499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి! | spicejet offers Rs 499 ticket, air asia joins race | Sakshi
Sakshi News home page

499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!

Sep 1 2014 12:29 PM | Updated on Sep 2 2017 12:43 PM

499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!

499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!

స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది.

విమాన ప్రయాణికుల మీద విమానయాన సంస్థలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 16 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.

అయితే.. ఈ ధరలలో ఇంధన సర్ఛార్జి కలిసి ఉన్నా, ఇతర పన్నులు, ఫీజులను మాత్రం ఆ రోజుకు ఎంత ఉంటే అంత చొప్పున ప్రయాణికులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం భారతదేశంలో చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ రద్దు చేసినా ఆ సొమ్ము తిరిగి ఇవ్వరు, అలాగే ప్రయాణ తేదీ కూడా మార్చరు.

మరోవైపు బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా కూడా మరో ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలిపి వివిధ మార్గాల్లో ప్రయాణాలకు రూ. 1290కే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్లను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement