Pact
-
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇండియా పోస్ట్‌తో అమెజాన్ జట్టు: వారి కోసమే
న్యూఢిల్లీ: చిన్న సంస్థలకు (ఎస్ఎంఈ) ఎగుమతులను సులభతరం చేసే దిశగా ఇండియా పోస్ట్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. సంభవ్ సమ్మిట్ 2023 సందర్భంగా కంపెనీ ఈ విషయం తెలిపింది. ఇదీ చదవండి: పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు అలాగే అమెజాన్, ఇండియా పోస్ట్ మధ్య దశాబ్ద కాలపు భాగస్వామ్యానికి గుర్తుగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్మారక స్టాంపును ఆవిష్కరించినట్లు వివరించింది. తమ విక్రేతలకు తోడ్పాటు అందించేందుకు సహ్–ఏఐ పేరిట కృత్రిమ మేథ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టినట్లు అమెజాన్ తెలిపింది. (సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం) -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్‌కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్‌లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్‌ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
దిగ్గజ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం.. లక్ష మందికి ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’( Hon Hai Fox Conn)సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైంది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీకి అందచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ -
బైజూస్ సేవలు ఉపయోగకరం
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 మిలియన్ విద్యార్థులకు విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సంస్థ విద్యాసేవలు త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ అందుబాటులోకి రానుండటం ముదావహం. నిత్యం పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షించే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ 2022 మే నెలలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడం తెలిసిందే. అదే సమయంలో నాణ్యమైన విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సీఈఓ రవీంద్రన్తో కూడా చర్చలు జరిపారు. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు గూర్చి తీసుకుంటున్న శ్రద్ధకు ఆశ్చర్యచకితులైన రవీంద్రన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తమ సేవలు ఉంటా యని ప్రకటించారు. ఫలితంగా జూన్ 16న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, బైజూస్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... ప్రతి ఏటా ఒక్కొక్కరికి 20 వేల నుంచి 24 వేల రూపాయలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్ విద్యా సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అంతేగాదు దాదాపు 4.7 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల ఖర్చు చేస్తోంది. బైజూస్ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్ యాప్‌ను కూడా ఉచితంగా అందుబాటులోనికి ఏపీ ప్రభుత్వం తెస్తోంది. గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లీషు, అటు తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉండేటట్లు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇంత చేస్తున్నా చంద్రబాబు ఆంగ్ల భాషా మాధ్యమాన్ని వ్యతిరేకించినట్లు... బైజూస్ విద్యాకార్యక్రమాలను కూడా వ్యతిరేకించడం శోచనీయం. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లింపక తప్పదు. (క్లిక్: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్!) – ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, విజయవాడ -
ఫెర్న్ హోటల్స్‌తో జట్టు కట్టిన మెజెంటా
ఛార్జ్ పాయింట్ ఆపరేటర్‌గా ఉన్న మెజెంటాతో ది ఫెర్న్ హోటల్స్ అండి రిసార్ట్ జట్టు కట్టింది. ఫెర్న్ సంస్థ లోనావాలా, కరాద్, బెంగళూరులతో పాటు మొత్తం 69 లోకేషన్స్‌లో 84 ఎన్విరాన్ఫ్రెండ్లీ హోటల్స్ నిర్వహిస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు ఫెర్న్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లలో డీసీ ఫాస్ట్ ఛార్జర్స్‌ను నెలకొల్పడంతో పాటు మెయింటనెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మొబైల్ అప్లికేషన్ ఏనబేల్డ్ ఛార్జింగ్ సొల్యూషన్స్‌ని మెజెంటా అందిస్తోంది. కస్టర్మర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో మెజెంటా ఛార్జింగ్ స్టేషన్లు, ఫీచర్లు అందిస్తోంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్!
ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది. జీ 20 దేశాలతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణ విషయంగా మారింది. టీ కొట్టు, పాన్ డబ్బా దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది. తొలుత సింగపూర్ భారత్ , సింగపూర్ దేశాల మధ్య ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది. చదవండి : RBI New Rule: ఆటోమేటిక్ కట్టింగ్లతో రెన్యువల్ ఇక నడవదు.. ఇలా చేయాల్సిందే! -
కరోనా వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్‌జెట్
సాక్షి, ముంబై: చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్ కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సరుకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో చేతులు కలిపింది. స్పైస్ ఎక్స్‌ప్రెస్ కార్గో విమానాలు మైనస్ 40 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నియంత్రిత ఉష్ణోగ్రతలో సున్నిత ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్త నమూనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా చేయగలవని కంపెనీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లు, మందులు, నిర్ధేశిత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన సరుకు రవాణాకై స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఇటీవలే స్పైస్ ఫార్మా ప్రో పేరుతో సేవలను పరిచయం చేసింది. 54 దేశీయ, 45 అంతర్జాతీయ నగరాలతో అనుసంధానమైన స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలున్నాయి. -
భారత్-అమెరికాల మధ్య కీలక ఒప్పందంపై సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం జరిగిన మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్ పొందే వెసులుబాటు కలుగుతుంది. తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశాల్లో సమగ్ర, ఫలవంతమైన చర్చలు జరిపామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి అని అన్నారు. రక్షణ సంబంధాలపై ఉపయుక్తమైన చర్చలు జరిగాయని, సైనిక సహకారంలోనూ ఇరుదేశాల మధ్య పురోగతి సాధ్యమయ్యేలా చర్చలు సాగాయని తెలిపారు. ఇక రెండు దశాబ్ధాలుగా భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్య విస్తరణ స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. చదవండి : మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ? భారత్‌కు వెన్నుదన్ను: మైక్ పాంపియో భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇక కరోనా వైరస్, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం భారత్-అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచ భద్రత, ఇతర అంశాలపై పాంపియో, ఎస్సర్‌లతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. -
విజెఎన్ఎన్ఎస్తో ఇన్ఫీ ఫౌండేషన్ ఎంఓయు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలలో స్వచ్ఛమైన నీటి సరఫరాను అందించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం 5.92 కోట్ల రూపాయలను ఇన్ఫోసిస్ వెచ్చించనుంది. ఈ మేరకు విశాఖ జిల్లా నవ నిర్మాణ్ సమితి (విజెఎన్ఎన్ఎస్)తో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవగాహనా ఒప్పందం (ఎంఓయు)కుదుర్చుకుంది. తద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రిమోట్ గిరిజన గ్రామాలకు త్రాగునీటి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన గ్రామాల్లో నీటి నిర్వహణ పద్దతులు, శానిటైజేషన్ పద్దతులను ప్రమోట్ చేసేందుకు ఈ నిధులను కేటాయించనుంది. అన్ని గ్రామాల్లోనూ మంచి పారిశుద్ధ్య విధానాలను ప్రోత్సహించేందుకు, సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థలను రూపొందించడానికి రూ. 5.92 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సదుపాయాలను స్వచ్ఛంద సంస్థ అయిన విజెఎన్ఎన్ఎస్ అందిస్తోంది. విజెఎన్ఎన్ఎస్ భాగస్వామ్యంతో వంద గ్రామాల్లో గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా పద్దతులను ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయనుంది. పైప్లైన్ల ద్వారా సరఫరా చేయనున్న ఈ సురక్షిత నీటితో 40 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడటంతోపాటు నీటి వలన కలిగే వ్యాధులను నిరోధిస్తుందని ఫౌండేషన్ భావిస్తోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా ముర్తి ఎంఓయు గురించి మాట్లాడుతూ, భారతదేశంలో త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం కీలకమైందన్నారు. మంచి పారిశుద్ధ్య విధానాలు, నీటి సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహణను ప్రోత్సహించేలా స్థానిక సంఘాలను శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా గ్రామ అభివృద్ధి నిధి పై స్థానికులకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. -
అనిల్ అంబానీ భారీ డీల్
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన , టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను బ్రూక్ ఫీల్డ్ కు విక్రయించింది. ఈ మేరకు కెనడా కు చెందిన బ్రూక్‌ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో తప్పనిసరి (రెండు వైపులా బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం తెలియజేసింది. దీంతో బ్రూక్‌ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ. 11,000 కోట్లను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ బైండింగ్ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఈ తాజా ఒప్పందం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకోనుంది. మరోవైపు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన మరో సంస్థ రిలయన్స్ కేపిటల్ కూడా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.హోమ్ ఫైనాన్స్ ద్వారా అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ, 1,000 కోట్లను(14.7 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపింది. కాగా ఆర్ కాం మొబైల్ టవర్ వ్యాపార వాటా విక్రయానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి కెనడా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్లో ఆర్‌కామ్ షేరు దాదాపు 8 శాతానిపై దూసుకెళ్లింది. -
మంధనాకు సల్మాన్ జోరు
ఇటీవల భారీ నష్టాలతో కుదైలైన టెక్స్ టైల్ కంపెనీని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడు. సల్మాన్ కు చెందిన 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ తో ఒప్పందం ఖరారు కావడంతో వరుసగా ఏడో రోజూ కూడా మంధనా ఇండస్ట్రీస్ కంపెనీ అప్పర్ సర్క్యూట్ ను తాకింది. బలమైన కొనుగోళ్లతో ఇవాల్టి బుల్ మార్కెట్ లోఈ షేర్లు 5 శాతం లాభపడ్డాయి. బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ కింద వస్త్ర ఉత్పత్తులను విక్రయించేందుకు గత వారం ఒప్పందం కుదరినట్టు సంస్థ ప్రకటించింది. తమ అమ్మకాలు సాగించేందుకు మంధర రీటైల్ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్ (ఎంఆర్ వీఎల్) ప్రత్యేక లైసెన్సుదారు అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా 2012 లో మంధనా ఇండస్ట్రీస్ సల్మాన్ ఖాన్ ఛారిటబుల్ ట్రస్టు తో 'బీయింగ్ హ్యూమన్' బ్రాండ్ పేరుతో చేనేత విక్రయాలను ప్రారంభించింది. ఈ ఆర్థిక సం.రం తొలి క్వార్టర్ లో రూ.57 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. రూ.1,646.61 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది జనవరిలో 70శాతం నష్టాలతో 52 వారాల కనిష్టాన్ని తాకింది.