
సాక్షి, చెన్నై : పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్‌వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్‌వేను మూసివేశారు.
సంబంధిత వార్త : టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్
Comments
Please login to add a commentAdd a comment