
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఐతే ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కోజికోడ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఎస్‌జీ 306ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో శుక్రవారం సాయంత్రం 6.27 నిమిషాలకు కొచ్చి విమానశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించామని చెప్పారు. తదనంతరం విమానం రాత్రి 7.19 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత విమానాన్ని రన్‌వేని తనిఖీ చేసే సాధారణ కార్యకలాపాలకు అప్పగించారు. విమానాశ్రయంలో అలర్ట్ స్ట్రక్చర్ పూర్తిగా యాక్టివేట్ అవ్వడంతో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధమైందని ఎయిర్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ తెలిపారు.
(చదవండి: సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు)
Comments
Please login to add a commentAdd a comment