ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త పెళ్లికి ముందు హెచ్‌ఐవీ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని ఆరోపించింది. పెళ్లి తరువాత తాను హెచ్‌ఐవీ బాధితురాలిగా మారిపోయానన్నారు. దీంతో తనను పుట్టింటిలో దిగబెట్టి, భర్త పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె భర్త దురాగతంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన మీరఠ్‌లోని పల్లవ్‌పురంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెకు 2021లో జానీ పోలీస్‌స్టషన్ పరిధిలోని ఒక యువకునితో వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వివాహానికి రూ. 15 లక్షలు ఖర్చుచేశానని తెలిపారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందక ఇంకా కట్నం కావాలని అడుగుతుండేవారని తెలిపారు. అత్తవారింటిలో ఎన్ని సమస్యలు ఎదురైనా తన కుమార్తె సహనంతో వ్యవహరించిందన్నారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లికి ముందు ఆ యువకుడు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలిపారు. అయితే పెళ్లి సమయంలో ఈ విషయాన్ని దాచి ఉంచారన్నారు. ఈ నేపధ్యంలో తన కుమార్తె కూడా ఎయిడ్స్ బాధితురాలిగా మారిందని వాపోయారు. కుమార్తె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను తమ దగ్గర దిగబెట్టి భర్త పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం!
Comments
Please login to add a commentAdd a comment