
నిశ్శబ్దాన్ని ఛేదించారు!
హెచ్‌ఐవీ.. దశాబ్దం క్రితం వరకు కూడా దీనిపై నలుగురిలో మాట్లాడాలంటే వణుకు.
వ్యాధి విషయమై మాట్లాడుతున్నారు
జిల్లాలో ఏటా తగ్గుతున్న హెచ్‌ఐవీ కేసులు
{పభుత్వం నుంచి సాకారం అవసరం
రేపు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం
చిత్తూరు (అర్బన్) : హెచ్‌ఐవీ.. దశాబ్దం క్రితం వరకు కూడా దీనిపై నలుగురిలో మాట్లాడాలంటే వణుకు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే గుండె జారిపోరుునంత పని. వ్యాధి సోకిందని తెలిస్తే ఆత్మహత్య ఒక్కటే దారనుకునే రోజులు. అందుకే దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు.. మాట్లాడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడుతున్నారు. హెచ్‌ఐవీ పట్ల తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటున్నారు. గురువారం ప్రపంచ ఎరుుడ్‌స నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనమిదీ.
ఐదేళ్ల క్రితం జిల్లాలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య 2,462 ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య వెరుు్యకి చేరింది. సుఖ వ్యాధులు, రోగాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండటం వల్లే హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాధి బారినపడ్డ వాళ్లకు ఆ ప్రాంతాల్లో సుఖ వ్యాధి చికిత్స కేంద్రాలు (డీఎస్‌ఆర్‌సీలు), వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యాంటీ రిట్రో వైరల్ థెరపి (ఏఆర్‌టీ) కేంద్రాలు 18 పనిచేస్తున్నారుు. వీటిల్లోని సిబ్బంది హెచ్‌ఐవీ బాధితులకు వైద్య సేవలు అందించడంతో పాటు వాళ్లలో మనోధైర్యాన్ని పెంచేలా కౌన్సెలింగ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదరణ ఏదీ..?
జిల్లాలో ఎరుుడ్‌స నియంత్రణ కోసం పనిచేస్తున్న ఐసీటీసీ కేంద్రాలకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. ఫలితంగా ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల్లేక పనులు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న హెచ్‌ఐవీ బాధితులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నా, వాటిని తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావడంలేదు. సాటివారు చులకనగా చూస్తారనే భావం హెచ్‌ఐవీ బాధితుల్ని వెంటాడుతోంది. ఇలాంటివారికి ఇళ్ల వద్దకు కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు జమచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
చైతన్యం తెస్తున్నాం
ఏటా అంతర్జాతీయ ఎరుుడ్‌స నివారణ దినోత్సవం నేపథ్యంలో ఒక కొత్త స్లోగన్‌తో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఈ సారి హెచ్‌ఐవీ వ్యాప్తిలేని సమాజాన్ని సాధిద్దామనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నాం. ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం కీలకం. ప్రజలు సైతం చైతన్యంతో వైద్యుల వద్దకు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా నిర్మొహమాటంగా చెబుతున్నారు. పాజిటివ్ వచ్చినా మనోధైర్యంతో చికిత్స చేరుుంచుకుంటున్నారు. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎరుుడ్‌స నియంత్రణాధికారిణి