ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం | Cochin bound Air India Express flight in Oman catches fire | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Published Wed, Sep 14 2022 3:37 PM | Last Updated on Wed, Sep 14 2022 4:06 PM

Cochin bound Air India Express flight in Oman catches fire - Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. కొచ్చి  రావాల్సిన  ఎయిరిండియా విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌ సమయంలో  విమానంలో ఉ‍న్నట్టుండి  పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమన్ నివేదించింది. 

మస్కట్ నుండి కొచ్చిన్‌కు రావాల్సిన ఐఎక్స్‌-442 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంటలంటుకున్నాయి.  టేకాఫ్‌ సమయంలో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. విమానం మస్కట్‌నుంచి  కొచ్చికి బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరినీ (141+ 4గురు శిశువులు) ఖాళీ చేయించామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని  సంబంధఙత అధికారి తెలిపారు. అయితే ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement