Is Omicron Variant Connection With HIV?: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అనుకునే లోపే మాయదారి మహమ్మారి రూపాంతరం చెంది ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రజలను పీడించేందుకు మరో సారి దాపురించింది. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ వేరియంట్ మొదటగా సౌతాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకొచ్చింది, అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు.
అందుకు శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ కరోనా వైరస్ నుంచి ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది, మరే ఇతర లక్షణాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు నిపుణులు వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ)తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్, హెచ్ఐవి మూలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు.
ఈ పరిశోధనలను ఉటంకిస్తూ ఒమిక్రాన్‌ను హెచ్‌ఐవితో ముడిపెట్టే అవకాశాలు "అత్యంత ఆమోదయోగ్యమైనదిగా ఉన్నాయని బీబీసీ తన నివేదికలో పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఒమిక్రాన్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం చెలామణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరిశోధకులు ఏమంటున్నారంటే.. హెచ్‌ఐవీ సోకిన మహిళకు కరోనా సోకడం, ఆ తరువాత వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉండే అవకాశాలు ఉండచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటువంటి అభిప్రాయమే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ వైరస్ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు’’ అని డా.కెంప్ తెలిపారు.
చదవండి: Omicron Variant: అమెరికాను కమ్మేసిన ఒమిక్రాన్.. 73 శాతం అవే కేసులు
Comments
Please login to add a commentAdd a comment