
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుదల నమోదవడం దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 న 8,013 కేసులు నమోదవగా మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే బయటపడ్డాయి. 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మొత్తం బాధితుల్లో కిత్రం రోజు 4,216 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కేసుల్లో క్రమం తప్పకుండా పెరుగుదల నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40,370 కు చేరింది.
చదవండి👉 అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా
గురువారం 7,584 కోవిడ్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రోజు వ్యవధిలోనే కేసులు 745 ఎగబాకాయి. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో నాలుగో వేవ్ కూడా ఉంటుందా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఈ భయాలు రెట్టింపవుతున్నాయి. అయితే, వైరస్ బారినపడుతున్న వారిలో స్వల్ప లక్షణాలే ఉండటం.. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు రాకపోవడం గమనించదగ్గ విషయం. ఏదేమైనా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వాలు చెప్తున్నాయి.
చదవండి👉🏼 స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని..
Comments
Please login to add a commentAdd a comment