85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు | 85 Prisoners Contract Aids Nagaon Central Jail Assam | Sakshi
Sakshi News home page

Nagaon Central Jail: 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. షాక్‌లో అధికారులు

Published Sun, Oct 10 2021 3:36 PM | Last Updated on Sun, Oct 10 2021 3:51 PM

85 Prisoners Contract Aids Nagaon Central Jail Assam - Sakshi

నౌగావ్‌: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్‌ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్‌లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్‌ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్‌ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్‌ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement