తేల్చండి..
సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మందికి ఎయిడ్స్ ఉందో! లేదో! జైలు అధికారులు నిర్ధారించాలని బుధవారం హై కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన ఏడు కొండలు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హై కోర్టుకు విన్నవించడంతో కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఎంత మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారు? వారికి ఆరోగ్యపరంగా ఇస్తున్న వైద్యం, పౌష్టికాహారం తదితర వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జైలు అధికారులు ఖైదీలకు ఇస్తున్న ఆహారం మందుల వివరాల నివేదికను అందజేశారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు గుడ్డు, 250 మిల్లీ గ్రాముల పాలు, వారంలో వంద గ్రాముల మాంసం, ప్రోటీన్స్, ఇతర ఏఆర్టీ మందులు ఇస్తామని హై కోర్టుకు తెలిపారు. అలాగే ఇతర జైళ్ల నుంచి కూడా హెచ్ఐవీ రోగులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపుతున్నారన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండడంతో గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని హెచ్ఐవీ రోగులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ నాలుగు జిల్లాలు హైవే కు ఆనుకొని ఉండడంతో లారీ డ్రైవర్లు, కూలీలు, రోడ్డు ప్రమాదం చేసి, హత్యలు చేసి హెచ్ఐవీ రోగులుగా జైలుకు వస్తున్నారని జైలు అధికారులు హై కోర్టుకు వివరించారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ రోగులు 19 మంది బయట నుంచి వచ్చారని, అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్ఐవీ టెస్ట్‌లలో బయటపడ్డాయని కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఆగస్టు రెండో తేదీకి వాయిదా వేసింది. -
బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారా?
సాక్షి, చెన్నై : శస్త్రచికిత్స సమయంలో ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నై కోర్టు సివిల్ కోర్టు తీవ్రంగా స్పందించింది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్’ ను ఆదేశించింది. అలాగే ఆ యువకుడికి ఉద్యోగం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 1999లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై నగరంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న ఓ పేద దంపతుల కుమారునికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో నగరంలోకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తాన్ని ఎక్కించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. మరోచోట రక్త పరీక్ష చేయగా హెచ్ఐవీ ఉన్నట్టు తేలడంతో కోర్టును ఆశ్రయించారు. 20 ఏళ తర్వాత కోర్డు తీర్పును వెల్లడించింది. కాగా ఆ బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు చెల్లించామని ఆస్పత్రి అధికారులు పేర్కొనగా.. అది అతని వైద్య ఖర్చులకే సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హెచ్ఐవీ బ్లడ్‌ను ఎలా ఎక్కించారని సిబ్బందిపై మండిపడింది. సిబ్బంది నిర్లక్ష్యంగానే ఆ బాలుడికి హెచ్ఐవీ సోకిందని..పరిహారంగా రూ. 20లక్షలు చెల్లించాలని కోర్టు తేల్చిచెప్పింది. యువకుడి తల్లిదండ్రులు పేదవారని, కుటుంబ పోషణ కోసం ఆ యుకుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హెచ్ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు
తల్లిదండ్రులు చేసిన తప్పు ఆ పాపకు శాపంగా మారింది. చేరదీయాల్సిన గురువులే ఆమెను దూరం పెట్టడంతో ఆమెకు కన్నీరే మిగిలింది. వీరఘట్టం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినికి హెచ్ఐవీ ఉన్నట్టు తెలియడంతో సిబ్బంది ఇంటికి పంపేశారు. ఊరడించి, ధైర్యం చెప్పాల్సిన వారే వివక్ష చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపకు ఈ వ్యాధి సోకింది. కొన్నేళ్ల తర్వాత అమ్మ చనిపోయింది. ఆ తర్వాత తండ్రి ఏమయ్యాడో తెలీదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పాప వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దే ఉంటూ చదువుకునేది. ఆమెను ఈ ఏడాదే కేజీబీవీలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆమె నిత్యం మందులు వాడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు మందులు వాడుతుందోనని కేజీబీవీ సిబ్బంది బిటివాడ పీహెచ్సీలో వైద్య తనిఖీలు చేయిం చారు. ఈ పాపకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలి కను వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దకు పం పించేశారు. వారం రోజులవుతున్నా కేజీబీవీ సి బ్బంది నుంచి ఇంత వరకు పిలుపు రాలేదు. మందులు వాడడమే గానీ తనకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం కూడా ఆ బాలికకు తెలీదు. ఆ బాలిక పరిస్థితిని చూసి అందరి మనసులు తల్లడిల్లిపోతున్నాయి. ఏ పాపం చేయని బాలికపై కేజీబీవీ సిబ్బంది వివక్ష చూపడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. బాల్యం నుంచే కష్టాలు... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ బాలిక వీరఘట్టంలో ఉన్న తాత వద్ద ఉంటోం ది. 1 నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం కోమటివీధి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. తర్వాత 6వ తరగతి వీరఘట్టం బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఇంటి వద్ద పాప ఆలనా పాలనా చూసేందుకు తాతకు ఇబ్బందిగా ఉండడంతో రెసిడెన్షియల్ విద్య ఉన్న కేజీబీవీలో ఈ ఏడాది 7వ తరగతిలో చేర్పించారు. సమాజానికి ఇచ్చే సందేశమిదేనా? ప్రతి ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం రోజున.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ర్యాలీలు చేసి స్పీచ్‌లు ఇచ్చే ఉపాధ్యాయులు ఓ బాలికపై ఇటువంటి వివక్ష చూపించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌లో ఓ బాలుడికి హెచ్ఐవీ ఉందని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వనందున అక్కడ ప్రధానోపాధ్యాయుడిని ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వీరఘట్టం కేజీబీవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ విషయంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ అమరావతిని సాక్షి వివరణ కోరగా.. ఆ బాలికకు హెచ్ఐవీ ఉందని తెలిస్తే మిగిలిన బాలికలు కంగారు పడతారనే ఉద్దేశంతో ఇంటికి పంపించేశామని చెప్పా రు. బాలికను మళ్లీ ఇక్కడ చేర్చుకుని తర్వాత శ్రీకాకుళంలో వీరి కోసం ప్రత్యేకంగా ఉన్న హోంకు పంపిస్తామన్నారు. -
ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి
తమిళనాడు, తిరువొత్తియూరు: హెచ్ఐవీ బాధిత బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాలని జిల్లా ముఖ్య విద్యాధికారి గురువారం ఆదేశించారు. పెరంబలూరు జిల్లా కొలక్కానత్తంకు చెందిన ఓ బాలుడి తల్లిదండ్రులు హెచ్ఐవీ బాధితులు. వీరిలో బాలుడి తల్లి గతేడాది మృతి చెందింది. తండ్రి సంరక్షణలో బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడికి హెచ్ఐవీ ఉన్నట్టు వైద్య పరీక్షలో తెలిసింది. ఇందుకు ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. పెరంబలూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన ఆ బాలుడు 9వ తరగతి పెరంబలూరు ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదివాడు. ఈ ఏడాది ఇంతకు ముందు చదివిన ప్రభుత్వ మహోన్నత పాఠశాలలోనే 10వ తరగతి చేర్చడానికి అతని బంధువులు ప్రయత్నించారు. ఆ బాలుడికి హెచ్ఐవీ ఉండడంతో అతన్ని పాఠశాలలో చేర్చుకోవడానికి హెచ్ఎం తిరస్కరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి బుధవారం పాఠశాల ఆవరణలో బాలుడి బంధువులకు, హెచ్ఎంకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బాలుడి బంధువులు జిల్లా కలెక్టర్ శాంతను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విద్యార్థిని పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ బాలుడు ఏ పాఠశాలలో 10వ తరగతి చదువడానికి ఇష్టపడతాడో అదే పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే హాస్టల్లో ఉంటూ చదవాలనుకుంటే పెరంబలూరు సింజేరిలో ఉన్న ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో చేర్చించాలన్నారు. ఆ బాలుడికి అడ్మిషన్ ఇవ్వడానికి తిరస్కరించిన పెరంబలూరు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం(ప్రధానోపాధ్యాయుడి)పై చర్యలు తీసుకుంటామని జిల్లా ముఖ్య విద్యాఅధికారి (సీఈఓ) గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
హెచ్ఐవీకి మందు దొరికింది!
అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలు కల్పించే క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీతో శాస్త్రవేత్తలు జంతువుల్లో హెచ్ఐవీని లేకుండా చేయగలిగారు. బతికున్న జంతువుల జన్యువుల్లోంచి హెచ్ఐవీ కారక వైరస్‌ను తొలగించగలగడం ఇదే తొలిసారి. వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందినప్పటికీ హెచ్ఐవీకి ఇప్పటివరకూ పూర్తిస్థాయి చికిత్స అన్నది లేదన్నది తెలిసిందే. యాంటీ రెట్రో వైరల్ మందులను వాడుతూ జీవితకాలాన్ని పెంచుకునేందుకు మాత్రమే అవకాశముంది. ఈ నేపథ్యంలో టెంపుల్ యూనివర్శిటీ, నెబ్రాస్కా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ల శాస్త్రవేత్తలు క్రిస్పర్ సాయంతో హెచ్ఐవీ వైరస్‌లను తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో టెంపుల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన శాలలో మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్‌ను తొలగించడంలో విజయం సాధించగా.. తరువాతి కాలంలో నెబ్రాస్కా యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. హెచ్ఐవీ వైరస్ తనదైన డీఎన్ఏ సాయంతో కణాల్లోకి చొరబడి విభజితమవుతుందన్నది తెలిసిందే. వ్యాధితో కూడిన ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్ మందులను చాలా నెమ్మదిగా వారాలపాటు విడుదల చేస్తూ వైరస్ మోతాదు అతి తక్కువ స్థాయిలో ఉండేలా చేసిన తరువాత శాస్త్రవేత్తలు.. ఆ తరువాత కణాల లోపల ఉండే వైరస్ డీఎన్ఏ పోగును కత్తిరించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో మూడు వంతుల ఎలుకల్లో వైరస్ లేకుండా పోయినట్లు స్పష్టమైంది. -
వైద్యుడి నిర్లక్ష్యం.. 400 మందికి హెచ్ఐవీ
ఇస్లామాబాద్ : ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ చిన్నారుల గురించి ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో తెలీక వారంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. రిపోర్ట్స్ నెగిటీవ్ అని వస్తే బాగుండు అని దేవుడిని వేడుకుంటున్నారు. కానీ వారు కోరుకున్నట్లు జరగడం లేదు. పరీక్షలు చేసిన ప్రతి ఒక్కరిలో మహామ్మరి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 మందిలో హెచ్ఐవీ వైరస్ లక్షణాలు కనిపించగా.. వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తుంది. కలుషిత సిరంజి వాడి.. వందలాది మంది చిన్నారులను ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధి బారిన పడేలా చేసిన ఈ సంఘటన పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ముజఫర్ గంగర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్వయంగా అతను కూడా హెచ్ఐవీ బాధితుడు కావడం గమనార్హం. ఈ వైద్యుడి వద్ద వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 400 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయని.. వారిలో అధికులు చిన్న పిల్లలే అని అధికారులు తెలిపారు. మరి కొంత మందికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అభం శుభం తెలియని తమ చిన్నారులకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇక తమ పిల్లలు సాధరణ జీవితాన్ని ఎలా గడుపుతారు.. సమాజం వారిని ఎలా చూస్తుంది అని వాపోతున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. తమ ప్లిలలకు ఈ పరిస్థితి కల్పించిన డాక్టర్‌కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. హైచ్ఐవీ కేసుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. 2017 ఒక్క సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యులు, పేదరికం వంటివి కూడా ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో.. వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు. ఇక ఇంతటి దారుణానికి కారణమైన వైద్యుడు ప్రస్తుతం రటోడెరోకు సమీపంలోని ఓ జైలులో ఉన్నాడు. ఈ విషయం గురించి అతను ‘నాకు హెచ్ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తోన్న ఆరోపణలు కూడా అవాస్తవం’ అని కొట్టి పారేస్తున్నాడు. ఈ దారుణంపై విచారణ చేస్తున్నట్లు సింధ్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రొగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
పెరిగిన హెచ్ఐవీ పేషెంట్లు.. డాక్టర్ అరెస్ట్
కరాచీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హెచ్ఐవీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న డా. ముజఫర్ గంగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లర్కానా జిల్లాలోని రటోడెరోలో ప్రభుత్వ ఆసుపత్రిలో ముజఫర్ గంగర్ విధులు నిర్వహిస్తున్నారు. అతడికి కూడా హెచ్ఐవీ ఉన్నట్టు గుర్తించారు. లర్కానా నగర సమీప ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో వైద్యఅధికారులు అలర్ట్‌ను ప్రకటించారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హెచ్ఐవీ భారిన పడ్డట్లుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు. కలుషిత సిరంజి వాడటం వల్ల 90 మంది వ్యక్తులు హెచ్ఐవీ బారిన పడినట్టు తెలుస్తోంది. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనకకు తనకు ఎలాంటి సంబంధం లేదని డా. ముజఫర్ గంగర్ తెలిపారు. తనకు హెచ్ఐవీ సోకిన విషయం కూడా తెలియదని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్టు సింధ్‌లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
హెచ్ఐవీ ఉందని చెప్పినా వినని కామాంధుడు..
కర్నూలు, ఆదోని: ఓ బాలికను కిడ్నాప్ చేయడంతోపాటు బలవంతంగా పెళ్లి చేసుకుని.. మూడు నెలల పాటు లైంగికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు(15ఏళ్లు) పోలీసులను ఆశ్రయించింది. విలేకరులతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని విలపించింది. వివరాలు బాలిక మాటల్లోనే.. ‘‘ మాది ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్.. మా అమ్మ 2015లో హెచ్ఐవీతో మృతి చెందింది. అమ్మ నుంచి నాకు కూడా వ్యాధి సోకింది. విషయం తెలియడంతో నాన్న ఎంతో కుమిలిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆదోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాన్నను సంప్రదించి.. హెచ్ఐవీకి చికిత్స అందిస్తూ చదివిస్తామన్నారు. దీంతో నేను ఆదోని పట్టణంలోని ఓ పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. నాన్న ఆరోగ్యం దెబ్బతిన్న విషయం తెలిసి ఎమ్మిగనూరుకు వచ్చాను. మా వీధిలోనే ఉన్న శంకర్ అనే యువకుడు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నాకు హెచ్ఐవీ ఉందని చెప్పినా వినలేదు. మూడు నెలల క్రితం రాత్రి 7.30గంటల సమయంలో నేను పాలప్యాకెట్టు కోసం బయటకు రాగానే మధు, యువరాజ్‌తో వచ్చిన శంకర్ నన్ను సైకిల్‌మోటార్‌పై బలవంతంగా ఆదోనికి తీసుకొచ్చాడు. ఓ ఇంట్లో బంధించి బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు. నాకు హెచ్ఐవీ ఉందని చెప్పినా వినలేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పారిపోయి వచ్చి నాన్నకు కబురు పెట్టారు. నా జీవితాన్ని సర్వ నాశనం చేసిన శంకర్, మధు, యువరాజ్, బంధువు ఆంజనేయపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాలిక డిమాండ్ చేశారు. బాధిత బాలికను షీటీం పోలీసులు విచారించారు. ఏం జరిగిందో విచారించి కేసు నమోదు చేస్తామని ఆదోని త్రీ టౌన్ సీఐ శ్రీరాములు తెలిపారు. -
ఎయిడ్స్ బాధితులకు శుభవార్త
లండన్: 3.7 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఇది. వీరందరికీ కచ్చితంగా ఇది శుభవార్తే. బతికున్నన్నాళ్లు వ్యాధిని భరిస్తూ.. మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేదని భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా నిరూపించారు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీ నుంచి బయటపడినట్లు.. పూర్తిస్థాయి చికిత్స సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్‌ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్ రోగి రెండో వ్యక్తి అని సియాటెల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో రవీంద్ర ప్రకటించారు. ఎయిడ్స్ వైరస్‌కు సహజమైన నిరోధకత కలిగిన వ్యక్తి తాలూకూ ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను చొప్పించడం ద్వారా ఇద్దరికీ చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పన్నెండేళ్ల కింద బెర్లిన్ పేషెంట్‌గా ప్రపంచానికి పరిచయమైన తిమోతీ బ్రౌన్ జర్మనీలో చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంట్రీ రెట్రోవైరల్ మందులు వాడకున్నా అతడి శరీరంలో వైరస్ ఛాయలేవీ లేవు. లండన్ రోగి విషయానికొస్తే.. ఈయనకు 2003లో వ్యాధి సోకింది. 2012లో హడ్కిన్స్ లింఫోమా (ఒక రకమైన రక్త కేన్సర్) బారిన కూడా పడ్డాడు. రవీంద్ర గుప్తా అప్పట్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పనిచేస్తుండేవారు. 2016లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య లండన్ పేషెంట్ తన వద్దకొచ్చాడని.. చివరి ప్రయత్నంగా మూలకణ చికిత్సకు ఏర్పాట్లు చేశామని రవీంద్ర తెలిపారు. జన్యుక్రమంలో సీసీఆర్ 5, డెల్టా 32 అనే రెండు మార్పుల కారణంగా హెచ్ఐవీ వైరస్ సోకని ఓ వ్యక్తి మూలకణాలను లండన్ పేషెంట్‌కు ఎక్కించారు. కొంతకాలం పాటు కొత్త మూలకణాలను రోగి శరీరం నిరోధించిందని.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. మూడేళ్లపాటు మూలకణాలను ఎక్కించాక గత 18 నెలలుగా లండన్ పేషెంట్ యాంటీ రెట్రోవైరల్ మందులు తీసుకోవడం ఆపేసినా శరీరంలో వైరస్ ఛాయల్లేవని రవీంద్ర వివరిస్తున్నారు. సులువేం కాదు.. మూలకణాల ద్వారా హెచ్ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉత్తర యూరప్ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం. రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. దాత మూలకణాలను అడ్డుకునేందుకు రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను తట్టుకుని నిలవగలగడం కష్టసాధ్యమైన పని. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. -
ప్రభుత్వాస్పత్రి నిర్వాకం.. చిన్నారికి హెచ్ఐవీ
చెన్నై : ఓ ప్రభుత్వాస్పత్రి నిర్వాకంతో ఓ మూడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బాధితురాలైంది. రక్తమార్పిడి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ పసిపాప పాలిట శాపంగా మారింది. రక్తమార్పిడి జరిగిన ఏడు నెలల అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆ చిన్నారికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. అనుమానంతో ఆ పాప తల్లిదండ్రులను పరీక్షించగా వారికి ఎలాంటి వైరస్ సోకలేదని స్పష్టమైంది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వ ఆసుప్రతి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ తమిళనాడులోని త్రిచిలో నివసించే ఓ జంట.. ఆనారోగ్యంతో బాధపడుతున్న తమ మూడేళ్ల కూతురిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమపై అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. కానీ వారికి నెగటీవ్ వచ్చింది. దీంతో గతంలో తమ పాపకు రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యుల చేసిన పొరపాటు ఫలితమేనని గ్రహించారు. గతేడాది జూలై 11న తమ కూతురికి రక్తాన్ని ఎక్కించారని, అయితే రక్తం ఎక్కించే సమయంలో వైద్యులు పొరపాటున ఓ వృద్ధుడి రక్తాన్ని ఎక్కించారని, ఇది తెలుసుకొని మధ్యలోనే ఆపేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అప్పుడు పాప ఆరోగ్యం కుదటపడటంతో అంతగా పట్టించుకోలేదని, కానీ ఈ నెల 8న మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ అని తేలిందన్నారు. ఈ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న మరో ఇద్దరు కూడా హెచ్ఐవీ వచ్చిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన హెచ్ఐవీ బ్లడ్ బాధితురాలు
చెన్నై : గతేడాది డిసెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సదరు మహిళకు కూడా హెచ్ఐవీ సోకింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. ‘సాధరణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా 2.5 - 3.5 కిలోగ్రాముల బరువు ఉండాలి. కానీ ఈ చిన్నారి కేవలం 1. 75 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ పాపను చిన్న పిల్లల ఐసీయూలో ఉంచామ’ని తెలిపారు. అంతేకాక తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా నిరోధించే ‘నెవిరాపిన్ సిరప్’ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మెడిసిన్‌ను 6 - 12 వారాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేకాక హెపటైటీస్ బీ వైరస్ రాకుండా నిరోధించడం కోసం హెపటైటీస్ బీ టీకాను కూడా ఇచ్చామన్నారు. దాంతో పాటు 45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రక్త దానం చేసే నాటికే సదరు యువకుడికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయకపోవడంతో ఈ దారుణం జరిగింది. -
హెచ్ఐవీ బ్లడ్ కలకలం.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హెచ్ఐవీ బారిన పడగా.. తన కారణంగా రెండు జీవితాలు హెచ్ఐవీకి బలికావాల్సి వస్తోందని రక్తం దానం చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలొదిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులంటే వణకు పుట్టేలా చేస్తోంది. సాక్షి, చెన్నై : గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిస సంగతి తెలిసిందే. కాగా, రక్తదానం చేసిన యువకుడు (19) తీవ్ర మనస్తాపంతో ఎలుకలమందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలొదిలాడు. అయితే, మృతుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్!) బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన తమ కొడుకు శుక్రవారం వరకు బాగానే ఉన్నాడని తెలిపారు. డాక్టర్లు వచ్చి ఏదో సూదిమందు ఇచ్చిన తర్వాతనే అతని ఆరోగ్యం క్షీణించిందని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతి వెనుక కారణాలను వెలికితీసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో సోమవారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం చేయాలనీ, ఆ ప్రక్రియనంతా వీడియోలో చిత్రీకరించాలని రాజాజీ ప్రభుత్వాస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హెచ్ఐవీ సోకిన శరీరానికి 72 గంటలలోపు పోస్టుమార్టం చేయడం కుదరదని ఆస్పత్రి డీన్ షణ్ముగసుందరం కోర్టుకు విన్నవించారు. అలా చేస్తే డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం చేయాలని కోర్టు వెల్లడించింది. వీడియో చిత్రీకరణ చేయాలని పునరుద్ఘాటించింది. (మరో గర్భిణికి హెచ్ఐవీ రక్తం) -
మరో గర్భిణికి హెచ్ఐవీ రక్తం
సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్ జిల్లాకు చెందిన ఒక గర్భిణికి ప్రభుత్వ సిబ్బంది హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వేడి వాతావరణం ఇంకా చల్లారక ముందే ఇలాంటి మరో దారుణం తమిళనాడులో బైటపడింది. చెన్నైలోని ప్రభుత్వ కీల్పాక్ ఆస్పత్రిలో ఒక మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై మాంగాడుకు చెందిన 27 ఏళ్ల వివాహిత రెండోసారి గర్భం దాల్చి అక్కడికి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో తరచూ పరీక్షలు చేయించుకునేది. రక్తం తక్కువగా ఉన్నందున కీల్పాక్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా పీహెచ్సీ సిబ్బంది సూచించారు. దీంతో ఏప్రిల్ 5న కీల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఆమెకు రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆ తరువాత యథాప్రకారం పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేది. ఎనిమిదో నెల గర్భంతో ఉన్నప్పుడు ఆగస్టు 18న ఆమెకు పరీక్షలు చేసినపుడు హెచ్ఐవీ బైటపడింది. అయితే ఈ విషయాన్ని గర్బిణి వద్ద దాచిపెట్టి హెచ్ఐవీ నిరోధక చికిత్సను ప్రారంభించారు. ఈ మందులు ఎందుకని గర్భిణి ప్రశ్నించగా రక్తం ఎక్కించినపుడు అంటువ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానంతో వైద్యంచేస్తున్నట్లు చెప్పిపంపివేశారు. అయితే పీహెచ్సీ సిబ్బంది ఇచ్చిన వివరణను అనుమానించిన ఆమె ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ వ్యాధి సోకినట్లు చెప్పారు. దీంతో హతాశురాలైన ఆమె తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌లకు లేఖ రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనరానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సదరు గర్భిణి సెప్టెంబరు 19న మగబిడ్డను ప్రసవించింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను దూరం పెట్టడంతో దిక్కుతోచక అల్లాడిపోయింది. ఈ దశలో విరుదనగర్ జిల్లా గర్భిణి ఉదంతం రచ్చకెక్కగా మాంగాడు మహిళ సైతం ఇరుగూ పొరుగుకు తనగోడు వెళ్లబోసుకోవడంతో బైటపడింది. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి తన జీవితం కూడా నాశనమైందని ఆమె ఆవేదన చెందగా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గర్భిణికి హెచ్ఐవీ బ్లడ్.. రక్తదాత ఆత్మహత్యాయత్నం
గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్ జిల్లా సాత్తూరుకు చెందిన 8 నెలల గర్భిణికి శివకాశి ప్రభుత్వ ఆస్పత్రి అనుబంధ బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించడం, ఆ రక్తం హెచ్ఐవీ రోగికి చెందినది కావడంతో గర్భిణి కూడా హెచ్ఐవీ రోగిగా మారిన సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయాందోళనలకు గురయ్యేలా చేసింది. బాధిత కుటుంబ సభ్యులపై ప్రభుత్వం అనేక వరాలజల్లు కురిపించినా వారు శాంతించలేదు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ భార్యాభర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సుమోటోగా కేసు స్వీకరణ న్యాయవాదులు జార్జ్ విలియమ్స్, కృష్ణమూర్తి మద్రాసు హైకోర్టులోని సెలవు దినాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తులు ఎస్.వైద్యనాథన్, పీడీ ఆషాలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు గురువారం హాజరయ్యారు. గర్భిణికి జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. ప్రభుత్వాస్పత్రులు ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి పనిచేస్తున్నట్లుగా తయారయ్యాయని దుయ్యబట్టారు. గర్భిణి నిండు జీవితాన్ని కాలరాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. న్యాయవాదుల ఆవేదనను విన్న అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ, ఈ ఘోరం తమ దృష్టికి కూడా వచ్చిందని, తీవ్రమైన ఆవేదన కలిగించిందని తెలిపారు. అధికారుల అలక్ష్యం సహించరానిదని అన్నారు. ఈ దశలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ అరవింద్ పాండియన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిందని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. గర్భిణి ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకున్నామని, కోర్టు సెలవులు ముగిసిన తరువాత నివేదిక అందజేస్తామని చెప్పారు. గర్భిణి కేసును సుమోటాగా స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, శివకావి ప్రభుత్వ వైద్యశాల నిర్వాహకులు, బ్లడ్‌బ్యాంక్ సిబ్బందిపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటనపై సవిరమైన నివేదికను సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. శిశువుకు సోకకుండా.. గర్భంలోని శిశువుకు హెచ్ఐవీ సోకకుండా గర్భిణిని మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో పెట్టారు. ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది. వ్యవహారంపై ఆరుగురితో కూడిన విచారణ కమిటీ రెండు వారాల్లోగా నివేదికను సమర్పిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. రక్తదాత ఆత్మహత్యాయత్నం వదిన కోసం మరిది రక్తం దానం చేశాడు. అయితే అదృష్టం వదినె చెంత నిలువగా రక్తం రూపంలో దురదృష్టం గర్భిణిని వెతుక్కుంటూ వచ్చింది.. ప్రాణాల మీదకు తెచ్చింది. రామనాథపురం జిల్లా కముదికి చెందిన 19 ఏళ్ల యువకుడు శివకాశి బాణసంచా ప్రింటింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అనారోగ్యానికి గురైన ఇతని అన్నభార్య (వదిన) ప్రసవం కోసం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. వదినెకు రక్తం అవసరం కావడంతో అందుకు సరిపడా ఎవరైనా బ్లడ్‌బ్యాంకు రక్తం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సదరు యువకుడు నవంబరు 30వ తేదీన అదే ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లిరక్తం ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రక్తాన్ని బ్లడ్‌బ్యాంక్‌లో భద్రం చేసుకున్న సిబ్బంది, య«థాలాపంగా మరో ప్యాకెట్లోని రక్తాన్ని అతని వదినకు ఎక్కించారు. ఇదిలా ఉండగా, రక్త దానం చేసిన యువకుడు విదేశీ ఉద్యోగానికి వెళుతూ డిసెంబర్ 6వ తేదీన ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో భాగంగా రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో కంగారుపడిన యువకుడు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అతడిచ్చిన రక్తం గర్భిణికి ఎక్కించడం జరిగిపోయింది. తన రక్తం వల్లనే గర్భిణి హెచ్ఐవీ రోగిగా మారిందని యువకుడు తీవ్రంగా కలతచెందాడు. బుధవారం రాత్రి ఇంటిలోని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు అతడిని వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి తీవ్రచికిత్స అందిస్తున్నారు. తనకు జీవించాలని లేదంటూ వైద్యచికిత్సకు అతడు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎండీఎంకే అధినేత వైగో విమర్శించారు. బాధిత మహిళకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్!
చెన్నై: తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించారు. ఈ దారుణ ఘటన విరుదు నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం దీనికి కారణమైన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. బాధిత గర్భిణీకి లేదా అతని భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన బ్లడ్‌ను వైద్యులు ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన ఓ వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సదరు యువకుడు రెండేళ్ల క్రితమే ఓ ఎన్జీవో కార్యక్రమం ద్వారా రక్త దానం చేశాడని, అప్పటికే అతనికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయలేదని, అతని మెడికల్ రికార్డును కూడా పొందుపరచలేదని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఆ యువకుడి నుంచి రెండోసారి రక్తాన్ని సేకరించినప్పుడు టెక్నీషియన్లు హెచ్ఐవీ టెస్ట్ చేయలేదని, దీంతో ఈ తప్పిదం జరిగిందన్నారు. -
ఈ మహిళ బిల్ గేట్స్ చేత కన్నీరు పెట్టించింది..
నిశబ్దంగా ఉన్న ఆ గదిలో ఓ విదేశీ జంటకు ఎదురుగా కొందరు మహిళలు కింద కూర్చున్నారు. వారిలో ఓ మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ‘ఒంటరిదాన్ని.. నాకో కూతురు. తనను పోషించాలి. తనకు మంచి జీవితం ఇవ్వాలి.. గొప్ప చదువులు చదివించాలి. వీటన్నింటిని ఎలా నెరవేర్చాలి.. నాకు చదువు లేదు.. పది ఇళ్లలో పాచి పని చేస్తే.. నాకు వచ్చే మొత్తం చాలా తక్కువ. దొంగతనాలు, దోపిడీలు నాకు చేతకావు. కానీ కళ్ల ముందు నా కూతురి ఉజ్వల భవిష్యత్ నాకు కనిపిస్తోంది. అది నిజమవ్వాలంటే నాకు డబ్బు కావాలి. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి.. ఓ మార్గం కనిపించింది. తప్పని తెలుసు.. కానీ తప్పదు. నాకు బురదంటుకున్న పర్వాలేదు.. నా కూతురి జీవితం వికసించాలి. అంతే.. ఆ ముళ్ల బాటలోనే నడవడం ప్రారంభించాను. నా కూతురి కోసం నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను’. ‘కానీ మనసులో ఓ భయం. ఈ విషయం నా కూతురికి తెలిసిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా తోచేది. అలా భయపడుతూనే.. నా కూతురికి తెలియకుండా జాగ్రత్త పడుతూనే.. ఈ వృత్తిలో కొనసాగాను. కానీ ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేపోయాను. నా కూతురి స్నేహితులకు నేను చేసే పని గురించి తెలిసింది. దాంతో వారు తనను సూటిపోటి మాటాలతో వేధించడం ప్రారంభించారు. హైస్కూల్ చదువులు చదువుతున్న నా చిట్టితల్లి.. ఈ పాడు తల్లి మూలంగా ఎదరవుతోన్న అవమానాల్ని తట్టుకోలేకపోయింది. చివరకూ ఓ రోజు ఇంట్లో తన శవాన్ని చూడాల్సి వచ్చింది. నా బంగారు తల్లి ఉన్నతంగా ఎదగాలని ఈ రొంపిలోకి దిగాను. కానీ నేడు నా చిట్టి తల్లి ఎవరికి అందనంత దూరం వెళ్లింది. నాకు ఈ జన్మకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇందుకు నేను ఎవరిని నిందించాలి’ అంటూ విలపిస్తుంది. ఆ మహిళ కష్టం అక్కడ ఉన్న వారితో కూడా కంటతడి పెట్టించింది. అలా ఏడ్చిన వారిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స కూడా ఉన్నారంటున్నారు అశోక్ అలెగ్జాండర్. సదరు మహిళల ముందు కూర్చున్న విదేశీ జంట మరేవరో కాదు ప్రపంచ కుబేరుడు బిల్ - మిలిందా గేట్స్ దంపతులు. గేట్స్ ఫౌండేషన్ ‘హెచ్ఐవీ / ఎయిడ్స్’ ప్రివెన్షన్ కోసం ప్రారంభించిన ‘అవహాన్’ ప్రోగ్రాం హెడ్‌గా పదేళ్లుగా పని చేస్తున్నారు అశోక్. ఈ 10 ఏళ్లలో తాను చూసిన సెక్స్ వర్కర్ల గురించి, వారి నేపథ్యాలు, జీవన విధానాల గురించి తెలుపుతూ ‘ఏ స్ట్రేంజ్ ట్రూత్ : లెసన్స్ ఇన్ లవ్.. లీడర్షిప్ అండ్ కరేజ్ ఫ్రమ్ ఇండియన్ సెక్స్ వర్కర్స్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు అశోక్. అంతేకాక ఈ ఎయిడ్స్ మహమ్మారి నివారణ విషయంలో భారత్ ఎలా విజయాన్ని సాధించిందో తెలపడమే కాక బాధితుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు గురించి కూడా అశోక్ ఈ పుస్తకంలో వివరించారు. ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఇందులోని పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ చేత కంటతడి పెట్టించిన మహిళ దీన గాధను కూడా ఈ పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు అశోక్. ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సదరు మహిళ చెప్పినదాన్ని విన్న తర్వాత మిలిందా గేట్ అక్కడ ఉన్న మిగతా మహిళలను ఒక ప్రశ్న అడిగింది. ‘ఇందులో ఎంత మంది జీవితాల్లో ఇలాంటి కష్టాలు ఉన్నాయ’ని ప్రశ్నించింది. దానికి వారు ‘మా అందరివి ఇలాంటి గాధలేనని’ తెలిపారు. అప్పుడు పక్కనే ఉన్న బిల్‌గేట్స్ తల కిందకు దించుకుని కన్నీరు పెట్టడం తాను చూశానని అశోక్ తెలిపారు. 2000 సంవత్సరంలో బిల్ - మిలిందా గేట్స్ దంపతులు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇక అశోక్ గురించి వస్తే ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ‘అవహాన్’తో పనిచేయడానికి ముందుకు వచ్చారు. గత పదేళ్లగా దీనికి హెడ్‌గా పనిచేస్తున్నారు. తన పూర్తి జీవితాన్ని వీరి కోసమే కేటాయించాడు. ఈ సమస్య గురించి అశోక్ ‘ఇది జీవితాలను పిండి చేసే ప్రదేశం.. ఇక్కడ మహిళలు రూ. 50 కోసం తమను తాము అమ్ముకుంటారు.. ఇక్కడ 14 ఏళ్ల వారికి డ్రగ్స్ ఇంజక్షన్లు ఇచ్చి బలి పశువులుగా మారుస్తారు. ఇదో చీకటి ప్రపంచం. ఇక్కడ ట్రాన్స్జెండర్లుగా పుట్టడంం.. గేల మధ్య ప్రేమ మహా పాపం. మర్చిపోయిన రహదారుల వెంట ప్రయాణం చేసే ట్రక్కుల వింత ప్రపంచం ఇది. ఇవే కాక గౌరవప్రదమైన జీవితం కోసం నిత్యం యుద్దం జరిగే ప్రదేశం. వారందరికిదే జీవనం.. జీవితం. శరీరం పావుగా మారే వేళ ఇక్కడ ఆత్మ పవిత్రత కోసం పరితపిస్తింటుంది’ అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ జీవితాల గురించి ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు అశోక్. -
మీ హెచ్ఐవీ స్థితి తెలుసా?
హెచ్ఐవీ.. ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి సోకినా క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా సుఖమైన జీవనం సాగించవచ్చు. వైద్యులు, కౌన్సిలర్ల సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే ఆనందంగా గడపవచ్చు. ఎలాంటి అనుమానం ఉన్నా ఉచితంగా పరీక్షలు చేస్తారు. జిల్లాలోని ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ వ్యాధిగ్రస్తులకు మనోస్థైర్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా గర్భిణుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఈ ఏడాది‘ మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి’ అనే నినాదంతో వ్యాధి నివారణకు పిలుపునిచ్చారు. కొత్తగా హెచ్ఐవీకి గురి కాకుండా చర్యలు తీసుకోవడం, వివక్ష లేకుండా చూడడం, హెచ్ఐవీ మరణాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ధ్యేయం. ఇందు కోసం జిల్లాలో డిసెంబర్ నెలలో హెచ్ఐవీపై అవగాహన సదస్సులు, హైరిస్క్ ప్రాంతాల్లో పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారు 20,665 మంది ఉన్నారు. మదనపల్లె సిటీ / చిత్తూరు అర్బన్ :శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్/హెచ్ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గుర య్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు ఎయిడ్స్ అతిపెద్ద కారణం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ బారిన పడకుం డా ఉండాలంటే విశృంఖల శృంగా రానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని సూచి స్తున్నారు. కణాల పాత్రే కీలకం.. వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్ కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైంది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతిమిల్లీలీటర్ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది. వ్యాధి గుర్తించడానికి ఇదేళ్లు హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్ఐవీ పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు. అందుబాటులో ఏటీఆర్ కేంద్రాలు జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది కంటే ఎక్కువగా రోగులు నమోదు ఉన్న తిరుపతి కేంద్రానికి ఏఆర్టీ ప్ల్లస్ గుర్తింపు వచ్చింది. ఇక్కడికి కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు. వీటితో పాటు శ్రీకాళహస్తి, కుప్పం, వి.కోట, పలమనేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, పూతలపట్టు, పీలేరు, సదుం, పుంగనూరులాంటి ప్రాంతాల్లో 11 లింక్ ఏఆర్టీలు ఉన్నాయి. 350, అంతకంటే తక్కువ తెల్ల రక్తకణాలు ఉన్నవారు, హెచ్ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటీ రిట్రోవైరల్ మందులు ఇవ్వ డంతో ఇన్పెక్షన్లు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు. నేడు భారీ ఎత్తున ర్యాలీలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ కం ట్రోల్ అధికారిణి డాక్టర్ అరుణ సులోచన తెలి పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరి«ధిలో కూడా ర్యాలీలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి ఇలా వస్తుంది.. ♦ సురక్షితం కాని లైంగిక సంబంధాలు ♦ మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని ఉపయోగించడం. ♦ రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్æ ఇన్స్ట్రుమెంట్స్ను శుభ్ర పరచకుండా వాడితే వ్యాపిస్తుంది. ఇలా రాదు.. ♦ హెచ్ ఐవీ బాధితుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు. ♦ హెచ్ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. ♦ వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం. ♦ నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామి తోనే లైంగిక సంబంధం కలిగి ఉండడం. ♦ సరైన పద్ధతిలో కండోమ్ వాడడం. ♦ హెచ్ఐవీ బాధితులు జీవితకాలం మందులు క్రమం తప్పకుండా వాడాలి. సాంకేతిక పద్ధతిలో సరైన మందులు వాడితే దీర్ఘకాలం జీవించొచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణికి హెచ్ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్టీ సెంటర్‌కు పంపిస్తాం. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట ర్ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్æ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. ఏఆర్టీ మందులు వాడితే సిజేరియన్ అవసరం లేదు. –అరుణ సులోచన, అడిషనల్ డీఎంహెచ్ఓ, చిత్తూరు -
ఆ కేసుల్లో భారత్ టాప్
ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో హెచ్ఐవీతో బాధపడే యువతీయువకులు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. 2017 సంవత్సరానికి గానూ భారత్‌లో 19 ఏళ్లలోపు వయస్సున్నవారిలో 1,20,000 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 మంది యువతీయువకులు చనిపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ‘చిల్డ్రన్–హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్– ది వరల్డ్ ఇన్ 2030’ పేరుతో యూనిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. చిన్నారులు, యువత, గర్భిణుల్లో హెచ్ఐవీ కేసుల్ని నియంత్రించడంలో దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని యూనిసెఫ్ తెలిపింది. ఈ విషయంలో భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్(5,800 మంది), నేపాల్(1,600), బంగ్లాదేశ్(వెయ్యి కంటే తక్కువ) మరింత మెరుగైన ఫలితాలు సాధించాయంది. -
హెచ్ఐవీలో విశాఖ @ 9
తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు : విశాఖ జిల్లాలో 2014 నుంంచి 2018 వరకూ హెచ్ఐవీ కేసుల తీరు తెన్నులు పరిశీలిస్తే.. ఏటేటా గణనీయంగాతగ్గుతున్నాయి. 2014లో 98,169 మందిని పరీక్షిస్తే 2464 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. 2015–166లో 96081 మంందికి పరీక్షలు చేయగా 2,180 కేసులు నమోదయ్యాయి. హెచ్ఐవీ కేసులు 2007 నుంచి క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత ఏడాది 1,03,616 మందిని పరీక్షించగా 2,017 మందికి , ఈ ఏడాది ఇప్పటిదాకా 63,325 మందికి పరీక్షలు చేయగా 1,046 మందికి పాజిటివ్‌గా తేలింది. దీనిని బట్టి గడచిన 10 ఏళ్ల నుంచి చూస్తే హెచ్ఐవీని పరీక్షించుకునే వారి సంంఖ్య పెరుగుతుంండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్టుస్పష్టమవుతోంది. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?.. ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్/ హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ జనాలను మహమ్మారిలా హడలెత్తించిన ఈ పులి విశాఖ జిల్లాలో క్రమంగా తన ఉనికి కోల్పోతోంది. గత ఏడాది ఎయిడ్స్/ హెచ్ఐవీ రోగుల సంఖ్యలో జిల్లా 4వ స్థానంలో ఉండగా..ఈ ఏడాది 9వ స్థానానికి మారింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహన సత్ఫాలితాలను ఇచ్చింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ... ఈ ఏడాది ఏప్రిల్ æనుంచి అక్టోబర్ వరకూ జిల్లా ఆస్ప?త్రుల్లో హైఐవీ పరీక్షలు చేయించుకోగా..వారిలో 1,046 మందికి హెచ్ఐవీఉన్నట్టు నిర్ధారణ అయింది. జిల్లాలో హెచ్ఐవీ సోకిన వారి కోసం నాలుగు యాంటీ రెట్రో వైరల్æ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. వీరిలో32,790 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిడ్ బారిన పడిన సుమారు 2,500 మంది బాధితులు పింఛన్లు పొందుతున్నారు. ఏఆర్టీ సెంటర్లలో నమోదైనవారు హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రో వైరల్æ మందుల కోసంం ఏఆర్టీ సెంటరులో మొత్తం 32,790 మంది నమోదు చేయించుకున్నారు. వారిలో 16,890 పురుషులు, 14621 స్త్రీలు. మగ పిల్లలు 661, ఆడపిల్లలు 522 మంది. హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రోవైరల్ నివారణ మందులు (ఏఆర్టీ) వాడుతున్నావారు మొత్తం 15,495 మంది ఉండగా..వారిలో 6,822 పురుషులు, 8047 మంది స్త్రీలు, మగ పిల్లలు 335, ఆడ పిల్లలు 259 మంది వున్నారు. హెచ్ఐవి స్థితిని తెలుసుకోండి పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి అనే కొత్త నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య–ఆరోగ్యశాఖ అధికారి ఎస్.తిరుపతిరావు వెల్లడించారు. రేసపువానిపాలెంలో గల సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఎవరినీ హెచ్ఐవీ బారిన పడకుండా చేయడం, హెచ్ఐవీ సోకిన వారిని వివక్ష లేకుండా సామూహికంగా కలుపుకుని పోవడం అన్నవి ప్రధాన అంశాలుగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి జూన్ 30 వరకు తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. జిల్లాలో సుమారుగా 3వేలమంది ఎయిడ్స్ రోగులు కేజీహెచ్, టీబీ ఆస్పత్రి, అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల ద్వారా ఏఆర్టీ మందులు పొందుతున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్సొసైటీ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ, డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ వరకు భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. మీడియా సమావేశంలో జిల్లావైద్య–ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. నేడు జీవీఎంసీ నుంచి ఏయూ వరకూ ర్యాలీ :నివారణ చర్యలు ముమ్మరం ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో భాగంంగా ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం సీడీ 4పరీక్షతో నిమిత్తంం లేకుంండా హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంంటనే ఎఆర్టీ చికిత్స ప్రారంభించడంం జరుగుతుంది. రక్తసేకరణ, రవాణా వాహనం ద్వారా స్వచ్ఛంద రక్త దానశాతాన్ని పెంచి, రక్తకొరత లేకుండా చేయడం, హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి ఎన్టీఆర్భరోసా ద్వారా జిల్లాలో 4వేలకు పైగా మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఏపీ బ్లడ్ సెల్æ యాప్ ద్వారా బ్లడ్‌బ్యాంక్, రక్తనిల్వలు వివరాలు తెలుసుకోవచ్చు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో జీవిస్తున్న 137 మంది గిరిజనులకు పంచామృతం కార్యక్రమంం ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు.– డాక్టర్ ఆర్.రమేష్, జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ విభాగం అధికారి, విశాఖపట్నం. వివిధ సంస్థల సహకారంతో.. ప్రస్తుత కాలంలో ప్రజల జీవన శైలి ఎయిడ్స్ వ్యాప్తికి దోహదం చేస్తోంది. నైతికపరమైన విలువలతో కూడిన జీవన విధానం ద్వారానే ఈ వ్యాధి నియంంత్రణ సాధ్యపడుతుంది. ముఖ్యంంగా హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థల సహకారంతో నెలకు మూడు సమావేశాలు ఏరా ?టు చేస్తున్నాం. అసలు వ్యాధి రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.తిరుపతిరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,విశాఖ. 9వ స్థానంలో విశాఖ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమైనా ఉందంటే..అది ఆంధ్రప్రదేశే. ఎయిడ్స్‌పై అవగాహన లోపించడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదే. 1981లో తొలిసారిగా ఎయిడ్స్‌ను కనుగొన్నప్పుడు కేవలం నలుగురికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 36.9 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బిల్æగేట్, క్లింటన్ ఫౌండేషన్ల నుంచి నిధులు వచ్చినంంత కాలం ఎయిడ్స్ నివారణకు విస్తత ప్రచారాలు చేసిన రెండు ప్రభుత్వాలు, ఆ నిధులు ఆగిపోవడంంతో ప్రచారాన్ని, అవగాహన కార్యక్రమాలను గాలికొదిలేశాయి.– కూటికుప్పల సూర్యారావు, ప్రముఖ వైద్యుడు -
జీవితంలో గరళం.. హృదయంలో అమృతం
అది నయం కాని వ్యాధి. మందులు వాడినన్ని రోజులూ జీవితాన్నిస్తుంది. ఆపేస్తే ప్రాణాలు తీసేసుకుంటుంది. అలాగని ‘నాకు ఈ వ్యాధి ఉంది’ అని ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అది పెట్టే బాధ కన్నా సమాజం పెట్టే బాధ.. దానిని.. పంటిబిగువున తట్టుకుని నిలబడటం సాధ్యం కాదు. ఇలాంటి బాధను భరిస్తూ ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలిసో తెలియకో భర్త చేసిన తప్పు ఆయనతో పాటు భార్యాబిడ్డలనూ వెంటాడింది. ఆ మహమ్మారి.. భర్తను బలి తీసుకున్నా, తనను బంధువుల్లో, సమాజంలో వివక్షకు గురిచేసినా ఆమె వెరవలేదు. భర్త చేసిన తప్పు వల్ల తనతో పాటు కుమార్తె అనుభవించిన క్షోభ మరెవ్వరికీ కలగకూడదని ఆమె భావించింది. హెచ్.ఐ.వి.పై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడ్డ వారికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్.ఐ.వి. కారణంగా కుటుంబ సభ్యులు దూరం చేసిన వారిని అక్కున చేర్చుకుని వారిని సేవా కేంద్రాలకు పంపిస్తోంది. హెచ్ఐవి, ఎయిడ్స్‌తో మరణించిన వారిని అయినవారు తీసుకెళ్లకపోతే తనే అన్నీ అయి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ఆదర్శ మహిళే.. సుధారాణి. భర్త ద్వారా సంక్రమించింది ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరావు 22 ఏళ్ల క్రితం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో టెలిఫోన్ బూత్ నిర్వహించేవారు. అందులోనే స్థానికంగా నివాసం ఉండే సుధారాణి పనిలో చేరింది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. 1997లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. గతంలో తిరిగిన తిరుగుళ్లకు శ్రీనివాసరావుకు హెచ్.ఐ.వి. సోకింది. ఈ కారణంగా ఆయన భార్య, పిల్లలూ ఇబ్బంది బలయ్యారు. ఈ సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నుంచి సుధారాణి తీవ్ర వివక్షకు గురయ్యింది. తమ వాడికి ఎలాగో వ్యాధి వచ్చింది. ఆయనతో పాటు మిమ్మల్నీ చూడాలంటే సాధ్యం కాదని వెళ్లగొట్టారు. వ్యాధితో ఏడేళ్ల పాటు బాధను అనుభవించి 2005లో శ్రీనివాసరావు మరణించాడు. భర్త దహనసంస్కారాలు, పెద్దకర్మ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సుధారాణిని పుట్టింటికి పంపించేశారు. ప్రేమపెళ్లిని కాదని సుధారాణిని దూరంగా ఉంచిన ఆమె తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత మాత్రం అక్కున చేర్చుకున్నారు. ఆమెకూ ఆ వ్యాధి ఉందని తెలిసినా.. మేమున్నామంటూ ఓదార్చారు. దీంతో కొండంత ధైర్యంతో సుధారాణి తన జీవితాన్ని కొనసాగించారు. వైద్యుల సలహాతో ఏఆర్టి మందులు వాడుతూ పదహారేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అవుట్ రీచ్ వర్కర్‌గా సేవలు తన జీవితం ఎలాగూ అస్తవ్యస్తమయ్యింది. తనలా మరొకరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆదరించాలని సుధారాణి నిర్ణయించుకున్నారు. భర్త మరణించిన తర్వాత పీపీటీసీటీ ప్లస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సెయింట్ యాన్స్లో అవుట్‌రీచ్ వర్కర్‌గా చేరారు. ఇందులో భాగంగా గర్భిణిలను గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్ఐవి పరీక్షలు చేయించి, ఒకవేళ వారికి హెచ్ఐవి ఉంటే బిడ్డకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. గర్భిణిలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 18 నెలల పాటు ఫాలో అప్ చేస్తున్నారు. బాధితుల కోసం కర్నూలుతో ‘నేస్తం’ డ్రాపింగ్ సెంటర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా పనిచేసేందుకు 2007లో సుధారాణి కర్నూలు వచ్చారు. కర్నూలులో ‘నేస్తం ఫర్ రాయలసీమ రీజియన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించారు. డ్రాపింగ్ సెంటర్ ద్వారా హెచ్ఐవి ఉన్న వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ, వారు ఎవరి వల్లనైనా వివక్షకు గురవుతుంటే వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు సుధారాణి. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్‌పై కళాశాలలు, పాఠశాలలు, మహిళా ప్రాంగణాల్లో ఇప్పటి వరకు 220లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఐవితో ఉన్న వారికి తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు ఇప్పించారు. ఇటీవలే ‘విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్’ ఏర్పాటు చేశారు. హెచ్ఐవితో జీవించే వారిని గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌తో లింకప్ చేసి మందులు తీసుకునేలా చేయడం, అవసరమున్న వారికి వైద్యుల వద్దకు రెఫర్ చేయడం ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్ఐవితో బాధపడుతూ చురుకుగా, కాస్త ఆరోగ్యంగా ఉన్న వారితో ఇతరులు ఆ వ్యాధికి గురిగాకుండా వారితోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవి బారిన పడిన పిల్లలను ఐసీపీఎస్‌కు లింకప్ చేసి, వారికి ఏఆర్టి సెంటర్ ద్వారా మందులు అందుకునేలా చేయడంతోపాటు, నెలకు రూ.1000లు పింఛన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పది వేల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌కు పంపించి మందులు ఇప్పించారు. అలాగే 104 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులను గుర్తించి, వారి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపి ఒక్కొక్కరికి నెలకు రూ.500 లు ఆర్థిక సహాయం అందేలా చేశారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ద్వారా ఏఆర్టి కేంద్రంలో చికిత్స పొందేందుకు వచ్చే 100 మందికి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ అందేలా చూశారు. హెచ్ఐవి కారణంగా కుటుంబసభ్యులు దూరం చేసిన వారిని కర్నూలు లోని శాంతినికేతన్, అభయగిరి సెంటర్లతో పాటు అనంతపురంలోని ఆర్డిటికి పంపిస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోతే స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. – జె.కుమార్, సాక్షి, కర్నూలు నేను పడ్డ క్షోభ ఎవరూ పడకూడదనే ఆ వ్యాధి బయటపడినప్పటి నుంచి నేను, నా భర్త పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆయన మంచాన పడ్డప్పుడు ఏ ఒక్కరూ వచ్చి చేయందించింది లేదు. సమాజంతో పాటు బంధువుల, స్నేహితులూ మమ్ములను దూరం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనను కాపాడుకున్నా, చివరికి విధి గెలిచి ఆయనను మా నుంచి దూరం చేసింది. ఆ తర్వాత అమ్మ, తమ్ముడు నాకు పెద్ద దిక్కయ్యారు. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదని అండగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఈ వ్యాధి భారిన పడిన వారు నాలాగా బాధపడకూడదని భావించి హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు నా వంతు సేవ చేస్తున్నాను. – బి. సుధారాణి, నేస్తం కో ఆర్డినేటర్ -
గ్రాఫీన్‌తో సరికొత్త ఇంధనం!
ఏటికేడాదీ పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు స్వీడన్‌లోని లింక్‌పింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కాలుష్యకారక కార్బన్‌డైయాౖMð్సడ్‌ను నీటితో కలిపి ఎథనాల్, మీథేన్ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. రేపటితరం అద్భుత పదార్థంగా చెబుతున్న గ్రాఫీన్ సాయంతో తాము ఈ అద్భుతాన్ని సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జియాన్‌వూ సన్ తెలిపారు. సిలికాన్, కార్బన్లతో తయారైన క్యూబిక్ సిలికాన్ కార్బైడ్‌కు గ్రాఫీన్‌ను పూతగా పూసినప్పుడు అది సూపర్ కండక్టర్‌గా వ్యవహరిస్తుందని.. ఇది కార్బన్‌డైయాక్సైడ్‌తో కూడిన నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొడుతుందని, వీటి నుంచి మీథేన్, ఎథనాల్లను తయారు చేయవచ్చునని వివరించారు. ఇలాంటి సూపర్ కండక్టర్లతో ప్రసార సమయంలో జరిగే విద్యుత్తు నష్టాన్ని లేకుండా చేయవచ్చునని జియాన్‌వూ సన్ అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కండక్టర్లు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేస్తూండగా.. కొత్తవి మాత్రం సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తాయని తెలిపారు. జన్యువులకు.. దీర్ఘాయుష్షుకు సంబంధం లేదు! వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. జన్యువులకు, దీర్ఘాయుష్షుకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు కాలికో లైఫ్ అనే కంపెనీ శాస్త్రవేత్తలు. దాదాపు 40 కోట్ల మందితో కూడిన వంశవృక్షాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్రాహం రూబీ! జన్యువులతో చాలా విషయాలు తెలుస్తాయన్నది నిజమేనని.. కాకపోతే ఆయుష్షుకు మాత్రం ఇది వర్తించదని రూబీ అంటారు. జన్యుమార్పుల ఆధారంగా తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆయుష్షు 15 – 30 శాతం మాత్రమేనని గతంలోనే లెక్కకట్టారు. జీవనశైలి, సామాజిక, సాంస్కృతిక కారణాలు, ప్రమాదాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించడం ద్వారా ఈ అంచనా ఏర్పడింది. తాజా అధ్యయనంలో కాలికో రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఆన్సిస్ట్రీ వెబ్‌సైట్‌లోని అమెరికా, యూరప్‌లకు చెందిన 40 కోట్ల మంది వివరాలను విశ్లేషించారు. ఒకే కుటుంబం.. ఇంటిపేరున్న వారిలో ఎవరి ఆయుష్షు ఎంత? అన్నది లెక్కకట్టింది. ఇది ఏడు శాతం కూడా లేదని స్పష్టమైంది. మొత్తమ్మీద చూస్తే ఆయుష్షుకు.. మన జన్యువులకు అస్సలు సంబంధం లేదన్నది ఈ అధ్యయనం సారాంశం. సెల్‌ఫోన్‌తో హెచ్ఐవీని గుర్తించవచ్చు! మనిషిని నిలువునా నిర్వీర్యం చేసేసే హెచ్ఐవీని ఎంత వేగంగా గుర్తిస్తే అంతమేలన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఉన్న పద్ధతులతో ఇది అసాధ్యం. అందుకే బ్రైగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అందరి చేతుల్లో ఉండే మొబైల్‌ఫోన్ సాయంతో పనిచేసే ఈ సరికొత్త టెక్నాలజీ.. చుక్క రక్తంతోనే హెచ్ఐవీ వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టం చేసేస్తుంది. ప్రస్తుతం ఖరీదైన పాలిమరేస్ చెయిన్ రియాక్షన్ సాయంతో హెచ్ఐవీ వైరస్‌ను గుర్తిస్తున్నారు. బ్రైగమ్ శాస్త్రవేత్తలు నానోటెక్నాలజీ సాయంతో ఓ మైక్రోప్రాసెసర్, మొబైల్‌ఫోన్ ద్వారా వైరస్ తాలూకూ ఆర్ఎన్ఏ న్యూక్లియిక్ యసిడ్లను గుర్తించే ఓ వ్యవస్థను సిద్ధం చేశారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారైన ఓ యంత్రాన్ని మొబైల్‌ఫోన్‌కు అనుసంధానించుకుని చుక్క రక్తం వేస్తే సరి.. 99.1 శాతం కచ్చితత్వంతో హెచ్ఐవీ వైరస్‌ను గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర వైరస్, బ్యాక్టీరియా గుర్తింపునకూ ఉపయోగించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షఫీ తెలిపారు. -
హెచ్ఐవీ నివారణకు సరికొత్త మందు..
ప్రమాదకరమైన హెచ్ఐవీ వ్యాధిని నిరోధించేందుకు, చికిత్స చేసేందుకూ యూనివిర్శటీ ఆఫ్ నార్త్ కారొలీనా శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని సిద్ధం చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి ఓ గాడ్జెట్లాంటిది ప్రవేశపెట్టి దాని ద్వారా మందు నిత్యం అందుబాటులో ఉండేలా చేయడం ఇందులోని విశేషం. రోజుకో మాత్ర వేసుకోవడం ద్వారా హెచ్ఐవీ రాకుండా ఉండేందుకు ఇప్పటికే అవకాశముంది. అలాగే యాంటీ రెట్రోవైరల్ మందులను క్రమం తప్పకుండా వాడటం వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందనీ మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మందులేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మార్టినా కొవరోవా అనే శాస్త్రవేత్త ఈ కొత్త పద్ధతి కోసం పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ పద్ధతిలో హెచ్ఐవీ మందు, ఓ సాల్వెంట్, ప్లాస్టిక్‌లను కలిపి ఓ గడ్డలా తయారు చేసి. గొట్టంలాంటి గాడ్జెట్‌లోకి ఎక్కిస్తారు. ఈ గొట్టాన్ని చర్మం అడుగుభాగంలోకి జొప్పించినప్పుడు ప్లాస్టిక్ క్రమేపీ కరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలో సాల్వెంట్‌తో కూడిన మందు నెమ్మదిగా అందడం మొదలవుతుంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక్కో గాడ్జెట్ దాదాపు ఐదు నెలలపాటు మందు అందించినట్లు తెలిసిందని, ఎలాంటి ఇతర దుష్ఫలితాలూ లేవని మార్టినా వివరించారు. -
హెచ్ఐవీ పంజా!
జిల్లాలో హెచ్ఐవీ వైరస్ పంజా విసురుతోంది. ప్రతి నెలా 250 నుంచి 300 కొత్త కేసులు నమోదవుతున్నారు. ఒక్క విజయవాడలోనే నెలకు వంద కేసులకు తక్కువకాకుండా రికార్డవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కాకిలెక్కలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు) : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా.. అంటూ మూడు దశాబ్దాల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేశారు. ఎయిడ్స్ ఎలా సోకుతుంది. రాకుండా ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలతో హోరెత్తించారు. దీంతో దశాబ్దకాలం పాటు హెచ్ఐవీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే రెండేళ్లుగా జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెలా కొత్తగా 300 కేసులు నమోదవుతుండగా, ఏడాదిలో 3 వేల నుంచి 3,500 వరకూ నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరింత మంది ఉండవచ్చనేది అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోనే హెచ్ఐవీ వ్యాప్తిలో జిల్లా మొదటి స్థానానికి చేరే అవకాశం ఉంది. హెచ్ఐవీ వ్యాప్తి చెందుతుందిలా.. ఒకప్పుడు లైంగిక సంపర్కం ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ వ్యాప్తి చెందేది. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్‌ల్లో స్క్రీనింగ్ పరీక్షలు నాసిరకంగా చేయడంతో రక్తమార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో యువత ఇటీవల కాలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీంతో ఒకరు వాడిన సూదిని మరొకరు వాడటం ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాపిస్తున్నట్లు సమాచారం. హైటెక్ వ్యభి చారం జోరుగా సాగుతుండటం మరోకారణం. అధికారులు కాకి లెక్కలు అధికారుల లెక్కల ప్రకారం 2015లో 33 వేలు ఉండగా, 2016లో 36 వేలకు చేరింది. 2017లో 39,500 మంది హెచ్ఐవీ బాధితులు ఉండగా, తాజాగా 20 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన 19,500 మంది ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. వారిలో సగం మంది మృత్యువాత పడగా, మిగిలిన వారిని ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయకపోవడంతో పేర్లు తొలగించి, జిల్లాలో హెచ్ఐవీ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కాకిలెక్కలు చెబుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా నివారణ సాధ్యం కాదు. అలాంటిది 39 వేల మందిని, ఇప్పుడు 20 వేలే ఉన్నట్లు చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నాసిరకంగా నిర్ధారణ పరీక్షలు.. రాజమండ్రిలో ఓ గర్భిణికి హెచ్ఐవీ లేకుండానే ఐసీటీసీ సిబ్బంది పరీక్షల నివేదికలో పాజిటివ్ అని ఇవ్వడంతో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అదేరీతిలో గతంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన హెచ్ఐవీ పాజిటివ్ రోగికి ర్యాపిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే వైద్యులకు సదరు రోగి గతంలో పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఐసీటీసీల్లో సరఫరా చేసే కిట్లు నాసిరకంగా ఉండటంతో నిర్ధారణ పరీక్షల్లో సైతం ప్రామాణికం ఉండటం లేదు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జిల్లాలో హెచ్ఐవీ కొత్త కేసులు ఏడాదిలో 2,500 నుంచి 3 వేల వరకూ వస్తున్నాయి. హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడంతో పాటు, రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది ఉన్నారు. వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏఆర్‌టీల్లో సైతం సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవు. అన్నింటినీ ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. మా డీఎల్వో పర్యవేక్షిస్తుంటారు. – డాక్టర్ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
గర్భిణికి ఎయిడ్స్ ఉందంటూ..
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): గర్భిణికి ఎయిడ్స్ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఘటనపై వైద్య అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగం ల్యాబ్‌లో గర్భిణికి రక్తపరీక్షలు చేసి ఎయిడ్స్ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ డీ అండ్ ఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, జిల్లా అసుపత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.రమేష్‌కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ , విచారణాధికారి డాక్టర్ సునీత విచారణ జరిపారు. బాధితురాలు నల్లమాటి మనీషాను, ల్యాబ్ టెక్నీషియన్ రవి, కౌన్సెలర్ లలితను వేరు వేరుగా విచారణ జరిపారు. బాధితురాలు మనీషా జరిగిన క్రమాన్ని వివరించారు. తన పట్ల కౌన్సెలర్ లలిత దురుసుగా ప్రవర్తించడాన్ని అధికారులకు వివరించారు. ఎయిడ్స్ లేకుండానే ఉందంటూ బలవంతంగా తనతో మందులు వాడించేందుకు ప్రయత్నించారన్నారు. తనకు ఎయిడ్స్ లేదని చెప్పినా వినకుండా లలిత దుర్భాషలాడారన్నారు. దాంతో తాను, తన భర్త, తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించామన్నారు. తనకు ఎయిడ్స్ లేదని చెప్పినప్పుడైనా రెండోసారి టెస్ట్‌లు చేసేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం ఈ ఘటనపై డిప్యూటీ డీ అండ్ ఎంహెచ్ఓ ఎం.పవన్‌కుమార్‌ను ప్రశ్నించగా గర్భిణికి ఇచ్చిన టెస్ట్ నివేదికలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ ఎవరిపైనా ఏవిధమైన చర్యలూ తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఎమైనా తప్పులు చేస్తే ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ నుంచి ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్‌కు, అక్కడ నుంచి ఇక్కడకు బదిలీ చేస్తున్నారు తప్ప వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. విచారణ తూతూమంత్రంగా జరిగిందని వారు తెలిపారు. -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు నివేదిక
తాడితోట (రాజమహేంద్రవరం): వివాహమై ఆరు నెలలైంది. గర్భిణి అని తెలియడంతో రక్త పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆ యువతికి పిడుగులాంటి వార్త అందింది. తనకు హెచ్ఐవీ ఉందంటూ ఆస్పత్రి సిబ్బంది నివేదిక ఇచ్చారు. తనకు వచ్చే అవకాశమే లేదని బాధితురాలు వాపోయినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరువు పోయిందని భావించిన ఆమె భర్త, ఆ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, సన్నిహితుల సలహా మేరకు ప్రైవేట్ ల్యాబ్‌లో ఆ యువతి పరీక్షలు చేయించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేదనే తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నిరసనకు దిగారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సంతోష్‌నగర్‌కు చెందిన నల్లామట్టి నాని ఆటో డ్రైవర్. అతని భార్య మనీషా గర్భిణి. ఈ నెల 4న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి వైద్య పరీక్షలకు వెళ్లింది. రక్త పరీక్షలు నిర్వహించేందుకు రక్తం శాంపిల్ తీసుకొని ఇంటికి పంపించేశారు. మరుసటి రోజున ‘మీ భర్తను తీసుకొని ఆస్పత్రికి రండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. తన భర్తను వెంటబెట్టుకొని ఆమె హడావుడిగా వెళ్లింది. ‘నీకు హెచ్ఐవీ ఉందని’ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో ఆ దంపతులు హడలిపోయారు. ‘నేను బయట తిరిగేదాన్ని కాదు. పెళ్లయి ఆరు నెలలైంది. నాకు హెచ్ఐవీ ఎలా వస్తుంది’ అంటూ ఆ యువతి విలపించినా పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఉన్న హెచ్ఐవీ కౌన్సిలర్ లలిత బలవంతంగా హెచ్ఐవీ విభాగం (ఏఆర్టీ సెంటర్)కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భీతిల్లిన ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయింది. బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఆ రిపోర్టుతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా 5న ఆత్మహత్య చేసుకునేందుకు బయటకు వెళ్లిపోతుండగా స్థానికులు రక్షించారు. ఆమె తల్లి, భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు మీద నమ్మకం లేక మరో ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని తేలింది. మరో మూడు చోట్ల రక్త పరీక్షలు చేయించినా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం వల్లే తప్పుడు రిపోర్టులు వచ్చాయని నిర్ధారణకు వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ రవిపైనా, గర్భిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్ లలితపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనపై ఎంక్వెరీ వేశామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామన్నారు. -
మరణమా?.. హెచ్ఐవీతోనా?
జోహన్నెస్‌బర్గ్: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్ డొనాల్డ్ గోర్డాన్ మెడికల్ సెంటర్ వైద్యులు ‘ఎయిడ్స్’ అనే జర్నల్‌లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
హెచ్ఐవీకి కొత్త చికిత్స...
యాంటీ రెట్రోవైరల్ మందుల పుణ్యమా అని ఇప్పుడు హెచ్ఐవీతో జీవితాన్ని పొడిగించుకోవడం సాధ్యమవుతోంది. అయితే ఈ మందులు వైరస్‌ను పూర్తిగా చంపలేవు. మందులు వేసుకోవడం మానేస్తే.. లేదా మరచిపోయినా చాలు.. మళ్లీ విజంభిస్తుంది. ఈ నేపథ్యంలో రాక్ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు హెచ్ఐవీపై చేసిన కొన్ని ప్రయోగాలు విజయవంతం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. హెచ్ఐవీ యాంటీబాడీలు రెండింటిని ఒక్కసారి వాడటం ద్వారా వైరస్‌ను కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంచవచ్చునని వీరు అంటున్నారు. బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (బీనాబ్స్) అని పిలుస్తున్న ఈ సరికొత్త మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు కొన్ని నెలలకు ఒకసారి మాత్రలేసుకుంటే సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ సి. నాసెన్వీగ్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్, నేచర్ మెడిసిన్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి. ఈ కొత్త యాంటీబాడీలు సహజసిద్ధమైనవని.. హెచ్ఐవీ వైరస్ పైభాగంలో ఉండే ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా పనిచేస్తాయని వివరించారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రెండు యాంటీబాడీలు శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థలు ఉపయోగించుకోవడం విశేషమన్నారు. తొలిదశ ప్రయోగాల్లో రెండు యాంటీబాడీల మందును ఆరువారాల వ్యవధిలో మూడుసార్లు ఇస్తే.. 21 నుంచి 30 వారాలపాటు వైరస్‌ను అదుపులో ఉంచగలిగిందని చెప్పారు. -
క్షణకాల కాంక్ష.. పిల్లలకు జీవితశిక్ష
తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కూలి పనులు చేసుకొంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులకే భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం వచ్చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం భర్త కోరిక మేరకు ఆమె కువైట్ వెళ్లి వచ్చింది. తిరిగొచ్చిన అనంతరం మళ్లీ కేరళకు భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లింది. నాలుగు నెలల కిత్రం నయంకాని వ్యాధితో మంచానికే పరిమితమైంది. భర్త ఆమెను వదిలేసి తిరుపతి వెళ్లిపోయాడు. ఎముకల గూడుగా మారిన ఆ మహిళను రెండు నెలల క్రితం రాత్రిపూట ఆటోలో తీసుకొచ్చి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఇరవై రోజులు మృత్యువుతో పోరాడి మహిళ కన్నుమూసింది. ఈమెకు ఒక కుమార్తె. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. కొన్ని సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి తిరిగి వ చ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి గ్రామానికి వచ్చి మేస్త్రి పని చేసుకొంటున్న ఓ వ్యక్తితో స్థానికులు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాన్ని నిర్మించుకొన్నారు. ఇంతలో నయం కాని వ్యాధి ఇద్దరినీ కబళించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వారు ఏమయ్యారో కూడా చెప్పేవారు లేరు. వాల్మీకిపురంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఉపాధి కోసం పూణే వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు. పూణె నుంచి స్వగ్రామానికి తరచూ వస్తూ బిడ్డను చూసుకునేది. ఈ క్రమంలోనే నయంకాని వ్యాధిబారిన పడడంతో మహిళ కన్నుమూసింది. కుమారునికీ వ్యాధి సోకడంతో తండ్రి పట్టించుకోలేదు. నానమ్మ సహకారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం నడవలేని స్థితికి చేరింది. దీంతో చదువు అర్ధంతరంగా ఆగిపోతుందని, దాతలు ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు జీవితాంతం శిక్షకు గురవుతున్నారు. చిత్తూరు ,మదనపల్లె టౌన్: కరువు కోరల్లో చిక్కుకుని కొందరు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇంకొందరు, ఉపాధి లేక మరికొందరు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతులు, మహిళలు అధికంగా వేశ్య వృత్తిని ఎంచుకుని వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. డబ్బుమీద వ్యామోహంతో రెడ్‌లైట్ ఏరియాలైన ముంబయి, పూణె, ఢిల్లీ, కలకత్తా, బెంగళూర్, సింగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి హెచ్ఐవీ బారిన పడి జీవితాలను నరకప్రాయం చేసుకుని రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. పబ్బులు, వేశ్య గృహాలకు వెళ్లి నయంకాని వ్యాధిబారిన పడుతున్నారని కొన్ని సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అలా వ్యాధుల బారిన పడుతున్న వారు అధికంగా మదనపల్లెతో పాటు, పడమట మండలాలైన పీటీఎం, బి. కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యంలలో గత ఐదేళ్లలో 23 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడు వేలకుపైనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు.. అలా చనిపోయిన వారి అయినవారి ఆదరణకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు వీరికి జీవిత కాల శిక్ష పడుతోంది. రక్తసంబంధీకులు కూడా అక్కున చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. కానరాని ప్రభుత్వ చర్యలు.. గతంలో ప్రభుత్వాలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, యువతులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 1000 కూడా అందించేవారు. దీంతో ఎంతో కొంత వారికి భరోసా లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. పునరావాస చర్యలు తీసుకుంటే కొంతైనా తగ్గించ వచ్చని పలువురు చెబుతున్నారు. ఆదరించని కుటుంబసభ్యులు.. వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి బాధపడుతున్న మహిళలు, పురుషులు కుటుంబసభ్యుల నిరాదరణకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంచం పట్టిన బాధితులను పట్టిం చుకోవడం లేదు. పైగా వారే అర్ధరాత్రి సమయాల్లో తీసుకొచ్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వదలి వెళుతున్నారు. వారిని సిబ్బంది క్రానిక్ వార్డులో చేర్చి చికిత్సలు అందిం చినా ఫలితం లేక చేరిన నెల రోజుల్లోపే చనిపోతున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులు తీసుకెళ్లని పరిస్థితి. దీంతో కుళ్లి దుర్వాసన వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తున్నారు. వారు ఆ మృతదేహాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి వాగుల్లో పాతిపెట్టి వస్తున్నారు. -
రిపోర్టులో హెచ్ఐవీ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు రిపోర్టులు ఇస్తూ రోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ రిపోర్టులను గుడ్డిగా నమ్ముతున్న కొంత మంది వైద్యులు టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను పూర్తి అవగతం చేసుకోకుండానే రోగాలను నిర్థారించేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మచిలీపట్నంలో గురువారం వెలుగుచూసింది. బిహార్‌కు చెందిన ఒక యువకుడు కొంత మంది స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మచిలీపట్నం వచ్చాడు. స్థానికంగా మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి నలతగా ఉండటంతో 8న మచిలీపట్నం హైనీ హైస్కూలుకు సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. దీంతో అతడు సద్దాంకు పలురకాల టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. డాక్టర్ చెప్పిన విధంగానే ఆ యువకుడు ఆర్ఎంపీ వైద్యశాలలో ఉన్న ల్యాబ్‌లో రక్త నమూనాలను ఇచ్చాడు. మరుసటి రోజు ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టును వైద్యుడికి చూపించాడు. రిపోర్టు చూసిన వైద్యుడు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని పంపేశాడు. మానసిక ఒత్తిడితో కెమికల్స్ తాగే యత్నం తనకు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యుడు నిర్థారించటంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. స్నేహితులకు దూరంగా ఉంటూ మదనపడుతూ ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి మగ్గం పనులకు సంబంధించిన కెమికల్స్ కలుపుకుని తాగే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన స్నేహితులు అతడిని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్నేహితులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి హెచ్ఐవీకి సంబంధించిన పరీక్షలు చేయించారు. అన్ని రిపోర్టులు నెగిటివ్‌గానే వచ్చాయి. దీంతో స్నేహితులు గురువారం ఆర్ఎంపీ వైద్యుడిని నిలదీశారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీంతో సదరు వైద్యుడు ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్ వల్లే తప్పిదం జరిగిందని బుకాయించాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ ల్యాబ్ టెక్నీషయన్ బతిమిలాడడంతో స్నేహితులు శాంతించారు. -
హెచ్ఐవీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది...
హెచ్ఐవీ వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న సరికొత్త వ్యాక్సిన్ సత్ఫలితాలనిస్తోంది. మానవులతోపాటు కోతులపై జరిగిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధిని అడ్డుకుందని నేషనల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ పరీక్షలు మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో రెండో దశ పరీక్షలు దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో 2600 మంది మహిళలకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నామని ప్రొఫెసర్ డాన్ బరూచ్ తెలిపారు. హెచ్ఐవీని అడ్డుకునేందుకు గత 35 ఏళ్లలో ఐదు వరకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా, ఈ స్థాయికి చేరుకున్న వ్యాక్సిన్ ఇదొక్కటే కావడం గమనార్హం. రకరకాల హెచ్ఐవి వైరస్ల ముక్కలు సేకరించి వాటిని కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత. దీన్ని వాడినప్పుడు కోతులు హెచ్ఐవి లాంటి వైరస్‌ను 67 శాతం వరకు అడ్డుకోగలిగాయని బరూచ్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా.. ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి. -
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
తూర్పుగోదావరి, రామచంద్రపురం: హెచ్ఐవీ వ్యాధితో జీవిస్తున్న వారికిది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు ప్రతినెలా లింక్ ఏఆర్టీ కేంద్రానికి వచ్చి మందులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వీరికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు సరిపడా మందులు అందించనున్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జావేద్ లాల్బండ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జి. ఆదిలింగం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఐసీటీసీ సూపర్వైజర్ ఎ.బుజ్జిబాబు పాల్గొన్నారు. -
బాధితుడికి ఓ అన్నం ముద్ద
హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వచ్చినవారిని సమాజం దూరం పెడుతుంది. వారికి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావడానికి సాహసించరు. ఇందుకు విరుద్ధంగా ‘మీల్స్ ఆన్ వీల్స్’ పేరుతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారికి అమెరికాలోని ‘ఇండియానా’ రాష్ట్రంలోని ఓ సంస్థ కడుపు నిండా అన్నం పెడుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మంచి ప్రయత్నానికి ‘ర్యాన్స్ మీల్ ఫర్ లైఫ్’ గా గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమానికి ‘ర్యాన్స్ మీల్’ అనే పేరు పెట్టడానికి వెనుక ఒక చిన్న కారణం ఉంది. కొన్నేళ్ల కిందట కొకొమోకు చెందిన ‘ర్యాన్ వైట్’ అనే 18 సంవత్సరాల యువకుడు హెచ్ఐవి కారణంగా మరణించాడు. తన 13 సంవత్సరాల వయసులో కలుషిత రక్తం ద్వారా ఆ బాలుడిలోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఐదు సంవత్సరాలు వ్యాధితో పోరాడి కన్నుమూశాడు. అందువల్ల ఈ సత్కార్యానికి అతడి పేరు పెట్టారు. అదే సంవత్సరం అక్టోబరు మాసంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్ర రాజధాని ఇండియానాపొలిస్‌లో రోజుకి 250 మందికి భోజనం అందిస్తూ, వారానికి 2500 మందికి అందించే స్థాయికి ఎదిగాం’ అని చెబుతారు ‘మీల్స్ ఆన్ వీల్స్’ ప్రాజెక్టు మేనేజర్ నిక్ ఫెన్నింగ్. ‘ఇండియానాలో సుమారు 12,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. అందులో సగం కంటె ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు’ అని చెబుతారు నిక్. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆహారం ఇవ్వడమే కాకుండా, వారికి కావలసిన ఆరోగ్య సదుపాయాలు చూస్తారు. ‘ఒంటరితనంతో బాధపడుతున్న వారు, వయసు పైబడినవారు ఎంతోమందికి మేం అన్నం పెట్టగలుగుతున్నాం’ అంటూ సంబరంగా చెబుతారు నిక్. ‘‘ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రబలిన ఎయిడ్స్ కారణంగా కొందరు వారి జీవితభాగస్వాములను కోల్పోయి, ఒంటరివారయ్యారు. వారంతా నలుగురితో కలవాలని, వారి బాధను నలుగురితో పంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అంటున్నారు నిక్. ‘మీల్స్ ఆన్ వీల్స్’ కేవలం హెచ్ఐవి బాధితులకు మాత్రమే కాకుండా, దివ్యాంగులకు, పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులకు కూడా కడుపు నింపుతున్నారు. చాలా దేశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న హెచ్ఐవీ బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమం జరిగితే చాలా బాగుంటుందని సామాజిక సేవకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ విజృంభించనున్న ‘ఎయిడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది. ఎయిడ్స్‌ను కనుగొన్న 30 సంవత్సరాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైద్య రంగానికే స్ఫూర్తినిచ్చింది. అప్పటికే దాదాపు మూడు కోట్ల మంది మరణానికి కారణమైన ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం కలసికట్టుగా ముందుకు కదిలింది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఎయిడ్స్ రోగులను ‘పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ’ అని పిలుస్తున్నారు. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి ఫలితంగా 2000 సంవత్సరం నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య 30 శాతం తగ్గింది. 2003 నుంచి మృతుల సంఖ్య 40 శాతం తగ్గింది. ఒక్క సబ్ సహారా ఆఫ్రికాలో గత దశాబ్దం కాలంలో 25 నుంచి 50 శాతం కేసులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆమ్‌స్టర్‌డామ్‌లో జూలై 23 నుంచి 27 వరకు ఎయిడ్స్‌పై ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. రెండో రకం చికిత్సను కూడా తట్టుకొని బతకకలిగే శక్తిని హెచ్ఐవీ సాధించిందనేదే ఆ వార్త. ఎయిడ్స్ నివారణలో ప్రస్తుతం రెండు రకాల చికిత్స విధానాన్ని అమలు చేస్తున్నారు. మొదటి రకం విధానానికి రోగి స్పందించకపోతే రెండోరకం విధానాన్ని అమలు చేస్తారు. దాంతో 90 శాతం మంది రోగులకు హెచ్ఐవీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, రోగుల్లో వ్యాధి ముదిరి మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇతర బ్యాక్టీరియాలకన్నా పరావర్తనం చెందే శక్తి హెచ్ఐవీ వైరస్‌లో పది లక్షల కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది మందులకు లొంగకపోతే విపరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎయిడ్స్ నివారణకు అమెరికాలో 28 రకాల మందులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు రకాల కాంబినేషన్లలో మాత్రమే ఈ మందులను వాడుతారు. ఒకటో రకం కాంబినేషన్ రోగిపై పనిచేయడం ఇది వరకే నిలిచిపోగా, ఇప్పుడు రెండో రకం కాంబినేషన్ కూడా పనిచేయక పోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్రిస్పర్ క్యాస్9తో హెచ్ఐవీకి చెక్!
జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా హెచ్ఐవీకి చెక్ పెట్టడం సాధ్యమేనని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందిని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధికి ప్రస్తుతం సరైన చికిత్ప లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులు వాడుతూంటే జీవితకాలం కొంత మెరుగయ్యే అవకాశం మాత్రమే ఉంది. హెచ్ఐవీ వైరస్ శరీర కణాల్లో తన జన్యుభాగాలను జొప్పించడం వల్ల.. మందులు వాడుతున్నంత సేపు అవి నిద్రాణంగా ఉంటాయి. ఆ తరువాత విజంభిస్తాయి. క్రిస్పర్ క్యాస్9 జన్యువుల్లో మార్పులు చేసేందుకు సమర్థంగా ఉపయోగపడుతుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో జపనీస్ శాస్త్రవేత్తలు ఆరు రకాల హెచ్ఐవీ వైరస్‌లలోని డీఎన్ఏ భాగాలను క్రిస్పర్ క్యాస్9లో ఉపయోగించారు. ఫలితంగా హెచ్ఐవీ వైరస్‌ను నియంత్రించే జన్యువులు పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం తాము ప్రయోగశాలలో హెచ్ఐవీతో కూడిన కణాలపై ప్రయోగాలు చేశామని, క్రిస్పర్ క్యాస్9ను మానవుల్లో ప్రవేశపెట్టడం ఎలా? తద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చూడటం ఎలా అన్న అంశాలపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కామెఓకా తెలిపారు. హెచ్ఐవీకి పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. -
ఛీత్కారాల మధ్య..
గుంతకల్లు రూరల్: వ్యాపారరీత్యా ఊళ్లు తిరుగుతున్న నా భర్త హెచ్ఐవీకి గురయ్యారు. ఆయన ద్వారా ఆ జబ్బు నాకూ సోకింది. విషయం బయటపడిన తర్వాత తప్పంతా నాదేనన్నట్లు మాట్లాడారు. నన్ను ఇంటి నుంచి గెంటేశారు. అప్పటికే మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఏడాది పాటు పుట్టింటిలో తలదాచుకున్నా. తన చివరి క్షణాల్లో జరిగిన వాస్తవాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఇందులో భార్య తప్పేమీ లేదని నా భర్త నోరు విప్పాడు. దీంతో మళ్లీ నన్ను అత్తింటివారు ఆదరించారు. ఆ తర్వాత నెలలోనే నా భర్త కన్నుమూశాడు. వృద్ధులైన అత్తామామలతో పాటు పిల్లల పోషణ భారం నాపై పడింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇరుగుపొరుగు వారు అంటున్న మాటలు ఎంతో బాధించాయి. చివరకు నా కూతుళ్ల పెళ్లిళ్లనూ చెడగొట్టారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. అయితే సమస్యకు ఇది పరిష్కారం కాదని భావించాను. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా బతకడం నేర్చుకున్నా. గ్రామైక్య సంఘం ద్వారా పొందిన రుణాలతో చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టాను. అప్పులు తీర్చేశాను. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాను. కొడుకును ఎంబీఏ వరకు చదివించాను. - కామాక్షమ్మ (పేరుమార్పు) -
రోగం.. వేగం..
ఖమ్మంవైద్యవిభాగం: సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోవడం.. మందులు సక్రమంగా వేసుకోకపోవడం.. మధ్యలోనే నిలిపివేయడం.. జబ్బును నిర్లక్ష్యం చేయడంతో టీబీ వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ విభజన తర్వాత నివారణ చర్యలు చేపట్టినా తీవ్రత తగ్గడం లేదు. క్షయ బారినపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ప్రతి నెల క్షయ కేసులు వందకు మించుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018, జనవరిలో 126 కేసులు, 2017లో 1,563 కేసులు నమోదు కావడంతో వ్యాధి వ్యాప్తి జిల్లాలో ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా క్షయ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2017లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,774 కేసులు నమోదయ్యాయి. 2012లో టీబీని ప్రభుత్వం నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులు విధిగా తమ ఆస్పత్రిలో నమోదైన కేసుల వివరాలను టీబీ కంట్రోల్ అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం ఇద్దరు హెల్త్ విజిటర్స్ ఎప్పటికప్పుడు ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రస్తుతం 56 శాతం మాత్రమే ప్రైవేటులో కేసులు నమోదైన వివరాలు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మాత్రం 2017లో 56 టీబీ మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క రోగి నుంచి 20 మంది వరకు.. టీబీ వ్యాధికి ప్రత్యేక వైద్యం ఉన్నప్పటికీ అవగాహన లేమితో వ్యాధి బారిన పడుతున్నారు. మందులు సరిగా వేసుకోకుండా వ్యాధిగ్రస్తులు మధ్యలోనే మానేస్తుండటంతో మళ్లీ తిరగబెడుతోంది. ఒక వ్యాధిగ్రస్తుడి ద్వారా 15 నుంచి 20 మందికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని టీబీ డాక్టర్లు చెబుతున్నారు. రోగి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధి కారక క్రిములు గాలిలో కలుస్తాయి. వ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా గుండె, కాలేయం, పేగులు, మెదడు, ఎముకలు వంటి శరీర అవయవాలకు సోకే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కూడా టీబీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం రావటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం వంటివి క్షయ లక్షణాలుగా చొప్పొచ్చు. ఎండీఆర్ కేసులూ అధికమే.. జిల్లాలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్(ఎండీఆర్) కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మందులు వాడుతూ మధ్య ఆపివేయటం, విచ్చలవిడిగా మందులు వాడటం వంటి వ్యాధిగ్రస్తులను ఎండీఆర్ కేసులుగా పిలుస్తారు. సాధారణంగా టీబీ సోకిన వారు 6 నెలలు మందులు వాడాల్సి ఉండగా, ఎండీఆర్ కేసులకు చెందిన వ్యాధిగ్రస్తులు 18 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది. జిల్లాలో 2017లో 31 ఎండీఆర్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2015లో 66 కేసులు, 2016లో 82 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. 18 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్(డీఎంసీ)ల ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల పరిధిలో రెండు వారాలకు మించి దగ్గు ఉండే రోగులను డీఎంసీకి పంపిస్తారు. ఇక్కడ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, మధిర, తల్లాడ, నేలకొండపల్లి, మంచుకొండ, వైరాలో ట్యూబరో క్లోసిస్ యూనిట్లు ఉన్నాయి. అందులోని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు రోగులు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అనే విషయంపై పర్యవేక్షిస్తుంటారు. ఖమ్మంలోని జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వార్డులో రోగులకు మందులు పంపిణీ చేస్తారు. రోజువారీ కోర్సు ఇస్తున్నాం.. గతంలో రోజు విడిచి రోజు మందులు ఇచ్చేవారు. ఫలితంగా కొందరు రోగులకు మాత్రలు పడేవి కావు. ప్రస్తుతం ఫిక్స్డ్ డైలీ కోర్సు ప్రవేశపెట్టి రోజూ మాత్రలు వేసుకునే విధానం వచ్చింది. నాలుగు రకాలకు చెందిన మందు ఒకే మాత్రలో ఉంటుంది. బరువునుబట్టి డోస్ ఇస్తున్నాం. జిల్లాలో టీబీని తగ్గించేందుకు శ్రమిస్తున్నాం. దగ్గు రెండు వారాలకు మించి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే రోగులు కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడితే మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టీబీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – వి.సుబ్బారావు, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ -
నకిలీ వైద్యుడి నిర్వాకం.. 46 మందికి హెచ్ఐవీ
ఉన్నావో (యూపీ): ఓ నకిలీ వైద్యుడి చేసిన పనికి 10 నెలల్లో దాదాపు 46 మంది హెచ్ఐవీ బాధితులుగా మారారు. కలుషిత సిరంజీతో రోగులకు ఇంజెక్షన్ చేయడంతో ఈ దారుణం జరిగింది. యూపీలోని ఉన్నావో జిల్లా బంగర్మౌలో గతేడాది ఏప్రిల్–జూలైలో అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. అలాగే గత నవంబర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా మరో 13 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఇంతకింతకు పెరుగుతున్న హెచ్ఐవీ కేసులను సీరియస్‌గా పరిగణించిన వైద్యాధికారులు ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. కమిటీ సభ్యులు ప్రేమ్‌గంజ్, చక్మిర్ పూర్ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి 24, 25, 27 తేదీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి 566 మందిని పరీక్షించారు. ఇందులో మరో 21 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. మొత్తం 46 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు వెల్లడైంది. రాజేంద్ర కుమార్ అనే నకిలీ వైద్యుడు దీనికి కారణమని అధికారులు గుర్తించారు. చౌకవైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చిన రోగులకు ఒకే కలుషిత సిరంజీతో ఇంజక్షన్ చేయడం ద్వారానే హెచ్ఐవీ సోకిందని వెల్లడించారు. -
వారం రోజుల మందులు ఒక్క క్యాప్సూల్‌లో
హెచ్ఐవీతో బాధపడుతన్న వారికో శుభవార్త. రోజూ బోలెడన్ని మాత్రలు తీసుకోవాల్సిన శ్రమ త్వరలోనే తప్పనుంది. వారం రోజులకు సరిపడా మందులన్నింటినీ ఒకే ఒక్క క్యాప్సూల్లోకి చేర్చడంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు విజయం సాధించడం దీనికి కారణం. క్యాప్సూల్‌లోని మందులు నెమ్మదిగా విడుదల అవడం ద్వారా హెచ్ఐవీ వైరస్ నుంచి వారం పాటు రక్షణ కల్పిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గియోవానీ ట్రావెర్సో తెలిపారు. లైండ్రా అనే ఫార్మా కంపెనీ ఇప్పుడు ఈ సరికొత్త క్యాప్సూల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాల్లో ఉంది. వేర్వేరు మందులను ఒక్కచోటికి తీసుకు రాగల టెక్నాలజీ ఒక్క హెచ్ఐవీకి మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగపడుతుందని ట్రావెర్సో అంటున్నారు. యాంటీ రెట్రోవైరల్ మందులు అందుబాటులోకి వచ్చిన తరువాత హెచ్ఐవీ మరణాల రేటు గణనీయంగా తగ్గినప్పటికీ, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కొంతమంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో లైండ్రా ఈ సరికొత్త క్యాప్సూల్‌ను అభివృద్ధి చేయడం విశేషం. ఆరు మూలలతో నక్షత్రం ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్ ఒక్కసారి కడుపులోకి చేరితే దాదాపు రెండు వారాలపాటు మనగలదు. ఈ కాలంలో ఒక్కో మూలలో ఉండే మందు క్రమేపీ విడుదలవుతూ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఎప్పుడు ఏ మందు విడుదల కావాలో తయారీ సమయంలోనే నిర్ణయించుకోగలగడం ఇంకో విశేషం. -
వారానికో మాత్రతో హెచ్ఐవీని జయించొచ్చు!
బోస్టన్: హెచ్ఐవీ... పవర్ఫుల్ మందులకు కూడా లొంగని మొండి వైరస్. దీనిబారిన పడినవారి ఎయిడ్స్ సోకడం, క్రమక్రమంగా వారు మరణానికి దగ్గర కావడం వంటి ఎన్నో కేసులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపై హెచ్ఐవీ బాధితులు ధైర్యంగా బతకొచ్చు. వేల రూపాయలు ఖర్చుచేసే మందులను వేసుకొని కాదు... కేవలం వారానికో మాత్ర చాలట. అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ మాత్రను తయారుచేశారు. హెచ్ఐవీని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినంతా ఓ మాత్రలో నింపారట. వారానికో మాత్ర వేసుకుంటే చాలు... హెచ్ఐవీ కారణంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించవచ్చని చెబుతున్నారు. ఒక్కసారి మాత్ర వేసుకున్నా.. అది వారం రోజులపాటు మెల్లమెల్లగా మందును శరీరంలోకి విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇది రోగి శారీరక ఆరోగ్యాన్నేకాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తరచూ మందులు వేసుకోవడం వల్ల వైరస్ వాటిని తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటుందని, ఇలా వారానికోసారి వేసుకునే మందు వల్ల వైరస్‌పై అది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. -
హెచ్ఐవీ ఉంటే ఉద్యోగం ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోటా కింద హెచ్ఐవీ బాధితుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిన సింగరేణి యాజమాన్యం తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఆ వ్యక్తి భూ గర్భంలో పనిచేయలేకపోతే, ఉపరితలంపై చేసే పనిని అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తండ్రి అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేన్నందున, పిటిషనర్‌కు డిపెండెంట్ కోటా కింద ఉద్యోగమిచ్చి మూడు నెలల్లో ఉత్తర్వులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. తన తండ్రి అనారోగ్యం నేపథ్యంలో డిపెండెంట్ కోటా కింద తనకు ఉద్యోగమివ్వాలన్న అభ్యర్థనను.. హెచ్ఐవీ ఉందన్న కారణంతో తిరస్కరించిందని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగరేణి కాలరీస్ కౌంటర్ దాఖలు చేస్తూ, హెచ్ఐవీ, హెపటైటీస్–బి ఉన్న వారు భూగర్భంలో పని చేయడానికి అనర్హులని, వీరికి ఉపరితలంపై బాధ్యతలు అప్పగిస్తామని తెలిపింది. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించాలని హైకోర్టు పేర్కొంది. -
భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వస్తే..
సందర్భం ఎయిడ్స్ రోగి అంటేనే భయంతో పారిపోయే పరిస్థితి నుంచి, సరైన అవగాహన ఉంటే రోజుకు కేవలం రూ. 30ల మందులతో ఎయిడ్స్ రోగులు 75 ఏళ్లు బతికే స్థితి వచ్చింది. కానీ అవగాహనా లోపమే అసలు సమస్యగా ఉంటోంది. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశీలన జరుపుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో ఇంటర్వ్యూ... ఎయిడ్స్ వస్తే ఇక చావే గతి అనే అపోహ ఉంది కదా? ప్రజలలో అవగాహనా రాహిత్యం వల్లనే ఇలా జరుగుతోంది. అమెరికాలో మొట్టమొదటిసారిగా 35 ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కం వల్ల ఈ వ్యాధి వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు రాక్ హడ్సన్ హెచ్ఐవీ బారిన పడ్డాక అమెరికన్ విమానంలో వెళుతుంటే చాలామంది విమానం దిగిపోయారు. అప్పట్లో ఈ వ్యాధి అంటే విపరీతంగా భయపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హెచ్ఐవీ కూడా అన్ని వ్యాధుల లాంటిదేనని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. సేఫ్ సెక్స్, సేఫ్ పేరెంట్, సేఫ్ నీడిల్, సేఫ్ బెడ్ లాంటి నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే నూటికి నూరుశాతం ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. 1987లో మొదటి మందును కనుగొన్నారు. ఆ తరువాత 40 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులొచ్చినా ఈ వ్యాధిపై అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో వ్యాధి ఉన్నవారు పెళ్లి చేసుకునే వారు కాదు, కానీ నేడు పాజి టివ్ పేరెంట్స్ కూడా సరైన మందులు వాడి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే నూటికి నూరుశాతం ఇప్పుడు నెగెటివ్ బిడ్డను కనవచ్చు. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) వారి సర్వే ప్రకారం 49 శాతం మంది గర్భిణీలకు తాము హెచ్ఐవీ పాజిటివ్ అని కూడా తెలవదు. ఎయిడ్స్‌పై అవగాహన అవసరం ఏమిటి? ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించడానికి.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా కొన్నికొన్ని దినాలను గుర్తించాయి. ప్రజల్లో ఆయా వ్యాధులకు సం బంధించిన అవగాహన బలపడాలన్నదే వీటి ముఖ్య ఉద్దేశం. 1988లో మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ‘జవాబుదారీతనాన్ని, భాగస్వామ్యాన్ని పెంచండి’ అనేది నినాదం. ముప్పైఏళ్లుగా ఎయిడ్స్‌పై పోరాటం జరుగుతున్నా దానిని మనం నివారించలేకపోయాం కాబట్టి ‘రెయిజ్ ఇంపాక్ట్’ అనే ఈ అవగాహనను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రకటించారు. దీనిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొనాల్సి ఉంది. హెచ్ఐవీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది కానీ అసలు హెచ్ఐవీ అనేదే లేకుండా పోవాలి. ఎయిడ్స్ వైరస్ ఒక్కటి మిగిలినా అది మళ్లీ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో హెచ్ఐవీ గత రెండు మూడేళ్లలో ఐదుశాతం నుంచి 1.5 శాతానికి పడి పోయింది. దీన్ని జీరో శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎయిడ్స్‌పై అవగాహన చేపడుతున్నాయా? గత మూడేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్ఐవీపై ప్రచారం విషయంలో మొద్దునిద్ర పోతున్నాయి. దీని ఫలితంగానే భారతదేశంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ఏపీ ప్రథమ స్థానం సాధిం చింది. పైగా అంతర్జాతీయ ఎన్జీవోల నుంచి డబ్బులు రాకుండా పోవడంతో ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం తగ్గిపోయింది. ఆరోగ్యంపై ఒక్కశాతం కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. పేదరికమే అనా రోగ్యానికి మూలకారణం. పేదరికం పోవాలంటే, ఆరోగ్యంపట్ల జాగరూకత ఉండాలి. కానీ ఆరోగ్యంపై మన ప్రభుత్వాలు మారుతల్లి ప్రేమ చూపిస్తున్నాయి. మన దేశంలో వ్యాధులు రాకుండా నిరోధించకపోవడంతో ప్రజలు తమ డబ్బును పూర్తిగా ఆరోగ్యంకోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలు తమ సంపాదనలో 75 శాతం వెచ్చించి మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటే ఎలా? హెచ్ఐవీపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా? గతంలో మశూచికం వస్తే అరటి ఆకుమీదపెట్టి అడవిలో పడేసేవారు. అలాంటిది వ్యాక్సిన్ వల్ల అంత పెద్దవ్యాధిని నామరూపాలు లేకుండాచేశారు. 1978 తరువాత మశూచికంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శాస్త్ర అద్భుతంగానే చెప్పాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినవారు స్వయంనియంత్రణ పాటించాలి. కలుషిత సిరంజీల వాడకంపై జాగరూకతతో ఉండాలి. సమర్థవంతంగా వ్యాధి వ్యాపించకుండా చేసుకునే మార్గాలున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఎయిడ్స్ రాకుండా చూసుకోవచ్చు. సమర్థవంతమైన వ్యవస్థ, మందులు వచ్చాయి. చాలామంది సిగ్గుతో, భయంతో ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం లేదు. భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వ్యాధి వస్తే భార్య సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఏపీలో ట్రాన్స్‌జెండర్లలో 7.5 శాతం మందికి పాజిటివ్ ఉండటం మంచిది కాదు. రోజుకు 30 రూపాయల మందులతో 75 ఏండ్లు బతకవచ్చు. 20 ఏళ్లక్రితమే మందులువచ్చినా కూడా ఇంకా అవగాహన రాలేదు. దీనిపై డిసెంబర్ ఒకటిన మాత్రమే కాదు నిరంతరం చర్చ జరగాలి. ఈ భూమిమీద ఎయిడ్స్ ఉన్నంత కాలం ఇది జరగాలి, అప్పుడే ఎయిడ్స్ దూరం అవుతుంది. రిపోర్ట్ వ చ్చిన తర్వాత కూడా మందులు వాడటానికి ఆలస్యం చేయడంవల్లే ఎక్కువమంది చనిపోతున్నారు. (నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త నేషనల్ ప్రొఫెసర్, ఐఎమ్ఐ కాలేజి మొబైల్: 97031 00938 -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు
కరీంనగర్ రూరల్: ఓ గర్భిణికి ప్రభుత్వాసుపత్రిలో హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇవ్వడంతో వైద్యులు ప్రసవానికి నిరాకరించారు. దీంతో అదే గర్భిణికి ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేనట్లు రిపోర్టు వచ్చిన ఉదంతమిది. కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన ఓ యువకుడు తన భార్య గర్భవతి కావ టంతో ఈ నెల 22న ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ సిబ్బంది ఆమెకు హెచ్ఐవీ ఉందంటూ రిపోర్టు ఇచ్చారు. ప్రసవం చేసేందుకు వైద్యురాలు నిరాకరించారు. ఆందోళనకు గురైన భర్త సమీపంలోని మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తపరీక్ష చేయించాడు. రెండు రిపోర్టుల్లోనూ హెచ్ఐవీ లేదని నిర్ధారించుకుని తిరిగి ప్రభుత్వ వైద్యురాలికి చూపించగా తాము చేసిన పరీక్షలే ముఖ్యమన్నారు. ప్రసవం చేసేందుకు రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. మరుసటిరోజు ఉదయం ఆమె పాపకు జన్మనిచ్చింది. డ్యూటీ సిబ్బందికి మెమో గర్భిణికి హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చిన విషయంపై అందిన ఫిర్యాదు మేరకు సం బంధిత వైద్య సిబ్బందికి మెమో జారీ చేశాను. డాక్టర్ అజయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించాం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. –సూపరింటెండెంట్ డాక్టర్ సుహాసిని -
పుట్టే బిడ్డకు వస్తుందా?
నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? – ఓ సోదరి హెచ్ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది. నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?– పేరు రాయలేదు కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండటం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడటం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
నెలకో టీకాతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం కలిగించే వార్త ఇది. వారికి రోజువారీ మాత్రలేసుకునే అవసరం నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. అమెరికాకు చెందిన వివ్ హెల్త్‌కేర్ సంస్థ ఒక ఇంజెక్షన్‌తో నెలరోజుల పాటు యాంటీ రెట్రోవైరల్ చికిత్స అందించే కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉండగా రోజువారీ మందుల పుణ్యమా అని వీరికి ప్రాణాపాయం గణనీయంగా తగ్గింది. అయితే రోగులు మందులు తీసుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో వివ్ హెల్త్‌కేర్ సంస్థ యాంటీ రెట్రో వైరల్ మందులను ఇంజెక్షన్ల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో కాబోటెగ్రావిర్, రిల్పీవిరైన్ మందులతో తయారైన ఇంజెక్షన్లు 4 నుంచి 8 వారాల పాటు మాత్రలు మింగాల్సిన అవసరం లేకుండా చేస్తుందని గుర్తించారు. అవసరాన్ని బట్టి ఈ ఇంజెక్షన్‌లోని మందుల మోతాదులను మార్చుకోవచ్చు అని వివ్ హెల్త్‌కేర్ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ మార్గోలిస్ తెలిపారు. తాము దాదాపు 300 మందిపై జరిపిన అధ్యయనంలో రెండు నెలలకు ఒకసారి ఇంజెక్షన్లు అందుకున్న 95 శాతం మందిలో వైరస్ నియంత్రణలో ఉందని, రోజూ మాత్రలు తీసుకున్న వారిలో ఇది 91 శాతం మాత్రమే ఉందని డేవిడ్ తెలిపారు. నెలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం నియంత్రణలో ఉన్నట్లు చెప్పారు. దాదాపు 96 వారాల తర్వాత కూడా రెండు నెలలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం మందిలో వైరస్ నియంత్రణలోనే ఉన్నట్లు తెలిసిందని వివరించారు. అన్నీ సవ్యంగా సాగితే 2019 నాటికల్లా ఈ ఇంజెక్షన్లు అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. -
మొలకెత్తిన ఆశలు.. ఆవుతో హెచ్ఐవీ నయం!
హెచ్ఐవీ(హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్) సోకితే మరణం తప్పదనే మాటకు కాలం చెల్లబోతోందా?. హిందూవులు పవిత్రంగా పూజించే గోవు జన్యువులతో మనుషులకు సోకే హెచ్ఐవీని నయం చేయోచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును. హెచ్ఐవీ వైరస్‌కు గోవు శరీరంలో అత్యతం వేగంగా ప్రతిరక్షకాలు తయారవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్ఐవీ చికిత్సలో కొత్త ఆశాలు రేగుతున్నాయి. హెచ్ఐవీపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు.. నాలుగు ఆవు దూడలకు హెచ్ఐవీ ఇమ్యునోజన్స్ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించారు. అనంతరం ఆ దూడల రక్తంలో హెచ్ఐవీ ప్రభావాన్ని నిరోధించే ప్రతిరక్షకం వెంటనే అభివృద్ధి కావడం వారిని విస్మయపరిచింది. వాటిలో ‘ఎన్సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్ఐవీని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. దీంతో ఆవులోని రోగ నిరోధక శక్తి ఇలాంటి ప్రతిరక్షకాలను వెంటనే ఎలా తయారు చేయగలుగుతుందో అర్థం చేసుకోవాలని వ్యుహం రచించారు. ప్రతిరక్షకాల ప్రక్రియను కనుగొంటే హెచ్ఐవీ సోకకుండా టీకాను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (ఐఏవీఐ), టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పదిదేశాల్లో అంటు వ్యాధిలా హెచ్ఐవీ
హైదరాబాద్: భారత్, చైనాతో పాటు పది దేశాల్లో హెచ్ఐవీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందని ఐకరాజ్య సమితి(యూఎన్) తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనుకు చెపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. భారత్, చైనాతోపాటు, ఇండోనేషియా, పాకిస్థాన్, వియాత్నం, మయన్మార్, పాపువా న్యూ గినియా, ఫిలిప్పిన్స్, తైలాండ్, మలేసియాలో హెచ్ఐవీ అంటువ్యాధిలా ప్రబలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా హెచ్ఐవీ సోకిన బాధితుల్లో 95 శాతం ఈ పదిదేశాలకు చెందిన వారేనని పేర్కొంది. దీనికి సెక్సు వర్కర్లు, ట్రాన్స్జెండర్స్లతో లైంగిక చర్యలకు పాల్పడటం, ఇంజక్షన్స్ తో డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణంగా తెలిపింది. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి హెచ్ఐవీ భారిన పడే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13 శాతం తగ్గిందని పేర్కొంది. భారత్‌లోని 26 నగరాల్లో జరిపిన సర్వేలో 46 శాతం మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చెసుకోవడం వల్లే హెచ్ఐవీ బాధితులుగా మారారని పేర్కొంది. గతంతో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల మరణాలు తగ్గినట్లు తమ సర్వేలో వెల్లైడందని యూఎన్ రిపోర్టులో పేర్కొంది. -
హెచ్ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ప్రాణాంతకర హెచ్ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్ఐవీ బాధిత చిన్నారులను డిస్అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు పేర్కొంది. -
హెచ్ఐవీ బాధితులకు త్వరగా క్షయ
కర్నూలు(హాస్పిటల్): ఇతర రోగుల కంటే హెచ్ఐవీతో బాధపడే వ్యక్తులకు క్షయ(టీబీ) త్వరగా వచ్చే అవకాశం ఉందని ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధులిక చెప్పారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో నేస్తం పాజిటివ్ నెట్వర్క్ విహాన్ సీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్ఐవీ–టీబీ వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే అంటు వ్యాధి అని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. క్షయ శరీరంలోని ఏ భాగానికైనా సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విహాన్ సీఎస్సీ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి. నాగరాజు, ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.