సాక్షి, ముంబై: చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్ కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సరుకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో చేతులు కలిపింది. స్పైస్ ఎక్స్‌ప్రెస్ కార్గో విమానాలు మైనస్ 40 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నియంత్రిత ఉష్ణోగ్రతలో సున్నిత ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్త నమూనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా చేయగలవని కంపెనీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లు, మందులు, నిర్ధేశిత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన సరుకు రవాణాకై స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఇటీవలే స్పైస్ ఫార్మా ప్రో పేరుతో సేవలను పరిచయం చేసింది. 54 దేశీయ, 45 అంతర్జాతీయ నగరాలతో అనుసంధానమైన స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment