kochi flight
-
అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లోనే కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఐతే ప్రయాణికులంతా..
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఐతే ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కోజికోడ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఎస్జీ 306ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం 6.27 నిమిషాలకు కొచ్చి విమానశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించామని చెప్పారు. తదనంతరం విమానం రాత్రి 7.19 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత విమానాన్ని రన్‌వేని తనిఖీ చేసే సాధారణ కార్యకలాపాలకు అప్పగించారు. విమానాశ్రయంలో అలర్ట్ స్ట్రక్చర్ పూర్తిగా యాక్టివేట్ అవ్వడంతో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధమైందని ఎయిర్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాస్ తెలిపారు. (చదవండి: సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు) -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. కొచ్చి రావాల్సిన ఎయిరిండియా విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో విమానంలో ఉన్నట్టుండి పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమన్ నివేదించింది. మస్కట్ నుండి కొచ్చిన్‌కు రావాల్సిన ఐఎక్స్-442 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంటలంటుకున్నాయి. టేకాఫ్ సమయంలో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది స్లైడ్ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. విమానం మస్కట్నుంచి కొచ్చికి బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరినీ (141+ 4గురు శిశువులు) ఖాళీ చేయించామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంబంధఙత అధికారి తెలిపారు. అయితే ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలో ఒక్కసారిగా తగ్గిన ప్రెజర్.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి!
కొచ్చి: కొద్ది రోజులుగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసరంగా కిందకు దింపాల్సిన సంఘటనలు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా దుబాయ్ నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది. క్యాబిన్లో ప్రెజర్ తగ్గటం వల్ల విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ముంబయి నుంచి మరో విమానంలో ప్రయాణికులను కొచ్చికి శుక్రవారం ఉదయం చేర్చారు. దుబాయి నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సంకేతిక సమస్య తలెత్తిన ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ‘దుబాయి నుంచి కొచ్చికి వస్తున్న ఎయిరిండియా బోయింగ్ విమానం ఏఐ-934 కెప్టెన్.. క్యాబిన్లో ప్రెజర్ తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు ఐఓసీసీకి సమాచారం అందించారు. విమానాన్ని ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశాం.’ అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులను దర్యాప్తునకు నియమించినట్లు చెప్పారు. గత బుధవారం.. ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న గోఎయిర్ విమానం విండ్‌షీల్డ్ పగిలిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత గోఎయిర్ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈనెలలోనే ఇలాంటివి రోజుకు 30 సంఘటనలు చోటు చేసుకున్నట్లు తాజాగా డీజీసీఏ తెలిపింది. అయితే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ‘సార్ నా బ్యాగులో బాంబు ఉంది..’ ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్ -
మరుగుదొడ్డిలో కిలో బంగారం!
న్యూఢిల్లీ: విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.