
ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో హెచ్‌ఐవీతో బాధపడే యువతీయువకులు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. 2017 సంవత్సరానికి గానూ భారత్‌లో 19 ఏళ్లలోపు వయస్సున్నవారిలో 1,20,000 మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 మంది యువతీయువకులు చనిపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ‘చిల్డ్రన్–హెచ్‌ఐవీ అండ్ ఎయిడ్స్– ది వరల్డ్ ఇన్ 2030’ పేరుతో యూనిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది.
చిన్నారులు, యువత, గర్భిణుల్లో హెచ్‌ఐవీ కేసుల్ని నియంత్రించడంలో దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని యూనిసెఫ్ తెలిపింది. ఈ విషయంలో భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్(5,800 మంది), నేపాల్(1,600), బంగ్లాదేశ్(వెయ్యి కంటే తక్కువ) మరింత మెరుగైన ఫలితాలు సాధించాయంది.
Comments
Please login to add a commentAdd a comment