బాలునికి అస్వస్థత.. విమానం వెనక్కి | spice jet returs vizag due to boy health issues | Sakshi
Sakshi News home page

బాలునికి అస్వస్థత.. విమానం వెనక్కి

Published Wed, Aug 2 2017 4:04 AM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM

spice jet returs vizag due to boy health issues

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  హైదరాబాద్‌కు బయల్దేరిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలుడు తీవ్ర అస్వ స్థతకు గురయ్యాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. స్పైస్‌ జెట్‌ విమానం విశాఖ నుంచి మంగళవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరింది. కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఊపిరందక విల విల్లాడిపోయాడు.

బాలుడి తల్లి ఆందోళ నకు గురికావడంతో విమానాన్ని తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. ఈలోగా విమానా శ్రయంలో అప్రమత్తమైన వైద్య బృందాలు బాలుడికి ప్రాథమిక వైద్యమందించాయి. ఆస్తమా కారణంగా బాలుడు ఇబ్బంది పడి నట్టు వైద్యులు తేల్చారు. దీంతో తల్లీకొడు కులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో విమానం విశాఖ నుంచి రాత్రి 10.15 గంటలకు తిరిగి బయల్దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement