మీ హెచ్‌ఐవీ స్థితి తెలుసా? | World HIV Aids Day Special Story | Sakshi
Sakshi News home page

మీ హెచ్‌ఐవీ స్థితి తెలుసా?

Published Sat, Dec 1 2018 12:16 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

World HIV Aids Day Special Story - Sakshi

హెచ్‌ఐవీ.. ఎయిడ్స్‌ ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి సోకినా క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా సుఖమైన జీవనం సాగించవచ్చు. వైద్యులు, కౌన్సిలర్ల    సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే ఆనందంగా గడపవచ్చు. ఎలాంటి అనుమానం ఉన్నా ఉచితంగా పరీక్షలు చేస్తారు. జిల్లాలోని ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్‌ ఇస్తూ వ్యాధిగ్రస్తులకు మనోస్థైర్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా గర్భిణుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు  చేపట్టారు.  ఈ ఏడాది‘ మీ హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోండి’ అనే నినాదంతో వ్యాధి నివారణకు పిలుపునిచ్చారు. కొత్తగా హెచ్‌ఐవీకి గురి కాకుండా చర్యలు తీసుకోవడం, వివక్ష లేకుండా చూడడం, హెచ్‌ఐవీ మరణాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ధ్యేయం. ఇందు కోసం జిల్లాలో డిసెంబర్‌ నెలలో హెచ్‌ఐవీపై అవగాహన సదస్సులు, హైరిస్క్‌ ప్రాంతాల్లో పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏఆర్‌టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారు 20,665 మంది ఉన్నారు.      

మదనపల్లె సిటీ / చిత్తూరు అర్బన్‌ :శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌/హెచ్‌ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గుర య్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్‌ (ఎయిడ్స్‌) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు ఎయిడ్స్‌ అతిపెద్ద కారణం  అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్‌ బారిన పడకుం డా ఉండాలంటే  విశృంఖల శృంగా రానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని సూచి స్తున్నారు.  

కణాల పాత్రే కీలకం..
వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్‌  కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైంది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతిమిల్లీలీటర్‌ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి.  సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవీ లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది.

వ్యాధి గుర్తించడానికి ఇదేళ్లు  
హెచ్‌ఐవీ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్‌ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్‌ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు.

అందుబాటులో ఏటీఆర్‌ కేంద్రాలు
జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి.  ఇందులో 2 వేల మంది కంటే ఎక్కువగా రోగులు నమోదు ఉన్న తిరుపతి కేంద్రానికి ఏఆర్‌టీ ప్ల్లస్‌ గుర్తింపు వచ్చింది. ఇక్కడికి కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు. వీటితో పాటు శ్రీకాళహస్తి, కుప్పం, వి.కోట, పలమనేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, పూతలపట్టు, పీలేరు, సదుం, పుంగనూరులాంటి ప్రాంతాల్లో 11 లింక్‌ ఏఆర్‌టీలు ఉన్నాయి.  350, అంతకంటే తక్కువ తెల్ల రక్తకణాలు ఉన్నవారు, హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్‌ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు  వాడాల్సి ఉంటుంది. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో  బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటీ రిట్రోవైరల్‌ మందులు ఇవ్వ డంతో ఇన్‌పెక్షన్‌లు  తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు.

నేడు భారీ ఎత్తున ర్యాలీలు
ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్‌ కం ట్రోల్‌ అధికారిణి డాక్టర్‌ అరుణ సులోచన తెలి పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరి«ధిలో కూడా ర్యాలీలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

వ్యాధి ఇలా వస్తుంది..
సురక్షితం కాని లైంగిక సంబంధాలు
మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని   ఉపయోగించడం.
రక్త మార్పిడి, హెచ్‌ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్‌æ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను శుభ్ర పరచకుండా వాడితే వ్యాపిస్తుంది.

ఇలా రాదు..
హెచ్‌ ఐవీ బాధితుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు.
హెచ్‌ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.
వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం.
నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామి తోనే     లైంగిక సంబంధం కలిగి ఉండడం.
సరైన పద్ధతిలో కండోమ్‌ వాడడం.
హెచ్‌ఐవీ బాధితులు జీవితకాలం మందులు క్రమం తప్పకుండా వాడాలి. సాంకేతిక పద్ధతిలో సరైన మందులు వాడితే దీర్ఘకాలం జీవించొచ్చు.  

జాగ్రత్తలు తప్పనిసరి
గర్భిణికి హెచ్‌ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్‌టీ సెంటర్‌కు పంపిస్తాం. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట ర్‌ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్‌æ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి.  ఏఆర్‌టీ మందులు వాడితే సిజేరియన్‌ అవసరం లేదు.
    –అరుణ సులోచన, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement