
ముంబై: త్వరలో లక్షద్వీప్‌తో పాటు అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ మరింత పటిష్టమయ్యేందుకు ఇటీవల సమీకరించిన నిధులు దోహదపడగలవని ఆయన వివరించారు.
ప్రస్తుతం నిలిపివేసిన విమానాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సింగ్ ఈ విషయాలు తెలిపారు. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసిన నేపథ్యంలో లక్షద్వీప్‌కు స్పైస్‌జెట్ సర్వీసుల ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.