
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్‌కేర్ రూపొందించిన హెచ్‌ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్‌ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్‌లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి.
(ట్విటర్‌లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?)
ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్‌ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్‌ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్‌ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
(ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment