మెల్‌బోర్న్: భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది. కోవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన బీబీఐబీపీ–కోర్‌వీ టీకాను దేశంలోకి వచ్చే యాత్రికుల టీకా స్టేటస్‌ను నిర్థారించేందుకు పరిగణనలోకి తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారిని, బీబీఐబీపీ–కోర్‌వీ తీసుకున్న 18–60 ఏళ్ల గ్రూపు వారిని కోవిడ్ టీకా తీసుకున్నట్లు గుర్తించనున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment