Ajay singh
-
లక్షద్వీప్‌కు త్వరలో స్పైస్‌జెట్ సర్వీసులు
ముంబై: త్వరలో లక్షద్వీప్‌తో పాటు అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ మరింత పటిష్టమయ్యేందుకు ఇటీవల సమీకరించిన నిధులు దోహదపడగలవని ఆయన వివరించారు. ప్రస్తుతం నిలిపివేసిన విమానాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సింగ్ ఈ విషయాలు తెలిపారు. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసిన నేపథ్యంలో లక్షద్వీప్‌కు స్పైస్‌జెట్ సర్వీసుల ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్పైస్‌జెట్‌కు డెడ్‌లైన్: కడతారా? జైలుకెడతారా అజయ్ సింగ్‌కు సుప్రీం వార్నింగ్
SpiceJet Vs Credit Suisse క్రెడిట్ సూయిస్ కేసులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ షాక్ తగిలింది.క్రెడిట్ సూయిస్ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 15లోగా క్రెడిట్ సూయిస్‌కి వాయిదాల రూపంలో 5 లక్షల డాలర్లను చెల్లించాలని, అలాగే డిఫాల్ట్ చేసిన మొత్తానికి 1 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్‌జెట్ సుప్రీంకోర్టు ఆదేశించింది.లేని పక్షంలో 'కఠిన చర్యలు' తీసుకుంటామని స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు) ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం క్రెడిట్ సూయిస్ బకాలయిలను క్రెడిట్ సూయిస్‌కి బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెల్లించని పక్షంలో సింగ్‌ను తీహార్ జైలుకు పంపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్‌ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే ఇక డిల్లీ-డాలీ బిజినెస్‌ను కట్టిపెట్టండి అంటూ కోర్టు ఆగ్రహ్యం వక్తం చేసింది. అనంతరం ఈ కేసును సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. -
SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!
Credit Suisse vs SpiceJet: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (గుడ్ న్యూస్: రూ.1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!) కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి. (బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్‌ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?) కాగా 2015 నుంచి క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్ మధ్య వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్లు డాలర్లు బకాయలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది. దీనిపై చివరికి 2021లో మద్రాస్ హైకోర్టు ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్లో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగానిలిపివేసింది, ఇరుపక్షాలు ఒక పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి నిచ్చింది. ఆగస్ట్ 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ ఒప్పందం గురించి సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదనే ఆరోపణలతో మార్చిలో క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు నమోదు చేసింది. దీంతోరాబోయే విచారణ సమయంలో హాజరు కావాలని అజయ్ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది. దీంతో ముగిసిపోనుందని భావించిన కేసు కాస్తా మళ్లీ మొదటి కొచ్చినట్టైంది. -
పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!
Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు. అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?) రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్‌పూర్‌లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
ప్రత్యేక కంపెనీగా స్పైస్‌ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: కార్గో, లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బ్యాంకులు, వాటాదారులు అనుమతించినట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ తాజాగా వెల్లడించింది. వచ్చే నెల(ఆగస్ట్) తొలి వారంలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను విడదీయనున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కార్గో, లాజిస్టిక్స్ సర్వీసులను స్లంప్ సేల్ ప్రాతిపదికన అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేస్తున్నట్లు గతేడాది ఆగస్ట్ 17న స్పైస్‌జెట్ తెలియజేసింది. తద్వారా సంస్థకు స్వతంత్రంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలు చిక్కనున్నట్లు వెల్లడించింది. కాగా.. జూన్ 19 మొదలు కంపెనీ విమానాలలో ఎనిమిదిసార్లు సాంకేతిక సమస్యలు నమోదుకావడంతో గత వారం డీజీసీఏ నుంచి స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన సంగతి తెలిసిందే. భద్రత, సమర్థత, విశ్వసనీయ విమానయాన సర్వీసులు అందించడంలో స్పైస్‌జెట్ వైఫల్యం చెందిందంటూ డీజీసీఏ పేర్కొంది. -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
Ajay Singh: అజయ్ సింగ్‌కు స్వర్ణ పతకం!
Weightlifter Ajay Singh Wins Gold Medal: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్‌గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించాడు. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్హమ్ గేమ్స్‌కు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
ఎయిరిండియాను కొనేంత పెద్దోళ్లం కాదు
ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కొనుగోలు రేసులో తాము లేమని చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. తమది చాలా చిన్న సంస్థ అని.. ఎయిరిండియా లాంటి దిగ్గజాన్ని కొనేంత స్థాయి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా జాతి సంపదలాంటిది. దాన్ని కొనుగోలు చేసేందుకు టాటా– విస్తారా, జెట్ ఎయిర్వేస్ లాంటి పెద్ద కంపెనీలున్నాయి. మాది చాలా చిన్న కంపెనీ. అంత భారీ సంస్థ కొనుగోలుకు బిడ్ చేసే స్థాయి మాకు లేదు‘ అని విమానయాన రంగ కన్సల్టెన్సీ కాపా ఏర్పాటు చేసిన వార్షిక ఏవియేషన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశాన్ని తాము కూడా మదింపు చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే వెల్లడించిన అజయ్ సింగ్ తాజాగా అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం. టాటాల సారధ్యంలోని విస్తారా, జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ఎయిరిండియా కొనుగోలు రేసులో పోటీపడుతున్నాయంటూ కాపా వెల్లడించిన వేదికపైనే అజయ్ సింగ్ తాజా వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నాలుగు కంపెనీలతో పాటు రెండు విదేశీ విమానయానేతర సంస్థలు కూడా బరిలో ఉన్నాయని కాపా ఒక నివేదికలో పేర్కొంది. ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చే నెల మధ్యలో బిడ్లను ఆహ్వానించవచ్చని, విక్రయ ప్రక్రియ జూలై నాటికల్లా పూర్తి కావొచ్చని కాపా భారత విభాగం హెడ్ కపిల్ కౌల్ అభిప్రాయపడ్డారు. -
'దావోస్‌లో మోదీ గ్రేట్ స్టోరీ చెప్పబోతున్నారు'
దావోస్ : ప్రపంచ ఆర్థిక వేదికపై (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) చెప్పడానికి ప్రధాని నరేంద్రమోదీ వద్ద గొప్ప కథ ఉందని, అది భారత్‌వైపు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ అన్నారు. ఆ కథను నరేంద్రమోదీ కంటే ఎవరు కూడా గొప్పగా చెప్పలేరని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణలు అయిన జీఎస్టీ, డిజిటలైజేషన్, పెద్ద నోట్ల రద్దువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రపంచ వేదికపై వివరించబోతున్నారన్నారు. ప్రపంచంలో మరే దేశ నేతకు లేనంత అవకాశం మోదీకి ఉందని, ఆయన మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని చెప్పారు. సంస్కరణల భారతం, 1.4బిలియన్ల భారతీయులు, యువ జనాభా, ప్రపంచానికి భారత్ అతిపెద్ద మార్కెట్వంటి అంశాలన్నీ కూడా మోదీ ప్రస్తావించనున్నారన్నారు. ప్రపంచ దేశాల అధినేతలతోపాటు ప్రధాని మోదీ కూడా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ప్రసంగించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌కు చెందిన ఓ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇది భారత్‌కు అతి ముఖ్యమైన కార్యక్రమంగా నిలవనుంది. 'గత ఏడాది జీ జిన్‌పింగ్‌ను చూసినప్పుడు మనందరి ఫోకస్ చైనాపైనే ఉంది. కానీ, ఈసారి మాత్రం దృష్టి అంతా భారత్‌పైనే' అని అజయ్ సింగ్ చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ఫోరం సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. మంగళవారం ఫోరం అధికారిక సెషన్స్‌లో ఆయన ప్రసంగిస్తారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషంగా చెప్పవచ్చు. చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నింటికి కూడా భావి ఆర్థిక అవకాశాలు కూడా దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికపైనే ఆవిష్కృతమవుతాయనీ అంటుంటారు. -
ఎన్డీటీవీని అమ్మేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) స్పైస్‌జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి. టీవీలో మెజారిటీ వాటాను అజయ్ సింగ్ కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం అజయ సింగ్ 40శాతం వాటాను, ప్రణయ్‌రాయ్, రాధికా రాయ్ సుమారు 20శాతం వాటాను కలిగి వుంటారని అంచనాలు వెలువడ్డాయి. డీల్ లో భాగంగా ఎన్డీటీవీకి చెందిన రూ.400 కోట్లు అప్పును కూడా అజయ్ స్వీకరించారని, మొత్తం డీల్ విలువ రూ.600 కోట్ల అని మీడియాలో కథనాలు జోరుగా వ్యాపించాయి. దీంతో ఎన్డీటీవీ షేర్ భారీగా ఎగిసింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో షేర్ ధర అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు సీబీఐ స్కానర్‌లో ఉండడంతో.. ఈ కంపెనీ చేతులు మారనుందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ అంచనాలను ఎన్డీటీవీ కొట్టిపారేసింది. తాము ఎవరితోనూ, ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని మార్కెట్ రెగ్యురేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో మార్కెట్వర్గాల్లో గందరగోళం నెలకొంది. కాగా 1988లో ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ఎన్డీటీవీని స్థాపించారు. -
రూ.2కే ‘స్పైస్’జెట్!
టిక్కెట్టు కాదండీ... కంపెనీయే జాక్‌పాట్ కొట్టేసిన అజయ్ సింగ్ ♦ చరిత్రలో అత్యంత చౌకగా చేతులు మారిన లిస్టెడ్ కంపెనీ ఇదే ♦ 15 రోజుల్లోనే యాజమాన్య హక్కుల బదలాయింపు ♦ స్టాక్ మార్కెట్లకు ధర వెల్లడించకుండానే డీల్ పూర్తి ♦ రెండున్నరేళ్ల తర్వాత కోర్టు జోక్యంతో వెలుగులోకి (న్యూఢిల్లీ) రెండు రూపాయలకు ఏం వస్తాయో ఒకసారి ఠక్కున చెప్పండి చూద్దాం.. పిప్పర్మెంటో, చాక్లెట్టో తప్ప మరే భారీదీ గుర్తుకురావడం లేదు కదా!! అలాంటిది .. బోలెడన్ని విమానాలు, ఆస్తులు.. (అఫ్కోర్స్ అప్పులు కూడా ఉన్నా) ఒక పెద్ద విమానయాన కంపెనీ రెండే రూపాయలకు అమ్ముడైపోయిందన్న సంగతి మీకు తెలుసా!! ఆ కంపెనీ మరేదో కాదు.. స్పైస్జెట్టే!! అంత చౌకగా దాన్ని దక్కించుకున్నది ఆ కంపెనీ ఒకప్పటి వ్యవస్థాపకుడు, ప్రస్తుత చైర్మన్ అజయ్ సింగ్. సుమారు రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను అప్పట్లో మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్. కంపెనీని నిలబెట్టారు. క్రమంగా మళ్లీ లాభాల బాట పట్టించారు. అయితే, స్పైస్‌జెట్‌ను మారన్ల నుంచి కొనుగోలు చేసేందుకు సింగ్ ఎంత చెల్లించారన్నది తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు!! అవును! అక్షరాలా రెండే రూపాయలు!! దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు. 2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు!!. కానీ.. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బయటికొచ్చిన ఈ విషయాలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది. బయట పడిందిలా.. అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్ల డించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. నిజానికి ఈ డీల్ విలువ రూ.2 అని అప్పట్లో మార్కెట్లో తెలిస్తే చరిత్ర వేరే విధంగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే కేవలం రెండ్రూపాయలకు స్పైస్‌జెట్‌ను ప్రమోటర్ విక్రయించేశారంటే దానికి విలువ లేదనేగా అర్థం!! అపుడు ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్ముకుని బయటపడటానికి ప్రయత్నించి ఉండేవారు. అదే జరిగితే షేరు ధర కుప్పకూలేది. కానీ డీల్ విలువ బయటపడకపోవటంతో సింగ్ చేతుల్లోకి కంపెనీ వెళ్తోందని తెలిసిన దగ్గరి నుంచీ షేరు ధర పెరగటం మొదలెట్టింది. డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న దరిమిలా ఈ సమాచారం బయటికొచ్చింది. దీన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి. అప్పులు, నష్టాల నుంచి లాభాల్లోకి .. ప్రస్తుతం మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న స్పైస్‌జెట్... సుమారు రెండున్నరేళ్ల క్రితం 2014 డిసెంబర్లో నిధుల కటకటతో మూసివేత అంచున నిలబడింది. బాకీలు కట్టలేక చేతులెత్తేసింది. 2014–15లో కంపెనీ నష్టం రూ.687 కోట్లు. అదే ఏడాది నికర విలువ కూడా తుడిచిపెట్టుకుపోయి మైనస్ రూ.1,329 కోట్లకు పడిపోయింది. మొత్తం రుణ భారం రూ.1,418 కోట్లు కాగా, స్వల్పకాలిక వ్యవధుల కోసం తీసుకున్న రుణాలు రూ. 2,000 కోట్ల మేర ఉండేవి. కంపెనీని గట్టెక్కించే వ్యూహాత్మక ఇన్వెస్టర్ల కోసం ప్రమోటర్ మారన్ కుటుంబం అన్వేషించింది. చివరికి సింగ్ ముందుకొచ్చి కంపెనీని టేకోవర్ చేశారు. నష్టాలకు అడ్డుకట్ట వేసి మళ్లీ క్రమంగా లాభాల్లోకి మళ్లించారు. ఓపెన్ ఆఫర్ మినహాయింపు...! సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థను టేకోవర్ చేసి, యాజమాన్య హక్కులు దక్కించుకునేవారు కచ్చితంగా మిగతా పబ్లిక్ షేర్హోల్డర్లకు వైదొలిగే వెసులుబాటు కల్పిస్తూ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. కానీ స్పైస్‌జెట్ కేసులో మాత్రం ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937 కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్... 26% ఓపెన్ ఆఫర్ నుంచి సింగ్‌కు అసాధారణంగా మినహాయింపునిచ్చింది. సెబీని కాదని ఇలా మినహాయింపునిచ్చే హక్కు ఉందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. -
ఎయిరిండియా కొనుగోలు యోచన లేదు
స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. గొప్ప అసెట్ అయినప్పటికీ ప్రస్తుతం దాన్ని కొనుగోలు చేసేంత పటిష్టంగా తమ కంపెనీ లేదని, ఇప్పటి పరిస్థితుల్లో అంత రిస్కు తీసుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా అనేదే ఒక పెద్ద బ్రాండ్. నిస్సందేహంగా గొప్ప అసెట్ కూడా. కానీ చాలా చిన్నదైన స్పైస్‌జెట్ దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడే పరిస్థితిలో లేదు‘ అని సింగ్ పేర్కొన్నారు. రుణగ్రస్త ఎయిరిండియాలో వాటాల విక్రయం చేపట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసిన దరిమిలా పలు సంస్థలు చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. లాభసాటి కాబట్టే బరిలోకి: ఇండిగో ప్రెసిడెంట్ ఎయిరిండియా కొనుగోలుతో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే బరిలోకి దిగినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. సంస్థ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న పక్షంలో ముందుకెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలు యోచన వెనుక గల కారణాలను వివరిస్తూ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఒకవేళ ఆ ప్రతిపాదన లాభసాటి కాకపోతే.. ఉద్యోగులకు, కస్టమర్లకు, వాటాదారులకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చనటువంటిదైతే ఎయిరిండియా కొనుగోలు ప్రయత్నాలు చేయబోము‘ అని ఘోష్ వివరించారు. -
వాణిజ్య విమానాలు భారత్‌లోనే తయారవ్వాలి
స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ ఆకాంక్ష వాషింగ్టన్: విమానయాన రంగంలో భారత్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తున్న క్రమంలో దేశీయంగా వాణిజ్య విమానాల తయారీని ప్రోత్సహించే విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని స్పైస్‌జెట్ సీఈవో అజయ్‌సింగ్ సూచించారు. 100 విమానాల కొనుగోలు కోసం అమెరికా సంస్థ బోయింగ్‌కు స్పైస్‌జెట్ ఇటీవల ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అజయ్‌సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అభినందనలు కూడా అందుకున్నారు. ఈ ఆర్డర్ అమెరికాలో వేలాది ఉద్యోగాలకు తోడ్పాటునిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వెంట ట్రంప్‌ను కలిసిన బృందంలో అజయ్‌సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అజయ్‌సింగ్ వాషింగ్టన్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫోన్ల తయారీపై యాపిల్ వంటి కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నప్పుడు... విమానాల తయారీదారులతో ఆ పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఈ దిశగా వెంటనే ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించాలని, భారత్‌లో తయారీపై వారు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత విమానయాన సంస్థలు 600కుపైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2020 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద వాణిజ్య విమానయాన మార్కెట్‌గా అవతరించనుందన్నారు. 120 మిలటరీ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తున్నప్పుడు, వాణిజ్య విమానాలపైనా అదే విధంగా దృష్టి పెట్టాలని ఆశించారు. ‘‘దేశీయంగా విమానయాన మార్కెట్ 20–25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. దేశ జనాభాలో 3 శాతం మందే విమానాల్లో ప్రయాణిస్తున్నారు. కనుక ఈ రంగలో అపార అవకాశాలు ఉన్నాయి’’ అని అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
కార్యకర్తకు చెంపదెబ్బ!
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. సొంతపార్టీ కార్యకర్తపైనే చేయిచేసుకున్నారు. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటనపై సాగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ దశలో సహనం కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అజయ్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చిన అజయ్ సింగ్.. కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు వెళ్తుండగా కొందరు కార్యకర్తలు ఆవేశంగా వ్యవహరించడంతో.. వారిని శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పానన్నారు. కార్యకర్తను పక్కకు నెట్టివేశానే తప్ప కొట్టలేదని చెప్పుకొచ్చారు. -
స్టాక్స్ వ్యూ
స్పైస్‌జెట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.74 టార్గెట్ ధర: రూ.150 ఎందుకంటే: దాదాపు దివాళా స్థితిలో ఉన్న ఈ కంపెనీ పగ్గాలను గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ చేపట్టారు. కంపెనీ పునరుజ్జీవింపజేయడానికి కొత్త యాజమాన్యం పలు చర్యలు తీసుకుంది. సామర్థ్యాన్ని, ఆదాయాన్ని పెంచడం, విమాన సర్వీసుల హేతుబద్ధీకరణ, విమానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కీలక మార్కెట్లలో విమాన సర్వీసుల పెంపు, వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా విమానాల సంఖ్యను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండడం విమానయాన రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం, వేతనాల పెరుగుదల, ఫస్ట్‌క్లాస్ రైల్వే చార్జీలతో పోల్చితే విమాన చార్జీలు ఒకింత చౌకగా ఉండడం వంటి అంశాల కారణంగా మొత్తం విమానయాన రంగమే టర్న్అరౌండ్ కానున్నదని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32గా ఉన్న ఉన్న విమానాల సంఖ్య మరో రెండేళ్లలో 52కు పెంచుకోనున్నది. ప్రతి నెలా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిస్తోంది. మొత్తం విమాన యాన సంస్థ వ్యయాల్లో 40 శాతంగా ఉంటే ఇంధన వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ మొత్తం ఆదాయంలో 46 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు 33 శాతానికి తగ్గాయి. గత ఏడాది జనవరిలో 9 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ షేర్ అదే ఏడాది నవంబర్‌లో 13 శాతానికి ఎగసింది. 2018 మార్చి కల్లా 18 శాతానికి పెరగగలదని అంచనా. వీటన్నింటి ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 17 శాతం, ఇబిటా 41 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇండస్‌ఇంద్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.921 టార్గెట్ ధర: రూ.1,125 ఎందుకంటే: ముంబై కేంద్రంగా కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలనందిస్తోంది.1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిడ్ సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 854 బ్రాంచీలు, 1,578 ఏటీఎంలతో ఖాతాదారులకు సేవలందిస్తోంది. లండన్, దుబాయ్, అబూదాబిల్లో ప్రాతినిధ్య కార్యాలయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.580 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 29 శాతంగా ఉంది. రిటైల్ రంగ రుణాలు 27 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహన రుణాలు 31 శాతం పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 3.91 శాతానికి చేరాయి. కీలకమైన ఫీజు ఆదాయం 30 శాతం పెరిగింది. కార్పిరేట్ రుణ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండి బకాయిలు 1 శాతానికి దిగువనే ఉన్నాయి. మార్జిన్ల అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలపై దృష్టిసారిస్తోంది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఆదాయ, నికర లాభాల వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం బ్యాంక్‌కు కలసివచ్చే అంశాలు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా రూ.1,125కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. 2017 నాటికి బ్రాంచీల సంఖ్యను 1,200కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,264 టార్గెట్ ధర: రూ.2,854 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ భారత మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ. ముంబై కేంద్రంగా ఐటీ, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తోంది. 46కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఇదే టాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలను అందుకోలేకపోయినా, ఇబిటా, నికర లాభాలు అంచనాలను మించాయి. అంతర్జాతీయ వ్యాపారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 27 శాతం పెరిగింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధితో రూ.6,110 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల వినియోగం 85 శాతంగా ఉంది. ఐటీ సేవల్లో ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 15%గా ఉంది. అధిక ఆదాయం వచ్చే ఇద్దరు క్లయింట్లు కలుపుకొని మొత్తం 9 మంది కొత్త క్లయింట్లు ఈ క్యూ3లో లభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐటీ బడ్జెట్/వ్యయాలపై తమ క్లయింట్ల నుంచి ఎలాంటి ప్రతికూల లేదా తగ్గింపు సంకేతాలు అందలేదని కంపెనీ చెబుతోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం డాలర్ టర్మ్‌ల్లో 10 శాతం, రూపాయి టర్మ్‌ల్లో 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.98గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.138కు పెరుగుతుందని భావిస్తున్నాం. కీలకమైన అమెరికా, యూరప్‌ల్లో మరిన్ని డీల్స్ సాధిస్తామని కంపెనీ ఆశావహంగాఉంది. ఇబిటా మార్జిన్లు 26-28 శాతం రేంజ్లో ఉంటాయని ధీమాగా ఉంది. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 15 శాతం, నికర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. -
ఎవరీ అజయ్‌సింగ్?
ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న అజయ్‌సింగ్... స్పైస్ జెన్ తొలి ప్రమోటర్లలో ఒకరు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరించిన అజయ్... బీజేపీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్‌కు సలహాదారుగా పనిచేయటంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అబ్కీ బార్- మోదీ సర్కార్’ అనే నినాదం రూపకర్త కూడా అజయేనని చెబుతారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివిన అజయ్.. 2005లో లండన్‌కి చెందిన కన్సాగ్రా కుటుంబంతో కలిసి మోదీలుఫ్త్ను 2005లో పునరుద్ధరించి, స్పైస్‌జెట్‌గా మార్చారు. అమెరికన్ ఇన్వెస్టరు విల్బర్ రాస్తో 80 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయించటంతో పాటు, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ స్పైస్‌జెట్‌లోకి పెట్టుబడులు తేగలిగారు. బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడే సింగ్.. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ‘‘ఆయన స్పైస్‌ను వదిలే సమయానికి సంస్థకు 800 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గటం వల్ల లాభాలు కూడా పెరగాల్సి ఉన్నా స్పైస్ నష్టాల పాలవుతోంది. అందుకే బొంబార్డియర్ విమానాలను తొలగించి, బోయింగ్-737లకు మాత్రమే పరిమితమవ్వాలన్నది ఆయన ఆలోచన. లాభదాయక రూట్లలో తక్కువ సిబ్బందితో నడిపించి వచ్చే ఏడాదికల్లా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు’’ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 10 శాతం పెరిగి రూ.20.50(అప్పర్ సర్క్యూట్) వద్ద క్లోజయింది. -
స్పైస్‌జెట్‌లో మళ్లీ అజయ్ ప్రయాణం
వాటా విక్రయించి దిగిపోతున్న మారన్ డీల్ విలువ దాదాపు రూ.1,500 కోట్లు వచ్చే ఏడాదికి బ్రేక్ ఈవెన్ సాధించేలా ప్రణాళిక కొన్ని విమానాలు, ఉద్యోగాల్లో సైతం కోత పెట్టుబడుల కోసం విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లోకి మళ్లీ పాత ప్రమోటర్ అజయ్‌సింగ్ ప్రవేశించారు. దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూపునకు ఉన్న వాటాలు మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అజయ్ నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా డీల్ పూర్తి కావచ్చని సమాచారం. అయితే ఈ ఒప్పందానికింకా నియంత్రణ సంస్థలు అనుమతివ్వాల్సి ఉంది. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి, సంస్థకు కొత్త ఊపిర్లూదేందుకు అజయ్ సింగ్ అయిదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. స్పైస్‌జెట్ బోర్డు ఆమోదించిన పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం ప్రస్తుత ప్రమోటర్ కళానిధి మారన్ కుటుంబం, కాల్ ఎయిర్వేస్ యాజమాన్య, నియంత్రణ బాధ్యతలన్నీ సింగ్‌కు బదిలీ అవుతాయి. మారన్ కుటుంబం తమకున్న మొత్తం ఈక్విటీ వాటాలను ఆయనకు బదలాయిస్తుంది. అయితే మున్ముందు తమ వద్దనున్న వారంట్లను వాటాలుగా మార్చుకుని, 10 శాతం వాటాలతో మైనారిటీ ఇన్వెస్టరుగా మాత్రం కొనసాగుతుంది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం మారన్ కుటుంబానికి 53.48 శాతం వాటాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక... యాజమాన్య బదలాయింపు, పునరుద్ధరణ ప్రణాళికను పౌర విమానయాన శాఖకు సమర్పించినట్లు అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితిని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా దీన్ని రూపొందించామన్నారు. బంబార్డియర్ క్యూ400 విమానాలను దశల వారీగా పక్కనపెట్టడం కూడా ఈ ప్లాన్‌లో భాగమే. దీనికి ఆమోదముద్ర లభించాక అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం 41 బోయింగ్-14 బొంబార్డియర్ విమానాలతో కార్యకలాపాలు ఒక మోస్తరుగా నడుస్తున్నాయని.. క్రమంగా ఫ్లయిట్ సర్వీసులు పెంచడంపై దృష్టి పెడతామని సింగ్ చెప్పారు. స్పైస్‌జెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా లాభదాయకం కాని రూట్లతో పాటు కొన్ని ఉద్యోగాల్లో కూడా కోత విధించాల్సి రావచ్చని తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్‌తో కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2005లో ఏర్పాటయ్యాక స్పైస్‌జెట్ యాజమాన్యం మారడం ఇది మూడోసారి. 2005లో ప్రవాస భారతీయుడు కన్సాగ్రా కుటుంబంతో కలిసి సింగ్ స్పైస్‌జెట్‌ను ఆరంభించాక అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ విల్బర్ రాస్ మెజారిటీ వాటాలు కొన్నారు. 2010లో ఆ వాటాలను మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి విక్రయించారు. మారన్ స్పైస్‌జెట్‌లో దాదాపు రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో సగ భాగాన్ని కంపెనీ కొనుగోలు కోసం వెచ్చించారు. తాజాగా మారన్ కుటుంబం నిష్ర్కమిస్తుండటంతో.. వ్యవస్థాపక ప్రమోటర్ సింగ్ మరోసారి కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో స్పైస్‌జెట్ నష్టాలు రూ. 246 కోట్లు. -
కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్..ప్రతిపాదిత 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించింది. స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మాజీ ప్రమోటరు అజయ్ సింగ్‌తో కలసి కంపెనీ సీఓఓ సంజీవ్ కపూర్ శుక్రవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి.సోమసుందరన్కి ప్రణాళికను అందజేశారు. సోమసుందరన్తో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందని సమావేశం అనంతరం కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఏ చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని, మొత్తం 18 విమానాలతో రోజుకు 230 ఫ్లయిట్ సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 9 శాతం పెరిగి రూ. 19.25 వద్ద ముగిసింది. అజయ్ సింగ్‌తో పాటు అమెరికా ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ సారథ్యంలోని ఫండ్ కూడా స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. కంపెనీని గట్టెక్కించే దిశగా నెల రోజుల్లోగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో.. ప్రస్తుత ప్రమోటరు కళానిధి మారన్ నుంచి ఇన్వెస్టర్లు కొంత వాటా కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా కంపెనీకి ఇప్పటికే రూ. 17 కోట్లు అందినట్లు.. చమురు కంపెనీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాటితోనే తీర్చినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 మధ్యలో దేశీ, విదేశీ విక్రేతలు, ఎయిర్పోర్ట్ ఆపరే టర్లు, చమురు కంపెనీలకు స్పైస్‌జెట్ చెల్లించాల్సిన బకాయిలు రూ. 990 కోట్ల నుంచి రూ.1,230 కోట్లకు పెరిగాయి. విదేశీ వెండార్లకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 624 కోట్ల నుంచి రూ. 742 కోట్లకు పెరిగాయి. -
ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్... సర్వీసుల పునరుద్ధరణకు వీలుగా రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రణాళిక ఆమోదంపై తుది నిర్ణయం తీసుకునేముందు సంబంధిత చమురు కంపెనీలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సర్వీసుల పునరుద్ధరణ దిశలో స్పైస్‌జెట్ ఇప్పటికే పౌర విమానయాన శాఖకు ప్రణాళికను అందజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రుణ చెల్లింపులకు వీలుగా 15-30 రోజులపాటు గడువు ఇవ్వాల్సిందిగా చమురు కంపెనీలను కోరినట్లు తెలిపాయి. కాగా, మరోపక్క కంపెనీ తొలి ప్రమోటర్ అజయ్ సింగ్ అమెరికాకు చెందిన రెండు ప్రయివేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ప్రతినిధులను కంపెనీ బోర్డులోకి తీసుకురావాలన్నది అజయ్ ప్రణాళిక. రూ. 1,230 కోట్లకు బకాయిలు..: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బకాయిలు డిసెంబర్ 10కల్లా రూ. 1,230 కోట్లకు చేరాయి. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు 18 రోజుల్లో రూ. 990 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు ఎగశాయి. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ లోక్‌సభలో వెల్లడించారు. -
స్పైస్‌జెట్‌కు కొత్త ఓనర్?
⇒సన్‌గ్రూప్ కళానిధి మారన్ యాజమాన్యంలో మార్పు! ⇒రంగంలోకి దిగిన పాత ప్రమోటర్ అజయ్ సింగ్.. ⇒ఇన్వెస్టర్ల నుంచి త్వరలో రూ.1,400 కోట్ల పెట్టుబడులకు చాన్స్... న్యూఢిల్లీ: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చేతులు మారనుందా? త్వరలో కొత్త యాజమాన్యం రాబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు(డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది. రంగంలోకి అజయ్ సింగ్... కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది. తక్షణావసరం రూ.1,400 కోట్లు... విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజా ఊరటతో మళ్లీ 16 స్థాయికి కోలుకుంది. ఎవరీ అజయ్ సింగ్... స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది. అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే... అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం. -
విమానయాన రంగానికి మౌలిక హోదా !
స్పైస్‌జెట్ ఉదంతంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ యోచన న్యూఢిల్లీ: విమానయాన రంగానికి మౌలిక రంగ హోదా కల్పించే విషయమై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో కింగ్ ఫిషర్, ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో ఈ దిశగా సదరు శాఖ యోచిస్తోంది. మౌలిక రంగ హోదా కల్పిస్తే తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తాయని, నిధుల లభ్యత సమస్య తొలుగుతుందని, విమానయాన సంస్థలు ఒడ్డునపడుతాయని ఈ శాఖ ఆలోచన. దీనికి సంబంధించిన ఆర్థిక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలను ఆదుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలని విమానయాన శాఖ ప్రతిపాదిస్తోంది. విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ) సమీకరణకు విమానయాన సంస్థలను అనుమతించాలని, కొన్నేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వాలని, ఈ సంస్థలకిచ్చే రుణాలపై బ్యాంకులు 8 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదని, చమరు కంపెనీలకు ఉన్న బకాయిలను రీ షెడ్యూల్ చేయాలని తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, కంపెనీ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. అజయ్ సింగ్ ఆసక్తి: కాగా స్పైస్‌జెట్ ఒరిజినల్ ప్రమోటర్ అజయ్ సింగ్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి. సోమసుందరన్‌ను కలవడం పలు ఊహాగానాలకు తెర తీసింది. అంతే కాకుండా ఆయన గురువారం సాయంత్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూడా కలిశారు. దీంతో నాలుగేళ్ల క్రితం స్పైస్‌జెట్ నుంచి వైదొలగిన అజయ్ సింగ్ మళ్ల స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. స్పైస్‌జెట్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేసే విషయమై మాట్లాడటానికి నిరాకరించిన అజయ్ సింగ్ స్పైస్‌జెట్‌కు చాలా సత్తా ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు గురువారం విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఆయిల్ కంపెనీలకు చెల్లింపుల్ని కంపెనీ జరపడంతో సర్వీసులు ప్రారంభించడానికి వీలుకలిగింది. అయితే బుధవారం స్పైస్‌జెట్ పూర్తిస్థాయిలో సర్వీసుల్ని నడపలేకపోవడంతో పలువురు ప్రయాణికులు స్పైస్‌జెట్ విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు రూట్లలో ఇతర విమానయాన సంస్థల విమాన టికెట్ల ధరలు 45 శాతం నుంచి 57 శాతం వరకూ పెరిగాయి. వచ్చే నెల 9 నుంచి విస్తార సర్వీసులు న్యూఢిల్లీ: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తార విమానయాన సర్వీసులు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి సర్వీసులను ఢిల్లీ నుంచి ముంబైకు, అహ్మదాబాద్‌లకు నడుపుతామని విస్తార తెలిపింది. బుకింగ్స్ గురువారం రాత్రి పదిన్నర నుంచి ప్రారంభించామని పేర్కొంది. -
మధ్యప్రదేశ్, మిజోరంలలో నేడే పోలింగ్
భోపాల్/ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో సోమవారం 270 అసెంబ్లీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,90,860 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిసారి ప్రింట్ అవుట్ విధానం... దేశంలోనే తొలిసారిగా మిజోరంలోని 10 నియోజకవర్గాల్లో వీవీపీఏటీ(ఈవీఎం ప్రింట్ అవుట్) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఫలితంగా ఈవీఎంకు అమర్చిన వీవీపీఏటీ మిషన్ల ద్వారా ఓటరుకు తాను వేసిన ఓటుకు సంబంధించి ఓ ముద్రిత ప్రతి అందుతుంది. తద్వారా తాను వేసిన ఓటు సరిగా పడిందో లేదో అప్పటికప్పుడే పరిశీలించుకునే సౌలభ్యం సంబంధిత ఓటరుకు కలుగుతుం ది. నాగాలాండ్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఈసీ ఇప్పుడు మిజోరంలో అమల్లోకి తెస్తోంది.