![Credit Suisse vs SpiceJet Supreme Court summons Ajay Singh for personal appearance - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/14/ajaysingh_Credit%20Suisse%20vs%20SpiceJet.jpg.webp?itok=4m-7d6XI)
Credit Suisse vs SpiceJet: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (గుడ్ న్యూస్: రూ.1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!)
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి. (బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?)
కాగా 2015 నుంచి క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్ మధ్య వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్లు డాలర్లు బకాయలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది. దీనిపై చివరికి 2021లో మద్రాస్ హైకోర్టు ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌లో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగానిలిపివేసింది, ఇరుపక్షాలు ఒక పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి నిచ్చింది. ఆగస్ట్ 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ ఒప్పందం గురించి సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదనే ఆరోపణలతో మార్చిలో క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు నమోదు చేసింది. దీంతోరాబోయే విచారణ సమయంలో హాజరు కావాలని అజయ్ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది. దీంతో ముగిసిపోనుందని భావించిన కేసు కాస్తా మళ్లీ మొదటి కొచ్చినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment