Lakshadweep
-
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్‌కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్‌లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్‌లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
Interim Budget 2024: లక్షద్వీప్‌కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్‌లను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్‌లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ను కేటాయించారు. సహజమైన బీచ్‌లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
లక్షద్వీప్ పై కీలక ప్రకటన: నిర్మలా సీతారామన్
-
దౌత్య సంబంధాల్లో సహనం ముఖ్యం
మాల్దీవుల్లోని ప్రస్తుత ప్రభుత్వం ‘ఇండియా ఔట్’ నినాదంతో గెలిచింది. భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీనికి తోడు లక్షదీవులు వర్సెస్ మాల్దీవుల సోషల్ మీడియా వివాదం చెలరేగింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాగే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియాకు అనుకూలం. ఈ ముఖ్యమైన వర్గాన్ని చీకాకు పెట్టేలా భారతీయ కార్యకలాపాలు ఉండకూడదు. విదేశాంగ విధానం అనేది ఎప్పటికప్పుడు ముగిసిపోయేది కాదు. అది స్థిరంగా కొనసాగాలి. 2023 నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ (భారత్ వెళ్లిపో) అనే ప్రజాకర్షక నినాదంతో గెలిచినప్పుడే భారత్–మాల్దీవుల సంబంధాలు మళ్లీ దెబ్బతింటాయని అందరూ భావించారు. బాధ్యతలు స్వీక రించిన వెంటనే, తమ దేశం నుంచి భారత రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ భారత్‌ను కోరారు. మాల్దీవులలోని వెయ్యికి పైగా ద్వీపాలు విస్తారమైన సముద్ర ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. అక్కడి అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత, దీవుల్లో విపత్తు సహాయ కార్యకలాపాలపై నిఘా కోసం భారత్ బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లను 75 మంది భారత సైనికులు నడుపుతున్నారు. మాల్దీవులు వ్యవస్థాపక సభ్యదేశంగా ఉన్న ‘కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్’లో భాగంగా సముద్ర భద్రతను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే దేశంలోని అతిపెద్ద ఆర్థిక మండలిలో భూజ లాధ్యయన సర్వేను భారత్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి కూడా కొత్త ప్రభుత్వం నిరాకరించింది. దీనిమీద భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ తమ అభ్యర్థనలను భారత్ అంగీకరించిందని ముయిజ్జూ చెబుతున్నారు. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో ఒక వికారమైన వివాదం చెలరేగింది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు. లక్షద్వీప్‌కు దక్షిణంగా ఉన్న ఈ దీవులు మాల్దీవుల కంటే మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించగలవని కొందరు సోషల్ మీడియాలో వాద నలు మొదలుపెట్టారు. వాటికి వ్యతిరేకంగానే మాల్దీవుల మంత్రులు ప్రతిస్పందించినట్లు కనబడింది. ఆ తర్వాత మాల్దీవులను బహిష్కరించాలని కొందరు భారతీయ ప్రముఖులు పిలుపునివ్వడంతో సోషల్ మీడియా యుద్ధం చెలరేగింది. కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణా మంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. ఇది ఆ దేశ పర్యా టక పరిశ్రమను దెబ్బతీసింది. అయితే ఒకటి మర్చిపోకూడదు. కోవిడ్ –19 మహమ్మారికి ముందు, ఈ పర్యాటకుల రాకపోకలలో చైనా మొదటి స్థానంలో ఉండేది. అన్ని ప్రయాణ ఆంక్షలను చైనా ఎత్తివేస్తే ఆ స్థానాన్ని తిరిగి ఆ దేశమే పొందే అవకాశం ఉంది. ముయిజ్జూ చైనా పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని’ ప్రకటించే సంయుక్త పత్రికా ప్రకటన వెలువడింది. గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (జీడీఐ) అనే మూడు కీలకమైన చైనా ప్రాజెక్టులలో పాల్గొనడానికి మాల్దీవులు సుముఖంగా ఉన్నట్లు ఈ ప్రకటన సూచిస్తోంది. ‘గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద జీడీఐ’లో మాల్దీవులు చేరింది. చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులను స్వాగతించింది. మాల్దీవుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రామాణికమైన చైనా మద్దతు ఉంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాలలో ఏదైనా బాహ్య జోక్యాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో పేరు ఎత్తని గురి ఇండియానే అని చెప్పనక్కరలేదు. అయితే చైనా, మాల్తీవుల ఉమ్మడి ప్రకటనలో రెండు ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి. 2017లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ బీజింగ్‌లో పర్యటించారు. చైనాకు అత్యంత అను కూలమైన స్థానాన్ని ఇచ్చేలా, ఇరు దేశాల మధ్య కుదిరిన వివాదా స్పద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద అమలు గురించి ఉమ్మడి ప్రకటనలో ఏ ప్రస్తావనా లేదు. అప్పటినుంచి అది సుప్తచేతనలో ఉంది. దాని పునరుద్ధరణ కోసం మాలేలోని చైనా రాయబారి ఒత్తిడి చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి తమకు అనుకూలమైన స్థానాన్ని ఇచ్చే పరిశీలనా కేంద్ర ఏర్పాటు కోసం చైనా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ గురించి కూడా ఉమ్మడి ప్రకట నలో ప్రస్తావన లేదు. ఇవి సాపేక్షంగా భారత్‌కు సానుకూలాంశాలు. ఈ పరిణామాలను భారత్ గమనించాలి. (దీవుల్లో పరిశోధన కోసం చైనా నౌక చేరుకుందన్న వార్తలు వచ్చాయి. అది ఫిబ్రవరిలో రానుందనీ, కానీ పరిశోధన కోసం మాత్రం కాదనీ మాల్దీవులు చెబుతోంది.) 2023 డిసెంబర్ 7న మారిషస్‌లో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కు మాల్దీవులు గైర్హాజరవడం ఒక ఎదురుదెబ్బ. భారత్ 2011లో శ్రీలంక, మాల్దీవులతో ఈ త్రైపాక్షిక సముద్ర భద్రతా వేదికను ప్రారంభించింది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రతతో కూడిన ఎజెండాపై, ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఈ వేదిక ముఖ్య మైన పాత్ర పోషించింది. 2020లో మారిషస్ ఈ కూటమిలో చేరింది. ఇటీవలి మారిషస్ సమావేశంలోనే, సీషెల్స్, బంగ్లాదేశ్ పరిశీలకులుగా చేరాయి. తర్వాత ఇవి పూర్తి సభ్య దేశాలు కావచ్చు. చైనా మెప్పు కోసం మాల్దీవులు ఈ సమావేశానికి హాజరుకాలేదని అనుకోవచ్చు. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? ఒకటి, సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా క్షమా పణ చెప్పనప్పటికీ, అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేయడంతోపాటు, తమ మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండించిన విషయాన్ని మనం విస్మరించకూడదు. రెండు, మాల్దీవులలోని పార్లమెంట్లో ఇండియాకు అనుకూలంగా ఉండే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం చలాయిస్తోంది, దీని ప్రతినిధులు మోదీ వ్యతిరేక ట్వీట్లను తీవ్రంగా ఖండించారు, అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా దీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ ఇస్తున్న మద్దతు, సద్భావన గురించి గొప్పగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. మాలెలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ముయిజ్జూ అధ్యక్షుడు కావడానికి ముందు రాజధాని మేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారత అను కూల రాజకీయ శక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. భారత్ పట్ల సానుకూల భావాలను కలిగి ఉన్న ఈ బలమైన, ముఖ్యమైన వర్గాన్ని చికాకు పెట్టేలా మన కార్యకలాపాలు ఉండకూడదు. భారత విదేశాంగ మంత్రి ఇటీవలి ప్రకటన, రెండు దేశాల మధ్య బలమైన ప్రజా సంబంధాలను సమర్థించడంలోని ప్రాముఖ్యతను సూచిస్తోంది. అదే సమయంలో, మాల్దీవుల వ్యతిరేక సోషల్ మీడియా వ్యాఖ్యల వరదలకు ఆయన ప్రకటన ఒక ముఖ్యమైన దిద్దుబాటుగా వెలువడింది. విదేశాంగ విధానం ఎప్పటికప్పుడు ముగిసే ఉపకథలా ఉండ కూడదు. పొరుగు దేశాలలోని రాజకీయాలు అనుకూలంగా లేన ప్పుడు కూడా స్థిరంగా, బలమైన ఒప్పుదలతో కొనసాగాలి. భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అక్కడి పరిణామాలపై తన మాటలు, చేతలను భారత్ జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. అంతి మంగా సహనమే ఫలితాన్ని ఇస్తుందని మరచి పోకూడదు. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
దారితప్పిన మాల్దీవులు
ఏదో యథాలాపంగా, ఎంతో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన మాల్దీవుల పంచాయితీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు మరింత తేటతెల్లం చేస్తున్నాయి. భారత వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్‌లో అధికారంలో కొచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మెయిజూ ఇప్పటికీ అదే పోకడలు పోతున్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఒక ఛాయాచిత్రాన్ని పోస్టు చేసినప్పుడు ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న రగడ తర్వాత ఆ దేశం ఒకటొకటిగా చర్యలు మొదలుపెట్టింది. మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధ్రువ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చే మార్చి 15లోపు దేశంలోవున్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని తుదిగడువు విధించారు. కేవలం 88 మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే భారత పర్యటనకొచ్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి మెయిజూ టర్కీని ఎంచుకున్నారు. ఆ తర్వాత యూఏ ఈలో జరిగే కాప్–28 సదస్సుకెళ్లారు. తాజాగా ఈ నెల 8 నుంచి 12 వరకూ చైనాలో పర్యటించారు. ‘భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకూ లొంVýæద’ని హెచ్చరించారు. వీటన్నిటి వెనుకా ఉన్నదెవరో సులభంగానే పోల్చుకోవచ్చు. మనకూ, మాల్దీవులకూ వున్న బంధం చాలా పాతది. అలాగని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు అక్కడ కొదవేమీ లేదు. దేశ ప్రజానీకంలోవున్న భారత్ అనుకూలతను ఎలాగైనా పరిమార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలనూ, వారి కార్యాచరణనూ తప్పుబట్టడానికి సందు దొరకని ప్రతిసారీ భారత్ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించటం అక్కడ పరిపాటి. గతంలో అబ్దుల్లా యామీన్ సైతం మూడు దశాబ్దాల తన ఏలుబడిలో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, చైనాతో అంటకాగి దేశాన్ని నిండా ముంచారు. ప్రశ్నించినవారిని ఖైదు చేశారు. ఇది సరికాదంటూ తీర్పునిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలను జైలుకు పంపారు. ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించింది. వీటివల్ల చెల్లించాల్సిన వడ్డీలే అపరిమితంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను గద్దెనెక్కించారు. నియంతృత్వ పోకడలకు పోలేదన్న మాటేగానీ... అవినీతిని అంతమొందిస్తానన్న వాగ్దానాన్ని సోలిహ్ నిలుపుకోలేకపోయారు. ఒక అవినీతి కేసులో యామీన్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడిన మాట వాస్తవమే అయినా, అది మినహా అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోయారు. ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఈ అసంతృప్తిని ప్రస్తుత అధ్యక్షుడు మెయిజూ ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. అయిదున్నర లక్షలమంది జనాభాగల మాల్దీవుల్లో మూడులక్షలమంది సున్నీ ముస్లివ్ులు. మతం పేరుతో వీరిలో అత్యధికులను తనవైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతక్రితం యామీన్ ప్రయత్నించినా ప్రయో జనం లేకపోయింది. కాకపోతే ఈ రాజకీయ క్రీడ చివరకు సెక్యులర్ పార్టీల వైఫల్యంగా మారి మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మెయిజూ అయినా, మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్ కీలకపాత్రను తోసిపుచ్చలేరు. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా భారత్‌దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే వ్యయం పెరగటం మినహా ప్రయోజనం శూన్యం. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. గతంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంత నష్టపోయిందో, ఎలా దివాలా తీసిందో అక్కడి పరిణామాలే తేటతెల్లం చేశాయి.అధికారంలోకొచ్చిన నాటి నుంచీ మెయిజూ పాలనపై దృష్టి నిలపడానికి బదులు చైనాను సంతుష్టిపరచటానికి సమయం వెచ్చిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఒకే తరహా వ్యవస్థలు,రాజకీయ భావాలుండటం సాధ్యం కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా అధికారంలో కొచ్చాక బాధ్యతగా మెలగాలి. దేశ గరిష్ఠ ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలి తప్ప, మూర్ఖత్వంతో అవతలివారిని నొప్పించటమే ధ్యేయం కాకూడదు. మెయిజూకు ఎన్నికల జాతరలో తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. లోగడ పాలించిన యామీన్‌కు చైనాతో ఉన్న సాన్నిహిత్యం, ఇటీవల గద్దె దిగిన సోలిహ్ భారత్ అనుకూల ధోరణి జగద్వితమే అయినా వారిద్దరూ ఇరు దేశాలకూ సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతోకొంత దాన్ని చేసిచూపేవారు. మెయిజూకు ఆ పరిణతి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదన్నట్టు ఇటీవల తైవాన్‌లో చైనాను గట్టిగా వ్యతిరేకించే పక్షమే తిరిగి అధికారంలోకి రాగా, తగుదునమ్మా అంటూ తమది ‘వన్ చైనా’ విధానమేనంటూ ప్రకటించారు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1,190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలోవుంటూ మన భద్రత రీత్యా హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్ – చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చి బొప్పి కట్టించుకునే చేష్టలకు దూరంగా ఉండటం అన్నివిధాలా దానికే శ్రేయస్కరం. -
ఛలో లక్షద్వీప్.. మంచిది కాదు!
కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్‌కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన. లక్షద్వీప్‌లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన. -
Maldives Row: మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోండి!
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్‌ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్‌కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు. తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు. అయితే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్ మును మహవర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు మును మహవర్ తెలిపారు. ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. చదవండి: Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్‌కు ఫేవర్! -
బై బై మాల్దీవులు చలో లక్షద్విప్
సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ వందలాది మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల ప్రయాణం కావడం, ఎక్కువ సంఖ్యలో దీవులు, ఆకట్టుకునే బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో మూడు, నాలుగు రోజుల పాటు గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ టూర్లు పూర్తిగా తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు స్వర్గధామంగా భావించే మాల్దీవుల పట్ల నగరవాసులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. పర్యాటకులతోపాటు కొత్తగా పెళ్లయిన జంటలు మాల్దీవులను హనీమూన్‌కు ఎంపిక చేసుకుంటారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా మాల్దీవులు కొంతకాలంగా కేరాఫ్‌గా మారింది. కానీ ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంతోపాటు నగరం నుంచీ అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఇప్పటికే ప్యాకేజీలు బుక్ చేసుకున్న వాళ్లు పర్యటనలు వాయిదా వేసుకుంటుండగా, కొత్తగా ఎలాంటి బుకింగ్‌లు కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు తెలిపాయి. పలు ఎయిర్‌లైన్స్, ట్రావెల్స్ సంస్థలు విమాన, ప్యాకేజీ చార్జీలను తగ్గించినప్పటికీ మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నగరానికి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని వెళ్లే వాళ్లు కూడా తమ పర్యటనలను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా ఉండే డిమాండ్ కూడా బాగా తగ్గిందన్నారు. లక్షద్విప్ వైపు సిటీ చూపు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా నగర పర్యాటకులు లక్షద్విప్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో లక్షద్వీప్‌కు పర్యాటక ప్యాకేజీలు, విమాన చార్జీలు కూడా పెరిగాయి. లక్షద్విప్‌లో రెండు రోజుల క్రూయిజ్ పర్యటనకు గతంలో రూ.20 వేలు ఉంటే ప్రస్తుతం రూ.35 వేల వరకు ప్యాకేజీ ధరలు పెరిగాయి. ప్యాకేజీల వివరాలను తెలుసుకొనేందుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన ఒక పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. లక్షద్విప్తోపాటు సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకూ సిటీజనులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు గోవా, డామన్ డయ్యూ, కోవలం తదితర ప్రాంతాలకు సైతం సిటీ టూరిస్టులు తరలివెళ్తున్నారు. ప్యాకేజీల్లో భారీ రాయితీలు ఒక్కసారిగా మాల్దీవులకు వెళ్లే టూరిస్టులు తగ్గిపోవడంతో ట్రావెల్స్ సంస్థలు, ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గతంలో మూడు రోజుల ప్యాకేజీ రూ.55,000 నుంచి రూ.72,000 వరకు ఉంటే దాన్ని ఇప్పుడు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు తగ్గించినట్లు ఒక ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అలాగే రూ.లక్షల్లో ఉండే ప్రీమియం ప్యాకేజీలపైనా భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రీమియం ప్యాకేజీలపై రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గించినట్లు మరో ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలో సింగిల్ జర్నీ గతంలో రూ.20 వేల వరకు ఉంటే ఇప్పుడు రూ.15వేల వరకు తగ్గించారు. మరోవైపు ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నవారు మాత్రం తమ పర్యటనలను రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకుంటున్నారు. బుకింగ్‌లను రద్దు చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో వాయిదా వేసుకుంటున్నారు. కానీ కొత్తగా బుకింగ్‌లు మాత్రం కావడం లేదు. అన్ని ట్రావెల్స్ సంస్థల్లో మాల్దీవులకు బుకింగ్‌లు పూర్తిగా స్తంభించాయి. -
లక్షద్వీప్‌కు త్వరలో స్పైస్‌జెట్ సర్వీసులు
ముంబై: త్వరలో లక్షద్వీప్‌తో పాటు అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ మరింత పటిష్టమయ్యేందుకు ఇటీవల సమీకరించిన నిధులు దోహదపడగలవని ఆయన వివరించారు. ప్రస్తుతం నిలిపివేసిన విమానాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సింగ్ ఈ విషయాలు తెలిపారు. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసిన నేపథ్యంలో లక్షద్వీప్‌కు స్పైస్‌జెట్ సర్వీసుల ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. -
లక్షద్వీప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మోదీ మాస్టర్ ప్లాన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో చేపట్టిన పర్యటన.. దేశీయ పర్యాటకుల్లో ఆ దీవుల సముదాయంపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యుద్ధ విమానాలతోపాటు వాణిజ్య విమాన సర్వీసులను సైతం నడిపేందుకు వీలైన విమానాశ్రయాన్ని లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవిలో నిర్మిస్తే బాగుంటుందని యోచిస్తోంది. ఇప్పటి వరకు మినికాయ్ దీవిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే రక్షణ శాఖ ప్రతిపాదన మాత్రమే కేంద్రం వద్ద ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సైనిక, పౌర అవసరాలకు సైతం సరిపోయేలా ఎయిర్‌పోర్టును నిర్మించే సరికొత్త ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలకు బేస్‌గా, పెరుగుతున్న పైరసీ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైందిగా ఇక్కడి ఎయిర్‌పోర్టు మారేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అరేబియా సముద్రంపై నిఘాను మరింత విస్తృతం చేసుకునేందుకు మినికాయ్ వద్ద ఎయిర్‌పోర్టు వైమానిక దళానికి ఉపయోగపడనుంది. ప్రస్తుతం లక్షద్వీప్ మొత్తంలో ఒకే ఒక్క విమానాశ్రయం అగట్టిలో ఉంది. ఇక్కడ చిన్న విమానాలు మాత్రమే దిగేందుకు అవకాశం ఉంది. మినికాయ్ దీవిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందనుంది. మరోవైపు, భారత్‌తో వివాదం తమకు భారీగా నష్టం చేసేలా కన్పిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు చెందిన పర్యాటక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన తమ మంత్రులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి. -
మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్
‘లక్షద్వీప్’ విషయంలో మాల్దీవులు-భారత్ మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం భారత్‌పై మాల్దీవ్ మంత్రులు వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద వాతావరణం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల వివాదంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఈ విషయంలో మోదీకి మద్దతుగా నిలిచి శరద్ పవార్.. ఇతర దేశాలకు చెందిన వారు ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము(దేశం) అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి.. వేరే దేశస్థులు మా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని మేము అంగీకరించము. మేము ప్రధానమంత్రి పదవిని గౌరవిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా బయటి వాళ్లు ఏం మాట్లాడినా మేం ఊరుకోం’ అని పేర్కొన్నారు. కాగా గత వారం ప్రధాని లక్ష్యద్వీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. కొన్ని గంటలపాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. సంబంధిత వార్త: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా లక్షద్వీప్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. చాలా వరకు భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. బైకాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరోవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌పై విమర్శలు చేసిన మంత్రులపై వేటు వేసింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చదవండి: లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు! -
లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి మొదటి వారంలో లక్షద్వీప్‌లో పర్యటించారు.కవరత్తిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని గంటల పాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకోవైపు,మాల్దీవుల మంత్రులు లక్షద్వీప్ పరిశుభ్రత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆ ప్రభుత్వం వేటు కూడా వేసింది. వీటన్నిటి ప్రభావంతో నేడు ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలమంది గూగుల్, మేక్ మై ట్రిప్ బాట పట్టారు. ఈ 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఆన్ లైన్ అన్వేషణ పెరిగిందని కేంద్ర సమాచార శాఖ విభాగాలు వెల్లడించాయి. తమ వెబ్ సైట్ లో లక్షద్వీప్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య అనూహ్య రీతిలో పెరిగిందని ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ కూడా ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ ద్వీపంలో గడపడమే కాక సాహసమైన ప్రయాణం కూడా చేశారు. సముద్ర గర్భంలో తిరుగుతూ మిగిలిన జీవరాసుల జీవనాన్ని కూడా దర్శించుకున్నారు. అంత పెద్ద ద్వీపంలో ఇంతటి సాహసం చేయడం మోదీకే చెల్లిందనే ప్రశంసలు,ఇటువంటి సాహసకృత్యాలు ఎందుకనే విమర్శలు రెండూ వెల్లువెత్తాయి. లక్షద్వీప్ లో అద్భుతమైన బీచ్ లు ఉండడమే కాక,భోజనం, ఆహారపదార్ధాలు,ఆతిధ్యం అద్భుతంగా వున్నాయని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడంతో భారతీయులలో ఈ ద్వీపాలను దర్శించాలనే ఆరాటం పెరిగింది. మిగిలిన దేశాల వారికీ అంతే ఆసక్తి పెరిగింది. మాల్దీవ్ ప్రభుత్వానికి మాత్రం అసూయ,భయం పెరిగాయి. భారత్ లోని బీచ్ లను,ద్వీపాలను అన్వేషించాలనే ఆరాటం ప్రపంచ పర్యాటకులలో మరింత ఎక్కువైంది. ఒక్క సంఘటన ఇంత ప్రభావం చూపిందన్నమాట! లక్షద్వీప్ పై మాల్దీవులు అక్కసు వెళ్ళ గక్కుతూ,కువిమర్శలు చేస్తున్న వేళ,మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేయాలని నెటిజన్లు మేక్ మై ట్రిప్ వారికి సూచనలు పంపుతున్నారు. ఈ వేడి రగులుతున్న సందర్భంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ తో సయోధ్య కోసం అర్రులు జాస్తోంది. మన దేశ సినిమా,క్రీడారంగ ప్రముఖులు సైతం మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారత ద్వీపాలను దర్శించాలని పిలుపునివ్వడం గమనార్హం! భారత్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేస్తోంది.ప్రధాని చేసిన లక్షద్వీప్ పర్యటన,ప్రచారం కూడా అందులో భాగమేనని అర్థం చేసుకోవాలి. లక్షద్వీప్ లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెరగాల్సివుంది. పర్యాటక విధానంలో యువతకు ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇంతగా చర్చకు,శోధనకు కేంద్రంగా మారిన ఈ ద్వీపం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దేశంలోనే అత్యల్ప సంఖ్యలో జనాభా కలిగిన అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాలు వున్నాయి. ఈ ప్రాంత రాజధాని కవరత్తి నగరం.లక్షద్వీప్ పేరుతో ఒక జిల్లా కేంద్రం కూడా వుంది. లెక్కల్లోలేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి.అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా వున్నారు. మిగిలిన 17 దీవులలో జనాభా శూన్యం. సముద్రగర్భంలో మాత్రం అనేక జీవరాసులు వున్నాయి. ఆగట్టిలో ఎయిర్ పోర్ట్ వుంది. కొచ్చిన్ నుంచి ఇక్కడికి విమానాల రాకపోకలు వున్నాయి. ఇక్కడ వున్నదంతా ముస్లిం జనాభానే. కాకపోతే,వీళ్లంతా మలయాళం యాసలో మాట్లాడుతారు. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటగా వచ్చినట్లు చెబుతారు.ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపే. మలయాళం,జెసేరీ ( ద్వీపంలోని స్థానిక భాష ),తమిళం,మలయాళ యాసతో అరబిక్,మహ్ల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా మలయాళం -అరబిక్ సంస్కృతి ఇక్కడ రాజ్యమేలుతోంది. ఈ దీవులు మాల్దీవులలోని చాగోస్ దీవులను పోలివుంటాయి. "మీరు సాహసాలు చెయ్యాలనుకుంటున్నారా? అయితే,లక్షద్వీప్ లో 'స్మార్కెలింగ్ చేయండి. మీ సాహసాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోండి "అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచిస్తున్నారు.ఇది అద్భుతమైన అనుభవమని కితాబు ఇస్తున్నారు. స్మార్కెలింగ్ అంటే?సముద్రంలో చేసే ఒక తరహా డ్రైవింగ్.స్మార్కెల్ అనే ట్యూబ్, డ్రైవింగ్ మాస్క్ వేసుకొని సముద్రగర్భంలో ఈత కొట్టడం అన్నమాట! దీని ద్వారా సాగర గర్భంలోని జీవరాశులను, పర్యావరణాన్ని తెలుసుకొనవచ్చు. మన ప్రధాని ఆ పని చేశారు. మొత్తంగా చూస్తుంటే, మాల్దీవులు -లక్షద్వీప్ మధ్య భవిష్యత్తులో పెద్ద పోటీ జరుగనుంది. వెరసి,మన పర్యాటకం ఊపందుకోనుంది. 👉: #Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు) రచయిత : మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
#Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు)
-
మాల్దీవుల బాయ్‌కాట్‌కు పిలుపు
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. -
#Maldives Row: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన.. టీమిండియా పేసర్ స్పందన
#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు. కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్‌ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. మాకేం సంబంధం లేదు దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం. దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
India-Maldives Row:మాల్దీవుల వివాదం: లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ కీలక వ్యాఖ్యలు
లక్ష్యదీప్ వ్యవహారంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ మండిపడ్డారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మొదటిసారి అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ స్పందించారు. ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలను భారత్ అస్సలు సహించదని అన్నారు. అదీ కాక, భారత దేశంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమయంలో భారతప్రధాన మంత్రికి తమదైన శైలిలో అండగా నిలిచిన భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనుచిత వ్యఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలని లేదని, తమ విలువలు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అన్నారు. సదరు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశాన్ని, తమ దేశ ప్రధానమంత్రిని కించపరిచితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. లక్ష్య దీప్‌కు మాల్దీవుల టూరిస్టులను అనుతిస్తారా? అని మీడియా ప్రశ్నకు.. అందరిని స్వాగతించడమే తమ దేశ సంస్కృతి అని అన్నారు. మాల్దీవుల సందర్శకులు లక్ష్యదీప్కు వచ్చి, ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. అభినందిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వారు అలా ఉంటే తమకు కూడా సంతోషమేనని అన్నారు. వారి రాకపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తప్పకుండా మాల్దీవుల టూరిస్టులు కూడా లక్ష్యదీప్కు రావాలని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ లక్ష్యదీప్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విసయం తెలసిందే. అయితే కొంత మంది నెటిజన్లు మాల్దీవుల కంటే కూడా లక్ష్యదీప్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీ వీడియో, ఫొటోలపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమై.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక.. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం -
Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది. 3,400 శాతం పెరిగిన సెర్చింగ్! లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు! ట్రెండింగ్‌లో లక్షద్వీప్ మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. -
అనుచిత వ్యాఖ్యల చిచ్చు
బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేస్తే, ఫలితం భారంగానే ఉంటుంది. మాల్దీవులకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు మంత్రులకు బహుశా అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియమ్ షివునా, మల్షా షరీఫ్, మహజూమ్ మజీద్... భారత్‌కూ, భారత ప్రధానికీ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, పదవి నుంచి సస్పెండయ్యారు. రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బోలెడంత రచ్చ జరుగుతోంది. మాలే మంత్రుల వ్యాఖ్యలపై భారత ప్రముఖులు గట్టిగానే స్పందించారు. మాల్దీవ్స్ బహిష్కరణ నుంచి మన సొంత ద్వీపాల పర్యాటకాభివృద్ధి దాకా నినాదాలు జోరందుకున్నాయి. వ్యవహారం లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. జరిగిన కథ గమనిస్తే – ‘మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్’ అంటూ, అక్కడి సముద్రతీరంలోని తన ఫోటో జోడించి జనవరి 5న భారత ప్రధాని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద మాల్దీవుల మంత్రులు, ఎంపీల అనుచిత వ్యాఖ్యలు ఇంత దూరం తెచ్చాయి. మంత్రి అబ్దుల్లా మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి, లక్షద్వీప్‌ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికేనని విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది. ఆయనలా అంటే, మరో మంత్రి మరియమ్ షియునా ‘ఎక్స్’లో ఇజ్రాయెల్‌తో భారత సంబంధాలను ప్రస్తావించారు. ఆమెతో మరో మహిళా సహచర మంత్రి మాల్షా స్వరం కలిపారు. భారత పర్యాటక ప్రాంతాలు, గదులు దుర్వాసన వేస్తుంటాయన్న నోటి తీట మాటలూ వచ్చాయి. ఇవన్నీ చిచ్చు రేపేసరికి, చైనా పర్యటనలోని మాల్దీవుల అధ్యక్షుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. మంత్రుల సస్పెన్షన్, వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ వివరణ చకచకా జరిగాయి. భారత్‌లోని పర్యాటక ప్రాంతాల గురించి, ప్రధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మన వారికి కోపం తెప్పించింది. సెలవులకు మాల్దీవులకు వెళదామనుకున్న వేలాది భారతీయులు టికెట్లను రద్దు చేసుకుంటూ, సదరు స్క్రీన్షాట్లను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటున్నారు. అలాగే, దేశంలోనే ఉన్న అందమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన దీవుల గురించి అన్వేషణ ఆరంభమైంది. ఈ వివాదం పుణ్యమా అని ఇంటర్నెట్లో లక్షద్వీప్ గురించి అన్వేషణ గత 20 ఏళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, గత ఏడాది లక్షద్వీప్‌కు 10 వేల మంది లోపే వెళితే, మాల్దీవులకు వెళ్ళిన పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉందని గమనించాలి. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్లు రేపి, ప్రస్తుత వివాదాన్ని ఆత్మాభిమాన, ఆత్మనిర్భర అంశంగా, లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా చేస్తే అది వట్టి హ్రస్వదృష్టి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు నిత్యం సాగుతున్న వేళ, మాల్దీవ్స్‌తో మన దీర్ఘకాలిక బంధం దెబ్బతినకుండా చూడడం ముఖ్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు కీలక పొరుగుదేశం మాల్దీవులు. ‘ప్రాంతీయ భద్రత, పురోగతి’ (సాగర్) లాంటి ప్రయత్నాల్లో ఆ దేశానిది ప్రధాన పాత్ర. అలాగే, ‘పొరుగుకు పెద్ద పీట’ లాంటి భారత ప్రభుత్వ ప్రాధాన్యాలకు మాల్దీవులు ఓ ప్రధాన కేంద్రం. అలాంటి మాల్దీవు లతో ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయి. భారత వ్యతిరేక అజెండాతో గెలిచి, గత 2023 నవంబర్‌లో మహమ్మద్ మొయిజు మాల్దీవ్స్‌కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే మాల్దీవుల ద్వీపబృందం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించాల్సిందిగా కోరారు. భారత్ మాత్రం హిందూ మహాసముద్రంలోని సుదూర ద్వీపాలకు వైద్యసాయానికై తమ సైనికులు అక్కడున్నారంది. తాజా వివాదాల వేళ మరో పొరుగు దేశం చైనా వైఖరి పక్క ఇల్లు తగలబడుతుంటే, చలి కాచుకుంటున్నట్టుంది. భారత్, మాల్దీవుల మధ్య రచ్చను అది ఆస్వాదిస్తోంది. మాల్దీవుల విదేశాంగ విధానం బాగుందనీ, ఆ దేశాధ్యక్షుడు భారత్‌తో సరైన రీతిలో వ్యవహరిస్తున్నారనీ చైనా మీడియా ప్రశంసిస్తోంది. అసలీ అంశంలో ఢిల్లీయే విశాల దృక్పథంతో ఉండాలంటూ బీజింగ్ సుద్దులు చెబుతోంది. ఇప్పటికే భారత్‌కు దక్షిణాన, పశ్చిమాన వివిధ దేశాల్లో చైనా పాగా వేసింది. హిందూ మహాసముద్రంలో కీలకమైన మాల్దీవుల్ని కూడా తన బుట్టలో వేసుకొనే పనిలో ఉంది. ఢిల్లీతో దీర్ఘకాలిక దౌత్యబంధమున్న మాలే సైతం క్రమంగా చైనా వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మరోపక్క మాలేలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఆందోళన రేపే అంశం. అత్యధికులు ముస్లిమ్లైన మాల్దీవుల నుంచి 600 – 700 మంది ఇస్లామిక్ తీవ్రవాద ‘ఐసిస్’లో చేరారని లెక్క. ఈ పరిస్థితుల్లో మాల్దీవులు కేంద్రంగా వ్యూహాత్మక ప్రయోజనాలెన్నో ఉన్న భారత్ ఆచితూచి వ్యవహరించాలి. నెటిజన్ల ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ లాంటి వ్యాఖ్యలు వినడానికి బాగున్నా, భౌగోళిక అనివార్యతల రీత్యా కుదిరేపని కాదు. సంచలన ప్రకటనల కన్నా సవ్యమైన కార్యాచరణే మన పర్యాటకాభివృద్ధికి కీలకం. ఇందులో మన పాలకులు చేసింది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ. లక్షద్వీప్‌కు ప్రాముఖ్యం కల్పించాలని మోదీ సర్కార్ భావిస్తే తప్పు లేదు కానీ, ఆ చిరు కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నిర్మాణాలతో జీవ్యావరణాన్ని దెబ్బ తీసే యత్నాలు మానాలి. మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం బాట పట్టి అంతా కలిపి దశాబ్దిన్నరే అయింది. కొద్ది నెలల క్రితమే వచ్చిన కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు. ఈ పరిస్థితుల్లో చేతి నిండా పని ఉన్న మాల్దీవ్స్ మంత్రులు భారత్ గురించి, భారత్‌లో భాగమైన లక్షద్వీప్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అది వారి పరిధి కూడా కాదు. తాగునీటి కొరత నుంచి ఇటీవలి కోవిడ్ నియంత్రణ దాకా పలు సందర్భాల్లో మానవతతో అండగా నిలిచిన భారతే తాము నమ్మదగిన, చిరకాల మిత్రుడని గ్రహించాలి. -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్
మాలె: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ..? అని ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. 'భవిష్యత్తులో లక్షద్వీప్ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. లక్షద్వీప్ ప్రజలు ఎల్లప్పుడూ పర్యాటక కోణంలో ఉండాలని కోరుకునే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాను. దీంతో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దానితో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?' అని ఆయన ప్రశ్నించారు. ఇదీ జరిగింది..! ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో మాల్దీవులు ఆ మంత్రులను పదవి నుంచి తప్పించింది. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు!
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అక్కడ ప్రధాని మోదీ సాహసాలకు సంబంధించిన పలు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్షద్వీప్ భారతదేశానికి చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. దీని వైశాల్యం 32.62 చదరపు కిలోమీటర్లు. అయితే లక్షద్వీప్ భారతదేశంలో ఎలా భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షద్వీప్ 36 చిన్న ద్వీపాల సమూహం. అయితే ఇక్కడి 10 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడి జనాభాలో 96 శాతం మంది ముస్లింలు. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ మొత్తం జనాభా 64473. ఇక్కడ అక్షరాస్యత రేటు 91.82 శాతం. లక్షద్వీప్ 1947 ఆగస్టులో భారతదేశంలో భాగంగా మారింది. భారత్- పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇది జరిగింది. నాటి రోజుల్లో 500కు మించిన సంస్థానాలను ఏకం చేయడంలో నాటి భారత హోం మంత్రి , ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను పాకిస్తాన్లో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే లక్షద్వీప్‌ను ఎవరూ పట్టించుకోలేదు. స్వాతంత్ర్యం తరువాత లక్షద్వీప్ అటు భారత్, లేదా ఇటు పాకిస్తాన్ అధికార పరిధిలో లేదు. పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ లక్షద్వీప్ ముస్లిం మెజారిటీ ప్రాంతంకావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అదే సమయంలో భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లక్షద్వీప్ గురించి ఆలోచించినట్లు చరిత్రకారులు తెలిపారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ తన యుద్ధనౌకను లక్షద్వీప్‌కు పంపింది. ఇదే సమయంలో సర్దార్ పటేల్ భారత సైన్యాన్ని లక్షద్వీప్ వైపు వెళ్లి.. అక్కడ భారత జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశించారు. దీంతో భారత సైన్యం.. పాక్ కన్నా ముందుగా లక్షద్వీప్‌కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కొంతసేపటికి పాక్ యుద్ధ నౌక కూడా అక్కడికి చేరుకుంది. అయితే వారు భారత త్రివర్ణ పతాకాన్ని చూసి, నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లక్షద్వీప్ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. అయితే నాటి పరిస్థితుల్లో భారత సైన్యం లక్షద్వీప్‌ను చేరుకోవడంలో అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చరిత్ర నిపుణులు అంటుంటారు. లక్షద్వీప్ 1956, నవంబరు ఒకటిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. అప్పుడు దీనిని లక్కడివ్-మినీకాయ్-అమిని దీవి అని పిలిచేవారు. 1973, నవంబరు ఒకటిన ఈ ద్వీపానికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. భౌగోళిక కారణాల రీత్యా లక్షద్వీప్‌కు పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతం హోదా లభించింది. -
లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్.. పనిచేస్తున్న పర్యాటక దేశ వెబ్సైట్లు
మాలె: మాల్దీవులకు చెందిన ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సాంకేతిక సమస్యతో శనివారం రాత్రి కొంత సమయం పాటు పనిచేయకుండా పోయిన మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, టూరిజం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లను కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు. ప్రభుత్వ ప్రధాన వెబ్సైట్లు సాంకేతిక సమస్య తలెత్తి కొంత సేపు డౌన్ అయ్యాయని దేశ ప్రెసిడెంట్ ఆఫీసు ఎక్స్‌లో పోస్టు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ) వెబ్సైట్ల పూర్తిస్థాయి పునరుద్ధరణ కోసం పనిచేస్తోందని ప్రెసిడెంట్ ఆఫీసు తెలిపింది. ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నామని ప్రకటించింది. మరోపక్క ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఇటీవల సందర్శించిన తర్వాత ఆయన ఫొటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ఎక్స్‌లో చేసిన పోస్టులు దుమారం రేపాయి. రమీజ్ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌లో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ వివాదానికి మాల్దీవుల వెబ్సైట్లు డౌన్ అవడానికి సంబంధం లేదని తెలుస్తోంది. Please note that the President’s Office website is currently facing an unexpected technical disruption. NCIT and other relevant entities are actively working on resolving this promptly. We apologise for any inconvenience caused. Thank you for your understanding and patience. pic.twitter.com/jUOopsQTUs — The President's Office (@presidencymv) January 6, 2024 The move is great. However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. 🤷🏻♂️ https://t.co/AzWMkcxdcf — Zahid Rameez (@xahidcreator) January 5, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం -
నీటి అడుగున ప్రధాని మోదీ సాహస క్రీడ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జల చరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్కు ప్రయత్నించానని తెలిపారు. న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష ద్విప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సముద్రం అడుగున తన సాహసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. అడ్వెంచర్‌ను ఇష్టపడేవారికి లక్షద్వీప్ సందర్శన అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్ను(నీటి అడుగున సాహసం) ప్రయత్నించానని తెలిపారు. అది మర్చిపోలేని అనుభవమని ఉద్ఘాటించారు. లక్షద్విప్ సముద్ర తీరాల్లో ఉదయం పూట నడక, బీచు ఒడ్డున కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలను సైతం మోదీ షేర్ చేశారు. ఆయన ఈ నెల 2, 3వ తేదీల్లో లక్షద్విప్‌లో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. లక్షద్వీప్ అందచందాలతోపాటు అక్కడి ప్రశాంతత మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయని పేర్కొన్నాను. అలాగే అక్కడి ప్రజలు చూపిన ఆత్మియత, గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వివరించారు. లక్షద్విప్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. -
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
లక్షద్వీప్ అందాలకు ప్రధాని మోదీ ఫిదా
-
PM Modi Lakshadweep: ప్రధాని మోదీ.. జస్ట్ వావ్
కవరత్తి: తన పర్యటనల్లో వైవిధ్యం.. కొత్తదనం రెండూ ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ రెండు రోజుల పర్యటనలో ‘వావ్’ అనిపించేలా ఫోజులతో ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్ ఉండాల్సిందేనని సూచించారాయన. అంతకు ముందు.. And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj — Narendra Modi (@narendramodi) January 4, 2024 ప్రకృతి అందాలతో పాటు, లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అంటూ సాగర తీరాన నడుస్తూ.. సేదతీరుతూ ఫొటోల్ని షేర్ చేశారు. -
లక్షద్వీప్ ఎంపీకి ఎదురుదెబ్బ
ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కుMohammed Faizal ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కనపెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ.. ఆరువారాల గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో.. ఆ గడువులోగా(ఆరువారాల) లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో లోక్‌సభ ఎంపీని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అనర్హత వేటు.. ఎత్తివేత అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో.. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం.. జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్ విడుదల చేసింది. 35లో నలుగురు మాత్రమే.. ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘‘ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. -
అనర్హతవేటు ఎత్తివేత.. ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
సాక్షి, ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది లోక్‌సభ. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్‌ను ఉదయమే రిలీజ్ చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో కింది కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించినా, లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం తనను అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారాయన. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. బుధవారం కూడా వాదనలు వినాల్సి ఉంది. ఈ లోపే లోక్‌సభ సచివాలయం ఆయన అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ ద్వారా ఆసక్తి రేకెత్తింది. -
నా లోక్‌సభ సభ్యత్వాన్ని... వెంటనే పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటు ఎత్తేసి లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హత్య కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్థారించి కవరత్తీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ జనవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తేయలేదని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఎంపీ పేర్కొన్నారు. -
లక్షద్వీప్ ఎంపీపై వేటు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది . ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్లు జైలు శిక్షపడిన లక్ష్యద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. లోక్‌సభ సెక్రటేరియట్ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహమ్మద్ ఫైజల్ ఎన్సీపీ ఎంపీ. 2009లో కాంగ్రెస్ నేత మహమ్మద్ సాలిపై కొంతమంది సమూహంతో వెళ్లి దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫైజల్ సహా మొత్తం 32 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫైజల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది సెషన్స్ కోర్టు. బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఆయన కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ రద్దు చేసింది. చదవండి: మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. -
లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కవరాట్టి: హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్‌కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకున్నదని ఫైజల్ ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్‌పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్‌ని ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు నిలపగలిగారు. -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
తొలిసారి లక్షద్వీప్‌లో నీలి తిమింగలం పాట రికార్డు
న్యూఢిల్లీ: లక్షద్వీప్‌లో పిగ్మి నీలి తిమింగలాలున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాజాగా లక్షద్వీప్‌లో తొలిసారి పిగ్మి నీలి తిమింగలం పాట రికార్డ్ చేసినట్లు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ ఓషనోగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్న దివ్య పానికర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈమె గత ఆరు సంవత్సరాలుగా తిమింగలాల మీద పరిశోధనలు చేస్తున్నారు. కేరళకు చెందిన దివ్య పానికర్ 2015లో తొలిసారి లక్షద్వీప్‌ను సదర్శించారు. ఆ సమయంలో ఆమె పలువురు జాలర్లును కలిసి మాట్లాడారు. వారిలో చాలామంది తాము లక్షద్వీప్‌లో పెద్ద పెద్ద తిమింగలాలను చూసినట్లు ఆమెకు చెప్పారు. దీనికంటే ముందే పలు శాస్త్రవేత్తల సమూహాలు హిందూ మహాసముద్రంలో అంతరించిపోతున్న పలు జాతులకు చెందిన జీవజాతులున్నట్లు వెల్లడించారు. అయితే ఇవన్ని ఇక్కడే స్థిరంగా ఉండేవా.. లేక వలస వచ్చినవా అనే దాని గురించి చెప్పలేకపోయారు. ఈ క్రమంలో గత ఆరేళ్లుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న దివ్య పానికర్ వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తొలిసారి ఈ నీటిలో పిగ్మి నీలి తిమింగాలాల పాట రికార్డు చేశాం. ఇక లక్షద్వీప్‌లో ఇవి ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ పాట’’ అన్నారు. ‘‘గత కొన్నేళ్లుగా సాంకేతిక రంగంలో జరిగిన అభివృద్ధి ఈ పరిశోధనకు చాలా మేలు చేసింది. ధ్వని తరంగాలను గుర్తించడం ద్వారా స్వరం ఉన్న సముద్ర క్షీరదాలను గుర్తించగల్గుతాం. తిమింగలాల కదలికలను గమనించడం చాలా కష్టం. ఇవి ఎక్కువ దూరం ప్రయాణం చేయడమే కాక.. నీటి లోపల ఎక్కువ సమయం ఉంటాయి. అందుకే ధ్వని దార్వా వీటిని గుర్తిస్తాం. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో నేను ధ్వని ద్వారా సముద్ర క్షీరదాల జనాభా, పంపకాన్ని ఎలా లెక్కించవచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాను’’ అని దివ్య పానికర్ తెలిపారు. ‘‘ఈ పరిశోధనల కోసం నేను డిసెంబర్, 2018లో సముద్రం లోపలికి వెళ్లి తిమింగలాలు చేసే ధ్వనిని రికార్డ్ చేయడం కోసం కవరత్తి ద్వీపం రెండు చివర్ల మైక్రోఫోన్స్ అమర్చి వచ్చాను. వీటిని విశ్లేషించగా.. ఏప్రిల్-మే నెలల మధ్య వీటి కార్యకలాపాలు గరిష్టంగా ఉన్నట్లు తెలిసింది. పిగ్మి నీలి తిమింగలం పాటలు నైరుతి రుతుపవన కాలమైన ఏప్రిల్-మేలో గరిష్టంగా ఉంటున్నాయి. దీన్ని బట్టి.. పిగ్మి నీలి తిమింగలాలు లక్షద్వీప్ ప్రాంతాన్ని కాలాల వారిగా వాడుకుంటున్నట్లు తెలిసింది’’ అన్నారు దివ్య పానికర్. 1960-70 కాలంలో సోవియట్ వేలింగ్ రికార్డు ప్రకారం లక్షద్వీప్ ప్రాంతలో నీలి తిమింగలాలున్నట్లు వెల్లడించింది. -
అయేషా సుల్తానాను ప్రశ్నించి వదిలేసిన లక్షద్వీప్ పోలీసులు
కోచి: దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ దర్శకురాలు అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కవరట్టి పోలీసులు ఆది, బుధ, గురు వారాల్లో ఆమెను ప్రశ్నించారు. గురువారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణ అనంతరం అయేషా సుల్తానా మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయం ముగిసింది. కోచి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పాను. రేపు లేదా ఎల్లుండి కోచికి చేరుకుంటాను’అని అన్నారు. బుధవారం దాదాపు 8 గంటలపాటు జరిగిన విచారణలో తనకు విదేశాలతో ఏవైనా సంబంధాలున్నాయా అంటూ పోలీసులు ప్రశ్నించారని అంతకుముందు అయేషా చెప్పారు. తన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారన్నారు. ఆదివారం పోలీసులు అయేషాను మూడు గంటలపాటు విచారించారు. ‘మలయాళం వార్తా చానెల్ జూన్ 7వ తేదీన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగించిందని ఆరోపించారంటూ బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు! -
లక్షద్వీప్ విపరిణామాలకు బాధ్యులెవరు?
లక్షద్వీప్ ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చిన ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవే, ఇతర సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. డామన్ డయ్యూ ప్రాంతంలో అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాంతంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ద్వీపప్రాంతంలో ప్రపుల్ నిర్వాకానికి పర్యవసానాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన అయిదు నెలల తర్వాత బంగ్రామ్ ప్రాంతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పర్యావరణ టూరిజాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి పాలనాయంత్రాంగం సమాధానమివ్వాల్సి వచ్చింది. అయిదు ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఒక వారం రోజుల తర్వాత రెండో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని లక్షద్వీప్ యంత్రాంగం వాగ్దానం చేయడంతో తొలి సమావేశం రద్దయిపోయింది. మే 24న సాయంత్రం 5 గంట లకు ప్రతిపాదిత రెండో సమావేశం కూడా నిర్వహించారు. దీనికి చాలామందే హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఒక హోటల్ పరిశ్రమకు చెందిన వ్యక్తి ప్రకారం, ఈ భేటీకి 16 పార్టీలు హాజరయ్యారని చైర్మన్ హోదాలో లక్షద్వీప్ కలెక్టర్ అక్సర్ ఆలీ పేర్కొన్నారు. అయితే బిడ్ డిజైన్‌పై పాలనాయంత్రాంగంతో భేటీలో పాల్గొన్నవారు విభేదించడంతో ఫలితం లేకుండానే ముగిసిపోయింది. ఈ బేటీపై అనేకమంది అసమ్మతి వ్యక్తచేశారు. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలంటే ఒక్కొక్క సంస్థ 70 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండాలని షరతుపెట్టారు. అయితే 30 గదుల రిసార్టును నిర్వహించడానికి 70 కోట్ల టర్నోవర్‌ను చూపించవలసిన అవసరం నాకేంటి అంటూ భేటీలో పాల్గొన్నవారిలో ఇద్దరు ప్రశ్నించారు. పైగా బిడ్ డాక్యుమెంట్లలో సైన్ చేసిన ఒప్పందం ముసాయిదా ప్రతిని చేర్చలేదు. ఇలాంటి స్థితిలో మాకు ఎవరు భద్రత కల్పిస్తారనేది మనస్సును తొలుస్తోందని మరొక హోటల్ యజమాని ప్రశ్నించారు. మేం పర్యావరణపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? స్థానికులకు ఉద్యోగాల కల్పన మాటేంటి? మేం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. ఇలాంటి అంశాలను పొందుపర్చకపోతే బిడ్స్‌ని ఎలా సరిపోల్చగలం అని మరొకరు ప్రశ్నించారు. అయితే కథ ఇంతటితో ముగియలేదు. బిడ్ దాఖలు చేయడానికి కన్సార్టియంలకు అనుమతిస్తూ పొందుపర్చిన నిబంధనను తొలి, రెండో సమావేశాల మధ్యకాలంలో తొలగించారు. ఈ మొత్తం అంశంలో పాలనాయంత్రాంగం ప్రదర్శించిన ఆత్రుత హోటల్ పరిశ్రమదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందుగా లక్షద్వీప్ లోని రిసార్టును తాము చూడాలని కోరుకుంటున్నట్లు బిడ్డర్లు అడిగితే మరో మూడు, నాలుగు రోజుల్లో చూపిస్తామని పాలనా యంత్రాంగం అలసత్వం ప్రదర్శించడం మరీ విశేషం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ కాలంలో పాలనా యంత్రాంగం ఆహ్వానం మేరకు హోటల్ పరిశ్రమదారులు రాలేకపోయారు. తమ సందర్శనను కాస్త పొడిగించాలని కోరారు. కానీ పాలనాయంత్రాంగం తిరస్కరించింది. బంగ్రమ్ దీవి కోవిడ్ బారిన పడలేదని, అతిథులు ఎలాంటి సమస్యలు లేకుండా దాన్ని సందర్శిస్తున్నారని అధికారులు ఒక బిడ్డర్‌కు ఈమెయిల్ సందేశం పంపారు. అదే సమయంలో బంగ్రమ్ రిసార్టును గతంలో నిర్వహించి ఉన్న సీజీహెచ్ ఎర్త్ ఎక్స్పీరియన్స్ హోటల్స్ యజమాని ఒకరు రిసార్టును తాను సందర్శిస్తానని కోరితే, అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేదు. ఆ రిసార్ట్ పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో తెలీకుండానే మేం బిడ్‌లో ఎలా పాల్గొనగలం అని అమృతర చెయిన్ ప్రీమియం రిసార్టులను నిర్వహిస్తున్న గుర్మీత్ సింగ్ ఓబెరాయ్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మేం ప్రస్తావించాం. ఇప్పుడు కరోనా మహమ్మారి విస్తృతంగా ఉంది. మేం ఆ ప్రాంతాన్ని సందర్శించలేం. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అనడిగాం. కానీ మా పర్యటనను వాయిదా వేయడాన్ని వారు పట్టించుకోలేదు. పైగా ముంబై ప్రాంత హోటల్ యజమాని ఒకరు ఆ రిసార్టును ఇప్పటికే ఎవరికైనా ప్రత్యేకించారా అని ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు కానీ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లో ఆయన ప్రారంభించిన రెండు ఇన్నింగ్స్‌లు కానీ పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. తన కార్యాలయంలోనే సమస్త అధికారాన్నీ కేంద్రీకరించుకున్నారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవై, ఇతర సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇకపోతే డామన్ డయ్యూలో ప్రఫుల్ పటేల్ నిర్వాకంపై గుణపాఠాలు మరింత ప్రబలంగా ఉన్నాయి. అసలుకు ప్రఫుల్‌ను ఈ ప్రాంతానికి ఎందుకు పంపించారు అనే అంశంపై పూర్తి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని అక్కడికి పంపించారని కొన్ని మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర కేబినెట్లో కనీసం ఒక సీటును కూడా అతడు ఎన్నడూ నిర్వహించలేదన్న వాస్తవాన్ని కొన్ని పత్రికలు బయటపెట్టాయి. దీంతో కేంద్రప్రభుత్వ వర్గాలలో అతనంటే చిన్నచూపు ఏర్పడిపోయిందని, లేకా అతడు చాలా స్వార్థపరుడని, దురాశా జీవి అని, చాలామంది అధికారులు అతడికి దూరంగా జరిగారని గుజరాత్ కేంద్రంగా పనిచేసే ఒక సామాజిక శాస్త్రవేత్త పేర్కొనడం గమనార్హం. డామన్ డయ్యూ ప్రాంతాన్ని చేరీ చేరగానే ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాం తంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. పటేల్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీఏ సత్య, శివస్సా ప్రాంతంలో వినోబా భావే ఆసుపత్రికి అధిపతిగా ఉన్న వీకే దాస్, స్థానిక అవినీతి వ్యతిరేక బ్యూరోను నిర్వహిస్తున్న ఏయూ జడేజా, సివిల్ కన్స్ట్రక్షన్ పనులను పరిశీలించే బీసీ వర్లి, తదితరులు తన చెంత చేరిపోయారు. చివరకు ఉన్నతాధికారులు సైతం ప్రపుల్ ఆదేశానుసారం వ్యవహరించాల్సి వస్తోందని స్థానిక వ్యాపారవేత్త ఒకరు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంత అధికారులతో పనిచేయడానికి బదులుగా తన సొంత వ్యక్తులతో ఎలా పని చేయించుకుంటున్నారని ప్రముఖ మీడియా సంస్థలు ప్రఫుల్ పటేల్‌ని ప్రశ్నించాయి కానీ ఆయన స్పందించలేదు. మరోవైపున హోటళ్లు, సివిల్ కన్స్ట్రక్షన్ వంటి రంగాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. సివిల్ కన్స్ట్రక్షన్ రంగాన్ని పరిశీలించినప్పుడు స్థానిక అధికారులు, కార్యకర్తలు అనేక ఆరోపణలు చేశారు. మొదటగా ఈ వ్యవహారాలతో సంబంధమున్న కొందరు వ్యక్తులు ప్రఫుల్ చేపట్టిన ప్రాజెక్టుల హేతుబద్ధతను ప్రశ్నించారు. కనీసం సైకిల్ తిరగడానికి కూడా తావు లేని చోట నాలుగు లేన్ల ప్రధాన రహదారిని నిర్మించాలని ప్రఫుల్ ప్రతిపాదించారని ఒక ఉన్నతాధికారి ఆరోపించారు. ఈ విషయాన్ని ఎత్తిచూపినప్పటికీ ప్రఫుల్ కనీసం స్పందించలేదు. రెండో విషయం ఏమిటంటే, లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ఉదాహరణకు ఆర్కేసీ ఇన్ఫ్రా బిల్ట్ అనే కంపెనీకి అతి పెద్ద భాగస్వామి ఎవరంటే గోద్రాకు చెందిన కమలేశ్ కుమార్ నవీన్ చంద్ర షా. అనేక పెద్ద సివిల్ కన్స్ట్రక్షన్ పనులు ఈ కంపెనీకి వెళ్లిపోయాయని స్థానిక వ్యాపారవేత్త చెప్పారు. ఈయన అభిప్రాయంతో కేంద్రపాలిత ప్రాంత ఉన్నతాధికారి కూడా ఏకీభవించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెండర్లలో అంచనా వేసిన వ్యయానికి 41.87 శాతం, 33 శాతం అధికంగా కోట్ చేసినప్పటికీ ఇదే కంపెనీకి కాంట్రాక్టులు దక్కాయి. వాస్తవానికి 30 శాతం కంటే అధికంగా అంచనా వేసిన టెండర్లను రద్దు చేసి మళ్లీ ఆహ్వానించాల్సి ఉంది. ఇదీ ప్రఫుల్ నేతృత్వంలో లక్షద్వీప్‌లో ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం. ఎమ్. రాజశేఖర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (ది వైర్ సౌజన్యంతో) -
దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
‘లక్షద్వీప్’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా
కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ వచ్చాక కోవిడ్ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖాదర్ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ప్రఫుల్‌కు ‘బ్లాక్ డే’ స్వాగతం లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు. -
లక్షద్వీప్‌ను ముంచేస్తారా?
సేవ్ లక్షద్వీప్, గో బ్యాక్ ప్రఫుల్ నినాదాలతో ఇల్లిల్లూ మారుమోగిపోతోంది. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న దాకా పరిస్థితి వెళ్లిపోయింది . అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అడ్మినిస్ట్రేటర్ వివాదాస్పద నిర్ణయాలేంటి? ద్వీప సముదాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అరేబియా సముద్రంలో ప్రశాంతంగా ఉండే పగడపు దీవుల్లో చిచ్చు రేగింది. అభివృద్ధి పేరుతో తీసుకున్న నిర్ణయాలు అలల్లో అలజడి రేపాయి. కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడా దీవుల్ని నిండా ముంచేసేలా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ 2020 డిసెంబర్ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. పెద్దగా వార్తల్లోకి వచ్చింది లేదు. అదే రోజు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో కేంద్ర ప్రభుత్వం దాద్రా నాగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు... గుజరాత్ మాజీ మంత్రి అయిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్డీఏఆర్) సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షద్వీప్‌లో స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హై ప్రొఫైల్æ బీచ్ ఫ్రంట్లు నిర్మిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఉన్న దీవి కాస్తా పోతుందనే ఆందోళనలైతే ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రఫుల్ పటేల్‌ను తొలగించాలన్న డిమాండ్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రతిపాదనల్ని నిలిపివేయాలని కోరింది. 36 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ అభివృద్ధి ప్రణాళికపై స్థానికులతో చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లక్షద్వీప్ ప్రజలకి అండగా నిలబడి ప్రజా వ్యతిరేక విధా నాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. నేడు లక్షద్వీప్‌కు ప్రఫుల్ ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు ప్రఫుల్ పటేల్. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు. వివాదాస్పద నిర్ణయాలివే ► గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదు. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ► తమ సంస్కృతి, ఆహారపు అలవాట్లపై దాడి అని స్థానికులు భగ్గుమంటున్నారు ► ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నప్పటికీ ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే పోటీ చేయొచ్చు. ► ఈ దీవుల్లో ఉండే అత్యధికులు ముస్లింలు కావడంతో వారికి పిల్లలు ఎక్కువ. అందుకే ఇక్కడ ముస్లిం జనాభాని టార్గెట్ చేశారన్న అసహనం వారిలో కనిపిస్తోంది. ► మద్యంపై నిషేధం ఉన్నప్పటికీ జనాభా నివసిస్తున్న దీవుల్లో కూడా పర్యాటకులకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతినిచ్చారు ► సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా గూండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ► దేశంలోనే నేరాల రేటు అతి తక్కువగా ఉన్న దీవుల్లో ఇలాంటి కఠిన చట్టం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్‌ని విమర్శించే వారిపైనే దీనిని ప్రయోగిస్తారన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► గత ఏడాది కాలంగా లక్షద్వీప్‌లో కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటించడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షల్ని తొలగించడంతో 8 వేల వరకు కేసులు నమోదయ్యాయి. 30 మంది వరకు మరణించారు. ► గ్రీన్ జోన్ ట్యాగ్ తొలగిపోవడంతో కోవిడ్ ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది. ► ఈ దీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కడైనా భూముల్ని తీసుకునే అధికారాలు, అక్కడున్న వారిని ఖాళీ చేయించే అధికారం ఎల్డీఏఆర్కు కట్టబెట్టారు. మైనింగ్, క్వారీయింగ్ కూడా చేయొచ్చు. స్థానిక యంత్రాంగంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ కట్టడాలు వచ్చి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. ► వేటకు వెళ్లే మత్స్యకారుల పడవల్లో భద్రత కల్పించడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ూ నేరుగా జనం కదలికలపై నిఘా పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లక్షద్వీప్ ప్రత్యేకతలు కేరళకు పశ్చిమాన 200 కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప్ 32 ద్వీపాల సముదాయం. వాటిలో 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాలో అంతర్భాగంగా ఉండే లక్షద్వీప్‌కు 1956లో కేరళ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. ఇక్కడ జనాభా కేవలం 65 వేలు. వారిలో 96 శాతం మంది ముస్లింలు. వీరు జాలర్ల వృత్తిలో ఉన్నారు. పశుమాంసమే వీరికి ఆహారం. వీరికి ఏదైనా కావాలంటే కేరళ రాష్ట్రం మీదే ఆధారపడతారు. కొబ్బరి చెట్ల పెంపకం, పర్యాటకం, పశుపోషణ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 2014 నుంచి ఎన్సీపీ నుంచి మహమ్మద్ ఫైజల్ ఎంపీగా ఉంటే పంచాయతీ మండళ్లలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది. పర్యావరణం దెబ్బతింటుంది లక్షద్వీప్ ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతోంది. వాతావరణ మార్పులతో ఏడాది పొడవునా సముద్రం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంగా ఉంటోంది. తుఫాన్లు పెరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు తరిగిపోతున్నాయి. 1998లో 51శాతం ఉన్న పగడపు దిబ్బలు 2017 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు, తవ్వకాలు చేపడితే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉంది – ప్రొఫెసర్ ఎస్.అభిలాష్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశద్రోహం కేసు, అయినా భయపడేది లేదు :నటి
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను జీవాయుధంతో పోల్చినందుకు గాను నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన బయోవెపన్‌గా ఆమె అభివర్ణించారు. మలయాళం న్యూస్ చానల్ మీడియా వన్ టీవీ చర్చలో పాల్గొన్న ఆయేషా సుల్తానా లక్షద్వీప్‌పై కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ ఆరోపించారు. ‘‘లక్షద్వీప్‌లో గతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు రోజుకి 100 కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్‌కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతోంది’’అని సుల్తానా టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లక్షద్వీప్ బీజేపీ చీఫ్ సి.అబ్దుల్ ఖదేర్ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరట్టి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) రాజద్రోహం, 153 బి (రెచ్చగొట్టే ప్రసంగాలు) కింద కేసు పెట్టారు. ఇప్పటికే ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. వెనక్కి తగ్గేది లేదు: ఆయేషా టీవీ చర్చల్లో తాను చేసిన వ్యాఖ్యల్ని ఆయేషా సుల్తానా సమర్థించుకున్నారు. రాజద్రోహం కేసు నమోదైనా భయపడేది లేదన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఆమె తన జన్మ భూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని చెప్పారు. తన గళం ఇంకా పెంచుతానంటూ ఫేస్బుక్లో ఒక పోస్టు ఉంచారు. -
Aisha Sultana: అయిషాపై దేశద్రోహం కేసు.. అదిరిపోయే ట్విస్ట్
లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. న్యూఢిల్లీ: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్ మేకర్. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. అయిషాకు మద్దతుగా లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్ ఖాదర్ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్, జిల్లా కలెక్టర్ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు. ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్ హమీద్ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్ పటేల్ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: నీటి అడుగున నిరసన చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు -
డిబేట్లో సంచలన వ్యాఖ్యలు, నటిపై దేశద్రోహం కేసు
సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు నమోదైంది. కరోనా వైరస్ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమె మీద ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయేషా.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ ఖోడా పటేల్‌ను బయోవెపన్‌గా వాడిందని పేర్కొంది. ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లక్షద్వీప్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఇది కేంద్ర ప్రతిష్టను దిగజార్చడమేనని అభిప్రాయపడ్డాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయేషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. చదవండి: ప్రభాస్ సినిమాలో మెరవనున్న రాశీఖన్నా! -
అగ్గిరాజుకున్న లక్షద్వీప్: సముద్రగర్భంలోకి వెళ్లి నిరసన
‘డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ (2021)’పై లక్షద్వీప్ ఒక్కసారిగా భగ్గుమంది. ద్వీపకల్ప భూమిలో ఆ డ్రాఫ్ట్ అగ్గి రాజేసింది. దీనిపై లక్షద్వీపకల్పవాసులు సోమవారం 12 గంటల పాటు నిరసనల హోరు చేపట్టారు. ప్రజలతో పాటు ప్రముఖులందరూ ‘లక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్ లక్షద్వీప్)’ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసనలో భాగంగా కొందరు యువకులు సముద్ర గర్భంలోకి వెళ్లి నిరసన తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ) సేవ్ లక్షద్వీప్ అని ఆంగ్ల, మలయాళంలో రాసి ఉన్న పత్రాలు పట్టుకుని నీటిలోనే నినాదాలు చేస్తూ డ్రాఫ్ట్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లజెండా కూడా ప్రదర్శించారు. ఇక సాధారణ ప్రజలు కూడా నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరిస్తూనే ఎవరికీ వారు ఉన్నచోటనే ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు.. నల్ల వస్త్రాలు.. నలుపు మాస్క్‌లు ధరించి లక్షద్వీప్‌ను పరిరక్షించండి అని డిమాండ్ చేశారు. వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకోవాలని నినదించారు. లక్షద్వీప్ అడ్మినస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ పై డ్రాఫ్ట్‌ను తీసుకువచ్చారు. అభివృద్ధి పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి ఈ ముసాయిదా తీసుకువచ్చారని నిరాహార దీక్ష చేస్తున్న వారు ఆరోపించారు. ఈ ముసాయిదాను కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 90 మంది ఐఏఎస్‌లు డ్రాఫ్ట్ విరమించుకోవాలని లేఖ కూడా రాశారు. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 చదరపు కిలోమీటర్ల మేర లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ పాలనా వ్యవహారకర్తగా గుజరాత్ బీజేపీ నేత ప్రఫుల్ ఖోడా పటేల్ నియమితులైనప్పటి నుంచి వివాదం రాజుకుంది. "We will keep protesting until he #Patel is revoked from the post of administrator." Students' underwater demonstration against Administrator at #Lakshadweep#SaveLakshadweep pic.twitter.com/ji0pXBwjil — AFROZ ALAM SAHIL (@afrozsahil) June 7, 2021 -
ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 93 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తాము ఏ పార్టీ సభ్యులం కాదని, తమకు కేవలం రాజ్యాంగం మీద నమ్మకం ఉందని వారందరూ ఆ లేఖలో పేర్కొన్నారు. ''అభివృద్ధి పేరుతో లక్షద్వీప్‌లో జరుగుతున్న పరిణామాలపై తీవ్రమైన ఆందోళన చెందుతూ ఈ లేఖ రాస్తున్నాం. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో లక్షద్వీప్ వాసుల నీతి, ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో ప్రతి అంశం కూడా లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధంగా ఉండడంతో పాటు ఏకపక్ష విధానంగా కొనసాగింది. ముసాయిదాను రూపొందించే సమయంలో లక్షద్వీప్ ప్రజలను కానీ, అక్కడి సమాజాన్ని కానీ సంప్రదించలేదు'' అంటూ మాజీ ఐఏఎస్‌లు పేర్కొన్నారు. చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. లక్షద్వీపంలో అలజడి! -
లక్షద్వీప్ దుమారం: ప్రఫుల్ రీకాల్‌కు తీర్మానం
లక్షద్వీప్ అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్.. ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించడం, దానికి వ్యతిరేకంగా ‘సేవ్ లక్షద్వీప్’ పేరుతో క్యాంపెయిన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రఫుల్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ ప్రభుత్వం సోమవారం ఏకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. తిరువనంతపురం : లక్షద్వీప్ లో కాషాయ ఎజెండానుఅమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఆ కేంద్రపాలిత ప్రాంతపు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాగా, లక్షద్వీప్ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ తీర్మానం కోరింది. వివాదాస్పద సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కేరళ సర్కార్ కోరింది. ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకువచ్చిన డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ గత వారం రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ఈ రెగ్యులేషన్ వల్ల లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని, దీవి ప్రజల పరిరక్షణకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. చెట్లతో మొదలుపెట్టారు ఇక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. బ్రిటీష్ పాలనలో కంటే ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులతోనే లక్షద్వీప్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు.దీవి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: సేవ్ లక్షదీవ్.. ఆ హీరోకి మద్దతు ఇక ప్రఫుల్ రూపొందించిన డ్రాఫ్ట్ ప్రకారం.. లక్షద్వీప్‌లో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్‌పై బ్యాన్ విధించారు. ఈ డ్రాఫ్ట్ తీవ్ర దుమారం రేపింది. కాగా, అక్కడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఆ డ్రాఫ్ట్‌ను నిలిపివేయాలంటూ అక్కడి ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు లభిస్తోంది. -
ద్వీపంలో అలజడి!
అరేబియా సముద్రంలో దూరంగా విసిరేసినట్టు... తన లోకం తనదన్నట్టు వుండే లక్షద్వీప్‌లో ఆర్నెల్లుగా అగ్గి రాజుకుంటోంది. పేరుకు లక్షద్వీప్ అయినా ఇది 36 ద్వీపాల సముదాయం. ఒక ద్వీపం పరాలీ సముద్ర జలాల కోతవల్ల దాదాపు నీట మునిగి, నివాసయోగ్యం కాకుండా పోయింది. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ సముదాయమంతా కలిసి కేవలం 32 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఒకే ఒక్క జిల్లా... అందులో పది డివిజన్లు. ఈ లక్షద్వీప్ పాలనా వ్యవహర్తగా గుజరాత్ బీజేపీ నేత ప్రఫుల్ ఖోడా పటేల్ వచ్చినప్పటినుంచీ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ ఆగ్రహావేశాలకు కారణం. పాలన వేరు... పెత్తనం వేరు. పాలకులుగా వున్నవారు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి దోహదపడాలి. ప్రజాస్వామ్య భావనలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా పెత్తనం మీదే ఆసక్తి కనబరిస్తే, స్థానికుల మనోభావాలు పట్టించుకోవడంలో విఫలమైతే సహజంగానే అది అశాంతికి దారితీస్తుంది. ద్వీపాల పాలనను నేరుగా కేంద్రం పర్యవేక్షించటానికి రెండు కారణాలుంటాయి. దేశ భద్రతలో ద్వీపాలది కీలకపాత్ర. సముద్రమార్గంలో అక్కడ అవాంఛనీయ శక్తులు చొరబడకుండా చూడటం అవసరం. అలాగే స్థానికులకు పాలనలో భాగస్వామ్యం కల్పించి, వారికి ప్రజాస్వామిక సంస్కృతి అలవాటు చేయడం కూడా ముఖ్యమైనదే. నిజానికి లక్షద్వీప్ ఎప్పుడూ సమస్యాత్మకం కాలేదు. ఇబ్బందంతా తరచు వచ్చే తుపానులతోనే. జనాభా కేవలం 64,000 కావడంతో నేరాల రేటు సహ జంగానే తక్కువ. దారుణమైన నేరాలు చాలా అరుదు. అలాంటిచోట ఉత్తపుణ్యాన గూండా చట్టం లాంటి కఠినమైన చట్టం అవసరమని పటేల్‌కు ఎందుకనిపించిందో అనూహ్యం. ఆ చట్టంకింద ఎవరినైనా కారణం చూపకుండా ఏడాదిపాటు నిర్బంధించే వీలుంది. అంతేకాదు... జనాభాలో 65 శాతం మందివుండే ఆదివాసీల్లో ఎక్కువమంది ముస్లింలు. వృత్తిపరంగా జాలర్లు. వారికి పశు మాంసమే ప్రధానాహారం. పటేల్ నిబంధన ప్రకారం అక్కడి హోటళ్లు పశుమాంసంతో వంటకాలు చేయకూడదు. దుకాణాల్లో అమ్మకూడదు. గోవధ నిషేధం సరేసరి. వీటిని ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్ష. పిల్లలకు పెట్టే మధ్యాహ్నభోజనంలో మాంసం నిషిద్ధం! కానీ విచిత్రంగా మద్యపానం అలవాటే లేని లక్షద్వీప్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతించారు. ఇద్దరు పిల్లలున్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ తీసుకొచ్చిన నిబంధన కూడా వివాదాస్పదమైంది. ప్రభుత్వ విభాగాల్లో క్యాజువల్, కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్నవారిని ఆయన ఒక్కవేటుతో తొలగించారు. సరుకు రవాణాకు స్థానికంగా వున్న బైపోర్ పోర్టును తప్పించారు. కర్ణాటకలోని మంగళూరు పోర్టునుంచే కార్యకలాపాలుండాలని ఆదేశించారు. వలలు, ఇతర ఉపకరణాలు భద్ర పరుచుకోవ డానికి మత్స్యకారులు తీరంలో ఏర్పాటు చేసుకునే షెడ్లు తీరప్రాంత రక్షణ నిబంధనలు ఉల్లంఘిస్తు న్నాయంటూ తొలగించారు. అభివృద్ధి కోసం భూమి స్వాధీనానికి వీలుకల్పించే ముసాయిదా స్థాని కుల ఆస్తిహక్కుకు మంగళం పాడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో కొన్ని ప్రతిపాద నల స్థాయిలో వుంటే కొన్ని అమలవుతున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ ప్రజాప్రతినిధులనూ, స్థాని కులనూ సంప్రదించకపోవటం సహజంగానే అసంతృప్తికి దారితీసింది. ఇన్నాళ్లూ అత్యవసర చికిత్స అవసరమైనవారిని హెలికాప్టర్లో కేరళకు తరలించే సౌకర్యం వుండేది. దాన్ని పటేల్ రద్దుచేశారు. ఉన్నతాధికారులనూ, అలా పనిచేసి రిటైరైనవారిని గవర్నర్లుగా, లెఫ్టినెంటు గవర్నర్లుగా, పాలనా వ్యవహర్తలుగా నియమించడాన్ని కొందరు తప్పుబడతారు. వారు నిబంధనలకు విలువి చ్చినంతగా జనం మనోభావాలకు విలువనివ్వరన్న అభిప్రాయం ఎప్పటినుంచో వుంది. అడపా దడపా అది నిజమేనన్నట్టు వ్యవహరించేవారూ లేకపోలేదు. అయితే గతంలో లక్షద్వీప్‌కు ఐఏఎస్‌లే పాలనా వ్యవహర్తలుగా వున్నారు. స్థానికుల్లో వారిపై అసంతృప్తి రాజుకున్న వైనం ఎప్పుడూ లేదు. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా అనుభమున్న ప్రఫుల్ ఖోడా పటేల్‌లో నిరంకుశాధికార పోకడలే వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016లో ఆయన్ను కేంద్ర పాలిత ప్రాంతం దామన్ డయూల పాలనా వ్యవహర్తగా నియమించగా అక్కడ సైతం ఆయనకు వివాదాలు తప్పలేదు. ఎన్నికల సమ యంలో కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా ఆయన ఆదేశాలిస్తున్నారని, ప్రశ్నించినందుకు తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని అప్పటి దాద్రా నాగర్ హవేలీ కలెక్టర్ కణ్ణన్ గోపీనాథన్ ఫిర్యాదు చేయగా... ఎన్ని కల కమిషన్ ఆ నోటీసును ఉపసంహరించుకోవాలని పటేల్‌ను ఆదేశించింది. ఆ యువ ఐఏఎస్ అధికారి ఎన్నికల అనంతరం సర్వీస్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. దాద్రా నాగర్ హవేలీ ఎంపీగా ఆరోసారి ఎన్నికైన మోహన్ దేల్కర్ మొన్న ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో పటేల్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్టు ప్రస్తావించడం కూడా వివాదానికి దారితీసింది. అయితే అందులో నిజానిజాలేమిటో ఇంకా నిర్ధారణ కావాల్సివుంది. కాంగ్రెస్ నేత శశిథరూర్ గత ఫిబ్రవరిలో తొలిసారి పటేల్ నిర్ణయాలపై గళమెత్తారు. ఇప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలుకొని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరకూ అందరూ పటేల్ పోకడలపై ఆగ్రహంతో వున్నారు. స్థానిక బీజేపీ నేతలు, శ్రేణులు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే లక్షద్వీప్‌లో పరిస్థితి మరింత దిగజారకముందే కేంద్రం జోక్యం చేసు కుని సరిదిద్దాలి. స్థానికుల మనోభావాలకు విలువనిచ్చే వాతావరణాన్ని కల్పించాలి. -
అనుచిత వ్యాఖ్యలు: హీరో పృథ్వీకి భారీ మద్దతు
తిరువనంతపురం: లక్షదీవుల వ్యవహారంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్కి భారీ మద్దతు లభిస్తోంది. కొత్త రెగ్యులేషన్స్‌ని ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ పృథ్వీ ఒక పోస్ట్ చేయగా.. జనం టీవీ పృథ్వీపై అనుచిత వ్యాఖ్యలతో పాటు అపవాదులు వేసింది. ఈ వ్యవహరాన్ని సెలబ్రిటీలు, రాజకీయా నాయకులు తప్పుబడుతున్నారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటు మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా, లక్షదీవుల(లక్షద్వీప్) కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా #SaveLakshadweep క్యాంపెయిన్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా పృథ్వీరాజ్ కుమారన్‌తో పాటు గీతూ మోహన్‌దాస్ పోస్టులు చేశారు. పృథ్వీరాజ్ తనకు లక్షదీవులతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అభివృద్ధి పేరుతో స్థానికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు. అయితే దీనిని తప్పుబడుతూ రైట్ వింగ్‌కు చెందిన జనం టీవీ చీఫ్ ఎడిటర్ జీకే సురేష్ బాబు పృథ్వీరాజ్‌ను విమర్శిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి పృథ్వీ మొరుగుతున్నాడని, పృథ్వీతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా సరికాదంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిపై దుమారం రేగడంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది జనం టీవీ. నేతలు.. నటులు మరోవైపు బీజేపీ ఐటీ సెల్ గత రెండు రోజులుగా పృథ్వీపై అనుచిత పోస్టులతో విరుచుకుపడుతోంది. దీంతో కొందరు రాజకీయ నాయకులు పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఈ వివాదంలో సంఘ్ పరివార్ తీరును తప్పుబట్టాడు. లోక్‌సభ ఎంపీ ప్రతాపన్, ఎమ్మెల్యే సురేంద్రన్, పీవీ అన్వేలాంటి వాళ్లు పృథ్వీకి బాసటగా నిలుస్తున్నారు. ఇక నటుల్లో అజు వర్గీస్, అనూప్ మీనన్, సుబిష్ సుధీ, డైరెక్టర్ జూడ్ ఆంటోనీ పృథ్వీకి మద్దతుగా ట్వీట్లు చేశారు. -
లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది..
న్యూఢిల్లీ: శాంతిభద్రతల పరిరక్షణ పేరిట స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ముసాయిదా ద్వారా బయటపడ్డాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ముసాయిదాలో ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి అలాగే బాధిత వ్యక్తులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన సహాయాన్ని పరిమితం చేయడానికి స్థానిక ప్రభుత్వం చేస్తున్న కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్ని కుట్రల నడుమ లక్షద్వీప్ ప్రజల భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుందన్నారు. లక్షద్వీప్ లో అమలవుతున్న రూల్స్ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని లేకపోతే లక్షద్వీప్ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారు. వాణిజ్య లాభాల ముసుగులో జీవనోపాధి, భద్రత, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, తక్కువ క్రైమ్ రేట్ ఉన్న భూభాగంలో శాంతిభద్రతల పేరిట కఠిన నిబంధనల అమలు ప్రజల్లో అసమ్మతిని రాజేస్తాయని హెచ్చరించారు. లక్షద్వీప్ యొక్క సహజమైన అందం, సంస్కృతి తరతరాలుగా ప్రజలను ఆకర్షిస్తూ వస్తున్నాయని నొక్కిచెప్పిన ఆయన.. లక్షద్వీప్ నిర్వాహకుడు ప్రఫుల్ ఖోడా పటేల్ ప్రకటించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పంత్‌కు క్రికెట్ దిగ్గజం వార్నింగ్.. -
చట్టాలకు లోబడే నేవీ ఆపరేషన్స్: పెంటగాన్
వాషింగ్టన్: భారత్‌లోని లక్షద్వీప్ సమీపంలో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ని చేపట్టడాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ఎఫ్‌ఓఎన్‌ఓపీలో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత్ పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ తీవ్ర అభ్యంతరం తెలపడంపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ‘మాల్దీవులకు సమీపంలో ఆ దేశ ఈఈజెడ్ పరిధి లోపల ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సాధారణ ఆపరేషన్స్ చేపట్టడం ద్వారా నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్ఛను, హక్కులను నిర్ధారించాం’ అని తెలిపారు. (చదవండి: భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య) -
భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించామని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్‌కు స్పష్టం చేసింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్), కాంటినెంటల్ జోన్ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’కి వ్యతిరేకమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించింది. సముద్ర జలాల పరిధిపై భారత వాదనను సవాలు చేస్తూ, అంతర్జాతీయ నిబంధనల మేరకు లక్షద్వీప్‌కు పశ్చిమంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్ పరిధిలో ఎఫ్‌ఓఎన్‌ఓపీ నిర్వహించామని పేర్కొంది. దీనిపై అమెరికాకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నౌక ఆపరేషన్స్ జరిపింది. ఈ విషయంపై భారత అభ్యంతరాలను అమెరికా ప్రభుత్వానికి దౌత్య మార్గాల ద్వారా వెల్లడించాం’ అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ ఈఈజెడ్ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది. -
కరోనా దూరని సు‘లక్ష’ణ దీవి
న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య 10 లక్షలు దాటేశాయి. దేశ నలుమూలలకూ పాకిన మహమ్మారిని ఓ చిన్న ప్రాంతం మాత్రం నిలువరించింది. కట్టుదిట్టమైన చర్యలతో, జాగ్రత్తలతో రాకాసిలా దూసుకొస్తున్న కరోనాను మన లక్షదీవులు లోపలికి చొరబడకుండా ఆపేశాయి. (కరోనా : అత్యంత ప్రమాదకర రాష్ట్రాలివే!) స్కూళ్లను తెరవడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లక్షదీవుల ప్రభుత్వం అర్జీ పెట్టుకుందంటే, మహమ్మారిపై పోరులో ఈ కేంద్రపాలిత ప్రాంతం ఎంత ముందుచూపుతో ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు. లక్షదీవులకు చేరే అన్ని రకాల వస్తువులు కేరళలోని కొచ్చి నుంచి వెళతాయి. ఇక్కడ ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్లే కరోనా ప్రభావం చూపని ప్రాంతంగా లక్షదీవులు వార్తల్లో నిలిచింది. (ఆగస్టు 10 నాటికి 20 లక్షలకు పైమాటే!) లక్షదీవుల జనాభా 64,473. కరోనా మహమ్మారిగా మారిందని తెలిసిన నాటి నుంచి సరిహద్దులను మూసేసింది. అనుమానితులను ఎక్కువ రోజులు క్వారంటైన్లో ఉంచింది. ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా వ్యాధి లక్షణాలు కనిపించిన 61 మందికి టెస్టింగ్ నిర్వహించింది. వీరందరికీ కరోనా నెగటివ్ వచ్చిందని లక్షదీవుల హెల్త్ సెక్రటరీ డా.ఎస్.సుందరవడివేలు వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి ఓడల్లో, ఫిబ్రవరి 9 నుంచి విమానాల్లో వచ్చిన వారికి టెస్టులు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి రానిచ్చినట్లు ఆయన తెలిపారు. రాజధాని అగత్తికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లో, కొచ్చిలోని రెండు హోటళ్లలో 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉంచామని చెప్పారు. లక్షదీవుల్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలహీనంగా ఉంది. కేవలం మూడే ఆసుపత్రులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా రాకుండా అడ్డుకోగలిగామని సుందరవడివేలు పేర్కొన్నారు. -
లక్ష దీవుల్లో 85 శాతం పోలింగెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించిన కఠిన పదాలను, పరస్పర దూషణలను మరచిపోదాం. ఇప్పటి నుంచి మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఈ చిన్ని దీవుల్లో మనం పరస్పరం ప్రేమతో జీవించాల్సిన అవసరం ఉంది’ అని లక్షదీవుల నుంచి లోక్‌సభకు ఎన్సీపీ తరఫున ఎన్నికైన పీపీ మొహమ్మద్ ఫైజల్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చిన్న నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు హోరాహోరీ పోరాటం జరపడం ద్వారా ప్రచారంలో కఠిన పదాలు, పరస్పర దూషణలు చోటు చేసుకున్నాయి. ఇంత తీవ్రంగా ప్రచారం జరగడం వల్లనే దేశంలోనే అత్యధికంగా లక్షదీవుల్లో 85 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 55,057 ఓటర్లలో ఫైజల్‌కు 22,851 (48.6 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హముదుల్లాహ్ సయీద్‌పై 823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇప్పుడు పునరావృతం అయ్యాయి. నాడు కూడా సయీద్‌పై ఫైజల్ పోటీచేసి 1,535 ఓట్ల మెజారితో విజయం సాధించారు. సయీద్ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, ఆయనపై ఫైజల్ విజయం సాధించారు. 1957 నుంచి 1967 వరకు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకుడు నల్లా కోయల్ తంగాల్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన్ని భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1967లో ఈ సీటుకు మొదటిసారి ఎన్నికలు జరగ్గా స్వతంత్ర అభ్యర్థి పీఎం సయీద్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1971లో పోటీ చేయగా మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి పీ పూకున్హీ కోయా చేతుల్లో సయీద్ కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2005లో సయీద్ మరణంతో ఆయన కుమారుడు హముదుల్లా 2009లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా ఆయన ఓడిపోతూ వచ్చారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉండే. అయితే ఆయన వ్యవహార శైలి నచ్చక కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఫైజల్‌కు ఓటు వేశారు. మహారాష్ట్రలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ విడివిడిగా పోటీ చేశాయి. భారత ఆగ్నేయ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో 78 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 36 దీవుల సమూహమే లక్షదీవులు. వీటిల్లో పది దీవులే జనావాస ప్రాంతాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 65 వేల జనాభా కలిగిన ఈ దీవుల్లో ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 55 వేల మంది ఉన్నారు. వీరిలో 93 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారు ఇక్కడ సామాజికంగా బాగా వెనకబడిన వారవడంతో వారికి ఈ సీటును రిజర్వ్ చేశారు. -
కేరళలో హై అలర్ట్
తిరువనంతపురం: శ్రీలంక నుంచి లక్షద్వీప్ దీవులకు వస్తున్న ఓ బోట్లో పదిహేను మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం కలకలం రేపింది. దీంతో కేరళ, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో తీర ప్రాంతాల్లో నౌకలను, విమానాలను సిద్ధం చేసినట్లు నేవీ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకలో వరుస బాంబు దాడుల తర్వాత హెచ్చరికలు రావడం, కేరళలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేశారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళకు చెందిన కొంతమంది ఐసిస్‌తో కలిసి పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు దాడుల్లో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. -
లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియాకు చెందిన వారే
సాక్షి, హైదరాబాద్: కేరళ రాష్టానికి పశ్చిమ దిశగా ఉన్న లక్షదీవుల్లోని మానవులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారేనని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో (సీసీఎంబీ) పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి విస్తరించే క్రమంలో భారత పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించినట్లు ఇప్పటికే తెలిసినప్పటికీ ఈ మార్గంలో లక్షదీవులు ఉన్నాయా లేదా అన్నది అస్పష్టం. అంతేకాకుండా ఈ 36 ద్వీప సముదాయంలో మానవ ఆవాసం ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ దీవుల్లోని ప్రజలపై కొన్ని జన్యు పరిశోధనలు చేపట్టారు. 8 దీవుల్లోని 557 మంది మైటోకాండ్రియల్ డీఎన్ఏ, 166 మంది క్రోమోజోమ్‌లను పరిశీలించారు. ఈ వివరాలను విశ్లేషణ చేసినప్పుడు జన్యు వైవిధ్యత తక్కువని స్పష్టమైంది. కాలక్రమంలో ఈ ప్రాంతాలను పలువురు రాజులు పాలించినా తక్కువ జన్యు వైవిధ్యత ఉండటం తమను ఆశ్చర్య పరిచిందని బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలకు అవకాశం!
తిరువనంతపురం: రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయంది. రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్, దక్షిణ తమిళనాడులో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. -
నడి సముద్రంలో.. మంటల్లో చిక్కుకున్న నౌక
సాక్షి, లక్షద్వీప్: అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌లో అగట్టికి 340 నాటికల్ మైళ్ల దూరంలో ఓ భారీ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుంది. డెన్మార్క్‌లోని మెర్స్క్ కంపెనీకి చెందిన ఈ నౌకలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ పైఅధికారులకు సమాచారమందించారు. గత రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. దీనిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. ఆయన థాయ్‌ల్యాండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో నలుగురు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఘటనకి సంబంధించిన నష్టంపై పూర్తి సమాచారం లేదని తెలిపింది. -
8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒక దాఖలైంది. ఆయా రాష్ట్రాల్లో నిత్యం హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందులో న్యాయవాదులు పేర్కొన్నారు. మైనారిటీ చట్టం 1992ను అనుసరించి ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులును మైనారిటీలుగా గుర్తించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్ అడ్వకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దేశంలో ప్రస్తుతం మెజారిటీ, మైనారిటీ ప్రాతిపదిక మత రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లకు ఆయన లేఖ రాశారు. అంతేకాక ప్రస్తుతం కొనసాగుతున్నర బలవంతవు లౌకిక వ్యవస్థ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌లలో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టును అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అభ్యర్థించారు. -
లక్షద్వీప్ సముద్రంలో భూకంపం
లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. తెల్లవారుజామున 4.01 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని, దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ సంభవించినట్లు ఇంతవరకు సమాచారం లేదు. 2006 సంవత్సరంలో సంభవించిన సునామీ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ విధ్వంసం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం సునామీ భయం ఏమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. -
విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం
లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. గూగుల్ సెర్చ్ ఏరియల్ వ్యూలో చూస్తే లెక్కపెట్టలేనన్ని ద్వీపాలు కనిపిస్తాయి. కానీ అన్ని దీవులు ఉండే అవకాశం లేదు. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా. అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు. లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన జానపద సినిమాను తలపిస్తుంటే, సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్‌లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి. ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు. తమాషా ఏమిటంటే... ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో గెంతులేస్తుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్... ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు. సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి. అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం. ఎక్కడ ఉన్నాయి? కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి? ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? విమానంలో... లక్షద్వీప్‌కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉంటాయి.రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది. షిప్ ప్రయాణం... లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్‌కండిషన్ క్రూయిజ్‌లే. ఎక్కడ ఉండాలి? సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి. భోజనం ఎలా? ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఏమేమి చూడాలి? హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి. ఏయే సాహసాలు చేయవచ్చు? కామత్ ఐలాండ్‌లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.