spice jet
-
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ : భక్తులకు బంపరాఫర్
అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యను దర్శించుకునే భక్తుల కోసం పలు విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల కోసం విమాన ఛార్జీలపై రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తులు రామ మందిర దర్శన కోసం విమాన టికెట్‌ను ప్రారంభ ధర రూ.1622గా నిర్ధేశించింది. నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న తేదీని మార్చుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించే అవసరం లేదని తెలిపింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి దేశంలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై,బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగా నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక అయోధ్య నుంచి వారి నివాస ప్రాంతాలు చేరుకునేందుకు వీలుగా కొత్త విమానాల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి దాదాపూ 200 విమానాల్లో అయోధ్యకు చేరుకునే సౌకర్యం ఉంది. భారత్‌లో ప్రారంభ విమాన టికెట్ ధర రూ.5000 ఉండగా.. ఇతర దేశాల నుంచి అయోధ్యకు చేరుకునేందుకు విమానయాన సంస్థను బట్టి టికెట్ ధర మారుతుంది. కానీ, స్పైస్‌జెట్ మాత్రం ప్రత్యేక ఆఫర్ కింద రూ.1622కే అందిస్తుంది. జనవరి 22 నుంచి జనవరి 28 మధ్య బుక్ చేసుకుంటే జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30,2024లోపు మీరు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తేదీలను మార్చుకోవచ్చు. -
SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!
Credit Suisse vs SpiceJet: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (గుడ్ న్యూస్: రూ.1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!) కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి. (బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?) కాగా 2015 నుంచి క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్ మధ్య వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్లు డాలర్లు బకాయలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది. దీనిపై చివరికి 2021లో మద్రాస్ హైకోర్టు ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్లో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగానిలిపివేసింది, ఇరుపక్షాలు ఒక పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి నిచ్చింది. ఆగస్ట్ 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ ఒప్పందం గురించి సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదనే ఆరోపణలతో మార్చిలో క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు నమోదు చేసింది. దీంతోరాబోయే విచారణ సమయంలో హాజరు కావాలని అజయ్ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది. దీంతో ముగిసిపోనుందని భావించిన కేసు కాస్తా మళ్లీ మొదటి కొచ్చినట్టైంది. -
ఈరోజు ఫోకస్ లో అపోలో హాస్పిటల్స్, స్పైస్ జెట్...!
-
ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..
వార్నింగ్ లైట్ వెలిగిందని అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. తీరా అధికారులు విమానంలో సోదాలు నిర్వహించగా..అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలు దేరిన స్పైస్ జెట్ విమానం అనూహ్యంగా కొద్దిసేపటిలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి వచ్చింది. కాక్‌పిట్ నుంచి వార్నింగ్ లైట్ వెలగడంతో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. దీంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ చర్యతో ఒక్కసారిగా వార్నింగ్ లైట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వద్ద ఆ విమానాన్ని తనిఖీ చేయగా తప్పుగా వార్నింగ్ లైట్‌ని చూపిందని తేలడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు అధికారులు. కాక్‌పీట్‌లోని కార్గోలో ఎలాంటి పొగ, మంటలు వచ్చిన సంకేతాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానం 140 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు బయలు దేరినట్లు తెలిపారు. తదనంతరం సాధారణ తనిఖీలను పూర్తి చేసి ఆ విమానం తిరుగు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి..హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..) -
స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్ ఏవియేషన్ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్(స్పైస్‌ఎక్స్‌ప్రెస్)లోనూ కార్లయిల్ ఏవియేషన్ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. విమాన లీజింగ్ కంపెనీ కార్లయిల్ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది. ఇందుకు స్పైస్‌జెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. -
స్పైస్‌జెట్‌కు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డిసెంబర్ త్రైమాసికానికి రూ.107 కోట్లను ప్రకటించింది. ప్రయాణికులు, సరుకు రవాణా పరంగా పనితీరు మెరుగ్గా ఉండడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలానికి స్పైస్‌జెట్ లాభం రూ.23.28 కోట్లుగా ఉంది. విదేశీ మారకం సర్దుబాటుకు ముందు చూస్తే డిసెంబర్ క్వార్టర్లో లాభం రూ.221 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,679 కోట్ల నుంచి రూ.2,794 కోట్లకు పెరిగింది. ‘‘మా ప్యాసింజర్, కార్గో వ్యాపారం మంచి పనితీరు చూపించడం లాభాలకు తోడ్పడింది. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ భారం తగ్గించుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. -
కళానిధి మారన్-స్పైస్‌జెట్: సుప్రీం కీలక ఆదేశం
న్యూఢిల్లీ: కళానిధి మారన్-స్పైస్‌జెట్ కేసులో ఇచ్చిన ఆర్బిట్రల్ అవార్డ్ అమలు దిశగా సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.270 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెంటనే నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది.పెండింగ్‌లో ఉన్న రూ.578 కోట్లకు గాను ఇప్పటికే రూ. 308 కోట్ల నగదు చెల్లించామని స్పైస్‌జెట్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బిట్రల్ అవార్డులో రూ.75 కోట్లను మూడు నెలల్లోగా కళానిధి మారన్, కల్ ఎయిర్వేస్కు చెల్లించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిక్రీ హోల్డర్‌కు ఇప్పటికే రూ.308 కోట్లను స్పైస్ జెట్ చెల్లించగా, బ్యాంక్ గ్యారంటీగా ఉన్న రూ.275 కోట్లను వెనక్కి తీసుకుని చెల్లించేయాలని ధర్మాసనం సూచించింది. స్పైస్ జెట్‌కు, మాజీ ప్రమోటర్ అయిన కళానిధి మా రన్, కల్ ఎయిర్వేస్ మధ్య షేర్ల బదిలీ వివాదం కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. రూ.243 కోట్లను వడ్డీ కింద డిపాజిట్ చేయాలని స్పైస్‌జెట్‌ను 2020 నవంబర్ 2 ఆదేశించడం తెలిసిందే. (ఇదీ చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్ ) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 270 కోట్లు వెంటనే చెల్లిస్తామని,అయితే కోర్టు ఆదేశాల మేరకు వడ్డీ కింద అదనంగా రూ. 75 కోట్లు మూడు నెలల్లో అందిస్తానమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో తుది పరిష్కార దిశగా ఇది తుది అడుగు అని తాము భావిస్తున్నామని స్పైస్‌జెట్ పేర్కొంది. -
స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఐతే ప్రయాణికులంతా..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఐతే ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కోజికోడ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఎస్జీ 306ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం 6.27 నిమిషాలకు కొచ్చి విమానశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించామని చెప్పారు. తదనంతరం విమానం రాత్రి 7.19 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత విమానాన్ని రన్‌వేని తనిఖీ చేసే సాధారణ కార్యకలాపాలకు అప్పగించారు. విమానాశ్రయంలో అలర్ట్ స్ట్రక్చర్ పూర్తిగా యాక్టివేట్ అవ్వడంతో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధమైందని ఎయిర్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ తెలిపారు. (చదవండి: సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు) -
SpiceJet: పైలట్స్‌కి 3 నెలలు సెలవు
-
పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు
కరోనా మహమ్మారి దెబ్బకి డీలా పడ్డ రంగాల్లో ప్రధానంగా ఏవియేషన్ రంగం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విమానయాన సంస్థలకు తీరని నష్టాలు తీసుకొచ్చాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన సంస్థలకు.. ఆపై ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆర్థికంగా మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందు స్పైస్ జెట్ సంస్థ నిలిచింది. అకస్మాత్తుగా తన కంపెనీలోని 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి సాలరీ కూడా ఇవ్వరంటూ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనిపై ఓ పైలెట్ స్పందిస్తూ.. స్పైస్‌జెట్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు, కానీ సంస్థ 3 నెలల పాటు పైలట్లని ఇంటికి పంపాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మాలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మూడు నెలల తర్వాత కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుందని అనుకోవడంలేదు. ఇది ప్రస్తుతం తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతున్నప్పటికీ, తిరిగి పైలట్లను విధుల్లోకి తీసుకోవడం కష్టమేనన్నాడు. చదవండి: AirAsia: బంపర్ ఆఫర్, ఏకంగా 50 లక్షల టికెట్లు ఫ్రీ -
స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్‌పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్‌జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
స్పైస్‌జెట్‌పై కొరడా ఝుళిపించిన DGCA
-
ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక..
సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంటే.. అందులోని 185 ప్రాణాలు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటుంటే.. కెప్టెన్ మోనికా ఖన్నా సమర్థత... సత్వర నిర్ణయం ప్రయాణికులతో సహా తననూ సురక్షితంగా భూమికి చేర్చింది. ఆ ధైర్యానికి, సమయస్ఫూర్తికి దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఇటీవల పాట్నా నుంచి ఢిల్లీకి స్పైజ్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ ఎస్జి723 విమానం బయల్దేరింది. పైలట్–ఇన్–కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానాన్ని పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్–ఎయిర్ ఇంజిన్‌లో మంటలు రేగాయి. ఇలాంటి హఠాత్పరిణామాలు సంభవించినప్పుడు సాహసాన్ని, సమర్థతను చూపడంలో ఆడా–మగ తేడా అనేది ఏమీ లేదు. అందరినీ కాపాడటం ఒక్కటే వారి కర్తవ్యం. ఆ దక్షతను చూపడంలో మోనికా ఏ మాత్రం జంకలేదు. తక్షణ నిర్ణయం.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్ బలప్రీత్ సింగ్‌భాటియా కూడా ఆమె తక్షణ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని నిపుణులు పరీక్షించి పక్షి ఢీకొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్, ఇంజన్ దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రయాణాలను అమితంగా ఇష్టపడే మోనికా ఖన్నా తాజా ఫ్యాషన్, ట్రెండ్స్‌పై అత్యంత ఆసక్తి చూపుతుందని ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సూచిస్తుంది. అంటే, అందం, నలుగురిలో ఆనందంగా ఉండటం అనే అంశాల పట్ల వీరోచితులు దృష్టి పెట్టరు అనేవారికి మోనికా ఓ పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మహిళా శక్తి అనడం కన్నా వీరోచితమైన ప్రజల జాబితాలో మోనికాఖన్నా చేరుతారని ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. ‘ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు అందులోని ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని భయంతో బతికిన క్షణాల నుంచి ఆమె విముక్తి కలిగించారు. మోనికా ఖన్నా ధైర్యానికి వందనాలు’ అంటూ దేశవ్యాప్తంగా సిటిజనుల నుంచి నెటిజనుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
విమాన ప్రయాణికులకు షాక్! ఛార్జీల పెంపు షురూ..
పెరిగిన ధరలతో సామాన్యులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడీ కాక మరింత బాగా తాకనుంది. బడ్జెట్ ధరల్లో విమాన సర్వీసులు అందించే స్పైస్‌జెట్ సంస్థ ఛార్జీలు పెంచుతామంటూ ప్రకటించింది. ఇటీవల కాలంలో విమానాల్లో ఉపయోగించే జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క జూన్‌లోనే ఇంధన ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షీణిస్తుంది. దీంతో ఏవియేషన్ సెక్టార్లో లాభాల సంగతి అటుంచి వస్తున్న నష్టాలను అదుపు చేయడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. చివరకు ధరల పెంపు ఒక్కటే మార్గంగా ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్లు డిసైడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సంస్థ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదని స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. వివిధ మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ధరలు పెంచినా నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమని.. పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా ఆయన కోరారు. కోవిడ్ తర్వాత ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ తరుణంలో ధరల పెంపుకు విమానయాన సంస్థలు విముఖంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టమనే భావనలోకి స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఛార్జీలు పెంపు స్పైస్‌జెట్‌తో మొదలైందని.. రాబోయే రోజుల్లో ఇతర సంస్థల నుంచి ధరల పెంపు ప్రకటనలు వెలువడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ! -
విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్..!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పైస్ జెట్ "వావ్ వింటర్ సేల్" పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. "వావ్ వింటర్ సేల్' ఆఫర్ కింద చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 (అన్నీ కలుపుకొని) ధరకు వన్ వే ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణీకులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పు వస్తే ప్రయాణ తేదీకి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని కూడా మార్చుకోవచ్చు. అలాగే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 - ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. (చదవండి: భారత్‌కు రానున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!) -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
గంట సేపు గాల్లోనే చక్కర్లు...
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లిన భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. సరైన అనుమతులు లేవనే కారణంతో శనివారం బాక్సర్లు వెళ్లిన ప్రత్యేక విమానాన్ని (స్పైస్ జెట్) అక్కడి విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దాంతో గంటకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఆటగాళ్లంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇంధనం అయిపోవచ్చిదంటూ ‘ఫ్యూయల్ ఎమర్జెన్సీ’ని కూడా ప్రకటించింది. చివరకు విదేశాంగ శాఖ జోక్యంతో పరిస్థితి కుదుట పడింది. దీనిపై డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. కరోనా కారణంగా భారత్‌నుంచి వచ్చే విమానాలపై యూఏఈలో ఆంక్షలు ఉన్నాయి. సాధారణ ఫ్లయిట్లను ఆ దేశం అనుమతించడం లేదు. దాంతో ప్రభుత్వ అనుమతితో భారత బాక్సింగ్ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయ లోపం కారణంగా కిందకు దిగేందుకు అనుమతి దక్కలేదు. దాంతో యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన తర్వాత అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే మరో గంట పాటు అన్ని పత్రాల తనిఖీ పూర్తయ్యే వరకు బాక్సర్లు విమానంనుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా... భారత్ నుంచి 19 మంది బాక్సర్లు (10 మంది మహిళలు, 9 మంది పురుషులు) బరిలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మేజర్ బాక్సింగ్ టోర్నీ. మహిళల విభాగంలో మేరీ కామ్ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ బరిలో ఉన్నాడు. -
ఎయిరిండియాకు... త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు. బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని.. ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగించడమేనన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ అంశంపై మాట్లాడారు. కాగా, తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నూరు శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎయిర్ఇండియాను ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం మినహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అవకాశం లేదన్నారు. అజయ్‌సింగ్ దూకుడు... స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూపు ప్రమోటర్ అంకుర్ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది. చదవండి: రూ.999 కే విమాన టికెట్: ఏయే రూట్లలో? -
కరోనా వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్‌జెట్
సాక్షి, ముంబై: చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్ కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సరుకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో చేతులు కలిపింది. స్పైస్ ఎక్స్‌ప్రెస్ కార్గో విమానాలు మైనస్ 40 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నియంత్రిత ఉష్ణోగ్రతలో సున్నిత ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్త నమూనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా చేయగలవని కంపెనీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లు, మందులు, నిర్ధేశిత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన సరుకు రవాణాకై స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఇటీవలే స్పైస్ ఫార్మా ప్రో పేరుతో సేవలను పరిచయం చేసింది. 54 దేశీయ, 45 అంతర్జాతీయ నగరాలతో అనుసంధానమైన స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలున్నాయి. -
స్ఫైస్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి,న్యూఢిల్లీ: ఫైలట్ల తప్పిదం వల్ల బెంగళూరులో రెండు విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. మెఘాల అడ్డుపడటంతో ఫైలట్ ల్యాండింగ్ ఎత్తును సరిగా అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బెంగళూరు, గువహాటి మధ్య నడిచే స్పైస్ జెట్ బోయింగ్ 737-800, జెట్ లైనర్ -ఎస్జీ-960 విమానం అత్యవసరంగా సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే సుమారు 1,000 ఫీట్లు తక్కువగా ల్యాండ్ అయింది. 4క్యాబిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం ఇద్దరు ఫైలట్లతో సహా 155 మంది ప్రయాణిస్తున్నారు. డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ (డీజీసీఏ) తెల్పిన వివరాల ప్రకారం.. విమానం రన్‌వే 2 లో సరిగ్గానే ల్యాండింగ్ అయింది. మేఘాల కారణంగా ఎత్తును ఫైలట్లు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ అవగాహన లోపంతో ఫ్లైట్ అధిక ఒత్తిడితో ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదని, అంతా సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజీసీఏ తెలిపింది. -
ఇక నుంచి యూకే–భారత్ మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ యూకే–భారత్ మధ్య విమాన సర్వీసులను నడుపనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి ఈ మేరకు స్లాట్స్ దక్కించుకున్నట్టు క్యారియర్ స్పైస్‌జెట్ కంపెనీ ప్రకటించింది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా అక్టోబరు 23 వరకు ఈ స్లాట్స్ పొందామని, అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభం అవగానే సాధారణ విమాన సేవలను తిరిగి మొదలుపెడతామని వెల్లడించింది. ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం నిబంధనలు, పరిమితులతో రెండు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడపవచ్చు. శీతాకాలంలో సాధారణ విమాన సేవలను అందించేందుకు స్లాట్స్ కోసం చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. తాజా పరిణామాలపై స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ కంపెనీకి ఇది పెద్ద మైలురాయిగా అభివర్ణించారు. ఇదిలావుండగా కోవిడ్–19 నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 22 నుంచి భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి, అలాగే ఇక్కడి నుంచి విదేశీయులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక విమానాలను మాత్రమే నడుపుతున్నారు. చదవండి: ఆఫర్ టికెట్ల అమ్మకాలు ఆపండి -
ఆఫర్ టికెట్ల అమ్మకాలు ఆపండి
న్యూఢిల్లీ: ప్రభుత్వం విధించిన చార్జీల పరిమితులు అమల్లో ఉన్నందున సోమవారం నుంచి ప్రారంభించిన ఐదు రోజుల రాయితీ టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కోరింది. రెండు నెలల క్రితం దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చార్జీల పరిమితులు అమలులో ఉన్నాయని డీజీసీఏ సీనియర్ అధికారులు తెలిపారు. చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఐదు రోజుల ‘1+1 ఆఫర్ సేల్‘ ను ప్రారంభించినట్లు సోమవారం ఉదయం ప్రకటించడంతో డీజీసీఏ వెంటనే స్పందించింది. దేశీ ప్రయాణాలకు పన్నులను మినహాయించి రూ .899 నుండి వన్–వే బేస్ చార్జీలను అందిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది.అమ్మకం సమయంలో టికెట్ బుక్ చేసుకునే కస్టమర్లకు గరిష్టంగా రూ .2,000 విలువ కలిగిన కాంప్లిమెంటరీ వోచర్ లభిస్తుందని, భవిష్యత్తులో బుకింగ్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తితో దాదాపు రెండు నెలల సస్పెన్షన్ తర్వాత దేశీయ ప్రయాణికుల సేవలు మే 25 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 24 వరకు విమాన చార్జీల పరిమితి ఉంటుందని మే 21 న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించిన తరువాత, మరిన్ని వివరాలతో డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. పతి విమానయాన సంస్థ తన టిక్కెట్లలో కనీసం 40 శాతం కనిష్ట గరిష్ట ధరల మద్య స్థాయి కన్నా తక్కువకు విక్రయించాలని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. -
స్పైస్ జెట్‌లో కోవిడ్ అనుమానితుడి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేపింది. గురువారం (ఫిబ్రవరి 13, 2020 న) బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన (స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ -88) ప్రయాణికుడికి ఈ వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (ఎపిహెచ్ఓ) అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా కోవిడ్ వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హుబీ ప్రావిన్స్‌లో ఒకే రోజులో దాదాపు 15 వేల కొత్త కేసులు, 242 కొత్త మరణాలు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు, ఇటు భారత్‌లో ఇప్పటి వరకు మూడు కోవిడ్-19 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడు కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే దేశవ్యాప్తంగా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చదవండి: కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే? కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
సాక్షి, తిరుపతి : తిరుపతి విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలినట్లు తెలిసింది. దీంతో అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని టేకాఫ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానానికి మరమ్మత్తులు చేపట్టారు. టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. -
27 నుంచి విజయవాడకు స్పైస్‌జెట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నం – విజయవాడ మధ్య విమానాలు నడపడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గతంలో విమానాలు నడపడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖ – విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడపడానికి అనేక సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆలెన్స్ ఎయిర్ విమానాలు విశాఖ – విజయవాడ మధ్య నడుపుతోంది. తాజాగా ఈ నెల 27 నుంచి విమానాలు నడపడానికి స్పైస్‌జెట్ కూడా ముందుకు వచ్చింది. నవంబర్ 16 నుంచి విశాఖపట్నం – బెంగళూరు మధ్య విమానాల సర్వీసులు నడపడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27 నుంచి విశాఖ నుంచి చెన్నై కూడా విమానాలు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారంలో ఆరు రోజులు ఈ నెల 27 నుంచి స్పైస్‌జెట్ విశాఖ – విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడుపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారానికి ఆరు రోజులు నడుపుతారు. మంగళవారం మాత్రం సర్వీసులు ఉండవు. (3254) రోజూ ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ(విజయవాడలో 3253లో) ఉదయం 9.50 గంటలకు బయలు దేరి తిరిగి విశాఖపట్నం 10.50 గంటులకు చేరుకుంటుంది. విశాఖ – బెంగళూరు మధ్య విమానాలు నవంబర్ 16 నుంచి విశాఖపట్నం – బెంగళూరు మధ్య విమాన సర్వీసులు నడపడానికి స్పైస్‌జెట్ సిద్ధమైంది. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులో బయలు దేరి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల అయిదు నిముషాలకు బెంగళూరు చేరుకుంటుంది. విశాఖ – చెన్నై మధ్య సర్వీసులు విశాఖ – చెన్నై మధ్య విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి నడవనున్నాయి. రోజూ ఉదయం 11 గంటల 20 నిమిషాలకు విశాఖలో బయలుదేరి 12 గంటల 55 నిమిషాలకు చెన్నై చేరుతుంది. ఉదయం 6.35 గంటలకు చెన్నైలో బయలుదేరి ఉదయం 8 గంటల పది నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. -
గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు
ఎయిర్‌పోర్టు (గన్నవరం): గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్‌కు విమాన సర్వీస్‌లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్‌జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ముందుకువచ్చాయి. అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. స్పైస్ జెట్ వైజాగ్ సర్వీస్.. స్పైస్‌జెట్ సంస్థ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌కు ఇండిగో నాలుగో సర్వీస్.. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్‌లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్‌ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది. -
స్పైస్‌జెట్ దివాలా పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటిషన్ ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ఏటీ) తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధి ంచిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను స్పైస్‌జెట్‌కు పంపినట్లు గానీ లేదా స్పైస్‌జెట్ వాటిని అందుకున్నట్లు గానీ దాఖలాలేమీ లేవని తెలిపింది. -
‘జెట్’ సిబ్బందికి కొత్త రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘బిల్లులు పేరుకుపోతున్నాయి. మా పిల్లల పాఠశాలల, కాలేజీల ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇక ఈఎంఐలు సరేసరి. మా పరిస్థితి భయానకంగా ఉంది. మా సహచరుల్లో కొంత మంది ఇప్పటికే 40 శాతం తక్కువ జీతాలకు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ జెట్ ఎయిర్వేస్ పైలట్ మీడియాతో వాపోయారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ జెట్ ఎయిర్వేస్ను తాత్కాలికంగా మూసివేయడంతో అందులో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు ఈ పరిస్థితి ఏర్పడింది. కొంత మంది సిబ్బంది 40 శాతం తక్కువకు ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారని చెబుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉద్యోగాలు దొరకడమే విశేషం. అంతకన్నా విశేషం ఏమిటంటే, జెట్ ఎయిర్వేస్ సిబ్బంది దుస్థితి గురించి తెలిసి అనేక స్టార్టప్, కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రత్యర్థి ఎయిర్వేస్ కంపెనీలు కూడా వారిని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి. చెన్నైలో ఉంటున్న ఓ చిన్నపాటి పుస్తకాల పబ్లిషర్ తన వద్ద రెండు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ఇవ్వాలని అనుకుంటున్నానని, తదుపరి వివరాలకు తనను సంప్రతించాల్సిందిగా మొట్టమొదట ట్వీట్ చేశారు. దాంతో స్టార్టప్‌లతో సహా పలు కార్పొరేట్ కంపెనీలు, పలు సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాను పదిమంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానని, వారు పీజీ చేసి పౌర సంబంధాల్లో ఉద్యోగం చేయడానికి వీలుగా వడ్డీరహిత రుణాలను కూడా ఇస్తానంటూ ఒకరు, తమది ఎక్స్‌ప్రెస్ ఇన్ ఇండియా డాట్‌కామ్ అని, ఇప్పటికే ఓ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉందంటే అది తమకు లాభించే అంశంగా పరిగణిస్తున్నామని, జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులయితే వారికి కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామంటూ మరొకరు ఆఫర్ ఇచ్చారు. ఇలా ఉద్యోగాలు ఆఫర్ చేసిన వారిలో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉదాహరణకు జెట్ మాజీ ఉద్యోగి అమిత్ బీ వధ్వానీ ముంబైలో ‘సాయి ఎస్టేట్ కన్సల్టెంట్స్’ నడుపుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు, అమ్మకాలు, కొనుగోళ్ల ఆడిట్ లెక్కలు, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తానంటూ ఆయన ఆఫర్ ఇచ్చారు. ఇక క్యూర్‌ఫిట్, బౌన్స్, స్టేఎబోడ్ అనే స్టార్టప్ కంపెనీల్లో 150 ఉద్యోగాలను జెట్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. అమెరికాలోని ‘వియ్ వర్క్ డాట్ కామ్’ కూడా ఆఫర్ ఇచ్చింది. మంచి అనుభవం ఉన్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను ప్రభుత్వ పౌర విమానయానంలోకి తీసుకుంటామని కేంద్ర పౌరవిమాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఏప్రిల్ 21వ తేదీన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటారో, లేదో తెలియదుగానీ, ఆయన హామీకి స్పందించిన ‘స్పైస్‌జెట్ ఎయిర్వేస్’ జెట్ ఎయిర్వేస్కు చెందిన వెయ్యి మంది సిబ్బంది వరకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. ఇంతగా మానవత్వం పరిమళిస్తుందంటే అది సోషల్ మీడియా పుణ్యమేనని చెప్పాలి! -
స్పైస్ జెట్ చొరవ : 500 మందికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస కార్యకలాపాలను మూసివేయడంతో రోడ్డునపడ్డ జెట్ ఎయిర్వెస్ ఉద్యోగుల విషయంలో మరో విమాన యాన సంస్థ స్పైస్ జెట్ సానుకూలంగా స్పందించింది. దాదాపు 500 మందికి ఉద్యోగాలను కల్పించినట్టు స్పైస్ జెట్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. భవిష్యత్తు నియామాకాల్లో జెట్ ఎయిర్వేస్ బాధిత ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడం విశేషం. "మేము ఇప్పటికే 100 కన్నా ఎక్కువ పైలట్లకు, 200 కన్నా ఎక్కువ క్యాబిన్ సిబ్బందికి , 200మందికిపైగా టెక్నికల్, ఇతర బ్బందికి ఉద్యోగాలు కల్పించాము" అని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో మరింత మందికి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రయాణీకుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్ నిలుపుదల ద్వారా ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసేందుకు వచ్చే రెండు వారాలలో 27 విమాన సర్వీసులను అదనంగా చేర్చనున్నామని సంస్థ ప్రకటించింది. మరోవైపు జెట్ విమానాలను నిలిపివేయడంతో విమాన సర్వీసుల క్రమబద్దీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా 440 స్లాట్లలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సహా స్థానిక విమానయాన సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం జెట్ వాటాల కొనుకోలుకు సంబంధించి బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు రుణ దాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ, ముంబై నగరాల్లో వందలాది మంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమను ఆదుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. -
34 శాతం కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేరు
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చివరకు మూసివేత దిశగా పయనిస్తున్న జెట్ ఎయిర్వేస్ స్టాక్మార్కెట్లో వరుసగా నష్టపోతోంది. తాత్కాలికంగా కార్యకాలాపాలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం బుధవారం వెల్లడించడంతో గురువారం నాటి మార్కెట్లో ఏకంగా 30శాతం నష్టపోయింది. అయితే నలుగురుబిడ్డర్లు వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారన్నఅంచనాలతో ప్రస్తుతం 26 శాతం నష్టంతో 179 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా మరోవైపు జెట్ ఎయిర్‌వేస సంక్షోభం నేపథ్యంలో ఇతర కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్ వివాదం నేపథ్యంలో మరో దేశీయ విమానాయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా విమాన సర్వీసులను పరిచయం చేస్తూ ఉండటంతో ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయి. 22 బోయింగ్ 737 ఎన్జీ విమానాలను ఇటీవల ప్రకటించింది. తాజాగా మరో 6 విమానాలను సర్వీసుల్లో దింపుతున్నట్టు వెల్లడించింది. దీంతో వరుసగా లాభపడుతూ ప్రస్తుతం 6 శాతం ఎగిసింది. అలాగే ఇండిగో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కౌంటర్లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది ఒక శాతానికిపైగా లాభాలతో కొనసాగుతోంది. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
ఎయిర్‌లైన్స్ న్యూ ఇయర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలతో నెట్టుకొస్తున్నప్పటికీ, పోటీ పరంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. నవంబర్ నెలలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11.03 శాతం పెరిగింది. 116.45 లక్షల మంది ప్రయాణికులు ఈ నెల్లో విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఈ వృద్ధి రేటు గత నాలుగేళ్ల కాలంలోనే అతి తక్కువ. అంతకుముందు అక్టోబర్ నెలలో ట్రాఫిక్ వృద్ధి 13.34 శాతంగా ఉంది. జెట్‌ఎయిర్‌వేస్: పరిమిత కాలం పాటు అమల్లో ఉండే విధంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ చార్జీలపై 30 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు టికెట్ బుకింగ్‌లపై ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవైపు, రానుపోను ప్రయాణాలకూ, బిజినెస్, ఎకానమీ తరగతుల టికెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు తగ్గింపు ధరలపై టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గో ఎయిర్: గో ఎయిర్ సంస్థ థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్‌లో వచ్చే నెల 10–13వ తేదీల మధ్య జరిగే యాట్ షో నేపథ్యంలో, ఫుకెట్ ప్రయాణ టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. భారత్ నుంచి ఫుకెట్‌కు నేరుగా విమాన సేవలను ప్రారంభిస్తున్న తొలి సంస్థ ఇదే. స్పైస్‌జెట్: హైదరాబాద్ నుంచి కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌కు జనవరి 1 నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, బాగ్డోగ్రా మధ్య ఎనిమిది సీజనల్ విమాన సర్వీసులను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 28 మధ్య నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి వివిధ గమ్యస్థానాలకు మొత్తం మీద 41 విమానాలను నడపనుంది. హైదరాబాద్– కోల్‌కతా మార్గంలో రూ.2,699కే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే, కోల్‌కతా–హైదరాబాద్ మార్గంలో రూ.3,199కే టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ఇక హైదరాబాద్–పుణె మధ్య రూ.2,499, రూ.2,209 ధరలను నిర్ణయించింది. హైదరాబాద్– కోయంబత్తూరుకు రూ.2,809, తిరుగు ప్రయాణ టికెట్‌ను రూ.2,309కే ప్రమోషనల్ ఆఫర్ కింద అందిస్తున్నట్టు స్పైస్‌జెట్ పేర్కొంది. -
స్పైస్‌జెట్ ఎయిర్ కార్గో సర్వీసులు
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయి ఎయిర్ కార్గో సర్వీసులను ప్రారంభించనుంది. స్పైస్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద ఈ ఎయిర్ కార్గో సర్వీసులను అందిస్తామని స్పైస్‌జెట్ సీఎమ్‌డీ అజయ్ సింగ్ చెప్పారు. పూర్తి స్థాయి ఎయిర్ కార్గో సేవలను అందిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని పేర్కొన్నారు.. బోయింగ్ 737–700 విమానాన్ని దీని కోసం వినియోగిస్తామని, ఇది 20 టన్నుల కార్గోను రవాణా చేయగలదని, తొలి సర్వీస్‌ను ఢిల్లీ నుంచి బెంగళూరుకు నిర్వహిస్తామని తెలిపారు. ఆరంభంలో గౌహతి, హాంకాంగ్, కాబూల్, అమృత్‌సర్‌లకు ఎయిర్ కార్గో సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు. తాజా పండ్లు, కూరగాయలను పశ్చిమాసియా ప్రాంతానికి రవాణా చేస్తామని వివరించారు. ఐదేళ్లలో ఎయిర్ కార్గో ట్రాఫిక్ 60 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్ కార్గో సర్వీసుల కోసం నాలుగు విమానాలను కేటాయిస్తామని, కెపాసిటీని రోజుకు 900 టన్నులకు పెంచుతామని తెలిపారు. తమ అనుబంధ వ్యాపార వృద్ధికి ఈ ఎయిర్‌కార్గో సర్వీసులు ఇతోధికంగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, రూపాయి పతనం, ముడిచమురు ధరల మంట నేపథ్యంలో మరో 2–3 నెలల్లో విమానయాన చార్జీలు పెరిగే అవకాశం ఉందని అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
బయో ఫ్యూయల్ విమానం- కీలక మైలురాయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం గాల్లోకి ఎగరడంతో రికార్డ్ నమోదైంది. బయో ఫ్యూయల్ ఆధారిత మొదటి విమానం దేశంలో టెస్ట్ ఫ్లైని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీలోని టెర్మినల్2లో బయో ఫ్యూయల్ విమానాన్ని రిసీవ్ చేసుకున్నామని పెట్రోలియం శాఖామంత్రి ధరేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ఇందుకు స్పైస్‌జెట్, ఏవియేషన్ అధారిటితోపాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, ఛత్తీస్‌గఢ్ బయో ఫ్యూయెల్ డెవలప్మెంట్ అథారిటీ ( సిబిడిఎ) డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) తదితరులకు అభినందనలు తెలిపారు. ఈ బయో మిషన్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా త్వరలోనే పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక కొత్త బయో-ఏటీఎఫ్‌పాలసీ తీసుకురానున్నామని వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను నియంత్రించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంలో భాగంగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, సురేష్ ప్రభు, హర్హవర్దన్, జయంత్ సిన్హా తదితరులు హాజరయ్యారు. జీవ ఇంధనంతో నడిచేవిమాన సర్వీసులను మన దేశంలో లాంచ్ చేయడం ఇదే ప్రథమం. కాగా అమెరికా, ఆస్ట్రేలియాలాంటిఅభివృద్ధి చెందిన దేశాలే వీటిని నిర్వహిస్తున్నాయి. పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. Taking our Biofuel mission forward @PetroleumMin will be bringing a new Bio- ATF Policy soon. pic.twitter.com/eJ6jjyCNoq — Dharmendra Pradhan (@dpradhanbjp) August 27, 2018 -
దేశీయ విమానాల బ్యాగేజీకి ఛార్జీల మోత
-
మూడో వంతుకు మహిళా పైలట్లు: స్పైస్ జెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ తాజాగా మహిళా పైలట్ల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆరంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం పైలట్లలో మహిళల వాటాను మూడో వంతుకు పెంచుకోవాలని స్పైస్‌జెట్ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 800 మంది పైలెట్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 140. బోయింగ్ 737, బొంబార్డియర్ క్యూ400 విమానాల కోసం మహిళా పైలట్లను నియమించుకుంటామని కంపెనీ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగుస్తుంది. ఇప్పటికే 175కు పైగా దరఖాస్తులు వచ్చాయని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ యువ మహిళా కెప్టెన్లు కాబుల్ వంటి క్లిష్టమైన ఎయిర్ఫీల్డ్స్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని సంస్థ డైరెక్టర్ శివాని సింగ్ కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పూర్తి మహిళా సిబ్బందితో ఉన్న మూడు ప్రత్యేక విమానాలను సంస్థ నడుపుతోంది. -
ఇదేంటో గుర్తుపట్టారా ?.. తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, చెన్నై : పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్‌వేను మూసివేశారు. సంబంధిత వార్త : టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్ -
రూ.769కే స్పైస్‌జెట్ ‘రిపబ్లిక్’ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీ మూడో అతిపెద్ద విమానయాన సంస్థ ‘స్సైస్‌జెట్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు దేశీ వన్‌వే ప్రయాణానికి రూ.769 ప్రారంభ ధరతో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే విదేశీ వన్‌వే ప్రయాణానికి రూ.2,469 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చు. జనవరి 25 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్ 12 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. -
'దావోస్‌లో మోదీ గ్రేట్ స్టోరీ చెప్పబోతున్నారు'
దావోస్ : ప్రపంచ ఆర్థిక వేదికపై (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) చెప్పడానికి ప్రధాని నరేంద్రమోదీ వద్ద గొప్ప కథ ఉందని, అది భారత్‌వైపు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ అన్నారు. ఆ కథను నరేంద్రమోదీ కంటే ఎవరు కూడా గొప్పగా చెప్పలేరని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణలు అయిన జీఎస్టీ, డిజిటలైజేషన్, పెద్ద నోట్ల రద్దువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రపంచ వేదికపై వివరించబోతున్నారన్నారు. ప్రపంచంలో మరే దేశ నేతకు లేనంత అవకాశం మోదీకి ఉందని, ఆయన మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని చెప్పారు. సంస్కరణల భారతం, 1.4బిలియన్ల భారతీయులు, యువ జనాభా, ప్రపంచానికి భారత్ అతిపెద్ద మార్కెట్వంటి అంశాలన్నీ కూడా మోదీ ప్రస్తావించనున్నారన్నారు. ప్రపంచ దేశాల అధినేతలతోపాటు ప్రధాని మోదీ కూడా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ప్రసంగించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌కు చెందిన ఓ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇది భారత్‌కు అతి ముఖ్యమైన కార్యక్రమంగా నిలవనుంది. 'గత ఏడాది జీ జిన్‌పింగ్‌ను చూసినప్పుడు మనందరి ఫోకస్ చైనాపైనే ఉంది. కానీ, ఈసారి మాత్రం దృష్టి అంతా భారత్‌పైనే' అని అజయ్ సింగ్ చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ఫోరం సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. మంగళవారం ఫోరం అధికారిక సెషన్స్‌లో ఆయన ప్రసంగిస్తారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషంగా చెప్పవచ్చు. చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నింటికి కూడా భావి ఆర్థిక అవకాశాలు కూడా దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికపైనే ఆవిష్కృతమవుతాయనీ అంటుంటారు. -
బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
ముంబై: కెనడాకు చెందిన బంబార్డియర్ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది. 50 బంబార్డియర్ క్యూ400 విమానాలను కొనుగోలు చేయనున్నట్టు స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ గతంలో పారిస్ ఎయిర్‌షో సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదిరినందుకు గర్వంగా ఉందని, ఈ ఆర్డర్‌తో వేగంగా వృద్ధి చెందుతున్న బారత మార్కెట్లో క్యూ400 విమానాల ప్రాతినిధ్యం పెరగనుందని బంబార్డియర్ వాణిజ్య విమానాల ప్రెసిడెంట్ ఫ్రెడ్ క్రోమర్ వ్యాఖ్యానించారు. 90 మంది ప్రయాణించే మోడల్‌ను కూడా విడుదల చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతానికి స్పైస్‌జెట్ నిర్వహణలో 78 సీట్ల సామర్థ్యంగల క్యు400 మోడల్ విమానాలు 20 ఉన్నాయి. వీటితోపాటు బోయింగ్ 737 మోడల్ విమానాలు 35 వరకు ఉన్నా యి. తాజా కొనుగోలు ఆర్డర్ ప్రాంతీయ మార్గాల్లో అనుసంధానత పెంచేందుకు దోహదపడుతుందని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ పేర్కొన్నారు. -
బరువు 15 కేజీలు దాటితే బాదుడే బాదుడు!
- చెకిన్ బ్యాగేజీ చార్జీలను పెంచనున్న స్పైస్‌జెట్ - డీజీసీఏ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడంతో ముందుకు.. న్యూఢిల్లీ: తక్కువ ధరలకే విమానయాన సేవలు అందిస్తోన్న స్పైస్‌జెట్ సంస్థ ఇక.. చెకిన్ బ్యాగేజీపై భారీ రుసుము వసూలుచేయనున్నట్లు తెలిసింది. విమానాల్లో చెకిన్ లగేజీ బరువు 15 కేజీలు దాటితే.. ఒక్కో అదనపు కేజీకి రూ.300 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రైవేటు విమానయాన సంస్థల చెకిన్ బ్యాగేజీ చార్జిలను నియంత్రిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఒక్కో విమాన ప్రయాణికుడు 15 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆపై ఒక్కో కేజీపై రూ.100 మాత్రమే అదనంగా తీసుకోవాలని పేర్కొంది. తమకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్(ఎఫ్ఐఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విధించే చార్జీలను నియంత్రించే అధికారం డీజీసీఏకు లేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సమగ్ర విచారణ అనంతరం డీజీసీఏ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రైవేట్ సంస్థలు బ్యాగేజీలపై చార్జీలు పెంచేందుకు ఆటంకాలు తొలిగిపోయినట్లయింది. అందరికంటే ముందు స్పైస్ అదనపు చార్జీలను ప్రకటించే వీలుంది. ఇక ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మాత్రమే 23 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లేవీలుంది. -
స్పైస్ జెట్ లాభం 16శాతం అప్
న్యూఢిల్లీ: ఏవియేషన్ కంపెనీ స్పైస్ జెట్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16 శాతం వృద్ధిచెంది రూ. 149 కోట్ల నుంచి రూ. 173 కోట్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,544 కోట్ల నుంచి రూ. 1,890 కోట్లకు చేరింది. ఫలితాల సందర్భంగా స్పైస్ జెట్ షేరు 5 శాతం పతనమై రూ. 119 వద్ద ముగిసింది. -
బాలునికి అస్వస్థత.. విమానం వెనక్కి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలుడు తీవ్ర అస్వ స్థతకు గురయ్యాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. స్పైస్ జెట్ విమానం విశాఖ నుంచి మంగళవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరింది. కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఊపిరందక విల విల్లాడిపోయాడు. బాలుడి తల్లి ఆందోళ నకు గురికావడంతో విమానాన్ని తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. ఈలోగా విమానా శ్రయంలో అప్రమత్తమైన వైద్య బృందాలు బాలుడికి ప్రాథమిక వైద్యమందించాయి. ఆస్తమా కారణంగా బాలుడు ఇబ్బంది పడి నట్టు వైద్యులు తేల్చారు. దీంతో తల్లీకొడు కులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో విమానం విశాఖ నుంచి రాత్రి 10.15 గంటలకు తిరిగి బయల్దేరింది. -
సుప్రీంకోర్టులోనూ స్పైస్‌జెట్‌కు చుక్కెదురు
► ఢిల్లీ హైకోర్టు తీర్పునకు సమర్థన ► మారన్‌తో షేర్ల కేటాయింపు వివాదం ► రూ.579 కోట్లు డిపాజిట్ చేయాలని లోగడ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. స్పైస్‌జెట్‌కు, ఆ సంస్థ పూర్వపు యజమాని కళానిధి మారన్‌కు మధ్య షేర్ల కేటాయింపు విషయమై నెలకొన్న వివాదంలో రూ.579 కోట్లు డిపాజిట్ చేయాలంటూ గత నెలలో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పైస్‌జెట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను స్పైస్‌జెట్‌తోపాటు దాని అధినేత అజయ్‌సింగ్ దాఖలు చేశారు. గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు స్పైస్‌జెట్, అజయ్ సింగ్ సవాల్ చేయగా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. నిలబడని వాదనలు: ఈ వివాదంపై తొలుత ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్‌ను ఆశ్రయించింది సన్‌టీవీ గ్రూపు చీఫ్ కళానిధి మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్. కళానిధి మారన్, కేఏఎల్ ఎయిర్వేస్ 2015లో స్పైస్‌జెట్‌లో ఉన్న తమ యాజమాన్య వాటా 58.46 శాతం (350,428,758 షేర్లు)ను అజయ్‌సింగ్‌కు బదలాయించారు. ఈ సందర్భంగా కుదుర్చుకున్న విక్రయ ఒప్పందం ప్రకారం... సంస్థ నిర్వహణ ఖర్చులు, రుణాల చెల్లింపుల కోసం తాము అందించిన రూ.579 కోట్ల నిధుల సాయానికి స్పైజ్‌జెట్ యాజమాన్యం రిడీమబుల్ స్టాక్ వారెంట్లను జారీ చేయాల్సి ఉండగా అందులో విఫలమైందని మారన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రూ.579 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. షేర్ల బదిలీ వివాదాన్ని తేల్చేందుకు ఓ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే, మారన్ నిర్వహణలో ఉండగా పోగుబడిన రూ.2,000 కోట్ల నష్టాల బాధ్యత మారిన యాజమాన్యంపై పడిందని, ప్రతీ పైసా కూడా అప్పులు చెల్లించడానికి, సంస్థ నిర్వహణకే వినియోగించినట్టు స్పైస్‌జెట్ విచారణలో భాగంగా కోర్టుకు తెలియజేసింది. ఫలితం లేకపోవడంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై స్పైజ్‌జెట్, అజయ్‌సింగ్ డివిజెన్ బెంచ్‌ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ సైతం రూ.579 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమన్న స్పైస్‌జెట్ వాదన చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. కాకపోతే రెండు విడతలుగా రూ.579 కోట్లు డిపాజిట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. -
రూ.2కే ‘స్పైస్’జెట్!
టిక్కెట్టు కాదండీ... కంపెనీయే జాక్‌పాట్ కొట్టేసిన అజయ్ సింగ్ ♦ చరిత్రలో అత్యంత చౌకగా చేతులు మారిన లిస్టెడ్ కంపెనీ ఇదే ♦ 15 రోజుల్లోనే యాజమాన్య హక్కుల బదలాయింపు ♦ స్టాక్ మార్కెట్లకు ధర వెల్లడించకుండానే డీల్ పూర్తి ♦ రెండున్నరేళ్ల తర్వాత కోర్టు జోక్యంతో వెలుగులోకి (న్యూఢిల్లీ) రెండు రూపాయలకు ఏం వస్తాయో ఒకసారి ఠక్కున చెప్పండి చూద్దాం.. పిప్పర్మెంటో, చాక్లెట్టో తప్ప మరే భారీదీ గుర్తుకురావడం లేదు కదా!! అలాంటిది .. బోలెడన్ని విమానాలు, ఆస్తులు.. (అఫ్కోర్స్ అప్పులు కూడా ఉన్నా) ఒక పెద్ద విమానయాన కంపెనీ రెండే రూపాయలకు అమ్ముడైపోయిందన్న సంగతి మీకు తెలుసా!! ఆ కంపెనీ మరేదో కాదు.. స్పైస్జెట్టే!! అంత చౌకగా దాన్ని దక్కించుకున్నది ఆ కంపెనీ ఒకప్పటి వ్యవస్థాపకుడు, ప్రస్తుత చైర్మన్ అజయ్ సింగ్. సుమారు రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను అప్పట్లో మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్. కంపెనీని నిలబెట్టారు. క్రమంగా మళ్లీ లాభాల బాట పట్టించారు. అయితే, స్పైస్‌జెట్‌ను మారన్ల నుంచి కొనుగోలు చేసేందుకు సింగ్ ఎంత చెల్లించారన్నది తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు!! అవును! అక్షరాలా రెండే రూపాయలు!! దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు. 2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు!!. కానీ.. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బయటికొచ్చిన ఈ విషయాలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది. బయట పడిందిలా.. అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్ల డించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. నిజానికి ఈ డీల్ విలువ రూ.2 అని అప్పట్లో మార్కెట్లో తెలిస్తే చరిత్ర వేరే విధంగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే కేవలం రెండ్రూపాయలకు స్పైస్‌జెట్‌ను ప్రమోటర్ విక్రయించేశారంటే దానికి విలువ లేదనేగా అర్థం!! అపుడు ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్ముకుని బయటపడటానికి ప్రయత్నించి ఉండేవారు. అదే జరిగితే షేరు ధర కుప్పకూలేది. కానీ డీల్ విలువ బయటపడకపోవటంతో సింగ్ చేతుల్లోకి కంపెనీ వెళ్తోందని తెలిసిన దగ్గరి నుంచీ షేరు ధర పెరగటం మొదలెట్టింది. డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న దరిమిలా ఈ సమాచారం బయటికొచ్చింది. దీన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి. అప్పులు, నష్టాల నుంచి లాభాల్లోకి .. ప్రస్తుతం మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న స్పైస్‌జెట్... సుమారు రెండున్నరేళ్ల క్రితం 2014 డిసెంబర్లో నిధుల కటకటతో మూసివేత అంచున నిలబడింది. బాకీలు కట్టలేక చేతులెత్తేసింది. 2014–15లో కంపెనీ నష్టం రూ.687 కోట్లు. అదే ఏడాది నికర విలువ కూడా తుడిచిపెట్టుకుపోయి మైనస్ రూ.1,329 కోట్లకు పడిపోయింది. మొత్తం రుణ భారం రూ.1,418 కోట్లు కాగా, స్వల్పకాలిక వ్యవధుల కోసం తీసుకున్న రుణాలు రూ. 2,000 కోట్ల మేర ఉండేవి. కంపెనీని గట్టెక్కించే వ్యూహాత్మక ఇన్వెస్టర్ల కోసం ప్రమోటర్ మారన్ కుటుంబం అన్వేషించింది. చివరికి సింగ్ ముందుకొచ్చి కంపెనీని టేకోవర్ చేశారు. నష్టాలకు అడ్డుకట్ట వేసి మళ్లీ క్రమంగా లాభాల్లోకి మళ్లించారు. ఓపెన్ ఆఫర్ మినహాయింపు...! సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థను టేకోవర్ చేసి, యాజమాన్య హక్కులు దక్కించుకునేవారు కచ్చితంగా మిగతా పబ్లిక్ షేర్హోల్డర్లకు వైదొలిగే వెసులుబాటు కల్పిస్తూ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. కానీ స్పైస్‌జెట్ కేసులో మాత్రం ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937 కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్... 26% ఓపెన్ ఆఫర్ నుంచి సింగ్‌కు అసాధారణంగా మినహాయింపునిచ్చింది. సెబీని కాదని ఇలా మినహాయింపునిచ్చే హక్కు ఉందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. -
స్పైస్‌జెట్ కొత్త సర్వీస్‌కి శ్రీకారం
విజయవాడ–హైదరాబాద్ మధ్య జూలై ఒకటి నుంచి ప్రారంభం విమానాశ్రయం(గన్నవరం): గన్నవరం ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పైస్‌జెట్ సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు రెండు, బెంగళూరు మూడు, చెన్నైకు ఒక సర్వీసును నడుపుతోంది. జూలై 1 నుంచి హైదరాబాద్‌కు అదనంగా మూడో సర్వీసును ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన క్యూ–400 విమానం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.05కు బయలుదేరి రెండు గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 2.40కి గన్నవరం నుంచి బయలుదేరి 3.30కి హైదరాబాద్ చేరుతుంది. -
విశాఖ- హైదరాబాద్‌కు మరో విమాన సర్వీస్
విశాఖపట్నం: హైదరాబాద్-విశాఖ నగరాల మధ్య మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఓ సర్వీసు అందిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తాజాగా జూలై 1 నుంచి మరో సర్వీసు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ విమానం హైదరాబాద్‌లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి అదే రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది. ఇక్కడి నుంచి రాత్రి 8.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు అదేరాత్రి రాత్రి 10.15 గంటలకు చేరుతుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. -
విహంగంలో పర్యాటక ప్రచారం
- వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన పర్యాటక శాఖ - స్పైస్ జెట్ విమానానికి రాష్ట్ర టూరిజం స్టిక్కర్లు - ఆవిష్కరించిన మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించేందుకు విమానాలను సాధనంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా కార్పొరేట్ తరహాలో స్పైస్ జెట్ బోయింగ్ 737 0800 విమానానికి రాష్ట్రంలోని చారిత్రక అందాలను అద్దింది. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జీఎంఆర్, స్పైస్‌జెట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమానంపై అతికించిన రాష్ట్ర టూరిజం ప్రాంతాల చిత్రాలు, శాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయని, వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చందూలాల్ చెప్పారు. గోవా, కేరళ రాష్ట్రాలకు ఒక్క టూరిజం ద్వారానే 70 శాతం ఆదాయం వస్తోందని, మన రాష్ట్రంలోనూ పర్యాటక, చారిత్రక ప్రాంతాలకు కొదవ లేదన్నారు. ఎన్నెన్నో ‘చిత్రాలు’..: స్పైస్ జెట్ విమా నం బయట ఒకవైపు చౌమొహల్లా, ఫలక్నుమాప్యాలెస్లు మరోవైపు సెవెన్ టూంబ్స్, గోల్కొండ చిత్రాలు ఏర్పాటు చేశారు. విమానంలోని 189 సీట్ల వెనుక రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల చిత్రాలు అంటించారు. వీటిని అమెరికాలో తయారు చేయించారు. లోపల పర్యాటక ప్రాంతాల డిస్ప్లే ఉంటుంది. ఈ ప్రచారం 2 నెలలు సాగుతుంది. విమానం స్టిక్కర్లు అంటించిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45కి వారణాసి వెళ్లింది. 2 నెలలకు అద్దె రూ.50 లక్షలు. ఈ విమానం పర్యాటక ప్రచారం కోసం దేశంలోని ప్రాంతాలు, ఇతర దేశాల్లోనూ తిరుగుతుంది. దేశ, విదేశాల్లోని ప్రజలకు అవగాహన... రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ.. దేశ, విదేశాల్లోని ప్రజలకు తెలంగాణ పర్యాటక, చారిత్రక కట్టడాలపై అవగాహన కోసమే ఈ ప్రయత్నమన్నారు. ఇటీవల మిజోరంతోపాటు పలు రాష్ట్రాల్లో రోడ్ షోలు నిర్వహిస్తే, తెలంగాణ అంటే ఎక్కడుందని అక్కడి ప్రజలు ప్రశ్నించారన్నారు. మన టూరిస్టు ప్రాంతాలకు ప్రచారం అవసరమని అప్పుడే భావించామన్నారు. స్పైస్ జెట్ విమానం రోజుకు 10 నుంచి 15 విమానాశ్రయాల్లో ల్యాండ్ అవుతుందని, తద్వారా తెలంగాణ కీర్తి నలు దిశలా వ్యాపిస్తుందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. శాఖ కమిషనర్ సునీతాభాగవత్, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెండ్ ఛోంగ్తూ, ఈడీ మనోహర్ పాల్గొన్నారు. -
కూర్చునే జాతీయగీతం వినాల్సి వచ్చింది..
ఇండోర్: విమానాల్లోని ప్రయాణీకులంతా సీట్లలో కూర్చుని ఉండగానే స్పైస్ జెట్ విమానంలో జాతీయ గీతం వినాల్సి వచ్చింది. గీతం అంటే మర్యాద లేదని కాదుగానీ లేవలేని పరిస్థితి. దీంతో తమ సీట్లలో అలాగే స్థూలాకారంగా ఉండి జాతీయ గీతం వింటూ ఆలపించారు. ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థపై పునీత్ తివారీ అనే ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా జాతీయ గీతం వచ్చిందని, గౌరవార్థం లేచి నిల్చుందామంటే అందుకు తగిన పరిస్థితి లేకుండా పోయిందని, పైగా నిల్చోవద్దని ఆదేశించారని, అందుకు సదరు విమాన సంస్థే కారణం అంటూ అందులో పేర్కొన్నారు. స్పైస్ జెట్‌కు చెందిన విమానం ఎస్జీ 1044 ఈ నెల (ఏప్రిల్) 18న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తూ ల్యాండ్ అయ్యే ముందు జాతీయ గీతాన్ని ప్లే చేసింది. కానీ, విమానంలోని సిబ్బందిగానీ, ప్రయాణీకులుగానీ లేవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం వారిని బంధించి ఉంచిన సీటు బెల్టులు. ‘ఓపక్క జాతీయ గీతం వస్తుండగా మమ్మల్ని సీట్లో నుంచి లేవోద్దంటూ పైలట్ ఆదేశించాడు. అతడి ఆదేశాలను మేం బలవంతంగా పాటించాల్సి వచ్చింది. పైగా జాతీయ గీతం వస్తుండగానే మధ్యలో ఒకసారి ఆపేసి కొద్దిసేపు ఆపి మళ్లీ ప్లే చేశారు’ అని ఆయన ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై స్పైస్ జెట్ అధికారిక ప్రతినిధి వివరణ ఇస్తూ విమానంలో తమ సిబ్బంది పొరపాటువల్ల అనూహ్యంగా జాతీయ గీతం ప్లే అయిందని, అయితే, వెంటనే తాము ఆపేశామని, ఈ విషయంలో ప్రయాణీకులకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. -
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం
గన్నవరం: గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. లోపాన్ని గుర్తించిన పైలెట్ విమానాన్ని గన్నవరంలోనే నిలిపివేశాడు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటివరకు బయల్దేరలేదు. రాత్రి 9 గంటలకు బయల్దేరే అవకాశం ఉందని విమానాశ్రయం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి మూడు గంటలుగా 60 ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్‌లో విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం స్పైస్‌జెట్ విమానం తిరుపతి బయలుదేరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పెలైట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే తిరిగి సురక్షితంగా కిందకు దించాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేసిన విమానాశ్రయ అధికారులు స్పైస్‌జెట్‌లో తలెత్తిన లోపాలను సరిచేస్తున్నారు. -
హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి స్పైస్‌జెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్.. ప్రతి రోజూ హైదరాబాద్, జైపూర్‌ల నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసులను నడపనుంది. టికెట్ ధరలు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు ఒకవైపు ప్రయాణానికి రూ.7,999, జైపూర్ నుంచి రూ.6,499లుగా నిర్ణయించినట్లు సోమవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్ బుకింగ్‌లను ప్రారంభించామని ఫిబ్రవరి 16 నుంచి ఈ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పేర్కొంది. జైపూర్-దుబాయ్ మధ్య తొలి డెరైక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన తొలి ప్రైవేట్ ఎయిర్‌లైన్ స్పైస్జెట్టే. -
స్పైస్ జెట్ సిబ్బంది ఆందోళన
-
స్పైస్ జెట్ సిబ్బంది ఆందోళన
బోనస్ సమస్య పరిష్కరించాలంటూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ సిబ్బంది శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఉదయం దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలు దేరాల్సిన 6 స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా బయలు దేరాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గంటల తరబడి ప్రయాణికులు ఎయిర్ పోర్టులో వేచి చూడాల్సి వచ్చింది. విమాన సర్వీసు తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడ-చెన్నై-బ్యాంకాక్ స్పైస్‌జెట్ కనెక్టడ్ ఫ్లైట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మరిన్ని ప్రాంతాలకు సర్వీసులకు విస్తరిస్తోంది. బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడతో సహా మరో ఆరు దక్షిణాది పట్టణాల నుంచి చె న్నైకి కనెక్టడ్ సర్వీసులను ఏర్పాటు చేసింది. స్పైస్‌జెట్ డిసెంబర్ 10 నుంచి చెన్నై-బ్యాంకాక్ డెరైక్ట్ సర్వీసులను (వారంలో ఆరు రోజులు) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత సీట్లకు టికెట్ ధరను రూ.9,999గా (రిటర్న్ టికెట్‌తో సహా) నిర్ణయించింది. బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడ, కోజీకోడ్, ట్యుటికోరిన్, బెంగళూరు, మదురై, కోయంబత్తూరు, కొచ్చి ప్రాంతాల నుంచి చెన్నైకి, మళ్లీ చెన్నై నుంచి అదే ప్రాంతాలకు తిరిగి విమాన సర్వీసులను కంపెనీ నడుపుతోంది. సీట్ల బుకింగ్‌ను ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా భాటియా తెలిపారు. స్పైస్‌జెట్ ఈ నెల 15 నుంచి అమృత్సర్ (పంజాబ్), కోజికోడ్ (కేరళ) నుంచి దుబాయ్‌కు సర్వీసులను ప్రారంభించనుంది. -
100 విమానాలు కొంటున్న స్పైస్‌జెట్
♦ బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు ♦ విలువ 11 బిలియన్ డాలర్లు! న్యూఢిల్లీ : దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్‌వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఆర్డర్లు ఇచ్చేందుకు 3-6 నెలల సమయం పట్టొచ్చని కోటేశ్వర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన 42 బోయింగ్ మ్యాక్స్ జెట్ల డెలివరీ 2018 నుంచి ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. విమానాల కొనుగోలు డీల్ విలువ సుమారు రూ. 70,500 కోట్లు (11 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన స్పైస్‌జెట్ వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం రూ. 72 కోట్లు. అంతక్రితం ఇదే వ్యవధిలో సంస్థ రూ. 124 కోట్ల నష్టం చవిచూసింది. ప్రస్తుతం సంస్థ వద్ద 34 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. గతేడాది రూ. 26,000 కోట్లు విలువ చేసే 42 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. -
విశాఖ నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. దీన్ని స్పైస్‌జెట్ విమానసంస్ధ అక్టోబరు 25 నుంచి అందించనున్నట్లు ఆసంస్ధ వర్గాలు వెల్లడించాయి. విశాఖ నుంచి ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్ధలు ఢిల్లీకి విమాన సర్వీసులు అందిస్తున్నాయి. -
స్పైస్‌జెట్ హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కలర్ ద స్కైస్ పేరుతో తాజాగా మరో డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో కనిష్టంగా రూ.1,699కు, అంతర్జాతీయ రూట్లలో రూ.3,799కు (అన్ని చార్జీలు కలుపుకొని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ చార్జీలకు లక్ష సీట్లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవ్లి పేర్కొన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన బుకింగ్స్ గురువారం (రేపు-ఈ నెల 26) వరకూ ఉంటాయని, వచ్చే నెల 1 నుంచి ఏప్రిల్ 20 వరకూ చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ప్రయాణికులు హోలీ పండుగ పర్యాటక ప్రణాళికలకు ఈ ఆఫర్ మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ ఆఫర్లో భాగంగా హైదరాబాద్-విజయవాడ, బెంగళూరు-హైదరాబాద్, ఢిల్లీ-డెహ్రాడూన్, గౌహతి-కోల్‌కతా, అహ్మదాబాద్-ముంబై రూట్లలో విమాన టికెట్లను రూ.1,699కే అందిస్తున్నామని వివరించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం పాత ప్రమోటర్ అజయ్ సింగ్ చేతికి వచ్చిన ఒక్కరోజు తర్వాత తాజా ఆఫర్ రావడం విశేషం. స్పైస్‌జెట్ నుంచి ఈ ఏడాది ఇది ఐదో ఆఫర్. మళ్లీ ప్రమోటర్‌గా అజయ్‌సింగ్ స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్, కాల్ ఎయిర్‌వేస్‌లకు ఉన్న మొత్తం 56.4 శాతం వాటా(35,04,28,758 ఈక్విటీ షేర్లు), పాత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ అయింది. ఈ వాటా బదిలీతో ఇప్పుడు స్పైస్‌జెట్ యాజమాన్యం అజయ్‌సింగ్‌కు దక్కింది. కాగా, స్పైస్‌జెట్ రూ.100 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత)బకాయిలను చెల్లించినట్లు సమాచారం. ఎయిర్కోస్టా కూడా...హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ. 999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన కంపెనీ అయిన ఎయిర్కోస్టా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవైపు టికెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. రూ.999కే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, రూ.1,999తో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి, అలాగే రూ.1,499తో హైదరాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నం నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నానికి వెళ్లొచ్చు. ఈనెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎకానమీ టికెంట్ బుకింగ్స్ పైనే అది కూడా పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి. మార్చి 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ తేదీలుగా నిర్ణయించింది. -
ఆకాశాన్ని తాకుతున్నాయి..
విమానాలకు సంక్రాంతి డిమాండ్ ఫిబ్రవరి ఒకటి వరకూ టికెట్ చార్జీల మోత గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం లో సంక్రాంతి సందడి ఫుల్లుగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర ప్రజలకు కేంద్రం గా వుండడంతో విమానాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విశాఖ నుంచి ఇండిగో, ఎయిర్‌కోస్తా, ఎయిరిండియా, స్పైస్ జెట్ విమాన సర్వీసులు వున్నా యి. ఈనెల 11 వరకూ సా ధారణంగా వున్న విమాన చార్జీలు సోమవారం నుంచి అమాంతంగా పెరిగిపోయాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టే వచ్చే వారి సంఖ్య టికెట్ల డిమాండ్‌ని బట్టి తెలుస్తోంది. విశాఖ నుంచి చెన్నైకి వెళ్లే విమాన సర్వీసులకు బాగా డిమాండ్ కనిపించింది. సోమవారం నాటి టికెట్ చార్జీ రూ.6942 ఉంటే బుధవారానికి దాని రేటు రూ.9440, ఈ నెల 21నాటికి రూ.10,642 పలికింది. ఇలా 23నాటికి రూ.9281 ఉన్నా తర్వాత నుంచి చార్జీలు తగ్గాయి. అదే చెన్నై నుంచి విశాఖకూ విమాన ఛార్జీల మోత ఎక్కువగానే వుంది. 12న టికెట్ చార్జి 2999 వుంటే, 13నుంచి రూ 7523, 14 న రూ7610 పలికింది. తర్వాత 19నాటికి టికెట్ ఛార్జి రూ 9441 వుంది. తర్వాత నుంచి కాస్త డిమాండ్ తగ్గింది. రూ 3114 నుంచి చార్జీలు వున్నాయి. ఇదిలా వుంటే...విశాఖ నుంచి హైదరాబాద్‌కి సాధారణంగా రూ1558 నుంచి 2804 వరకూ వుండే విమాన చార్జి సోమవారం 4802 వుంది. ఈనెల16నాటికి రూ 5326, 18న రూ. 6818 రేటు వుంది. విశాఖ నుంచి ఢిల్లీకి సాధారణంగా నాలుగు వేలుంటే...ఇపుడు రూ 14982 పలుకుతోంది. ఫిబ్రవరి ఒకటి వరకూ డిమాండ్ వుంది. విశాఖ నుంచి బెంగుళూరుకి ఈనెల12న 4725 వుంటే...13న రూ. 6142, 15న 8086, 17న రూ11,403, 18న రూ13,502 పలికింది. అలాగే తిరుపతికి వెళ్లే యాత్రికులూ ఈనెలలో ఎక్కువగానే వున్నారు. సోమవారం నాటి చార్జి 5987 వుంటే 18న మాత్రం రూ 7464 వుంది. 26న రూ.8599...ఇలా ఫిబ్రవరి 8నాటికి రూ.3015 వుంది. మొత్తంమ్మీద ఫిబ్రవరి ఒకటి వరకూ విమానాల రద్దీ వుందని విమాన సంస్ధలు చెబుతున్నాయి. ఈనెల 18 వరకూ విపరీతమయిన డిమాండ్ వుందని..పలు విమాన సర్వీసులకయితే టికెట్లే లేవని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా వుంటే ట్రావెల్ ఏజెంట్లకు ఈడిమాండ్ పంటపడుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ని బట్టి రెట్టింపు చార్జిలు చెబుతున్నారు. ఈనెల 18న చెన్నైకి వెళ్ల డానికి రూ టికెట్ చార్జీ రూ20 వేలు వుందంటే విమాన ప్రయాణికుల తాకిడి ఎలా వుందో తెలుస్తోంది. -
ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్... సర్వీసుల పునరుద్ధరణకు వీలుగా రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రణాళిక ఆమోదంపై తుది నిర్ణయం తీసుకునేముందు సంబంధిత చమురు కంపెనీలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సర్వీసుల పునరుద్ధరణ దిశలో స్పైస్‌జెట్ ఇప్పటికే పౌర విమానయాన శాఖకు ప్రణాళికను అందజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రుణ చెల్లింపులకు వీలుగా 15-30 రోజులపాటు గడువు ఇవ్వాల్సిందిగా చమురు కంపెనీలను కోరినట్లు తెలిపాయి. కాగా, మరోపక్క కంపెనీ తొలి ప్రమోటర్ అజయ్ సింగ్ అమెరికాకు చెందిన రెండు ప్రయివేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ప్రతినిధులను కంపెనీ బోర్డులోకి తీసుకురావాలన్నది అజయ్ ప్రణాళిక. రూ. 1,230 కోట్లకు బకాయిలు..: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బకాయిలు డిసెంబర్ 10కల్లా రూ. 1,230 కోట్లకు చేరాయి. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు 18 రోజుల్లో రూ. 990 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు ఎగశాయి. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ లోక్‌సభలో వెల్లడించారు. -
స్పైస్‌జెట్‌కు లభించని ఊరట
తక్షణ ఆర్థిక సాయం ఆర్ధించిన సంస్థ హామీ ఇవ్వని పౌర విమానయాన శాఖ న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, సమస్యల్లో కూరుకుపోయిన సన్గ్రూప్కు చెందిన స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. తక్షణం తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ స్పైస్‌జెట్ అధికారులు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్.ఎల్. నారాయణన్ తదితర కంపెనీ ఉన్నతాధికారులు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసి తక్షణం తమను ఆదుకోవాలని విజ్నప్తి చేశారు. అయితే వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఇలాంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు పై స్థాయిలో తీసుకుంటారని శర్మ పేర్కొన్నారు. స్పైస్‌జెట్ అంశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి, పెట్రోలియం, ఆర్థిక మంత్రి త్వ శాఖలకు నివేదించామని తెలిపారు. స్పైస్‌జెట్ రుణ భారం రూ.2,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ సంస్థ సాఫీగా కార్యకలాపాలు నిర్వహించాలంటే తక్షణం రూ.1,400 కోట్లు అవసరం. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ మొత్తం 1,861 సర్వీసులను రద్దు చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.310 కోట్ల నష్టాన్ని పొందింది. అంతకు ముందటి క్వార్టర్ నష్టాల(రూ.559 కోట్లు)తో పోల్చితే ఇది తక్కువే. ఈ సంస్థకు నష్టాలు రావడం ఇది వరుసగా ఐదో క్వార్టర్. -
1800 సర్వీసులను రద్దు చేసిన స్పైస్‌జెట్
చెన్నై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుత నెలకు సంబంధించి 1,800 సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 31 వరకూ నేపాల్‌లోని ఖాట్మండు, తదితర పలు నగరాలకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 81 సర్వీసులు సోమవారం(8)నాటివే కావడం గమనార్హం. కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బకాయిలకు సంబంధించి రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోతే బుధవారానికల్లా క్యాష్ అండ్ క్యారీ ప్రాతిపదికన మాత్రమే కార్యకలాపాలను అనుమతించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) ఇప్పటికే నిర్ణయించింది. కాగా, మరోవైపు ముందస్తు(అడ్వాన్స్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉంది. ఈ బాటలో నెల రోజులకుమించి టికెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ ఇప్పటికే డీజీసీఏ కంపెనీని ఆదేశించింది. ఈ పరిణామాల వల్ల కంపెనీ లెసైన్స్ వెంటనే ప్రమాదంలో పడే అవకాశం లేనప్పటికీ, వివిధ సమస్యలు చుట్టుముట్టవచ్చునని నిపుణులు వ్యాఖ్యానించారు. -
499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!
విమాన ప్రయాణికుల మీద విమానయాన సంస్థలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 16 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే.. ఈ ధరలలో ఇంధన సర్‌ఛార్జి కలిసి ఉన్నా, ఇతర పన్నులు, ఫీజులను మాత్రం ఆ రోజుకు ఎంత ఉంటే అంత చొప్పున ప్రయాణికులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం భారతదేశంలో చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ రద్దు చేసినా ఆ సొమ్ము తిరిగి ఇవ్వరు, అలాగే ప్రయాణ తేదీ కూడా మార్చరు. మరోవైపు బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా కూడా మరో ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలిపి వివిధ మార్గాల్లో ప్రయాణాలకు రూ. 1290కే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్లను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. -
మధురపూడి-హైదరాబాద్‌ల నడుమ మరో సర్వీసు
మధురపూడి: మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం - హైదరాబాద్ నడుమ మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు విమానాశ్రయాల మధ్య ఒక సర్వీసును నడుపుతున్న స్పైస్ జెట్ సంస్థ వచ్చే నెల ఒకటి నుంచి మరో సర్వీసును నడపనుంది. కొత్త సర్వీసు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మధురపూడి చేరుకుని, తిరిగి 3.25 గంటలకు బయలుదేరుతుందని స్పైస్‌జెట్ స్థానిక మేనేజర్ అనిల్ నారాయణ శుక్రవారం తెలిపారు. టిక్కెట్ రూ. 2,200 నుంచి ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే సర్వీసులకు కనెక్టింగ్‌గా ఉండే ఈ సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇప్పటివరకూ మధురపూడి -హైదరాబాద్ మధ్య మూడు సర్వీసులు నడుస్తున్నాయి. -
చిన్న రన్‌వేలపై రిస్క్ తీసుకోవద్దు
న్యూఢిల్లీ: చిన్న రన్వేలు కలిగిన జమ్మూ, పాట్నాలకు పూర్తి లోడ్‌తో విమానాలు నడుపుతున్న ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్లపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తీరు మార్చుకోకపోతే వాటి కార్యకలాపాలను నిలిపేస్తామని హెచ్చరించింది. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు శుక్రవారం ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్న రన్వేలు కలిగిన ఎయిర్‌పోర్టులకు 20 శాతం తక్కువ లోడ్‌తో విమానాలు నడపాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఆ రెండు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యే విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య 150-155 వరకు ఉండాలి. కానీ, ఈ కంపెనీలు ఒక్కో విమానంలో 170-180 మంది పాసెంజర్లను తరలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించడానికి మూడు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. లోడ్ పరిమితి నిబంధనలను ఈ కంపెనీలు ప్రతిరోజూ ఉల్లంఘిస్తున్నాయనీ, తద్వారా ప్రయాణీకుల భద్రతకు నీళ్లొదులుతున్నారనీ అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. -
మళ్లీ దేశీ ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్ ఆఫర్లు
ముంబై/న్యూఢిల్లీ: విమాన ధరల పోరులో రెండో రౌండ్ మొదలైంది. మరోసారి విమాన టికెట్ల ధరల తగ్గింపును స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇదే బాటలో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్, జెట్ కనెక్ట్‌లు కూడా డిస్కౌంట్ ఆఫర్లనందిస్తున్నాయి. ట్రావెల సీజన్ ముగుంపుకు వస్తుండటంతో ఇటీవలే ఎయిర్ ఇండియాతో సహా పలు కంపెనీలు డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో రౌండ్ ధరల తగ్గింపులో ఎయిర్ ఇండియా మినహా ఇతర కంపెనీలు సై అంటున్నాయి. సెకండ్ చాన్స్ పేరుతో తగ్గింపు ధరలకే విమాన టికెట్లను స్పైస్‌జెట్ అందిస్తుండగా, హ్యాపీ వీకెండ్ పేరుతో ఇండిగో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ కూడా ఇతే తరహా ఆఫర్‌ను అందిస్తోందని, పర్యాటక పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బేస్ చార్జీ, ఇంధన సర్‌చార్జీలపై 30 శాతం వరకూ డిస్కౌంట్‌ను జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్‌లు కూడా అందిస్తున్నాయని వివరించాయి. 30 రోజులు ముందు బుకింగ్ ఏప్రిల్ 15 లోపు చేసే ప్రయాణాలకు గాను 30 రోజులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని రెండోసారీ ఇస్తామని స్పైస్‌జెట్ పే ర్కొంది. ఈ అవకాశం శుక్రవారం నుంచి మొదలై ఆది వారం అర్థరాత్రి వరకు అందుబాటులో ఉం టుందని వివరించింది. అంతక్రితం ఆఫర్‌కు మంచి స్పందన రావడంతో ఈ ఆఫర్‌ను పొడిగించామని పేర్కొంది. ఈ నెలలో విమానప్రయాణాలు చౌక భారత్‌లో విమాన యానం చేయాలంటే ఫిబ్రవరి నెల ఉత్తమమైనదని, ఈ నెలలో విమాన టికెట్లు చౌక(18%)గా లభిస్తాయని అంతర్జాతీయ ట్రావెల్ సెర్చ్ సైట్ స్కైస్కానర్ నివేదిక వెల్లడించింది. మూడేళ్ల టికెట్ల బుకింగ్ చరిత్ర ఆధారంగా ఈ సంస్థ బెస్ట్ టైమ్ టు బుక్ పేరిట ఒక నివేదికను రూపొందించింది. -
చిన్న నగరాల నుంచి సింగపూర్‌కు ఫ్లైట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, సింగపూర్‌కు చెందిన టైగర్ ఎయిర్ సోమవారమిక్కడ మూడేళ్ల కాలానికిగాను ఇంటర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిద్వారా స్పైస్‌జెట్ సర్వీసులు అందిస్తున్న దేశంలోని 14 నగరాలను సింగపూర్‌కు అనుసంధానిస్తారు. అంటే ప్రయాణికులు ఒకే టికెట్‌పై ఈ నగరాల నుంచి స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నుంచి టైగర్ ఎయిర్ విమానంలో సింగపూర్‌కు చేరుకుంటారు. జనవరి 6 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు వసూలు చేయరు. ప్రయాణికులకు తక్కువ వ్యయానికే సేవలు అందించాలన్న లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలను ఏకం చేశామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నగరాల నుంచే.. స్పైస్‌జెట్ సర్వీసులందిస్తున్న తిరుపతి, వైజాగ్, అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, కోల్‌కత, కోయంబత్తూరు, ఢిల్లీ, గోవా, ఇండోర్, మంగళూరు, మదురై, పుణె, బెంగళూరు నగరాలకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా విమాన చార్జీ (అన్ని కలుపుకుని) ఒకవైపుకు రూ.4,699. తిరుగు ప్రయాణమైతే చార్జీ రూ.9,998 ఉంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం సింగపూర్‌కు వారంలో అయిదు సర్వీసులను టైగర్ ఎయిర్ నడుపుతోంది. ఇక సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే టైగర్ ఎయిర్ ప్రయాణికులు జనవరి 12 నుంచి స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీ కలెక్షన్, చెక్డ్ ఇన్ బ్యాగేజీ బట్వాడా ఉచితం. కాగా, ఒక విదేశీ సంస్థతో ఇంటర్లైన్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలో ఇదే తొలిసారి. కీలక మార్కెట్లలో భారత్ ఒకటని టైగర్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అలెగ్జాండర్ నిగ్గీ తెలిపారు. హైదరాబాద్ నుంచి మరిన్ని.. శక్తివంతమైన భాగస్వామిని త్వరలోనే ప్రకటిస్తామని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ వెల్లడించారు. తమ సేవల విషయంలో మూడు నాలుగు నెలల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో స్పైస్‌జెట్‌కు రూ.559 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఏడాదిలో కంపెనీ దశ తిరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇంటర్లైన్ ఒప్పందాలు మరిన్ని కుదుర్చుకుంటాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో అపార అవకాశాలున్నాయి. ఈ నగరాలు లక్ష్యంగా కొత్త నెట్‌వర్క్‌ను త్వరలో ప్రకటిస్తాం. ఢిల్లీ, చెన్నై తర్వాత కీలక నగరం హైదరాబాద్. భాగ్యనగరం నుంచి మరిన్ని నగరాలను విమానాలు నడుపుతాం’ అని పేర్కొన్నారు. 17 బోయింగ్ 737 విమానాలకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టైగర్ ఎయిర్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సోమవారం స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో క్రితం ముగింపుతో పోలిస్తే 7.64 శాతం ఎగసి రూ.16.90 వద్ద క్లోజయ్యింది. 84.24 లక్షల షేర్లు చేతులు మారాయి.